డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వేళ చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గుర్తు చేశారు.
హైదరాబాద్ : డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వేళ చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గుర్తు చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ఐదు సంతకాలు చేశారని... వాటికి ఇప్పుడు విలువ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకపోగా.... రుణాలు వసూలు చేయాలని అధికారులతో ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపించారు. రుణాలు వసూలు చేస్తేనే జీతాలు పెంచుతామని బెదిరిస్తున్నారని గిడ్డి ఈశ్వరి విమర్శించారు.