
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకంపై ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు కుంకుమ పథకం డబ్బులు నేరుగా మహిళలకు అందడంలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు కేవలం చెక్కులే ఇస్తున్నారని, బ్యాంకులు ఆ డబ్బులను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వడంలేదని ఆమె తెలిపారు. గతంలో ఇచ్చిన చెక్కులు కూడా ఇంతవరకు డబ్బులు అందలేదని ఆమె వెల్లడించారు. మహిళలకు బ్యాంకర్లు డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.