
సాక్షి, విజయవాడ: 2 లక్షల టన్నుల లేటరైట్ అక్రమంగా తవ్వకాలు జరిగాయని గుర్తించినట్లు గోపాలకృష్ణ ద్వివేది, డీఎంజీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో బాక్సైట్ తవ్వకాలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే తూర్పుగోదావరి, విశాఖపట్నంలో శాఖాపరంగా విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అక్రమ తవ్వకాలపై ఆరోపణలు రావడంతో వారు బుధవారం వివరాలు సేకరించారు. ఆండ్రస్ మినరల్‌కి 8 లీజులు 2013లో వాళ్లకి మంజూరయ్యాయని, వాటిపై తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటిపై తాము పెనాల్టీ కూడా వేసినట్లు పేర్కొన్నారు. భద్రతా చర్యలు, ఇతర ప్రమాణాలను తనిఖీ చేశామని చెప్పారు. వేదాంతకి 34 లక్షల టన్నుల సరఫరా చేశారు, 4.5 లక్షల టన్నుల చైనాకు సరఫరా చేశారు అని వెల్లడించారు.
వీటిపై విచారణ చేస్తున్నట్లు ద్వివేది తెలిపారు. లేటరైట్ తవ్వరా.. బాక్సైట్ తవ్వరా అని విచారిస్తున్నట్లు స్పష్టం చేశారు. అల్యూమినియం కంపెనీకి సరఫరా చేయడం వలన ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని పేర్కొన్నారు. 2013 నుంచి 2019 జనవరి వరకు ఈ తవ్వకాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలు జరగలేదు అని స్పష్టం చేశారు. ఇప్పుడు లేటరైట్‌ని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు.. అందుకే లేటరైట్ అని నిర్ధారిస్తున్నాట్లు వివరించారు. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో గతంలో పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉందని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చదవండి: ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు కేటీఆర్?: ఎమ్మెల్యే సీతక్క
చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’
Comments
Please login to add a commentAdd a comment