'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు' | ysrcp mla giddi eswari fires on ap govt over tribals facilities | Sakshi
Sakshi News home page

'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు'

Published Sat, Mar 26 2016 7:45 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు' - Sakshi

'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు'

హైదరాబాద్: ‘రాబోయే కాలంలో బాక్సైట్ తవ్వమని, గిరిజనుల పక్షాన నిలబడతామని, పర్యావరణాన్ని కాపాడతామని శాసనసభలో తీర్మానం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి’ అని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలన్నారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇంకా ఆమె  ఏమాట్లాడారంటే..

► ఏజెన్సీలో ఉన్న సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు), పీహెచ్‌సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)ల్లో స్పెషలిస్టులు లేరు. వైద్యం కోసం నగరానికి వెళ్లడానికి డబ్బుల్లేక, గిరిజనులు వైద్యానికి దూరమవుతున్నారు.
► టీడీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లయింది. అటవీ శాఖ మంత్రి ఒక్కసారి కూడా తమ ప్రాంతాల్లో పర్యటించలేదు. వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు.
► ప్రాథమిక విద్య కూడా గిరిజనులకు అందకుండా పోతుంది. ప్రతి కిలోమీటరు ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే.. హేతుబద్దీకరణ పేరిట వాటిని తొలగించారు. వాగులు దాటి స్కూళ్లకు పోలేక విద్యార్థులు చదువు మానేస్తున్నారు. ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య పెరుగుతోంది.
► పాఠశాలల్లో మౌలిక వసతుల్లేవు. స్కూళ్లలో టాయిలెట్స్ లేవు. ఉన్నా ఉపయోగించే పరిస్థితిలో ఉండటం లేదు. విద్యావాలంటీర్ల శ్రమను ప్రభుత్వం దోచుకుంటోంది. నెలకు రూ. 5 వేల జీతంతో సరిపెడుతున్నారు.
► ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెన్షన్ భద్రత లేదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలనే విన్నపాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. తమిళనాడులో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
► గిరిజన గ్రామాలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ఎన్టీఆర్ సుజల, జలసరి అడ్రస్ లేవు.
► అరకు మెయిన్ రోడ్డు నిండా గోతులే. ఇక గిరిజన గ్రామాల రోడ్ల పరిస్థితి చెప్పడానికి లేదు.
► గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి ఉంటే.. కనీసం పరిస్థితుల్లో కొంత మార్పు ఉండేది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెలే ఉన్నారనే ఉద్దేశంతో సలహా మండలిని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వంలో గిరిజన మంత్రీ లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement