bauxite mining
-
చంద్రబాబు ప్రభుత్వంలో భారీగా అక్రమ మైనింగ్
-
ఏపీ: బాక్సైట్ తవ్వకాలు ఈ ప్రభుత్వంలో జరగలేదు
సాక్షి, విజయవాడ: 2 లక్షల టన్నుల లేటరైట్ అక్రమంగా తవ్వకాలు జరిగాయని గుర్తించినట్లు గోపాలకృష్ణ ద్వివేది, డీఎంజీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో బాక్సైట్ తవ్వకాలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే తూర్పుగోదావరి, విశాఖపట్నంలో శాఖాపరంగా విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అక్రమ తవ్వకాలపై ఆరోపణలు రావడంతో వారు బుధవారం వివరాలు సేకరించారు. ఆండ్రస్ మినరల్‌కి 8 లీజులు 2013లో వాళ్లకి మంజూరయ్యాయని, వాటిపై తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటిపై తాము పెనాల్టీ కూడా వేసినట్లు పేర్కొన్నారు. భద్రతా చర్యలు, ఇతర ప్రమాణాలను తనిఖీ చేశామని చెప్పారు. వేదాంతకి 34 లక్షల టన్నుల సరఫరా చేశారు, 4.5 లక్షల టన్నుల చైనాకు సరఫరా చేశారు అని వెల్లడించారు. వీటిపై విచారణ చేస్తున్నట్లు ద్వివేది తెలిపారు. లేటరైట్ తవ్వరా.. బాక్సైట్ తవ్వరా అని విచారిస్తున్నట్లు స్పష్టం చేశారు. అల్యూమినియం కంపెనీకి సరఫరా చేయడం వలన ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని పేర్కొన్నారు. 2013 నుంచి 2019 జనవరి వరకు ఈ తవ్వకాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలు జరగలేదు అని స్పష్టం చేశారు. ఇప్పుడు లేటరైట్‌ని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు.. అందుకే లేటరైట్ అని నిర్ధారిస్తున్నాట్లు వివరించారు. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో గతంలో పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉందని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు కేటీఆర్?: ఎమ్మెల్యే సీతక్క చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదు: పెద్దిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే లెట్రెయిట్‌కి అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనూ లెట్రెయిట్ లీజులు ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు తవ్వితే లెట్రెయిట్.. ఇప్పుడు తవ్వితే బాక్సైట్ అవుతుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చాకే శాశ్వతంగా బాక్సైట్ తవ్వకాల జీవోలు రద్దు చేశారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపామని తెలిపారు. అక్రమంగా 2 లక్షల టన్నులు తవ్వినందుకు రూ.20 కోట్ల జరిమానా వేశామన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మైనింగ్ ప్రాంతానికి టీడీపీ నేతలు వెళ్తే ఏమొస్తుందని ప్రశ్నించిన పెద్దిరెడ్డి.. వాళ్లేమన్నా మైనింగ్‌ను నిర్ధారించే నిపుణులా అని నిలదీశారు. ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. -
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు అవాస్తవం: ప్రతాప్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు అవాస్తవమని విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా ఎవరికీ మైనింగ్ లైసెన్స్ ఇవ్వలేదని తెలిపారు. కోర్టు అనుమతితో ఇచ్చిన లైసెన్స్ మేరకు లెట్‌రైట్ తవ్వకాలు మాత్రమే జరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడినవారి లైసెన్స్‌లు రద్దు చేశామన్నారు. అక్రమ మైనింగ్‌పై రేపటి నుంచి అనకాపల్లి ఏరియాలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని వెల్లడించారు. 3 జిల్లాల్లో కలిపి అక్రమ మైనింగ్‌పై రూ.250 కోట్ల వరకు ఫైన్ విధించామని తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. -
లోకేష్ అభయం.. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత!
సాక్షి, అమరావతి: లేని బాక్సైట్‌ను అక్రమంగా తవ్వేస్తున్నారంటూ రాజకీయ డ్రామాకు తెరలేపిన టీడీపీ నాయకులు అధికారంలో ఉండగా కొండలు, గుట్టల్ని ఇష్టానుసారం తవ్వి దోచుకున్నారు. ఐదేళ్లలో ఉత్తరాంధ్ర గనుల్లో టీడీపీ నేతల అరాచకం అంతాఇంతా కాదు. చంద్రబాబు తనయుడు లోకేష్ అభయంతో ఆయన బినామీలు యధేచ్చగా గనుల్ని కొల్లగొట్టారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే కాకుండా విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు, విజయవాడ, గుంటూరుకు చెందిన మాజీ మంత్రులు కూడా ఈ అక్రమ తవ్వకాల్లో భాగస్వాములే. విజిలెన్స్ దాడుల్లో అడ్డంగా దొరికిపోయి రూ.కోట్లలో జరిమానాలు చెల్లించాల్సి రావడం, క్వారీలు మూతపడడంతో తట్టుకోలేక ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. మైనింగ్ డాన్.. లోకేష్ బినామీ శ్రీనివాసచౌదరి విశాఖ, అనకాపల్లి ప్రాంతంలో లోకేష్‌కు బినామీగా ఉన్న వెంగమాంబ శ్రీనివాసచౌదరి మైనింగ్ డాన్‌గా మారి రూ.వేల కోట్లు కొల్లగొట్టాడు. నెల్లూరు నుంచి వచ్చి విశాఖలో తిష్టవేసిన ఆయన మైనింగ్ దోపిడీ మాటలకు అందదు. అనకాపల్లి మండలం సీతానగరంలో 4 రోడ్ మెటల్ లీజులను పర్యావరణ క్లియరెన్స్, డీజీపీఎస్ సర్వే లేకుండా లోకేష్ అతనికి కట్టబెట్టారు. సర్వే నెంబర్ 251లో పి.వెంకటేశ్వరరావు పేరుతో 7.05 ఎకరాలు ఒకచోట, 7.50 ఎకరాలు మరోచోట లీజుకు తీసుకున్నాడు. లీజు పరిధి దాటి పక్కనున్న క్వారీల్లో అక్రమ మైనింగ్ చేశాడు. అదే గ్రామంలో వీవీఆర్ క్రషర్స్ అండ్ కాంక్రీట్ కంపెనీ పేరుతో సర్వే నెంబరు 193లో 0.0838 ఎకరాలను లీజుకు తీసుకుని అక్రమ మైనింగ్ జరిపారు. ఇదే కంపెనీ పేరుతో 303 సర్వే నెంబర్లో 2.08 ఎకరాలు లీజుకు తీసుకుని తవ్వకాలు చేయించారు. లీజు హద్దుల్ని చెరిపేసి ఇష్టానుసారంగా మెటల్ తవ్వేశారు. నిబంధనల్ని ఉల్లంఘించి కొండ పైనుంచి తవ్వకాలు జరిపారు. 16 అడుగుల లోతు వరకూ తవ్వకాలు జరపడంతో ఆ గనుల స్వరూపమే మారిపోయింది. లోకేష్ అండతో శ్రీనివాసచౌదరి ఈ లీజులకు సీనరేజి కూడా కట్టకుండా, జీఎస్టీ చెల్లించకుండా చక్రం తిప్పాడు. మైనింగ్ విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ అక్రమాలు రుజువు కావడంతో రూ.33 కోట్ల జరిమానా విధించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో సర్వే నెంబరు 1లో నాలుగు రోడ్ మెటల్ లీజులు తీసుకుని సీతానగరంలో మాదిరిగానే ఇష్టానుసారం తవ్వకాలు జరిపారు. విజిలెన్స్ తనిఖీలో అవన్నీ బయటపడడంతో ఈ క్వారీలకు ఏకంగా రూ.81 కోట్ల జరిమానా విధించారు. లోకేష్ అండతో శ్రీనివాసచౌదరి జరిపిన మైనింగ్ దందాలో విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావులు కూడా ఉన్నట్లు తేలింది. వెలగపూడి అండతో ఎంఎస్ రెడ్డి దందా ఒంగోలు నుంచి విశాఖ వెళ్లిన మారెడ్డి సింగారెడ్డి అలియాస్ ఎంఎస్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అండతో అనకాపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేశారు. అనకాపల్లి మండలం మార్టూరులో అంజనీ స్టోన్ క్రషర్స్ పేరుతో 6.77 ఎకరాలను లీజుకు తీసుకుని అక్రమంగా తవ్వకాలు జరిపాడు. ఈ క్వారీలో 3 లక్షలకుపైగా క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్‌ను తవ్వినట్లు పర్మిట్లు తీసుకున్నాడు. వాస్తవానికి అక్కడ తవ్వింది 1.32 లక్షల క్యూబిక్ మీటర్లే. మిగిలిన పర్మిట్లను అమ్ముకుని భారీగా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలడంతో రూ.14.50 కోట్ల జరిమానా విధించారు. నర్సీపట్నం, పాడేరులో... మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బంధువైన నర్సింగరావు హిమానీ స్టోన్ క్రషర్స్ పేరుతో నర్సీపట్నంలో రోడ్ మెటల్ లీజుకు తీసుకుని అక్రమ మైనింగ్ చేశారు. అక్రమాలు బయటపడడంతో రూ.6 కోట్ల జరిమానా విధించారు. పాడేరులో మాదిమాంబ స్టోన్ క్రషర్స్ పేరు మీద కోన వెంకటేశ్వరరావు టీడీపీ ముఖ్య నాయకుల అండతో యధేచ్చగా తవ్వకాలు జరిపాడు. అనుమతికి మించి తవ్వకాలు జరపడం, మైనింగ్ నిబంధనలు ఒక్కటి కూడా పాటించలేదని స్పష్టమవడంతో విజిలెన్స్ అధికారులు రూ.14.5 కోట్ల జరిమానా విధించారు. భారీగా అక్రమాలు జరిగాయి ఉత్తరాంధ్రలో చాలా పెద్దఎత్తున మైనింగ్ అక్రమాలు జరిగాయి. పలు చోట్ల విచారణ చేయగా ఉల్లంఘనలు జరిగినట్లు తేలింది. లేటరైట్, రోడ్మెటల్ లీజుల్లో ఎక్కువ అక్రమాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్, మాంగనీస్ లీజుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేశారు. వీటిని గుర్తించి జరిమానాలు విధించాం. అక్రమాలను ఇంకా వెలికితీస్తున్నాం. – ప్రతాప్‌రెడ్డి, మైనింగ్ విజిలెన్స్ ఏడీ, విశాఖ గ్రానైట్ తవ్వకాలకు అచ్చెన్న అండ శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఆమదాలవలస, రాజాం ప్రాంతాల్లో గ్రానైట్ లీజుదారులతో అచ్చెన్నాయుడు లాలూచీపడి అక్రమ తవ్వకాలు చేపట్టారు.ఈ క్వారీల విలువ రూ.వందల కోట్లు ఉంటుంది. టెక్కలిలో ఎంఎస్ఈ గ్రానైట్స్, కుష్యా గ్రానైట్స్ అక్రమ తవ్వకాలు అచ్చెన్న ప్రోత్సాహంతోనే జరిగాయి. విజిలెన్స్ విచారణలో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లేటరైట్, రోడ్ మెటల్, గ్రానైట్, మాంగనీస్ గనులకు సంబంధించి వందల లీజులను పలువురు టీడీపీ సీనియర్ నేతలు ఇతరుల పేర్లతో పొంది తవ్వకాలు జరిపించినట్లు తేలింది. ఐదేళ్లలో ఈ గనుల ద్వారా వేల కోట్ల రూపాయలు వారి జేబుల్లోకి వెళ్లాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అక్రమాలన్నీ ఒక్కొక్కటీ బయటపడడంతో వారి అక్రమార్జన నిలిచిపోయింది. దీన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు, లోకేష్, అయ్యన్న, ఇతర నేతలు బాక్సైట్ పేరుతో ప్రభుత్వంపై బురద చల్లే యత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
బాక్సైట్ కాదు.. లేటరైట్
‘‘ఆ ప్రాంతంలో ఉన్నది బాక్సైట్ కాదు లేటరైట్’’ అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2010లో స్పష్టం చేసింది. అయినా అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ప్రచారం. ‘‘ఈ ప్రభుత్వం కొత్తగా ఎవరికీ లేటరైట్ మైనింగ్ లీజులు ఇవ్వలేదు. నాతవరం మండలంలోని భమిడిక గ్రామంలో ఒక్కచోట మాత్రం టీడీపీ ప్రభుత్వహయాంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే మైనింగ్ జరుగుతోంది.’’ అంటూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఇప్పటికే రెండుసార్లు మీడియాకు ఆధారాలతో సహా వివరించారు. అయినా ఈ ప్రభుత్వం లీజులిచ్చేస్తోంది అంటూ విమర్శలు... ఒక అబద్దాన్ని పదేపదే చెబితే నిజమైపోతుందనుకుంటూ ప్రతిపక్షం, ఒక వర్గం మీడియా చేస్తున్న గోబెల్స్ ప్రచారం చూసి జనం విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ ద్వివేది శనివారం మరోమారు మీడియాకు వివరించి ఆధారాలన్నిటినీ చూపించారు. సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం భమిడిక భూముల్లో లేటరైట్ ఖనిజం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 2010 లోనే స్పష్టం చేసిందని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నట్లు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. విజయవాడలోని ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లుగా గనుల అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. జియోలాజికల్ సర్వే ఆధారంగా గనుల లీజులు ఇస్తారని, ఏ ఖనిజం ఎంత పరిమాణంలో ఉందనే అంశాన్ని సర్వే సంస్థ నిర్ధారిస్తుందని తెలిపారు. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలోని భమిడికలో సర్వే చేయని కొండ పోరంబోకు 121 హెక్టార్లలో లేటరైట్ ఉన్నట్లు జీఎస్ఐ 2010లో నివేదిక ఇచ్చిందని తెలిపారు. సరుగుడు పంచాయతీలోని సుందరకోట, అసనగిరి లీజుల్లోను కేవలం లేటరైట్ మాత్రమే ఉందని జీఎస్ఐ తేల్చిందని తెలిపారు. 2004లో ఈ ప్రాంతానికి సమీపంలోని మరో రెండు లీజుల విషయంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) కూడా అక్కడ కేవలం లేటరైట్ మాత్రమే ఉందని రిపోర్టు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం లీజులున్న ప్రాంతంలో లేటరైట్ మాత్రమే ఉందని, బాక్సైట్ లేదని జీఎస్ఐ, ఐబిఎం డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఆరు వారాల్లో తీర్పు అమలు చేయాలన్నారు భమిడిక లీజుకు అప్పటి ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) 2010 అక్టోబరు 12న ఇచ్చిందని తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2014 నవంబరు 17న అక్కడ తవ్వకాలు జరిపేందుకు ఆనుమతులు ఇచ్చిందన్నారు. 2014 డిసెంబర్ 4న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మైనింగ్‌కు అవసరమైన సరంజామా పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందన్నారు. జీఎస్ఐ, ఐబీఎం, పర్యావరణ మంత్రిత్వ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడ బాక్సైట్ ఉన్నట్లు చెప్పలేదన్నారు. ఆలాంటప్పుడు ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నట్లు, బాక్సైట్ ఎత్తుకెళుతున్నట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో ఆ ప్రాంతంలో ఆరు లీజులుండగా, అందులో ఈ ఒక్క లీజుకు మాత్రమే.. అది కూడా 2018 ఆగస్టు 18న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం వల్ల అనుమతి ఇచ్చామని తెలిపారు. లీజుదారుడు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాత హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2021 ఫిబ్రవరి 5న లీజు ఇచ్చామన్నారు. ఆరు వారాల్లోగా హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అప్పట్లో ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఐదు లీజుల్లో తవ్వకాలు బంద్ ఆరు లీజుల్లో ఒకదాని కాల పరిమితి ముగియగా, అక్రమ తవ్వకాలు చేస్తున్నారనే ఫిర్యాదులతో నోటీసులు జారీ చేసి రెండింటిని మూసి వేయించినట్లు తెలిపారు. శింగం భవాని, లోవరాజు పేరు మీద ఉన్న ఈ రెండు లీజుల్లో 2.3 లక్షల టన్నుల లేటరైట్‌ను అక్రమంగా తవ్వినట్లు తనిఖీల్లో బయపడిందని తెలిపారు. వారికి సుమారు రూ.19 కోట్లు జరిమానా విధించి తవ్వకాలు నిలిపి వేయించామన్నారు. మిగిలిన మరో రెండు లీజులకు సరైన రోడ్డు సౌకర్యం లేక తవ్వకాలు జరగడం లేదన్నారు. మొత్తం 6 లీజులకు 5 చోట్ల తవ్వకాలు జరగడం లేదని తెలిపారు. విశాఖలో బాక్సైట్ తవ్వకాలు జరపాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏ కోశానా లేదని స్పష్టం చేశారు. అయోమయం ఉండకూడదనే అన్ని ఆధారాలు చూపిస్తున్నామని తెలిపారు. ఆరు వారాల్లోగా లీజు కేటాయించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ -
రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. అయినా విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని ఓ పత్రిక తప్పుడు కథనం రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలాగే లేటరైట్ మైనింగ్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను, గనుల శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా తప్పుడు కథనాలను ప్రచురించారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లేలా కథనాలు ప్రచురించిన ఆ పత్రికపై కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేస్తున్నామని తెలిపారు. మొత్తం తవ్వకాల విలువే అంత లేదు గత ప్రభుత్వంలో విశాఖ జిల్లాలో లేటరైట్ మైనింగ్ కోసం ఆరు లీజులిచ్చారని ద్వివేది తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతోనే ఒక మైనింగ్ మాత్రమే లీజుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఆ లీజుదారు ఇప్పటి వరకు కేవలం 5 వేల టన్నుల లేటరైట్ తవ్వారని తెలిపారు. 5 వేల టన్నుల తవ్వకాల్లో రూ.15 వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మొత్తం తవ్వకాల విలువే అంత లేనప్పుడు, అన్ని వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయన్నారు. రాష్ట్రంలో అటవీ వనరులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి మైనింగ్ లీజుల విషయంలో ప్రభుత్వం పర్యావరణానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అనుతివ్వలేదు విశాఖ జిల్లాలో ప్రభుత్వ అనుమతితో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను బాక్సైట్ తవ్వకాలుగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని ఖండిస్తున్నామని భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వి.జి.వెంకటరెడ్డి తెలిపారు. లేటరైట్, బాక్సైట్ ఖనిజాలు వేరువేరుగా ఉంటాయని, రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్ ఖనిజాల మైనింగ్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న ప్రదేశంలో లభించే ఖనిజం లేటరైట్ అని 2010లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతంలో 1981–82లో జరిగిన పరిశోధనల్లో ఇక్కడ లభించే ఖనిజం లేటరైట్‌గా నిర్ధారించారని తెలిపారు. కేవలం ఒక లీజు ద్వారా జరుగుతున్న లేటరైట్ మైనింగ్‌లో ఇప్పటి వరకు 5 వేల టన్నుల లేటరైట్‌ను వెలికితీశారన్నారు. అయ్యన్న అక్రమాలకు ఆధారాలు గత ప్రభుత్వంలో లేటరైట్ మైనింగ్‌లో అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన అనుయాయులు అనేక అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు. ఆ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మైనింగ్ అధికారులు విచారణ జరిపారని, అప్పటి అక్రమ మైనింగ్‌లపై భారీ జరిమానాలు కూడా విధించామని చెప్పారు. ఇసుక కొరత లేదు జగనన్న కాలనీలకు ఇసుక కొరత లేదని గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి తెలిపారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుపుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా 200 రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. రోజుకు దాదాపు 2 లక్షల టన్నుల వరకు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. వర్షాకాలం కోసం ఇప్పటికే 50 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇరిగేషన్ శాఖ క్లియరెన్స్‌తో పూడికగా ఉన్న ఇసుక నిల్వలను ట్రెడ్జింగ్ చేసి సామాన్యులకు అందుబాటులోకి తెస్తామన్నారు. జగనన్న కాలనీల్లో ఇసుక కోసం రీచ్‌లకు 40 కిలోమీటర్ల లోపు ఉన్న వారు ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు కూపన్లను ఇస్తున్నామన్నారు. అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న వారికి ప్రభుత్వమే కాలనీల వద్దకు ఇసుక రవాణా చేస్తోందని తెలిపారు. బోట్స్ మెన్ సొసైటీలకు గతంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండేదని, ప్రస్తుతం కూడా అలా అనుమతులు కావాలని వారు కోరుతున్న మాట వాస్తవమేనన్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. -
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్
సాక్షి, అమరావతి: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన విధానాలపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా గిరిజనుల జీవితాలను నాశనం చేసే జీవో నెం. 97 ఇచ్చింది చంద్రబాబు కాదా..? 2015 లో జీవో జారీ చేసినపుడు సీఎంగా ఉన్నది మీరే కదా...? గత ప్రభుత్వంలో మీరు గిరిజనులకు ఏం చేశారో చెప్పలేక, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి చూపించిన సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదం. గత ఐదేళ్ల మీ పాలనలో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పల్లెల్లో మాఫియాను ప్రోత్సహించారు. కాగా నేడు ప్రభుత్వ ఫథకాలను ప్రజలకు గడప ముంగిటకే చేర్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఇలా మాట్లాడటం వల్లే 123 సీట్ల నుంచి 23 సీట్లకు పడిపోయేలా ప్రజలు బుద్ధి చెప్పినా ప్రవర్తనలో మార్పు లేదన్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో జిసిసిలో జరిగిన వందల కోట్ల అవినీతిపై విచారణ జరపండి. గిరిజనుల ఉత్పత్తులకు ధర కల్పించకకుండా అవినీతికి పాల్పడిన అధికారులపై విచారణ జరిపి, కోట్ల అవినీతిలో భాగస్వాములైన అధికారులపై చర్యలు తీసుకోమని ఆదేశించారు. (చదవండి : ‘గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోలేరు’) -
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు స్వస్తి
సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పూర్తిగా స్వస్తి పలకాలని వైఎస్ జగన్ సర్కారు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గిరిజనుల విశ్వాసాలు, మనోభావాలను గౌరవించే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో 1521.078 హెక్టార్లకు సంబంధించిన ఆరు బాక్సైట్ మైనింగ్ లీజులను రద్దు చేస్తూ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రాంగోపాల్ గురువారం జీఓ నంబరు 80 నుంచి 85 వరకు వేర్వేరుగా ఆరు జీఓలు జారీ చేశారు. మన ప్రభుత్వం రాగానే గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని, వారి అభిప్రాయాల ప్రకారం బాక్సైట్ తవ్వకాలకు స్వస్తి చెబుతూ మైనింగ్ లీజులను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కాగానే అందుకు సంబంధించిన ఫైళ్లు తెప్పించుకుని పరిశీలించారు. బాక్సైట్ తవ్వకాలకు స్వస్తి చెబితే సర్కారు ఆదాయం కోల్పోతుందని కొందరు ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు సూచించినా అంగీకరించలేదు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదని, గిరిజనుల విశ్వాసాలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇందులో మరో మాటకు తావు లేదని, బాక్సైట్ మైనింగ్ లీజులు రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. తమ దశాబ్దాల కల, కోరికను నెరవేర్చిన వైఎస్ జగన్ చిరకాలం గిరిజనుల గుండెల్లో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, గిరిజన ప్రజా ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. రద్దయిన మైనింగ్ లీజులు ►విశాఖ జిల్లా జెర్రెల అభయారణ్యం రెండు, ఎనిమిది బ్లాకుల్లో 617 హెక్టార్లు. ►జెర్రెల అభయారణ్యం మూడో బ్లాకులో 460 హెక్టార్లు. ►జెర్రెల అభయారణ్యం ఒకటో బ్లాకులో 85 హెక్టార్లు. ►విశాఖటపట్నం జిల్లా అరకు మండలం చిట్టంగోలి అభయారణ్యంలో 152 హెక్టార్లు. ►విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం (ఫారెస్టు బ్లాకు) రక్త కొండ గ్రామంలో 113.192 హెక్టార్లు. ►విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం గాలికొండ రిజర్వు ఫారెస్టులో 93.886 హెక్టార్లు. మాట తప్పిన బాబు.. విశాఖపట్నం జిల్లాలో 1521.078 హెక్టార్ల బాక్సైట్ నిక్షేపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు కేటాయించింది. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే గిరిజనుల కోరిక మేరకు బాక్సైట్ మైనింగ్ లీజులు రద్దు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి రాగానే అందుకు విరుద్దంగా కేంద్రం నుంచి అనుమతులు తెప్పించి 2015 నవంబర్ 5న తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేయించారు. -
బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు: ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: విశాఖ ఏజెన్సీలో చంద్రబాబు ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుకు సంబంధించిన ఫైల్‌పై గత గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకం చేయగా, తాజాగా అనుమతులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలు జరపబోమని.. గతంలో టీడీపీ సర్కార్ ఇచ్చిన మైనింగ్ లీజును రద్దు చేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్ లీజును రద్దు చేశారు. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ 1,2,3, గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు ఇచ్చారు. రెండేళ్ల కిందటే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు 2,226 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. (చదవండి: విశాఖ జిల్లాలో.. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు) ఐదు జీవోలు జారీ.. బాక్సైట్ తవ్వకాల అనుమతులు రద్దుకు సంబంధించి మొత్తం 5 జీవోలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ►జీవో నెంబర్ 80- విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని రక్తకొండ గ్రామ పరిధిలో 113.192 హెక్టార్ల బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు ►జీవో నెంబర్ 81- చింతపల్లి, అరకులో 152 ఎకరాల బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు ►జీవో నెంబర్ 82- అనంతగరి మండలం గాలికొండలో 93.886 హెక్టార్ల మైనింగ్‌లీజు రద్దు. ►జీవో నెంబర్ 83 - జెర్రెల బ్లాక్–1 లో 85 హెక్టార్ల బాక్సైట్ మైనింగ్‌లీజు రద్దు ►జీవో నెంబర్ 84- జెర్రెల బ్లాక్–2,3లో 617 హెక్టార్లకు సంబంధించి చింతపల్లిలో మైనింగ్‌లీజు రద్దు ►జీవో నెంబర్ 85- చింతపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో జెర్రెల బ్లాక్–3 లో మరో 460 హెక్టార్లలో మైనింగ్‌లీజు రద్దు -
‘అన్న’మాట నిలబెట్టుకున్నారు
జీవో నంబరు 97... విశాఖపట్నం మన్యంలోని కొండల్లో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ఇస్తూ గత టీడీపీ ప్రభుత్వం 2015, నవంబరులో ఇచ్చిన ఉత్తర్వులు ఇవి! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్‌పై యుద్ధం చేస్తానంటూ గిరిజనులను నమ్మించిన చంద్రబాబు 2014 సంవత్సంలో అధికారంలోకి రాగానే ఆ మాట మరచిపోయారు! అందుకే గిరిజనులంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు! గిరిజనుల సెంటిమెంటుకు గౌరవం.. ఇదీ జనం మనసు ఎరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట! ‘సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటునూ గౌరవించాల్సిందే’నని విస్పష్టంగా చెప్పిన జన నాయకుడని ఇప్పుడు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు! ఇదీ ఇద్దరు నాయకుల మధ్య తేడా! దశాబ్దాలుగా పలు ఉద్యమాలతో కీలక మలుపులు తిరిగిన బాక్సైట్ మైనింగ్ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల మనసుల్లో గూడుకట్టుకున్న భయాందోళనలకు ముగింపు పలికారు. 3,030 ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాక్షి, విశాఖపట్నం/పాడేరు: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని రిజర్వు ఫారెస్టు ప్రాంతంలోనున్న అపారమైన బాక్సైట్ ఖనిజ సంపదపై కొన్ని దశాబ్దాల క్రితమే బడాబాబులు కన్నేశారు. ఖనిజం కోసం కొండలను తవ్వేస్తే తమ జీవనానికి, సాంస్కృతిక వారసత్వానికే కాదు అటవీ, పర్యావరణానికి విఘాతం కలుగుతుందనే భయాందోళనలతో దాదాపు 50 ఏళ్లుగా గిరిజనులు పోరాటం చేస్తూ వచ్చారు. వారి పక్షాన వైఎస్సార్సీపీ అధినేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో మూడేళ్ల క్రితం చింతపల్లిలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి భారీ సదస్సు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండు చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు వెనుకంజ వేసినప్పటికీ జీవో 97ను మాత్రం రద్దు చేయలేదు. జీవో నంబరు 97ను రద్దు చేయాలనే డిమాండుతో గిరిజనులు ప్రారంభించిన పోరాటానికి జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏజెన్సీలోని వైఎస్సార్సీపీ నాయకులు కూడా బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర వహించారు. పార్టీ అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి గిరిజనులకు మేలు చేస్తామని జగన్ తన ప్రజాసంకల్పయాత్ర సందర్భంలోనూ పునరుద్ఘాటించారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి నెలలో పాడేరులో నిర్వహించిన బహిరంగ సభలోనూ గిరిజనులకు అభయమిచ్చారు. అలా ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నారు. గిరిజనుల పక్షాన తాను ఉన్నానని నిరూపించారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి తాజాగా ప్రకటించడంతో విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన ముఖ్యమంత్రి అంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. బాక్సైట్ కొండలిక సురక్షితం... అరకులోయ మండలంలోని గాలికొండ, రక్తికొండ, చిత్తంగొంది, చింతపల్లి ప్రాంతంలోని జర్రెల, సప్పర్లతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తేడు అటవీ ప్రాంతంలో కలిపి దాదాపు 75 కోట్ల టన్నుల బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఈ రెండు జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 27 కొండల్లో ఈ బాక్సైట్ నిక్షిప్తమై ఉందని గుర్తించారు. అయితే ఈ కొండలలో బాక్సైట్ తవ్వకాలు జరిపితే 270 గ్రామాలకు చెందిన గిరిజనులు పూర్తిగా నిర్వాసితులవుతారని, వ్యవసాయ భూములు, అటవీ సంపద అంతా నాశనమవుతాయని, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఏజెన్సీ ప్రజల మనుగడమే ముప్పు పొంచి ఉదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే మైదాన ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు చేశారు. దీంతో అప్రమత్తమైన గిరిజనులు దశాబ్దాల క్రితమే ఆందోళనలు ప్రారంభించారు. పంచపట్మాలి ప్రత్యక్ష నిదర్శనం.. విశాఖ మన్యానికి సమీపంలోనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోనున్న పంచపట్మాలి కొండల్లో జరుగుతున్న దాష్టీకం గిరిజనుల్లో ఆందోళనలను మరింత పెంచింది. దమన్‌జోడి వద్ద ఏర్పాటు చేసిన అల్యూమినా రిఫైనరీ కోసం 1985 సంవత్సరం నుంచి అక్కడ బాక్సైట్ తవ్వకాలు మొదలుపెట్టారు. కేవలం 48 లక్షల టన్నుల బాక్సైట్ ఖనిజం తవ్వకం వల్లే సమీప గ్రామాల గిరిజనులంతా నిర్వాసితులయ్యారు. అటవీ సంపద కనుమరుగైంది. జలవనరులు కలుషితమయ్యాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూములన్నీ నాశనమయ్యాయి. వాటిపై గిరిజనులంతా మనుగడను కోల్పోయారు. ఈ పరిస్థితిని చూసిన పర్యావరణవేత్తలంతా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో 75 కోట్ల టన్నుల బాక్సైట్ కోసం చేపట్టిన మైనింగ్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 270 గ్రామాలకు చెందిన గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థం చేస్తున్న జీవో నంబరు 97ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రద్దు చేయడంపై సర్వత్రా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన మేధావులు, నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. బాక్సైట్ జీవో 97 రద్దు చారిత్రాత్మకం.. గిరిజనుల పక్షపాతిగా పేరొం దిన సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న బాక్సైట్ అనుకూల జీవో నంబరు 97ను రద్దు నిర్ణయం చారిత్రాత్మకం. గత చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్‌ను తవ్వి గిరిజనులను నాశనం చేసే చర్యల్లో భాగంగానే ఈ జీవోను జారీ చేసింది. ఆ సమయంలో గిరిజనుల పక్షాన జగన్మోహన్రెడ్డి నిలబడ్డారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పాదయాత్రలో ఈ బాక్సైట్ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించడం సంతోషంగా ఉంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు గిరిజనుల మనుగడకు భద్రత.. రాష్ట్ర ఖజానాకు వచ్చే రూ. వేల కోట్ల ఆదాయం కన్నా గిరిజనుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. బాక్సై ట్ జీవో 97ను రద్దు చేసి ముఖ్యమంత్రి జగన్ గిరిజను ల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. గిరిజనుల పక్షపాతిగా దేశ చరిత్రలో నిలిచారు. – చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే, అరకు గిరిజనులకు పండుగ రోజు.. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ గత చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 97ను జారీ చేసినప్పుడు మే మంతా పోరాటానికి దిగాం. మా గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాడు అండగా నిలబడ్డారు. మాలో మనోధైర్యాన్ని నింపారు. చింతపల్లిలో గిరిజనులతో సదస్సు నిర్వహించారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించారు. ఇది బాక్సైట్ ప్రభావిత జర్రెల, గాలికొండ ప్రాంతాల గిరిజనులకు పండుగ రోజు. – అడపా విజయకుమారి,జర్రెల మాజీ సర్పంచ్, జీకే వీధి మండలం బాక్సైట్ జీవో రద్దును స్వాగతిస్తున్నాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాక్సైట్ జీవో 97 రద్దుకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజనులు దశాబ్దాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ దోపిడీకి పూనుకోవడం దుర్మార్గ చర్యగా గిరిజన సంఘం అప్పట్లో ఖండించింది. ఉద్యమం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డి బాక్సైట్ జీవో రద్దుకు నిర్ణయం తీసుకోవడం గిరిజనులకు ఎంతో మేలు చేస్తుంది. – పి.బాలదేవ్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, అరకులోయ ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది.. గిరిజనులంతా బాక్సైట్‌ను వ్యతిరేకించి ఉద్యమాలు చేస్తుంటే, గత చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను నాశనం చేసే చర్యలకు పాల్పడింది. జీవో నంబర్ 97ను జారీ చేసి గిరిజనులకు అన్యాయం చేయాలని చూసింది. బాక్సైట్ ఖనిజ సంపద దోపిడీ చేసి విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్రెడ్డి గిరిజనుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించడం చరిత్రలో నిలిచిపోతుంది. – పి.రంజిత్‌కుమార్, దండకారణ్య విమోచన సమితి నేత, హుకుంపేట గిరిజనుల రక్షకుడు జగన్మోహన్రెడ్డి.. సీఎం జగన్మోహన్రెడ్డి తన తండ్రి, మహానేత వైఎస్సార్ వలే మాటకు కట్టుబడి ఉండే మంచి నేతగా గిరిజనుల్లో గుర్తింపు పొందారు. అధికారంలోకి రాగానే బాక్సైట్ అనుకూల జీవో 97ను రద్దు చేస్తానని చింతపల్లి సదస్సులో గిరిజనులకు మాట ఇచ్చారు. ఆ రోజుల్లో గిరిజనుల పక్షాన బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంను గిరిజనులు ఇప్పటికి మరువలేదు. ప్రభుత్వానికి ఆదాయం కంటే గిరిజనుల ప్రయోజనాలు, వారి సురక్షిత మనుగడే ముఖ్యమని మహోన్నత ఆశయంతో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి బాక్సైట్ జీవో 97 రద్దుకు నిర్ణయించి గిరిజనులకు రక్షకుడిగా మారారు. ఆయన నిర్ణయంపై గిరిజనులు సంతోషంగా ఉన్నారు. – చిట్టపులి శ్రీనివాసపడాల్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పాడేరు -
విశాఖ జిల్లాలో.. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు
సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలో 3,030 ఎకరాల బాక్సైట్ మైనింగ్ లీజును రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సంతకం చేశారు. దీంతో బాక్సైట్ మైనింగ్ లీజు ఉత్తర్వులు శుక్రవారం జారీకానున్నాయి. తమ ప్రభుత్వం వస్తే బాక్సైట్ తవ్వకాలు జరపబోమని, గతంలో సర్కారు ఇచ్చిన మైనింగ్ లీజు రద్దుచేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్ లీజు రద్దుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుచేస్తున్నాం’.. అని వైఎస్ జగన్ ఈ ఫైలుపై సంతకం చేసిన సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఈ నిర్ణయంతో సీఎం మాట తప్పని, మడమ తిప్పని నేతగా నిరూపించుకున్నారని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. మాట మార్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి విశాఖ జిల్లా చింతపల్లి, జెర్రిల్లా అటవీ బ్లాకుల్లో 3030 (1212 హెక్టార్లలో) ఎకరాల బాక్సైట్ నిక్షేపాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. బాక్సైట్ తవ్వకాలు జరపొద్దని గిరిజనులు డిమాండు చేయడంతో అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే వీటి లీజులు రద్దుచేస్తామని ప్రకటించడమే కాక.. అక్కడ బాక్సైట్ వ్యతిరేక ఆందోళనలో సైతం పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట గాలికొదిలేశారు. బాక్సైట్ తవ్వకాలతోనే గిరిజనుల ప్రగతి సాధ్యమంటూ మాట మార్చారు. బాక్సైట్ తవ్వకాలకు అటవీ, పర్యావరణ తుదిదశ అనుమతులను ఆఘమేఘాలపై కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకున్నారు. అనంతరం.. రాత్రికి రాత్రే బాబు సర్కారు 2015 నవంబరు 5న విశాఖ జిల్లాలోని చింతపల్లి, జెర్రిల్లా అటవీ ప్రాంతంలో 3030 ఎకరాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో నంబరు 97 జారీచేసింది. దీనిని నిరసిస్తూ అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజనులతో ఆందోళన చేపట్టింది. దీంతో.. తమకు తెలియకుండానే జీవో జారీచేశారంటూ చంద్రబాబు అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. పర్యావరణ అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ సర్కారు కేంద్రానికి నాలుగుసార్లు లేఖలు రాసిన విషయాన్ని ‘సాక్షి’ ఆధారాలతో బట్టబయలు చేయడంతో నాలుక కరుచుకున్న చంద్రబాబు.. ఇక సమాధానం చెప్పలేక ఈ జీవోను అబయెన్సులో పెడతామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. చెప్పిన మాటకు కట్టుబడి.. ఈ నేపథ్యంలో.. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. చెప్పిన మాటకు కట్టుబడి అధికారుల నుంచి అందుకు సంబంధించిన ఫైలు ఇటీవల తెప్పించుకున్నారు. బాక్సైట్ మైనింగ్ లీజును రద్దుచేయాలని సంతకం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పేరుతో ఉన్న 3030 ఎకరాల మైనింగ్ లీజు రద్దుచేస్తూ భూగర్భ గనుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేయనుంది. కాగా, బాక్సైట్ అనేది మేజర్ మినరల్ అయినందున మైనింగ్ లీజు జారీచేసే, రద్దుచేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వాలు లీజులు ఇవ్వడం లేదా రద్దుచేయడం లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మైనింగ్ లీజు గడువు ముగిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే రద్దుచేయవచ్చు. కానీ, లీజు గడువు ముగియక ముందే రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున ఈ విషయాన్ని వివరిస్తూ అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా కోరనుంది. -
జీఓ-97 రద్దు చేసిన ప్రభుత్వం
-
బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయడం హర్షనీయం
సాక్షి, అరకు : బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, వారు జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరకు లోయలో సంబరాలు నిర్వహించిన అనంతరం స్థానిక గిరిజనులతో కలిసి వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అశోక్, సుబ్రమణ్యం,భాస్కర్, చిన్నారావు పాల్గొన్నారు. -
బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేయనున్న ప్రభుత్వం
-
చంద్రబాబు బాక్సైట్ దోపీడీ గుట్టు రట్టు
-
బాక్సైట్ మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం: వైఎస్ జగన్
-
మావోల లేఖ: వారు ఆదివాసీలు కాదు.. ద్రోహులు!
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ సమీపంలోని లివిటిపుట్టు వద్ద దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు ఆ హత్యాకాండపై బహిరంగలేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి జగబందు పేరుతో మావోలు లేఖలు విడుదల చేశారు. రాజకీయ నేతలకు, దళారీలను ఆ లేఖలో గట్టిగా హెచ్చరించారు. బాక్సైట్ పేరుతో మంత్రి పబ్బం గడుపుకుంటున్నారు ‘మైనింగ్ మాఫియాగా మారి, ఆదివాసీల ప్రాకృతిక సంపదను అప్పన్నంగా కొల్లగొడుతున్నందుకే అరకు ఎమ్మెల్మే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను హతమార్చాం. కిడారి, సోమాలు ఆదివాసీలు కాదు.. ద్రోహులు, సామ్రాజ్యవాద బహుళ జాతీ కంపెనీలకు దళారులు. కిడారి రోజుకో పార్టీ మారుతూ సంపాదనే ధ్యేయంగా బరితెగించారు. నాతవరం మండలంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు, కొడుకు విజయ్‌లు వాటాలతో పబ్బం గడుపుకుంటున్నారు. మన్య ప్రాంత సంపద అక్రమ తరలింపు ఆపకపోతే జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే’అంటూ మావోలు లేఖలో పేర్కొన్నారు. ఇక గత కొద్ది నెలలుగా ఆంధ్రా-ఒడిశా బార్డర్ (ఏవోబీ) వద్ద మావోయిస్టులు కదలికలు ఏపీ పోలీసులకు చాలెంజ్‌గా మారింది. -
గిడ్డి ఈశ్వరిని హెచ్చరించిన మావోయిస్టులు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ సమీపంలోని లివిటిపుట్టు వద్ద గత నెల 23న దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు ఆ హత్యాకాండపై బహిరంగలేఖ విడుదల చేశారు. గిరిజనుల్ని మోసం చేసి స్వలాభం కోసం రూ.కోట్లకు అమ్ముడుపోయినందునే కిడారిని, అలాగే ఎన్నో తప్పులు చేసినందునే సివేరి సోమలను హతమార్చినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రధాన పత్రికల సంపాదకుల పేరిట మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మంగళవారం రాత్రి ఈ లేఖను విడుదల చేసింది. ‘‘గిరిజన వ్యతిరేకులు, ప్రజాద్రోహులైన కిడారి, సివేరి సోమలను సెప్టెంబర్ 23న ప్రజాకోర్టులో శిక్షించాం. గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు హెచ్చరించినా అధికారపార్టీకి తొత్తులుగా మారి మా హెచ్చరికలను లెక్క చేయకపోవడమేగాక బాక్సైట్ తవ్వకాలకు లోలోపల ప్రభుత్వానికి సహకరించినందువల్లే శిక్షను అమలు చేశాం. గిరిజనుల్ని మోసం చేసి స్వలాభం కోసం రూ.కోట్లకు అమ్ముడుపోయిన ప్రజాద్రోహి కిడారిని, అలాగే ఎన్నో తప్పులు చేసిన సివేరిలను కఠినంగా శిక్షించాం. ప్రజల సమక్షంలోనే వారు చేసిన తప్పులను ఒప్పుకున్నారు. అందుకే శిక్షలను అమలు చేశాం..’’ అని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. పోలీసునుద్దేశించి మావోయిస్టులు లేఖలో ప్రస్తావిస్తూ.. ‘‘ఆరోజు పోలీసు సోదరులు మాకు ఆయుధాలతో చిక్కినా వారిని చంపలేదు. పొట్టకూటికోసం ఉద్యోగం చేస్తున్నారని పెద్ద మనసుతో క్షమించి విడిచిపెట్టాం. అదే మా విప్లవ సోదరులు మీకు దొరికితే దొంగకథలల్లి వాళ్లను నిస్సహాయులను చేసి ఎన్కౌంటర్ చేస్తారు కదా! మరి మీరు మా మాదిరి చేయగలరా? ఆలోచించండి..’’ అని కోరారు. మావోయిస్టులు విడుదల చేసిన బహిరంగ లేఖ రూ.20 కోట్లకు అమ్ముడుబోయిన గిడ్డి మాకు నీతులు చెప్పడమా? ప్రజాద్రోహి, గిరిజన ద్రోహి, అధికారపార్టీకి తొత్తు అయిన గిడ్డి ఈశ్వరి తమను నిందించడమేంటని మావోయిస్టులు మండిపడ్డారు. రూ.20 కోట్లకు అధికారపార్టీకి అమ్ముడుపోయిన నువ్వు మాకు నీతులు చెప్పడమా? అని ధ్వజమెత్తారు. ‘ప్రజాకోర్టులో కిడారి నీ విషయంపై నిజం చెప్పాడు. నీకందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచి క్షమాపణలు చెప్పాలి. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలి. లేదంటే నీకూ కిడారి, సోమలకు పట్టిన గతే పడుతుంది. మేము చెప్పినట్లు చేస్తావు కదా! లేదంటే మంత్రి పదవి దొరుకుతుందని ఆశిస్తావా.. ఆలోచించుకో’’ అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హెచ్చరికలు చేశారు. -
విజయసాయి రెడ్డి ప్రశ్నలకు మంత్రుల జవాబులు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సోమవారం కేంద్ర మంత్రులు రాజ్యసభలో సమాధానమిచ్చారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై ఎంపీ ప్రశ్నకు గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్ధీబాయ్ చౌదరి వివరణనిచ్చారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో ప్రతిపాదనలు సమర్పించినట్టు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ కోసం కొన్ని బ్లాక్‌లను కేటాయించాల్సిందిగా నాల్కో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలను సమర్పించిందని చెప్పారు. బాక్సైట్ గనుల కేటాయింపు జరిగితే విశాఖపట్నంలో అల్యూమినా రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమని నాల్కో తన ప్రతిపాదనలలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలోని గూడెం, జెర్రలలోని బాక్సైట్ బ్లాక్‌లతోపాటు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కాటంరాజు కొండ వద్ద గల బాక్సైట్ బ్లాక్‌లను తవ్వకాల కోసం లీజుకు కేటాయించాల్సిందిగా 2007 నవంబర్లోనే నాల్కో దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ ఆయా బాక్సైట్ బ్లాక్‌లలో తవ్వకాలు జరిపేందుకు 2009 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నాల్కోకు అనుమతించినట్లు మంత్రి తెలిపారు. కారణాంతరాల వలన నాల్కో బాక్సైట్ తవ్వకాలను చేపట్టలేకపోయిందని పేర్కొన్నారు. దీంతో తిరిగి ఏజెన్సీ ప్రాంతంలోని బాక్సైట్ బ్లాక్‌లలో మైనింగ్ లీజు కోసం నాల్కో 2017 మే, 2017 సెప్టెంబర్ మాసాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. సుప్రీం కోర్టు (సమతా తీర్పులో) ఆదేశాల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీనంలోని సంస్థ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. నాల్కో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున షెడ్యూల్డు ఏరియాలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అర్హత కలిగి ఉందని ఆయన వెల్లడించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులపై ఆంక్షలు లేవు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ రిఫైనరీ, పెద్ద ఎత్తున ఆయిల్ ట్యాంక్‌లు ఉన్నందున రక్షణ శాఖ విమానాల్లో పైలట్ల శిక్షణకు ఇది ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమానాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని వెల్లడించారు. విశాఖపట్నంలో ప్రాథమికమైన ఫ్లైయింగ్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబోమని తెలిపారు. సుశిక్షితులైన పైలట్లే ఈ ఎయిర్పోర్ట్ నుంచి మిలటరీ విమానాలను ఆపరేట్ చేస్తారని చెప్పారు. మిలటరీ విమానాల రాకపోకలకు సంబంధించి అవసరమైన అన్ని భద్రతా చర్యలు పాటిస్తున్నామని వెల్లడించారు. ఆయిల్ రిఫైనరీలు, ట్యాంక్‌లపై నుంచి మిలటరీ విమానాలు రాకపోకలు సాగించవని మంత్రి స్పష్టం చేశారు. -
బాక్సైట్ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల లీజు విషయంలో గిరిజనులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గిరిజనుల హక్కులను ఏవిధంగా పరిరక్షిస్తున్నారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. అక్కడ ఏం జరుగుతుందో తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
ఇంతకీ ఆర్కే ఎక్కడ ?
-
బాక్సైట్ కోసమేనా ?
-
ఇదీ కటాఫ్ ఏరియా కథ
కటాఫ్ ఏరియా.. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడీ పేరు మార్మోగుతోంది. మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద ఎన్కౌంటర్ వారం క్రితం ఇక్కడే జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మడ్ అటవీ ప్రాంతం ఎంతటి దుర్భేద్యమైనదో.. ఏవోబీలోని కటాఫ్ ప్రాంతం అంత దుర్భేద్యమైనది. పక్కా ప్రణాళికతో తొలిసారి ఆ ప్రాంతంలోకి పోలీసు బలగాలు అడుగుపెట్టగలిగాయి. దాంతో కటాఫ్ ఏరియా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడెలా చేరుకోగలిగారంటే.. ఇన్నాళ్లూ దుర్లభంగా ఉన్న కటాఫ్ ప్రాంత ప్రవేశాన్ని పక్కా వ్యూహంతో పోలీసు అధికారులు సుగమం చేసుకున్నారు. కటాఫ్ ఏరియాలోని రామగుడ ప్రాంతంలో మావోయిస్టులు భారీ ఎత్తున శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆ శిబిరాలకు అవసరమైన సరుకులను తరలిస్తున్న విషయాన్ని కూంబింగ్ దళాలు పసిగట్టాయి. వాటిని తరలిస్తున్న వ్యక్తి(కొరియర్)ని అదుపులోకి తీసుకొని మొత్తం సమాచారం రాబట్టారు. దాన్ని ఆధారం చేసుకుని ఆంధ్ర-ఒడిశా పోలీస్ ఉన్నతాధికారులు పరస్పరం చర్చించుకొని పక్కా వ్యూహం రచించారు. జీపీఎస్ తదితర ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థల సాయంతో ముందుకు కదిలారు. టార్గెట్ ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిపివేసి, సెల్ సిగ్నళ్లు నిలిపివేసి కాలినడకనే కటాఫ్ ఏరియాకు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మావోయిస్టులు నిద్రలో ఉన్న సమయంలో దాడి ప్రారంభించి ఎన్కౌంటర్ చేశారు. వరుసగా మూడురోజులపాటు జరిగిన ఈ కాల్పుల్లో మొత్తం 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. కటాఫ్ అంటే 1980 దశకంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో బలిమెల జలాశయం నిర్మించారు. అయితే సుమారు 142 గ్రామాలు జలాశయం మధ్యలో ఉండిపోయాయి. అక్కడకు చేరుకోవడం చాలా కష్టం. నావలు లేదా లాంచీల్లోనే ప్రయాణం చేయాలి. గ్రామాలన్నీ నీటి మధ్యలో ఉన్న ఎత్తయిన కొండలపై ఉన్నాయి. వీటిలో సుమారు 55 వేల వరకు జనాభా నివసిస్తున్నారు. ఆ ప్రాంతాన్నే కటాఫ్ ఏరియాగా వ్యవహరిస్తున్నారు. స్థానికుల సహకారం, ఆ ప్రాంత భౌగోళిక స్వరూపంపై అవగాహన ఉంటే తప్ప అక్కడికి ప్రవేశించడం దుర్లభం. అందుకే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్టర్‌జోన్‌గా ఇన్నాళ్లూ ఉపయోగించుకున్నారు. సమాంతర పాలన నుంచి సంక్షోభంలోకి.. నాలుగు డివిజన్లు, మూడు కేంద్ర ప్రాంత్రీయ కమాండ్లు(సీఆర్సీలు), ఎనిమిది వరకు ఏరియా కమిటీలు.. వెరసి పోలీసులను దశాబ్ద కాలంగా ముప్పుతిప్పలు పెట్టిన మావోయిస్టు పార్టీ ఏవోబీ జోన్ కమిటీ ఇప్పుడు కీలక నేతలను కోల్పోయింది. ఏవోబీలో ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేది. తరువాత పోడు వ్యవసాయం పెరిగింది. దీంతో దట్టమైన అడవులు పలుచబడ్డాయి. గతంలో రోడ్లు వద్దని చెప్పిన గిరిజనం ఇప్పుడు రోడ్లు కావాలని కోరుతున్నారు. దీంతో మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నారు. వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పుడు యువత తీరులో మార్పు వచ్చింది. మావోయిస్టు ఉద్యమంలో చేరే వారి సంఖ్య తగ్గుతోంది. దీంతో మావో ఉద్యమం సంక్షోభంలోకి వెళ్లింది. -
అది ఆర్కే అడ్డా
మల్కన్‌గిరి అటవీ ప్రాంతం మావోయిస్టు కే ంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) అడ్డా లాంటిది. మల్కన్‌గిరి జిల్లాలో 1,430 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. దట్టమైన ఆ రిజర్వు ఫారెస్టును స్థావరంగా చేసుకుని దశాబ్దాల తరబడి అక్కడ నుంచే ఆయన తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్కేకు మూడంచెల భద్రత ఉంటుంది. పది నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టు దళ సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వీరిని దాటుకుని వెళ్లడం పోలీసులకు కత్తిమీద సాములాంటిది. ఆ అటవీ ప్రాంతంలో ఎక్కడికక్కడే మందుపాతర్లను అమర్చి ఉంటారు. ఒకవేళ పోలీసులు ప్రమాదాన్ని ఊహించి తప్పించుకుని వద్దామన్నా బలిమెల రిజర్వాయరును దాటుకుని రావాల్సి ఉంటుంది. లాంచీల్లో వచ్చేద్దామన్నా ఎగువన ఉన్న కొండపై నుంచి మావోలు కాల్పులు జరపడానికి అనువుగా ఉంటుంది. 2008లో బలిమెల రిజర్వాయరులో కూంబింగుకు వెళ్లి వస్తున్న గ్రేహౌండ్స్ దళాల లాంచీపై రాకెట్ లాంఛర్లతో ఇలాగే దాడి చేసి 38 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలో పలుమార్లు జరిగిన ఎన్కౌంటర్లలో కొందరు మావోలు మరణించినా ఆర్కే తప్పించుకోగలగడానికి ఈ పరిస్థితులే కారణం. మావోల కంచుకోట ఏవోబీ ఏవోబీ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది మావోయిస్టులు.. తర్వాత గంజాయి సాగు. ఇక్కడి కొండలు, గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం, కనీస సదుపాయాలకు నోచుకోని గిరిజన తండాలు. అక్కడి వారికి ఉపాధి లేని పరిస్థితులు ఉద్యమానికి ఊపిరి పోశాయి. తూర్పు కనుమల్లోని ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 9 జిల్లాల పరిధిలో విస్తరించిన ఏవోబీ జోన్ ఉద్యమానికి పెట్టని కోట. దీని పరిధిలో ఉన్న ఆంధ్రకు చెందిన తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు.. ఒడిశాకు చెందిన గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు ఆయువుపట్లు. ఈ ప్రాంతాలను విభజించి కార్యకలాపాలు సాగిస్తున్నారు. పట్టున్న ప్రాంతాలు: సీలేరు నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న విశాఖ జిల్లాలోని దుర్గం, జాజిపాలెం, గడ్డిబంద, కాకులగెడ్డ, మల్కన్‌గిరి జిల్లాలోని బిర్సింగి, గొంది, గుమ్మాబ్లాక్, చిత్రకొండ, కలిమెల, బలిమెల, ఎంపర్ల మెట్ట, టెక్ పొదర్, కొరాపుట్ జిల్లాలోని నారాయణపట్న, బందుగాం, చినబురిగి, పెదబురిగి, మంగళపురం బ్లాక్‌లు, విజయనగరం జిల్లా పార్వతీపురం, కొమరాడ, సాలూరు, మక్కువ, విశాఖ జిల్లాలోని జీకేవీధి, చింతపల్లి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మావోలకు మంచి పట్టుంది. కాలినడకే శరణ్యం: ఆంధ్రతోపాటు ఒడిశాలోని చాలా ఏజెన్సీ గ్రామాలకు కాలి నడకే శరణ్యం. ముఖ్యంగా ఒడిశాలోని చిత్రకొండ నుంచి బలిమెల రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న దర్లవాడ, పనసపుట్టు, పంపరుమెట్ట, జనభ, ఆండ్రపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలకు వెళ్లాలంటే చిత్రకొండ నుంచి లాంచీల్లో ప్రయాణం చేయాల్సిందే. ఈ గ్రామాలకు అంబులెన్స్ వంటి అత్యసర సేవలను అసలు ఊహించలేం. వ్యాధులు వస్తే మరణం తప్ప నివారణం లేదు. ఈ వెనుకబాటుతనమే గిరిజనులను మావోయిస్టు ఉద్యమం వైపు నెడుతోంది. వందల మంది గిరిజన యువత మిలిషియా కమిటీల్లో చేరి పనిచేస్తున్నారు. అలాగే చాలా మంది దళాల్లో చేరారు. వారి సాయంతోనే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ గుప్పిట్లో ఉంచుకోగలుగుతున్నారు. ఏవోబీ పరిధి 9 జిల్లాలు ఆంధ్రలో: తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఒడిశాలో: చెందిన గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలు. బలిమెలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే... బలిమెలకు ఆ పేరు ఎలా వచ్చిందనే దానిపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. స్థానికులు చెబుతున్న ఓ కథనం మేరకు.. ఏదైనా పెద్ద ప్రాజెక్టును నిర్మించాలంటే పూర్వకాలంలో బలి ఇవ్వడం పరిపాటి. బలిమెల రిజర్వాయర్ నిర్మించే సమయంలో మహిళలకు అమ్మవారు పూని రిజర్వాయర్‌లో నీరు ఎప్పుడూ పుష్కలంగా ఉండాలంటే నిర్మాణం పూర్తయ్యేవరకూ తనకు నిత్యం బలి ఇమ్మని కోరారని స్థానికులు చెబుతున్నారు. ఆందోళన చెందిన ప్రజలు నిత్యం నరబలి ఇవ్వలేమని, జంతు బలి ఇచ్చేందుకు తమకు సమ్మతమేనని అమ్మవారికి వేడుకున్నారు. చిత్రకొండ ప్రాంతంలోని బలిమెల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యే వరకూ ఇక్కడి గిరిజనులు, మైదాన ప్రాంతంలోని జనం నిత్యం ఎక్కడో ఒక దగ్గర జంతు బలి ఇచ్చేవారని.. అందుకే ఈ రిజర్వాయర్‌కు బలిమెల రిజర్వాయర్ అని పేరు పెట్టినట్టు చెబుతున్నారు. ‘గురుప్రియ’ వంతెన నిర్మాణం జరిగితే.. మావోయిస్టులకు అత్యంత అనుకూలంగా ఉన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి అటవీ ప్రాంతంపై పట్టుకోసం అటువైపు ఉన్న ఒడిశా ప్రభుత్వం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు ఇసుమంతైనా సమాచారం లభించే అవకాశం ఉండదు. ఈ అడవుల్లో మావోయిస్టులు తుపాకుల కర్మాగారంతో పాటు పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌ను ఏళ్ల తరబడి నడుపుతున్నట్టు గతేడాది సెప్టెంబర్ 18న పోలీసులు గుర్తించారు. అనంతరం దానిని నిర్మూలించారు. ఇంతటి పటిష్టమైన మావో సామ్రాజ్యంలోకి ప్రవేశించేందుకు వీలుగా మల్కన్‌గిరి జిల్లాలో బలిమెల రిజర్వాయరుకు సమీపంలో గురుప్రియ నదిపై రూ. 188 కోట్లతో 910 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణంతోపాటు రోడ్ల నిర్మాణాలకు 1982లోనే ఒడిశా సీఎం బిజూ పట్నాయక్ పునాది రాయి వేశారు. ఆ వంతెన నిర్మాణం జరిగితే కటాఫ్ ఏరియాలోని 154 గిరిజన గ్రామాలకు రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. దీంతో మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది కేంద్రం, ఒడిశా ప్రభుత్వాల వ్యూహం. ఈ ఎత్తుగడను గమనించిన మావోయిస్టులు గురుప్రియ వంతెన నిర్మాణం జరగకుండా ఎదురు దాడులు చేస్తూ వస్తున్నారు. గతేడాది ఆగస్టు 29న బీఎస్ఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆరుగురు మరణించారు. ఈ బ్రిడ్జి కాంట్రాక్టును దక్కించుకున్న గామన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు, కార్మికులను హెచ్చరించడంతో ఆ సంస్థ కాంట్రాక్టును ఉపసంహరించుకుని వెనక్కి వెళ్లిపోయింది. చివరకు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థకు సరిహద్దు భద్రతా దళాల(బీఎస్ఎఫ్) రక్షణగా ఉంచుతామన్న హామీతో కోల్‌కతాకు చెందిన రాయల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ముందుకొచ్చింది. వాస్తవానికి ఈ వంతెన ఈ ఏడాదే పూర్తి కావలసి ఉంది. కానీ మావోయిస్టుల దాడులు, హెచ్చరికలతో ఇప్పటిదాకా 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. -
దోపిడీపై తిరుగుబాటు
మౌలిక వసతులు.. గిట్టుబాటు ధరల విషయంలో దళారుల దోపిడీ.. బాక్సైట్ తవ్వకాలు వంటి అంశాల్లో ప్రభుత్వాలు గిరిజనులను పట్టించుకోకపోవడమే వారిని మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. ప్రభుత్వాల తీరుతో దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయి.. అభివృద్ధికి దూరంగా కారడవుల్లో మగ్గిపోయిన గిరిజనులు మావోయిస్టులకు ఆశ్రయమిచ్చేవారు.. క్రమంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దశాబ్దాల క్రితం ఏజెన్సీలో దళారీ వ్యవస్థ ఆధిపత్యం చెలాయించేది. గిరిజనుల పంటలకు మదుపుల పేరుతో అడ్వాన్సులు ఇచ్చి.. పంట ఉత్పత్తులను తమకే అమ్మాలని దళారులు షరతులు పెట్టేవారు. పంట అమ్మే సమయంలో తమకు నచ్చిన రేటు కట్టి గిరిజనులను దోపిడీ చేసేవారు. ఇక దళారులతోపాటు గ్రామాల్లోకి వచ్చే పోలీసుల దౌర్జన్యాలకు, గిరి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారు. ఇవేవీ ప్రభుత్వాల దృష్టికి వెళ్లేవికావు. ఒకవేళ వెళ్లినా చర్యలు ఉండేవి కావు. విద్య, వైద్యం, రవాణా, తాగునీరు వంటి కనీస సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వాలు గిరి పల్లెలను అసలు పట్టించుకోలేదు. ఫలితంగా విద్య, ఉపాధి అవకాశాలకు దూరమైన గిరిజన యువత మావోయిస్టు ఉద్యమం వైపు మొగ్గు చూపారు. బలిమెల రిజర్వాయర్‌లో ముంపునకు గురైన వేలాది ఎకరాల భూములకు బదులు ప్రభుత్వం ఇచ్చిన అటవీ భూములు పంటల సాగుకు పనికి రాకపోగా.. అందుకు ప్రభుత్వం నుంచీ ఎటువంటి సహకారం లభించలేదు. దీంతో పెద్దగా పెట్టుబడి లేకుండానే వేలాది రూపాయల ఆదాయం సమకూర్చే గంజాయి సాగు వైపు గిరిజనులు మొగ్గుచూపారు. అలాగే బాక్సైట్ తవ్వకాల వల్ల అడవులు నాశనమవుతాయని..గిరిజనుల మనగడకే ముప్పు వస్తుందని గిరిజనులతోపాటు పర్యావరణవేత్తలు చేస్తున్న ఆందోళనలు అరణ్యరోదనగానే మిగిలాయి. ఈ పరిస్థితులన్నింటినీ అవకాశంగా తీసుకున్న మావోయిస్టులు అడవుల్లోకి చొచ్చుకుపోయి.. గిరిజనులతో మమేకమవుతూ.. వారి పక్షాన పోరాటాలు చేస్తూ.. ఏవోబీని బలమైన కోటగా మలచుకున్నారు. -
మన్యంలో టీడీపీ పరిస్థితి ధైన్యం
మాజీ మంత్రి ఎదుట వాపోయిన కార్యకర్తలు జీవో నెం. 97 జీవో రద్దు చేయాలన్న మణికుమారి చింతపల్లి: ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే తాము గిరిజనులకు మద్దతుగా పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి మత్సరాస మణికుమారి చెప్పారు. స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల పార్టీ నాయకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజనుల మనోభావాలను గౌరవించి చంద్రబాబు 97 జీవోను రద్దు చేయాలని కోరారు. ఎస్టీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మన్యంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మన్యంలో టీడీపీ పరిస్థితిని అధినేతకు వివరించడానికే సిగ్గుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అధ్యక్షునికి అవమానం మండల పార్టీ అధ్యక్షుడు గోకాడ సత్యనారాయణకు ఈ సమవేశంలో సముచిత స్థానం కల్పించక పోవడంపట్ల పలువురు కార్యకర్తలు పెదవి విరిచారు. ఆయన అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశంలో ఆయన కూర్చునేందుకు కుర్చీ కూడా కేటాయించలేదు. దీంతో సమావేశం ముగిసేంత వరకు ఆయన వెనకాల నిలబడక తప్పలేదు. చింతపల్లి మార్కెట్ యార్డు డెరైక్టర్ దుచ్చరి చిట్టిబాబు, ఎంపీపీ కవడం మచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. -
'బాక్సైట్ తవ్వకాలకు నిలిపివేయాలి'
పాడేరు: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం శనివారం విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించింది. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని విద్యార్థి విభాగం నాయకుడు సురేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ర్యాలీగా వెళ్లి హుకుంపేట తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. -
'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు'
హైదరాబాద్: ‘రాబోయే కాలంలో బాక్సైట్ తవ్వమని, గిరిజనుల పక్షాన నిలబడతామని, పర్యావరణాన్ని కాపాడతామని శాసనసభలో తీర్మానం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి’ అని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలన్నారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇంకా ఆమె ఏమాట్లాడారంటే.. ► ఏజెన్సీలో ఉన్న సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు), పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)ల్లో స్పెషలిస్టులు లేరు. వైద్యం కోసం నగరానికి వెళ్లడానికి డబ్బుల్లేక, గిరిజనులు వైద్యానికి దూరమవుతున్నారు. ► టీడీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లయింది. అటవీ శాఖ మంత్రి ఒక్కసారి కూడా తమ ప్రాంతాల్లో పర్యటించలేదు. వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు. ► ప్రాథమిక విద్య కూడా గిరిజనులకు అందకుండా పోతుంది. ప్రతి కిలోమీటరు ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే.. హేతుబద్దీకరణ పేరిట వాటిని తొలగించారు. వాగులు దాటి స్కూళ్లకు పోలేక విద్యార్థులు చదువు మానేస్తున్నారు. ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య పెరుగుతోంది. ► పాఠశాలల్లో మౌలిక వసతుల్లేవు. స్కూళ్లలో టాయిలెట్స్ లేవు. ఉన్నా ఉపయోగించే పరిస్థితిలో ఉండటం లేదు. విద్యావాలంటీర్ల శ్రమను ప్రభుత్వం దోచుకుంటోంది. నెలకు రూ. 5 వేల జీతంతో సరిపెడుతున్నారు. ► ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెన్షన్ భద్రత లేదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలనే విన్నపాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. తమిళనాడులో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ► గిరిజన గ్రామాలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ఎన్టీఆర్ సుజల, జలసరి అడ్రస్ లేవు. ► అరకు మెయిన్ రోడ్డు నిండా గోతులే. ఇక గిరిజన గ్రామాల రోడ్ల పరిస్థితి చెప్పడానికి లేదు. ► గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి ఉంటే.. కనీసం పరిస్థితుల్లో కొంత మార్పు ఉండేది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెలే ఉన్నారనే ఉద్దేశంతో సలహా మండలిని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వంలో గిరిజన మంత్రీ లేకపోవడం గమనార్హం. -
బాక్సైట్ తవ్వకాలకే సర్కారు మొగ్గు
బడ్జెట్ సమావేశంలో తేటతెల్లం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజం పాడేరు: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్న వైఖరి బడ్జెట్ సమావేశంలో మొదటిసారి తేటతెల్లమైందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆమె గురువారం హైదరాబాద్ నుంచి ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలో గనుల తవ్వకాల ద్వారా రూ.17,880 కోట్లు ఆదాయం సమకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత ఆదాయం సమకూరే గనులు మరెక్కడా లేవని, ఏజెన్సీలో నిక్షిప్తమైన బాక్సైట్ తవ్వకాల ద్వారానే ఇది సాధ్యమవుతుందని, దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి రూ.3,100 కోట్లు కేటాయించిన ప్రయోజనమేమీ ఉండదన్నారు. గతేడాది గిరిజన సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో సుమారు రూ.900 కోట్లు దారిమళ్లించిందని వెల్లడించారు. దీని వల్ల గిరిజన సంక్షేమం కుంటుపడుతోందని, నిధులు కేటాయించినా సక్రమంగా వినియోగించకపోవడం వల్ల మౌలిక సౌకర్యాలు కూడా మెరుగు పడటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. -
ఆదివాసీల హక్కుల కోసం రాహుల్ పాదయాత్ర
ఢిల్లీ: ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ...మే నెలలో పాడేరు, చింతపల్లిలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని అన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. విశాఖ మన్యంలో బాక్సైజ్ తవ్వకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకడుగు విషయం తెలిసిందే. -
గిరిజనులపై ఇంత నిర్బంధమా?
బాక్సైట్ ఉద్యమాన్ని అడ్డుకునేందుకే అక్రమ అరెస్టులు అమాయక గిరిజనులను వెంటనే విడుదల చేయాలి ఏపీజీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ పాడేరు : మన్యం మనుగడకు ముప్పు కలిగించే బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ గిరిజనులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధాలను గిరిజన వర్గాలు సంఘటితంగా ఖండించాలని బుధవారం పాడేరులో ఏపీ గిరిజన సంఘం రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్న గిరిజనులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనర్స మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగా మన్యంలో గిరిజనులపై నిర్బంధాలను ప్రయోగిస్తోందని విమర్శించారు. బాక్సైట్‌పై ప్రభుత్వ మొండి వైఖరివ ల్లే జర్రెల మాజీ సర్పంచ్ హత్యకు గురయ్యారని, ఈ హత్యతో సంబంధం లేని అమాయక గిరిజనులను చింతపల్లి, జీకేవీధి పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి బలవంతంగా ఒప్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. జనవరి 8న అదుపులోకి తీసుకొని 15న అరెస్ట్ చేసినట్లు కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. 18 మందిని సెంట్రల్ జైలులో నిర్బంధించారని, పోలీసులు అరెస్ట్ చేసిన గిరిజన సంఘం నాయకుడు చిక్కుడు అశోక్, వైఎస్సార్ సీపీ నాయకుడు అడపా విష్ణుమూర్తిని నడవడానికి కూడా వీలులేని విధంగా కాళ్లపై తీవ్రంగా కొట్టారని, బాక్సైట్‌కు వ్యతిరేకపోరాటం చేస్తే ఇదే గతి పడుతుందని పోలీసు అధికారులు హెచ్చరించడం నిర్బంధాలకు పరాకాష్టని మండిపడ్డారు. బాక్సైట్ ఉద్యమాన్ని అణచివేసేందుకు జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో ప్రభుత్వం వంద పోలీసు ఔట్ పోస్టులను ఏర్పాటు చేసేందుకు చూస్తోందన్నారు. జీవో 97 రద్దుకు, బాక్సైట్ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించేందుకు సిద్ధం కావాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పీసా డివిజన్ అధ్యక్షుడు కోడా అజయ్‌కుమార్, సీఐటీయు డివిజన్ కార్యదర్శి ఆర్.శంకరరావు, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు నర్సయ్య, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.సూర్యనారాయణ, ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు రామారావుదొర, జీఎస్ యు జిల్లా అధ్యక్షుడు వి.రాంబాబుపాల్గొన్నారు. గిరిజనులను హింసించడం దారుణం కొయ్యూరు: బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న గిరిజనులను చిత్రహింసలకు గురిచేయడం దారుణమని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.సూరిబాబు ఆందోళన వ్యక్తంచేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం అల్లూరి పార్క్ వద్ద నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాక్సైట్ తవ్వితే పర్యావరణం పూర్తిగా నాశనమవుతుందని మేధావులు చెబుతున్నా ప్రభుత్వానికి వినిపించడం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి మన్యంలో గిరజనులపై నిర్బంధం పెరిగిందని చెప్పారు. బూదరాళ్ల సర్పంచ్ సుమర్ల సూరిబాబు, సీపీఎం చింతపల్లి డివిజన్ కార్యదర్శి ఎం బూరుగలయ్య సీఐటీయూ నేత వై.అప్పలనాయుడు, వైఎస్సార్ సీసీ నాయకుడు నాని తదితరులు మాట్లాడారు. -
బాక్సైట్ ఉద్యమంపై రౌండ్‌టేబుల్ సమావేశం
పాడేరు రూరల్: బాక్సైట్ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖ మన్యంలో నిక్షిప్తమైన బాక్సైట్‌ను వెలికితీయవద్దని ఆందోళన చేస్తున్న గిరిజన నాయకులపై పెట్టిన అక్రమ అరెస్ట్‌లను నిలుపుదల చేయాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. అలాగే జీఓ నెం.97 రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పల నర్సయ్యతో పాటు పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం గుండెల్లో గునపాన్ని దింపుతాం
సీపీఐ నేత నారాయణ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: బాక్సైట్ ఖనిజంపై పడే ప్రతి గునపాన్ని ప్రభుత్వ గుండెల్లో దింపుతామని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. బాక్సైట్ మైనింగ్ అంశంపై గిరిజనులు మూడువైపుల నుంచి దాడులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏపీ ప్రభుత్వ అణ చివేత ఒకవైపు, కార్పొరేట్ ముసుగులో మైనింగ్ మాఫియా, మరోవైపు నక్సలైట్లు గిరిజనులపై దాడులు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న గిరిజను ల హత్యలను సర్కార్ హత్యలుగానే తాము భావిస్తున్నామన్నారు. గురువారం మఖ్దూం భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో బాక్సైట్ తవ్వకాలను బాబు వ్యతిరేకించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదేదారిలో సాగుతున్నారని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు బాక్సైట్ తవ్వకాల ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్నంతటిని చోద్యంగా చూస్తోందని ధ్వజమెత్తారు. ఒడిశా లో పాస్కోకు, మైనింగ్ మాఫియాకు వ ్యతిరేకంగా సీపీఐ అగ్రనేత బర్ధన్ సాగించిన పోరాట స్ఫూర్తితో తామూ పోరాడతామన్నారు. -
జెడ్పీని కుదిపేసిన బాక్సైట్
-
జెడ్పీని కుదిపేసిన బాక్సైట్
విశాఖపట్నం: 2015లో విశాఖ జిల్లా చరిత్రలో ఇది చీకటి దినం అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. విశాఖ జెడ్పీ సమావేశంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. బాక్సైట్ అంశంపై బుధవారం జరిగిన సమావేశం దద్దరిల్లింది. సమావేశం ప్రారంభం కాగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ... బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్‌తోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులు అడ్డుతగిలారు. ప్రతిపక్ష నేతలకు మైకులు ఇవ్వడానికి అధికార పార్టీ నేతలు నిరాకరించారు. ఎమ్మెల్యే కిడారికి మైక్ ఇవ్వడానికి వీల్లేదంటూ దౌర్జన్యానికి దిగారు. ఆయన మాట్లాడుతుంగా చేతిలో ఉన్న మైక్‌ను లాక్కున్నారు. దీంతో కిడారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ఆవేదన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ అసెంబ్లీలో మైకులు కట్ చేశారు.. ఇప్పుడు జడ్పీ సమావేశంలో మైకులు ఇవ్వకపోవడం ప్రతిపక్షం గొంతు నొక్కడమేనంటూ కిడారి సర్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షానికి మైకులు ఇవ్వకపోవడం దుర్మార్గమని, టీడీపీ నేతల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాక్సైట్ వద్దే వద్దు
నామమాత్రంగా ఐటీడీఏ సమావేశం గిరిజన సమస్యలపై సాగని చర్చ మన్యంలో అభివృద్ధి పనుల తీరుపై పాడేరు, అరకు ఎమ్మెల్యేల అసంతృప్తి మన్యం ప్రజా ప్రతినిధులందరిదీ ఒకే మాట జీవో 97 రద్దు తీర్మానానికి పట్టు దద్దరిల్లిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ హామీ పాడేరు : బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించాలని, శాశ్వతంగా బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యేలతో పాటు ఏజెన్సీ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో పట్టుబట్టారు. ఇక్కడి యూత్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో ముందుగా బాక్సైట్ జీవో 97 రద్దు కోసం తీర్మానం చేశాకే సమావేశం కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీన్ని పాలకవర్గ చర్చనీయాంశాల్లో చేర్చాలన్నారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తే ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధాలకు పూనుకోవడం ప్రజాస్వామ్యం విరుద్ధమని చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు కె.పద్మకుమారి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చీడికాడ, పాడేరు జెడ్పీటీసీ సభ్యులు పి.సత్యవతి, నూకరత్నం మాట్లాడుతూ బాక్సైట్ వల్ల మన్యానికే కాకుండా మైదాన ప్రాంతాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని, బాక్సైట్ తవ్వే యోచన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పెదబయలు, అరకు, జి.మాడుగుల ఎంపీపీలు ఉమా మహేశ్వరరావు, కె.అరుణకుమారి, ఎం.వి.గంగరాజు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారు. 97 జీవోను రద్దు చేయాలని కోరుతూ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు ఇచ్చిన తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని జిల్లా కలెక్టర్ ఎన్ .యువరాజ్ చెప్పారు. గిరిజనులను స్వేచ్ఛగా బతకనివ్వండి.. ఎమ్మెల్యే ఈశ్వరి అడవిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులను స్వేచ్ఛగా బతకనివ్వాలని, బాక్సైట్‌ను తవ్వి మనుగడకు ముప్పు కలిగించ వద్దని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెలికాప్టర్లో తిరుగుతూ విత్తనాలు చల్లుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అడవులు పెంచాలని సందేశమిచ్చారని, మరి సహజమైన అడవులను నాశనం చేసే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ఎం తవరకు సమంజసమని ఆమె ప్రశ్నిం చారు. బాక్సైట్‌పై తప్పుల తడకలతో ఇచ్చిన శ్వేతపత్రం ఒక బూటకమని, ప్రజాభిప్రాయ సేకరణ, వెబ్సైట్, టోల్‌ఫ్రీ వంటివి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను బాక్సైట్ వద్దని మొరపెట్టుకుంటున్న గిరిజనుల గోడును చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. గిరిజనులకు ద్రోహం తల పెట్టవద్దని భవిష్యత్తులో బాక్సైట్ ప్రస్తావనే లేకుండా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ప్రాణాలకంటే బాక్సైట్ ఎక్కువా?.. ఎమ్మెల్యే కిడారి విశాఖ మన్యంలో జీవిస్తున్న వేలాది మం ది గిరిజనుల ప్రాణాలకంటే వేల కోట్ల వి లువ చేసే బాక్సైట్ ఎక్కువా? అని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాక్సైట్ ఉద్యమం లో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, ప్రభుత్వమే వెనక్కి తగ్గాలని ఆయన హెచ్చరించారు. గిరిజనులు కాఫీ, వ్యవసాయంతో ఇతర వాణిజ్య పంటలను, అటవీ ఉత్పత్తులతో స్వయం జీవనం సాగిస్తున్నారని, వారపు సంతల్లో ఏటా వేల కోట్ల టర్నోవర్ జరుగుతోందన్నారు. మన్యంలో గిరిజనులు బాక్సైట్‌ను కోరుకోవడం లేదని, గిరిజనుల శ్రేయస్సు దృష్ట్యా బాక్సైట్ తవ్వకాల జీవో 97 ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. -
ఏఓబీ బంద్ హింసాత్మకం
- ఇద్దరు గిరిజనులను చంపిన మావోయిస్టులు మావోయిస్టులు పిలుపు నిచ్చిన ఏఓబీ బంద్ హింసాత్మకంగా మారింది. మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు కాల్చి చంపారు. మృతులు చిత్రకొండ ప్రాంతానికి చెందిన సర్పంచ్‌లు జయరామ్‌కొర, సాదుమ్‌కొరలుగా పోలీసులు గుర్తించారు. అయితే, దీనికి సంబంధించి మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కాగా..: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతంలో బంద్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరిపాలనే ప్రభుత్వ నిర్ణయంపై మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు కూంబింగ్‌లు, తనిఖీలతో అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ బస్సులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. దుకాణాలను వ్యాపారులు మూసేశారు. అయితే, పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లోని దుకాణాలను పోలీసులు తెరిచిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు వద్దన్నాడు'
గుంటూరు వెస్ట్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శీతాకాల సమావేశాలలో ఒక్క ప్రజా సమస్యపై కూడా చర్చించక పోవడం దారుణమన్నారు. పార్లమెంట్, శాసనసభలలో ప్రజా సమస్యలపై చర్చ జరగకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా అనవసరమైన అంశాలపై కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె రోజాపై ఏడాదిపాటు బహిష్కరణ వేటువేయడం తగదని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటికి అనుమతులు మంజూరు చేయడం ఆయన రెండు నాలుకల ధోరణికి నిదర్శనమన్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చక్రం వెనుకకు తిరుగుతున్నదని నారాయణ వ్యాఖ్యానించారు. -
మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు
-
బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం!
-
బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం!
హైదరాబాద్: ఏపీలో బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇప్పటికీ మారనట్లుగా కనిపిస్తోంది. బాక్సైట్ అంశంపై ఏపీ శాసనసభలో మంత్రి పీతల సుజాత ప్రకటన ఇచ్చినప్పటికీ, జీవో నంబర్ 97ను రద్దు చేస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. దీనర్థం బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గేది లేదని ఏపీ ప్రభుత్వం సంకేతాలు పంపిస్తున్నట్లు చెప్పవచ్చు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టరాదంటూ విశాఖ జిల్లాలో తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా జీవో నంబర్97 అనేది విశాఖ, మన్యం ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు జరపాలని ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో. గత కొన్ని రోజులుగా వీటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, గిరిజనులతో కలిసి పోరాటం సాగిస్తున్నారు. ఇటీవల బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో జీఓ 97ను నిలుపుదల చేస్తామని మంత్రులు నోటిమాటతో సరిపెట్టారు, కానీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడం గమనార్హం. -
తెల్లదొరల్నే తరిమికొట్టాం..చంద్రబాబు ఓ లెక్కా..?
బహిరంగ సభావేదికపై గిరిపుత్రుల హెచ్చరిక వైఎస్ జగన్‌తో ముఖాముఖి సాక్షి, విశాఖపట్నం: ‘‘లక్షల గొంతులు ఒక్కటై మాకొద్దీ బాక్సైట్ అంటున్నా చంద్రబాబుకి జ్ఞానోదయం కావడం లేదు. బాక్సైట్ మైనింగ్ ఎందుకు వద్దో మీరే చెప్పండి.’’అంటూ విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో గురువారం జరిగిన బాక్సైట్ వ్యతిరేక సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనులను అడిగారు. ‘ఆనాడు తెల్లదొరల్నే తరిమికొట్టిన జాతి మాది.. మా జీవితాలను నాశనం చేయాలని చూస్తున్న చంద్రబాబుకు కూడా అదే శాస్తి చేస్తాం’ అని గిరిపుత్రులు హెచ్చరించారు. బాక్సైట్ జోలికొస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. బహిరంగ సభా వేదికపై వైఎస్ జగన్‌తో వారి ముఖాముఖి విశేషాలు... (కోండ్రుపల్లికి చెందిన వృద్ధుడు మండలం చిన్నబ్బాయి జగన్ పిలుపునందుకుని ప్రసంగించారు.) ‘‘నా తాత ముత్తాతలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే బతికారు.. ఇక్కడే చచ్చారు. నేను ఇక్కడే కొండపై వ్యవసాయం చేసుకుంటూ దుంపలు తిని జీవిస్తున్నా..రైతు బిడ్డలం. మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో పెడతామంటే అక్కడ ఏం చేసి బతకాలి.’’ (జర్రెల పంచాయతీ సర్పంచ్ అడపా విజయకుమారితో జగన్ మాట్లాడారు.) జగన్: మీరే కదా జర్రెల సర్పంచ్ కుమారి: అవునండి జగన్: మీ పేరు కుమారి: విజయకుమారి జగన్: బాక్సైట్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారమ్మా.? కుమారి: బాక్సైట్ తవ్వితే మా బతుకులు పోతాయండి. జగన్: జర్రెల గ్రామ సభలో బాక్సైట్‌కు అనుకూలంగా తీర్మానం చేశారని చంద్రబాబు చెబుతున్నారు. 2011లో గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తీర్మానం చేయలేదని చెప్పారు. ఇప్పుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో తీర్మానం చేశారని అంటున్నారు. అసలు తీర్మానం చేశారా తల్లీ.! కుమారి: ప్రజలందరూ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాల రికార్డులు మా పంచాయతీ పుస్తకాల్లో ఉన్నాయి. అంతేకాని అనుకూలంగా చేసినట్లుగా ఎలాంటి తీర్మాన పత్రాలు ఎక్కడా లేవు. విష్ణుమూర్తి(గిరిజన నాయకుడు): శ్వేతపత్రం విడుదల కాగానే పంచాయతీ రికార్డులు తిరగేశాం. చంద్రబాబు చెబుతున్నట్లు అక్టోబర్ 2న జర్రెల పంచాయతీలో గ్రామసభ జరిగినట్లు, తీర్మానం చేసినట్లు ఎక్కడాలేదు. జగన్: గ్రామ సభ జరగలేదు.. తీర్మానం జరగలేదు అయినా అబద్ధాలతో చంద్రబాబు ముం దుకువెళుతున్నారు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు వేయలేదు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయితే దానిలో మూడో వంతు గిరిజన ఎమ్మెల్యేలు ఉండాలని చట్ట ం చెబుతోంది. రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాల్లో ఆరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వచ్చాయి. కమిటీ వేస్తే వాళ్లే సభ్యులుగా ఉంటారు. వైఎస్సార్కాంగ్రెస్వారు బాక్సైట్‌ను వ్యతిరేకిస్తారు కాబట్టి కమిటీ వేయటం లేదు. ఇది ఎంతోకాలం సాగదు. గట్టిగా ఒత్తిడి చేస్తాం. కమిటీ వేయిస్తాం. (తర్వాత గిరిజన మహిళ రత్నాబాయి జగన్‌తో మాట్లాడారు) జగన్: తల్లీ బాక్సైట్ తవ్వితే మీకు కలిగే నష్టం ఏమిటి? రత్నాబాయి: మేం అంతరించిపోతాం జగన్ బిడ్డా..మా అడవి తల్లి ఇచ్చిన కూరలు, దుంపలు ఉడకబెట్టి తిని, చెంబుడు నీళ్లు తాగి బతుకుతున్నాం. వందల కిలోమీటర్లు కొండ తవ్వేస్తే మేము ఏం తినాలి. చంద్రబాబు నాయుడు వచ్చేసి మా అడవిని తవ్వేసుకుంటాడా, తెల్లదొరల్నే తరిమికొట్టాం. ఈ చంద్రబాబు లెక్కకాదు. మా జోలికొస్తే ఊరుకోం. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 10 ఎకరాలిస్తానని ఆనాడు దేవుడు వైఎస్ అన్నారు. ఆయనే ఉంటే ఈ కష్టాలు వచ్చేయే కాదు. (బూదరాళ్ల సర్పంచ్ సుమర్ల సూరిబాబుతో జగన్ మాట్లాడారు) జగన్: బాక్సైట్ తవ్వితే ఏమవుతుంది? సూరిబాబు: ప్రజల మనుగడ దెబ్బతింటుందన్నా. ఇదే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 1/7 చట్టం ప్రకారం నీ భూమి మీద నీకే హక్కు చూసుకో బిడ్డా అని మాట ఇచ్చిన వ్యక్తి వైఎస్. ఇప్పుడు చంద్రబాబు మా బతుకులు బుగ్గి చేయాలనుకుంటున్నారు. అదే జరిగితే ఎంతటికైనా తెగించి పోరాడతాం. (అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును జగన్ అడిగారు) జగన్: సర్వేశ్వరరావును అడుగుదాం..అన్నా బాక్సైట్ తవ్వితే ఇక్కడ నీటికి, ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతుంది. సర్వేశ్వరరావు: బాక్సైట్ కొండలు తవ్విన గోతుల్లో పడిన వర్షం నీరు కలుషితమవుతుంది. ఇక్కడ గోపురం, చింతపల్లి, సీలేరు,అరకు వేలి కొండల్లో పడిన నీరు రిజర్వాయర్లకు వెళుతోంది. 21 నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి. గిరిజనులకే కాకుండా విశాఖ, తూర్పు, విజయనగరం జిల్లాల ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఇవి కలుషితమైతే కొత్త కొత్త జబ్బులు వస్తాయి. జాతి అంతరించిపోతుంది. డయాబెటిస్‌ను నయం చేసే పాతాళగరడ అనే వేరు ఇక్కడే దొరుకుతుంది. ఇలాంటి మూలికలు దూరమవుతాయి. సీలేరు, మాచ్ఖండ్లలో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అది కూడా పోతుంది. జగన్: చంద్రబాబు నాయుడికి, ఈ మీటింగ్ చూస్తున్న దేశానికి తెలియాలి. బాక్సైట్ మైనింగ్‌ను వ్యతిరేకించేవాళ్లంతా చేతులు పెకైత్తండి. చంద్రబాబుకు అర్థం కావాలి మన్యం ఏమంటోందని..(సభలో ఉన్న అశేష జనవాహిని చేతులు పెకైత్తి బాక్సైట్ తవ్వకాలను తాము వ్యతిరేకిస్తున్నామంటూ నినదించారు.) -
బాక్సైట్ తవ్వకాలు వద్దంటున్నా..
-
ప్రతి విషయంలో మోసం, దగా, అబద్ధాలు..
-
'ఆదిమ జాతి అంతరిస్తుంది'
-
'చంద్రబాబుకు మాత్రం జ్ఞానోదయం కావట్లేదు'
-
'చంద్రబాబుకు మాత్రం జ్ఞానోదయం కావట్లేదు'
చింతపల్లి: ఎన్ని లక్షల గొంతులు తమకు బాక్సైట్ తవ్వకాలు వద్దంటున్నా.. చంద్రబాబుకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఆయన సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కేంద్రం చెబితే ఒకసారి కాస్త వెనక్కి తగ్గిన చంద్రబాబు.. ఆ తర్వాత మళ్లీ గ్రామసభలు జరిగాయంటూ అబద్ధాలు చెప్పి బాక్సైట్ తవ్వకాల విషయంలో ముందుకెళ్తున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఈవాళ ఎన్నివేల మంది ఎంతో దూరం నుంచి నడిచైనా సరే ఇక్కడకు వచ్చి.. ఆ కష్టాన్ని మాత్రం ఏ ఒక్కరి మొహంలో ఎక్కడా చూపించకుండా, కష్టం అనిపించినా, దూరం నుంచి వచ్చామన్న తలంపును సైతం పక్కనపెట్టి, ఎండను లెక్క చేయకుండా, భోజనానికి వెళ్లాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టి చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను పంచిపెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈవాళ బాక్సైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ లక్షల గొంతులు ఒక్కటై ఇక్కడ బాక్సైట్ మైనింగ్ మాకొద్దని గట్టిగా చెబుతున్నా కూడా చంద్రబాబు నాయుడికి ఇంకా జ్ఞానోదయం కావడం లేదు బాక్సైట్ ఎందుకు వద్దంటున్నాం, దానివల్ల మనకు జరిగే నష్టాలేంటో నేను మాట్లాడే ముందు మీకు మైకిస్తా.. చంద్రబాబుకు అర్థం అయ్యేలా మీ నోట్లోంచి మీరే చెప్పండి. చంద్రబాబుకు గట్టిగా బుద్ధొచ్చేలా గడ్డిపెట్టేలా మాట్లాడండి. ఇన్నివేల మంది ముందుకొచ్చి బాక్సైట్‌పై పోరాటానికి గొంతుకలిపారు. అయినా చంద్రబాబుకు మాత్రం కనిపించడం లేదు. మన్యం ఏమంటోందో చంద్రబాబుకు అర్థం కావాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి ప్రయత్నం చేసి, తర్వాత వెనకడుగు వేశారు. ఎన్నికలు అయిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరగనివ్వబోమని చెప్పారు ఇక్కడ గ్రామసభలు కూడా జరగలేదని, గ్రామసభలు ఒప్పుకోలేదని 2011లో గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక మొన్న ఒక శ్వేతపత్రం విడుదల చేసి, అందులో మాట మార్చేశారు. గ్రామసభలు జరిగాయని, అవి బాక్సైట్ మైనింగ్ కావాలంటూ తీర్మానించాయని అన్నారు. ఇంతకుముందు సర్పంచిగా ఉన్న వెంకటరమణ గ్రామసభలో తీర్మానం చేశారా.. (లేదంటూ ప్రజలు చేతులు ఊపారు). తాను తీర్మానం చేయలేదని వెంకటరమణ చెబుతున్నా, చంద్రబాబు మాత్రం ఆరోజే తీర్మానం జరిగిపోయిందని చెబుతున్నారు. గ్రామసభ జరిగి ఉంటే పుస్తకాల్లో ఉండాలి.. అవి కూడా ఏమీ లేవని ప్రస్తుత సర్పంచి చెప్పారు. గ్రామాలు ఏవీ అంగీకరించకపోయినా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ముందుకెళ్లిపోతున్నారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎందుకు వేయడం లేదని చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నా కారణం ఏమిటంటే, రాజ్యాంగం ప్రకారం షెడ్యూలు 5లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నియామకం రాజ్యాంగ హక్కు. అందులో మూడొంతుల మంది గిరిజన శాసన సభ్యులు అయి ఉండాలని చెబుతున్నారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో మొత్తం 7 గిరిజన స్థానాలుంటే ఆరింటిలో వైఎస్ఆర్సీపీ సభ్యులున్నారు. కమిటీ వేస్తే, అందులో అంతా వైఎస్ఆర్సీపీ సభ్యులే ఉంటారు కాబట్టి, బాక్సైట్‌కు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేరు కాబట్టి గిరిజన సలహా కమిటీ నియామకాన్ని కూడా వాయిదా వేస్తున్నారు కానీ మీరు చేసేదేమీ ఎక్కువ రోజులు సాగదు. ఒత్తిడి తెచ్చి, గిరిజన సలహా కమిటీ వేయించి, అందులో గట్టిగా వ్యతిరేకిస్తాం చంద్రబాబు జారీ చేసిన జీవోను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలని ఇన్ని గొంతులు పోరాడుతున్నాయి చంద్రబాబు ఏం చేశారో, రాజశేఖరరెడ్డి ఏం చేశారో అందరికీ తెలుసు. తర్వాతి సీఎంలు ఏం చేశారో, అధికారంలోకి మళ్లీ వచ్చాక చంద్రబాబు.. ఏం చేశారో కూడా తెలుసు. రాజశేఖరరెడ్డి చనిపోయి ఆరేళ్లవుతున్నా.. ఆయనను తప్పుపడుతూ కొత్తగా బాక్సైట్ తవ్వకాలకు జీవో విడుదల చేస్తున్నారు చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, లేదా జగన్ మోహన్ రెడ్డి లేదా మరే ముఖ్యమంత్రి అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటేనే వాళ్ల గుండెల్లో స్థానం ఉంటుంది. బాక్సైట్ గనులు ఇచ్చే క్రమంలో చంద్రబాబు గిరిజన సలహా కమిటీచేత అడ్డగోలు నిర్ణయాలు తీయించే కార్యక్రమాలు చేయించాడు బాక్సైట్ గనులు ఏమైనా చేయాల్సి వస్తే గిరిజనులు మాత్రం, లేదా ప్రభుత్వ సంస్థలు మాత్రమే చేయాలి. కానీ అప్పట్లో, చంద్రబాబు.. బలవంతంగా గిరిజన సలహా కమిటీ నియమించి తన ఎమ్మెల్యేలతో బలవంతంగా రుద్దించే ప్రయత్నం చేశాడు అందులో.. ఇక్కడ గనులు వీళ్లు కాదు.. ఎవరైనా తవ్వుకోవచ్చని దుబాయ్ వాళ్లకు ఇచ్చేందుకు చంద్రబాబు తీర్మానం చేయించాడు ఈవాళ అదే చంద్రబాబు ఆరోజు అంతటి గట్టి ప్రయత్నాలు చేసి, మైనింగ్ చట్టాలను కూడా మార్చాలని కేంద్రంమీద ఒత్తిడి తెచ్చారు గిరిజనులతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని కేంద్రం చెప్పడంతో మనం బతికిపోయాం తర్వాత చంద్రబాబుకు అధికారం పోయింది.. రాజశేఖరరెడ్డి వచ్చారు. ఇష్టారాజ్యంగా మైనింగ్ చేపడితే గిరిజనులు ఇబ్బంది పడతారని, ప్రభుత్వంతో చేయించాలని.. స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని.. ఒక అడుగు ముందుకేశారు. తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పాలి. ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడుచుకోవాలి. ఆరోజు కాస్త ముందుకు వెళ్లినా, తర్వాత దాన్ని ఆపించేశారు. తానేం చెప్పినా పార్టీ ఒప్పుకొంటుందని తెలిసినా, గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని అర్థమైన తర్వాత నుంచి ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అందుకే ఆయన హయాంలో జరగలేదు.. ఆయన మరణించిన ఆరేళ్ల తర్వాత, చంద్రబాబు సీఎం అయ్యాక ఇప్పుడు జరుగుతోంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తానే పోరాడుతున్నట్లు చెప్పాడు. అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. రాజశేఖరరెడ్డి గారు చనిపోయాక.. ఇప్పుడు మళ్లీ ఆయన గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 2011 సంవత్సరంలో ఇదే గిరిజన ప్రాంతానికి జేసీ కాలా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్ వేసిన మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాను. వాళ్లిచ్చిన నివేదికను కేంద్రం కూడా పక్కన పెట్టేస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక ఒకటి కాదు, రెండు కాదు.. 10.2.2015న ఒకటి, 23.2.2015, 21.7.2015, 5.8.2015న ఇంకోటి.. ఇలా వరుసపెట్టి లేఖలు కేంద్రానికి రాసి, ఒత్తిడి తెస్తే కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇదే చంద్రబాబు కాలా కమిషన్ వచ్చినప్పుడు గవర్నర్‌కు లేఖ రాశాడు. గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తవ్వకాలకు తానూ వ్యతిరేకం అన్నారు. సీఎం అయిన తర్వాత బాక్సైట్ గనులకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్లేటు ఫిరాయించాడు. ఒక శ్వేతపత్రం విడుదల చేశాడు. అందులో రకరకాల మాటలు మాట్లాడాడు. అన్నీ అబద్ధాల పుట్ట. జేరాల గ్రామ పంచాయతీ ఆరోజే తీర్మానం చేసిందని అంటాడు. అప్పుడు గవర్నర్‌కు చెప్పేది ఈయనే, ఇప్పుడు ఈ మాట అనేదీ ఈయనే. తనకు అనుకూలంగా ఉంటే ఒకమాట, లేకపోతే మరోమాట చెబుతాడు. ఈ గ్రామానికే అప్పట్లో వెంకటరమణ సర్పంచి. ఆయనే గ్రామసభ జరగలేదని స్వయంగా చెబుతున్నాడు. అయినా చంద్రబాబు మాత్రం సభ జరిగిందని శ్వేతపత్రంలో రాస్తున్నాడు. ఇదే చంద్రబాబు జీవో 97 అని కేంద్రం నుంచి క్లియరెన్సు వచ్చాక విడుదల చేశాడు. గిరిజన ప్రాంతంలో అలజడి మొదలయ్యేసరికి ఈ జీవో ఎలా వచ్చిందో తనకు తెలియదని, దాన్ని అబెయెన్స్‌లో పెట్టానని అంటాడు ప్రభుత్వం జీవో ఇస్తే చేస్తుంది, ఉపసంహరించుకుంటే చేయదు. మధ్యలో పెండింగులో పెట్టడం ఏ ముఖ్యమంత్రి దగ్గరా వినలేదు ఈరోజు కూడా చంద్రబాబు కనీసం ఒకటి చేసినా... చేశానని చెప్పుకొనే దమ్ము, ధైర్యం లేవు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే జీవోను ఎందుకు ఉపసంహరించుకోవట్లేదని గట్టిగా అడుగుతున్నా. 15.8.2015న కేంద్రం రెండోస్థాయి పర్యావరణ అనుమతి ఇస్తూ.. గ్రామసభలు మళ్లీ జరగాలని ఒక క్లాజు పెట్టింది. గిరిజన సలహా మండలి సిఫార్సు కూడా ఉండాలని మరో క్లాజు పెట్టింది. అయినా గిరిజన సలహా మండలిని ఎందుకు వేయడం లేదని చంద్రబాబును అడుగుతున్నా చంద్రబాబు జీవితం అంతా మోసం.. మోసం.. మోసం.. అన్న మూడు పదాల చుట్టే తిరుగుతుంది. ఎన్నికలకు ముందు టీవీలు ఆన్ చేస్తే.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇళ్లకు రావాలంటే బాబు సీఎం కావాలని అన్నారా లేదా, జాబు రావాలంటే బాబు సీఎం కావాలని అన్నారా.. లేదా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారా లేదా? ప్రతి విషయంలో మోసం, దగా, అబద్ధాలు. ఈరోజు చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పాలి. చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుతున్నాం. బాక్సైట్ తవ్వకాలకు ఆయన అనుమతి ఇచ్చినా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు నువ్వు నిజంగా మంచోడివైతే, మాటమీద నిలబడే తత్వం ఉంటే వెంటనే జీవోను రద్దు చేసి, మాట నిలబెట్టుకోండి. కనీసం ఈ మాటైనా నిలబెట్టుకోవాలని గట్టిగా అడుగుతున్నాం. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. చంద్రబాబు మన వెంట్రుక కూడా పీకలేడని చెబుతున్నాం మీకు అన్నిరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అన్ని రకాలుగా మనం గట్టిగా పోరాడుదాం. ఇక్కడున్న యువకులు డీఎస్సీ పరీక్షలు రాసి సంవత్సరం అయిపోయింది. పిల్లలు పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి ప్రభుత్వోద్యోగాలు కదా అని చెప్పి, ఇంట్లో నుంచి తల్లిదండ్రులు పుస్తెలమ్మి డబ్బులు పంపితే హాస్టళ్లలో ఉండి చదువుకుని డీఎస్సీ రాస్తే.. వాళ్లకు ఉద్యోగాల మాట దేవుడెరుగు, క్లస్టర్ స్కూళ్లని కొత్త విధానం తెస్తున్నాడు. దాంతో ఉన్న స్కూళ్లు కూడా మూసేసి.. 7వేల మంది టీచర్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాడు. కనీసం ఇప్పటికైనా బుద్ధి రావాలి, బుద్ధి వచ్చేవరకు పోరాడుదాం. -
రేపు చింతపల్లిలో వైఎస్ జగన్ సభ
-
రేపు చింతపల్లిలో వైఎస్ జగన్ సభ
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతంలో పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 8 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్తున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో నర్సీపట్నం మీదుగా చింతపల్లి చేరుకుని, అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. -
బాక్సైట్‌కు వ్యతిరేకంగా వైఎస్ జగన్ బహిరంగసభ
విశాఖపట్నం: విశాఖ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లపై అనకాపల్లిలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ విశాఖ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. విశాఖ మేయర్ పీఠమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...విజయవాడ కల్తీమద్యం మరణాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిపక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. -
'ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి'
-
'ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి'
విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం మోసపూరితమైందని ఆంద్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో ఓ హోటల్ జరిగిన కార్యక్రమంలో బాక్సైట్ తవ్వకాలపై వాస్తవ పత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ...ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 97 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై బహిరంగ చర్చకు రావాలని సీఎంకు ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమానికి మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఆదివాసీల హక్కుల దినోత్సవం రోజున చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలపై ప్రకటన చేయడం విచిత్రమైన పరిస్థితికి నిదర్శనమని నాదెండ్ల వ్యాఖ్యానించారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో తనకు ప్రయోజనం చేకూర్చే కంపెనీల కోసం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ను సైతం సవరణ చేసేందుకు చంద్రబాబు గతంలో ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని గతంలో నాలుగు సార్లు కేంద్రానికి లేఖలు కూడా రాశారని నాదెండ్ల పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన పెద్దకే ఇలాంటి మార్పు ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. -
అదో అబద్ధాల పత్రం
-
అదో అబద్ధాల పత్రం
సీఎం శ్వేతపత్రంపై బృందాకారత్ విసుర్లు సభలో తీర్మానం ఎవరు చేశారు? చంద్రబాబుకు జర్రెల మాజీ సర్పంచ్ సూటిప్రశ్న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గర్జించిన గిరిజనం చింతపల్లి: బాక్సైట్ తవ్వకాల విషయమై జర్రెల పంచాయతీ గ్రామసభలో తీర్మానించినట్టు శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబునాయుడు పేర్కొనడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం చింతపల్లిలో ‘గిరిజనగర్జన’ చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఆది నుంచి ఆదివాసీలంతా బాైక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని అన్నారు. 2008లో జర్రెల పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారుడైన సాగిన వెంకటరమణ ఉన్నారని, ఆయనే తీర్మానం చేసిందీ లేనిదీ చెబుతారన్నారు. దీంతో వేదికపైకి వచ్చిన ఆయన మాట్లాడుతూ 2008లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారని, ఆ సమయంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని తమకు చెప్పేవారని, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తాము ఖనిజ తవ్వకాలకు అనుకూలంగా తీర్మానం ఎలా చేస్తామని ప్రశ్నించారు. చంద్రబాబు శ్వేతపత్రంలో ఏ మాత్రం నిజంలేదని, గిరిజనులంతా దీనిని గమనించాలన్నారు. అప్పటి పంచాయతీ తీర్మాన పుస్తకాన్ని సభలో పెట్టారు. అనంతరం బృందాకారత్ మాట్లాడుతూ సొంత పారీ ్టవారినే మోసం చేయగలిగే చంద్రబాబుకు గిరిజనులు ఒక లెక్కా అన్నారు. ఐదో షెడ్యూల్ ప్రకారం గిరిజనుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వాలకు లేదన్నారు. దొడ్డిదారిలో బాక్సైట్ తవ్వేందుకే చంద్రబాబు గిరిజన సలహామండలి ఏర్పాటు చేయలేదన్నారు. అటవీ హక్కుల చట్టం అమలయ్యేలా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. జర్రెల ప్రాంతంలో కేవలం 42 మంది మాత్రమే అటవీ భూముల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోందని, అక్కడున్న మిగిలిన వారంతా మనుషులు కాదా అని ఆమె ప్రశించారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బాక్సైట్ తవ్వకాలతో అడవులు నాశనమై గిరిజనుల మనుగడ దెబ్బతింటుందని గతంలో గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. మన్యంలోని టీడీపీ నేతలు గిరిజనులను మోసం చేయకుండా చిత్తశుద్ధితో ఉద్యమాలు చేయాలని కోరారు. సీపీఎం నాయకులు సీహెచ్ నర్సింగరావు, లోక్‌నాధం, ప్రభావతి, కిల్లో సురేంద్ర, బి.చిన్నయ్యపడాల్, సీపీఐ నాయకులు బి.రామరాజ్యం, గిరిజనసంఘం నాయకులు జి.సత్యనారాయణ, కె.బలరామ్, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బాక్సైట్ పాపం టీడీపీదే..
చింతపల్లి: ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు బీజంవేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు వేరొకరిపై నిందలు వేయడం తగదని, సీపీఐ రాష్ట్రసహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లడుతూ 1999లోఅధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు తెరలేపారన్నారు. అనంతరం ఆయన అధికారం కోల్పోవడం వల్లే ఇంతకాలం బాక్సైట్ తవ్వకాలు ఆగాయని, కాంగ్రెస్ హాయాంలో అనుమతులు మంజూరైనా, ప్రజా వ్యతిరేకత దృష్ట్యా తవ్వకాలు నిలిపి వేశారని వివరించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్లీ బాక్సైట్ అంశం తెరమీదకు తెచ్చి, తాను చేస్తున్న తప్పును వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి రాగానే మరోలా వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ జిల్లాసహాయ కార్యదర్శి బడుగు రామరాజ్యం,సత్యనారాయణ,పెద్దబ్బాయి పాల్గొన్నారు. -
బాక్సైట్ తవ్వకాల పై వామపక్షాల ఆందోళన
-
బెజవాడలో సీఎం దిష్టిబొమ్మ దహనం
గాంధీనగర్: బాక్సైట్ తవ్వకాలకు అనుమతించే జీవోను రద్దు చేయాలంటూ విజయవాడలో న్యూడెమోక్రసీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం ఉదయం స్థానిక లెనిన్ సెంటర్లో సీపీఐ ఎల్ న్యూమోక్రసీ నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. గిరిజనుల జీవితాలను ఛిద్రం చేసే బాక్సైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
విభజించి.. తవ్వేద్దాం!
ఏజెన్సీ తెరపైకి ‘ఆ నలుగురు’ బాక్సైట్ అనుకూల బృందంలో కొత్తపల్లి గీత, గుమ్మడి సంధ్యారాణి, హైమావతి, స్వాతి బాక్సైట్ కోసం చంద్రబాబు ఎత్తుగడ విశాఖపట్నం: దేశాన్ని ఆక్రమించేందుకు నాడు తెల్లదొరలు ‘విభజించి...పాలించు’ అన్న కుయుక్తిని ప్రయోగిస్తే... నేడు బాక్సైట్ కొండలను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ‘విభజించు... తవ్వేద్దాం’ అనే పన్నాగానికి తెరతీస్తోంది. గిరిజనుల మహోద్యమంతో బాక్సైట్ తవ్వకాల జీవోపై తాత్కాలికంగా ఉపసంహరించుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తగ్గలేదు. ‘గిరిజనులతో సంప్రదింపులు’పేరిట కొత్త వ్యూహంతో బాక్సైట్ తవ్వకాల అంశాన్ని పరిశీలి స్తూనే ఉంది. అందుకోసం ముగ్గురు గిరిజన మహిళా ప్రజాప్రతినిధులతోపాటు మరో మాజీ మహిళా ప్రజాప్రతినిధిని ఎంపిక చేసుకోవడం గమనార్హం. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం జెడ్పీ చైర్పర్సన్ స్వాతిలతోపాటు రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతిలను ఇందుకు నియోగించాలని వ్యూహరచన చేస్తున్నారు. ఎందుకంటే... ► వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచినప్పటికీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఏడాదికిపైగా అధికార టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు కోసం ఆమె ప్రయత్నించనున్నారు. అందుకే ఆమె బాక్సైట్ తవ్వకాల అంశంలో ప్రభుత్వ అనుకూల వాదన వినిపిస్తున్నారు. ►విజయనగరం జిల్లాకు చెందిన గిరిజన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి. విశాఖ ఏజెన్సీకి చెందిన మాజీ మంత్రి మణికుమారికి దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవిని మంత్రి నారాయణ సిఫార్సుతో చివరి నిముషంలో సంధ్యారాణికి ఇచ్చారు. ప్రస్తుతం కేబినేట్లో గిరిజన మంత్రి లేకపోవడంతో సంధ్యారాణి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో బాక్సైట్ తవ్వకాలకు గిరిజనులను ఒప్పించే బాధ్యతను వహించేందుకు ఆమె కూడా సిద్ధపడ్డారు. ►తల్లీ కూతుళ్లు శోభా హైమావతి, స్వాతిలను కూడా చంద్రబాబు వ్యూహంలో భాగస్వాములు కానున్నారు. గిరిజన వర్గానికి చెందిన స్వాతి ప్రస్తుతం విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. స్వాతి తల్లి శోభా హైమావతి ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె 1999లో ఎస్టీ కోటా కింద ఎస్.కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి మండలాలు అప్పటి ఎస్.కోట నియోజకవర్గంలో భాగంగా ఉండేవి. ఆమె కూడా ప్రస్తుతం నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇలా ఈ నలుగురు మహిళా నేతలకు మరిన్ని రాజకీయ ప్రయోజనాలను ఆశగా చూపిస్తూ బాక్సైట్ తవ్వకాల అనుకూల వ్యూహానికి సాధనంగా చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ గీత రంగంలోకి వచ్చారు. త్వరలోనే మిగిలిన ముగ్గురు నేతలు ఏజెన్సీలో అడుగుపెడతారని తెలుస్తోంది. ఆ నలుగురూ... సంప్రదింపుల పేరుతో గిరిజనులను బాక్సైట్ తవ్వకాల కోసం ఒప్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. విశాఖ ఏజెన్సీకి చెందిన మాజీ మంత్రి మణికుమారితోపాటు ఇతర గిరిజన నేతలు కూడా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారు. దాంతో ఇతర జిల్లాలకు చెందిన గిరిజన నేతల ద్వారా కథ నడిపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్సీ సంధ్యారాణి, విజయనగరం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ స్వాతి, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతిలను ఇందుకు నియోగించాలని ప్రణాళిక రూపొందించారు. అందుకే ఆ నలుగురు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. గతవారం విశాఖపట్నం గిరిజన భవన్లో నిర్వహించిన సదస్సుకు కూడా హాజరుకాలేదు. -
బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ
చోడవరం (విశాఖపట్నం) : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం విశాఖ జిల్లా చోడవరంలో భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సుమారు వెయ్యి మంది కళాశాల విద్యార్థులు గాంధీగ్రామ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మెయిన్ రోడ్డు, కొత్తూరు జంక్షన్, కాంప్లెక్స్ వరకూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లారు. బాక్సైట్ తవ్వకాలకు ఉద్దేశించి జీవో 97ను తాత్కాలికంగా రద్దు చేయడం కాదని, పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలతో సాగు, తాగునీరు కలుషితం అవుతుందని, అటవీ ప్రాంతం అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఇన్చార్జ్ తహశీల్దార్ రామారావుకు వినతిపత్రం ఇచ్చారు. -
బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు
-
'సీఎం, మంత్రికి తెలియకుండానే బాక్సైట్ జీవో'
విజయవాడ: బాక్సైట్ తవ్వకాల జీవో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే అటవీశాఖ జారీ చేసిందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇదే విషయం మంత్రివర్గ సమావేశంలోనూ చర్చకు వచ్చిందని, ఇలాంటి లోపాలను సరిదిద్దుతామని ఆయన చెప్పారు. విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం కేఈ కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని సీఎం గతంలో ఒకసారి అన్నారని, తరువాత ఇంకెప్పుడూ అనలేదన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని ఓ మంత్రి మాట్లాడుతున్నారని, ఆయన మాదిరి సంబంధం లేని ఇతర శాఖల గురించి తాను మాట్లాడబోనని కేఈ చురకలు అంటించారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులపై దాడులపట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. బ్యాంకు రుణాలకు పాస్‌బుక్‌లు అవసరం లేకుండా లోన్ చార్జ్ క్రియేషన్ మాడ్యూల్‌ను బ్యాంకులకు అనుసంధానిస్తామన్నారు. సర్వే పనులు వేగవంతం చేయడానికి సుమారు రూ.15 కోట్లతో 273 ఈటీఎస్ మిషన్లు రప్పిస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ-పంట కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. మీ-సేవ కేంద్రాల ద్వారా 62 రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెచ్చామని, అవసరంలేని 18 రకాల సేవలను తొలగించామన్నారు. 240 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. సమావేశంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) అనిల్‌చంద్ర పునీత పాల్గొన్నారు. -
'వైఎస్ జగన్ పర్యటనకు భయపడే'
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాల జీవోను శాశ్వతంగా రద్దు చేసేవరకు వైఎస్సార్సీపీ ఉద్యమం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆమె మంగళవారమిక్కడ మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చింతపల్లి పర్యటనకు భయపడే జీవోను చంద్రబాబు తాత్కాలికంగా నిలిపివేశారని ఎద్దేవా చేశారు. జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని, గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని ఈశ్వరి తెలిపారు. -
బాక్సైట్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల భారీ ర్యాలీ
ఐటీడీఏ వద్ద నాలుగో రోజు కొనసాగిన దీక్షలు పాడేరు: విశాఖ మన్యాన్ని అందాల కశ్మీర్‌గా అభివర్ణిస్తూనే బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి విధ్వంసానికి పూనుకుంటోందని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ధ్వజమెత్తారు. బాక్సైట్ వ్యతిరేక వేదిక విద్యార్థులతో సోమవారం పాడేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఉన్న చట్టాలను అమలు చేయని ప్రభుత్వం 97 జీవోను ఇచ్చి 40 ఏళ్ల పాటు మన్యంలో ఏపీఎండీసీ అనుమతులు ఇచ్చిందని విమర్శించారు. బాక్సైట్ వ్యతిరేకంగా మహోద్యమానికి 28 సంఘాలతో బాక్సైట్ వ్యతిరేక వేదిక ఏర్పడిందని తెలిపారు. కేబినెట్ సమావేశంలో చ ర్చించి 97జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు రామరావు దొర మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోం దని విమర్శించారు. గిరిజనుల ఆందోళనలపై ప్రభుత్వాలు స్పందించి బాక్సైట్ తవ్వకాలను విరమించకుంటే మన్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్ మాట్లాడుతూ బాక్సైట్ వ్యతి రేక ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాల వలన మన్యం సర్వనాశనమవుతుందని పంటలు నశిస్తాయని, తవ్వకాలను అడ్డుకోవాలని కోరారు. బాక్సైట్ వ్యతిరేక వేదిక ప్రతినిధులు సూర్యనారాయణ, రాజ్‌కుమార్, కృష్ణారావు, ఎం.ఎం.శ్రీను, పాలికి లక్కు, రాధకృష్ణ, సుందర్రావు, వంతాల రాంబాబులతో పాటు పట్టణంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
బాక్సైట్ ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఐక్య కార్యచారణ కమిటీ ఏర్పాటైంది. ఆదివారం విశాఖలోని ఎంవీపీ కాలనీ ప్రాంతంలోని గిరిజన భవన్లో వివిధ ఆదివాసీ సంఘాలు, గిరిజన మేథావులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కెడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, పి.రాజన్నదొర, రాజేశ్వరి, కళావతి తదితరులు సమావేశమయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు గ్రామసభ ఆమోదాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తీర్మానించారు. తవ్వకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే
విజయనగరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాక్సైట్ తవ్వకాలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని సాలూరు నియోజవర్గ ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలపై చర్చించడానికి ఈ ఆదివారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమావేశం అవుతామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారంటూ పవన్ కల్యాణ్ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. -
బాక్సైట్ పై బీజేపీకి నేతల అల్టిమేటం
పాడేరు: బాక్సైట్ తవ్వకాల అంశంపై విశాఖ జిల్లా బీజేపీ నేతలు పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. బాక్సైట్ అంశంపై పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీకి రాజీనామా చేస్తామన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన బీజేపీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పాడేరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ కురుస ఉమామహేశ్వరరావు, అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్.వేమనబాబు, అన్ని మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఏయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఏయూ విద్యార్థులను కేజీహెచ్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఏయూ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళుతోందంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చేపట్టనున్న ఏయూ బంద్‌కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మద్దతు తెలిపారు. -
'బాబుకు ఓటేసిన ఫలితం అనుభవిస్తున్నారు..'
చంద్రబాబుకు ఓటేసిన ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కృష్ణమూర్తి అన్నారు. ఆయన గురువారం విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పాలెపువలస, వల్లాపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. బాక్సైట్ తవ్వకాలతో ప్రభావితమయ్యే ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. బాక్సైట్ మైనింగ్ కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు, టీడీపీకి ఓటేసిన పాపం ప్రజలను వెంటాడుతోందని చెప్పారు. గనుల పేరుతో సీఎం చంద్రబాబు ప్రజల పొట్టకొడుతున్నారని విమర్శించారు. ప్రజల జీవనాధారమైన కొండలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. వెంటనే బాక్సైట్ మైనింగ్ ఆపేయాలని డిమాండ్ చేశారు. -
మన్యం జోలికొస్తే తరిమికొడతాం
ఏయూ క్యాంపస్: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను నిరసిస్తూ విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. సోమవారం ఉదయం ఆంధ్రా వర్సిటీలోని పరిశోధకులు, విశాఖలోని గిరిజన విద్యార్థులు ఏయూ మెయిన్‌గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు ఎస్.లోవరాజు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్ కుమార్ తదితరలు ఈ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. మన్యం ప్రజల జోలికి వస్తే సహించేది లేదన్నారు. పచ్చని ప్రకృతిని నాశనం చేయాలనే శక్తులను ఆదివాసీలంతా ఏకమై తరిమికొడతారన్నారు. దీక్షకు అరకు ఎమ్మెల్యే (వైఎస్సార్సీపీ) కిడారి సర్వేశ్వరరావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణకు అన్ని వర్గాలతో కలసి పని చేస్తామన్నారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ అరకును టూరిజం హబ్‌గా చేస్తామని చెప్పిన సీఎం.. నేడు పర్యావరణానికి హాని చేసే విధంగా ప్రవర్తించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజులు విద్యార్థుల దీక్షకు సంఘీభావం తెలిపారు. గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు, విశాఖలోని వివిధ కళాశాల విద్యార్థులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏయూ ఆచార్యుడు జర్రా అప్పారావు, పరిశోధకులు, గిరిజన సంఘాల, ఉద్యోగ సంఘాల నేతలు దీక్షకు మద్దతు తెలిపారు. -
నేడు జీఓ ఎలా జారీ చేస్తారు ? ఉమ్మారెడ్డి
-
చంద్రబాబు గవర్నర్‌కు లేఖ ఇవ్వడం అబద్దమా?
విశాఖపట్నం: ఇకపై బాక్సైట్ కోసం ప్రతి గిరిజనుడు ఆయుధాలతో పోరాడుతాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే(పాడేరు) గిడ్డి ఈశ్వరి అన్నారు. మా ప్రాణాలు అడ్డుపెట్టయినా బాక్సైట్‌ను కాపాడుకుంటామని ఆమె చెప్పారు. విశాఖలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మన్యం బంద్ కు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బంద్ ప్రారంభం మాత్రమేనన్నారు. 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తవ్వకాలు ఆపాలంటూ గవర్నర్‌కు లేఖ ఇవ్వడం అబద్దమా.. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండని అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ లేఖను నిన్నటికి నిన్న వెబ్సైట్ లోంచి తొలగించేశారని ఎమ్మెల్యే వివరించారు. జీవో 97ను జారీ చేసినందుకు ఏ కార్యక్రమం తలపెట్టినా చంద్రబాబుకు గిరిజనుల ఆగ్రహం తప్పదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు. -
'జీవో 97 ను రద్దు చేయండి'
పాడేరు: గిరిజనుల గొంతుకోసే బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుందామంటూ అఖిలపక్షం నాయకులు పాడేరులో శనివారం ర్యాలీ తీశారు. ప్రభుత్వం వెంటనే జీవో 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పాల్గొన్నాయి. అంతేకాకుండా అనంతగిరి మండలకేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద అఖిలపక్షం నాయకులు ధర్నా చేశారు. ఉత్తరాంధ్రలోబాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆందోళన చేశారు. ధర్నాలో పాల్గొన్న అఖిలపక్షనాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
టీడీపీ వెబ్సైట్ నుంచి చంద్రబాబు లేఖ తొలగింపు
-
మన్యం మంటలు
* బాక్సైట్ తవ్వకాలపై ప్రజాగ్రహం * విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు.. నేడు మన్యం బంద్ సాక్షి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలకు రాష్ర్టప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై విశాఖ మన్యం మండి పడుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రాణాలు అడ్డుపెట్టయినా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని పాడేరులో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. శనివారం మన్యం బంద్‌కు పిలుపు నిచ్చింది. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇక నుంచి ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలని తీర్మానించింది. సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చిన సర్కార్.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేందుకు పోలీసుల నిర్బంధాలు, తప్పుడు కేసులు బనాయించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ముగ్గురు ఆదివాసీలను మావోలు కిడ్నాప్ చేసినప్పుడు తవ్వకాలు జరపబోమని అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తన చుట్టూ ఉండే పారిశ్రామిక కోటరీ కోసం అనుమతులిచ్చారని ఆమె విమర్శించారు. తొలుత అఖిల పక్షం ఆధ్వర్యంలో పాడేరులో బైక్ ర్యాలీ చేశారు. ఉన్నతాధికారుల ఏరియల్సర్వే బాక్సైట్ తవ్వకాలకై జీవో జారీ చేసిన మర్నాడే సీఆర్పీఎఫ్ ఏడీజీ(అడిషనల్ డెరైక్టర్ జనరల్) పి.వి.కె.రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో పర్యటించింది. ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి చేరుకున్న ఈ బృందం ముంచంగిపుట్టు, మల్కన్‌గిరిలలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులను తనిఖీ చేసింది. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజనుల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని భావిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను దింపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
నేడు విశాఖ మన్యం బంద్
-
అనుమతులు ఎవరి కోసం?
సీఎంను ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజన్న దొర సాక్షి, హైదరాబాద్: ‘బాక్సైట్ తవ్వకాలు జరిపితే ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్తి కలుషితం అవుతాయని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే అసెంబ్లీలో మాట్లాడారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు 2011 డిసెంబర్ 24న లేఖ రాశారు. బాక్సైట్ తవ్వకాల వల్ల అక్కడ నదులన్నీ ఎండిపోతాయన్నారు. పర్యావరణం పాడైపోతుందన్నారు. గిరిజనులందరూ నిరాశ్రయులవుతార ని చెప్పారు. ఆ ప్రాంతాల్లో తాగడానికైనా మంచినీళ్లు దొరకవన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక ఈ రోజు బాక్స్ట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ జీవో నెంబరు 97 జారీ చేశారు. ఇప్పుడు గిరిజనులు నిరాశ్రయులు కారా? బాక్సైట్ తవ్వితే నీరు లేక ఆ ప్రాంతం ఎండిపోదా? పర్యావరణం దెబ్బతినదా? కాలుష్యం ఉండదా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్న దొర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అప్పుడో మాట, ఇప్పుడో తీరు.. చంద్రబాబుదీ, తెలుగుదేశం పార్టీదీ ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలోకి రాగానే మరో తీరని రాజన్నదొర దుయ్యబట్టారు. అప్పుడు గవర్నర్‌కు రాసిన లేఖను, ఇప్పటి జీవో 97 ప్రతులను మీడియాకు చూపించారు. గవర్నర్‌కు గతంలో రాసిన లేఖకు చంద్రబాబు కట్టుబడి ఉండాలని రాజన్న దొర సూచించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు. పార్టీ నేతలతో ఆ ప్రాంతంలో ధర్నాలు చేయించారు. బాక్సైట్ తవ్వకాలకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన అనుమతులను.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 97 రద్దు చేయండని గిరిజనులందరి తరుఫున, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. -
విశాఖ బాక్సైట్ తవ్వకాలు రద్దు చేయాలి
గిరిజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను వెంటనే రద్దు చేయాలని గిరి జన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ నాయకులు గిరిజన ‘ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తింది. కార్పొరేట్ ప్రయోజనాల కోసం గిరిజనుల భూములను లాక్కోవడం అన్యాయమని సంఘ నేతలు శోభ న్నాయక్, ధర్మనాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఈ తవ్వకాలకు అనుమతులు వెంటనే రద్దు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
నిరసన సెగ
బాక్సైట్ తవ్వకాలకు అనుమతులపై అఖిల పక్షాల నిరసన ఐక్య ఉద్యమానికి సమాయత్తం నేడు మన్యం బంద్ ఉద్రిక్తత నేపథ్యంలో సీఆర్పీఎఫ్ అధికారుల పర్యటన శీతాకాలం ఆరంభంలో ఏజెన్సీ ఒక్కసారిగా వేడెక్కింది. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో మన్యంలో నిరసనాగ్ని రగులుకుంది. సర్కారు వైఖరికి వ్యతిరేకంగా మన్యం బందుకు సిద్ధమైంది. ప్రాణాలు పణంగా పెట్టయినా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటామని పాడేరులో అఖిలపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చి తేల్చి చెప్పాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రతిన బూనాయి. వైఎస్సార్సీపీతో సహా వామపక్షాలు.. ఇతర రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. పాడేరు : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అఖిలపక్షాల్లో నిరసన పెల్లుబికింది. శుక్రవారం పలు మండలాల్లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జీకేవీధి, చింతపల్లి, పాడేరు, పెదబయలు మండలాల్లో విపక్షాలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలను నిర్వహించాయి. జి.మాడుగుల మండలంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి అనంతరం సభను బహిష్కరించి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ధర్నా, ర్యాలీ నిర్వహించారు. పాడేరులో అఖిలపక్షాలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. రాజకీయ పార్టీలు, పీసా, విద్యార్థి కమిటీలు సమావేశమై బంద్‌కు పిలుపునిచ్చాయి. బాక్సైట్ ఉద్యమంలో అందరి భాగస్వామ్యం: ఎమ్మెల్యే ఈశ్వరి మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడానికి ఐక్య ఉద్యమం చేపట్టాలని, ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ గిరిజన భవన్లో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్షాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాల్లో ఆదివాసీ ప్రజలను సంఘటితం చేసి ఉమ్మడి పోరుతోనే బాక్సైట్‌ను అడ్డుకోగలమన్నారు. ఆదివాసీలంతా వ్యతిరేకిస్తున్నా, పర్యావరణానికి గిరిజనుల మనుగడకు విఘాతమని తెలిసినా ప్రభుత్వం నిరంకుశంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిందని ధ్వజమెత్తారు. ప్రకృతి సంపదపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగబడుతున్నాయని, మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే ప్రజా ప్రతిఘటన తప్పదని మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు హెచ్చరించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలన వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ గిరిజన సంఘం, సీపీఎం నాయకులు ఆర్.శంకరరావు, ఎంఎం శ్రీను, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పాలికి అప్పారావు, సీపీఐ నాయకుడు కూడా భూషణరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాంగి సత్తిబాబు, బీజేపీ నాయకులు ఉమా మహేశ్వరరావు, వేమనబాబు, సల్ల రామకృష్ణ, బీఎస్పీ నాయకులు సుర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం మార్చుకోకుంటే టీడీపీకి గుడ్‌బై విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన 97 జీఓను ఉపసంహరించాలని మాజీ మంత్రి మణికుమారి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వి.కాంతమ్మ, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, టీడీపీ నాయకులు బొర్రా నాగరాజు, ఎంవిఎస్ ప్రసాద్, శెట్టి లక్ష్మణుడు, పాంగి రాజారావు, జి.మాడుగుల జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఓ హరినారాయణన్‌కు వినతిపత్రం అందజేసి ఐటీడీఏ వద్ద నిరసన తెలియజేశారు. మన్యంలో ఆదివాసీలంతా వ్యతిరేకిస్తున్న బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతివ్వడం భావ్యం కాదన్నారు. ఈనెల 13న తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగే సమావేశానికి హాజరై బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన జీఓను ఉపసంహరించాలని కోరనున్నట్లు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం పూనుకుంటే పార్టీ నుంచి వైదొలుగుతామని పేర్కొన్నారు. -
'గిరిజనులకు బతికేహక్కు లేదా?'