చంద్రబాబు గవర్నర్కు లేఖ ఇవ్వడం అబద్దమా? | giddi eeswari questioned babu on bauxite mining letter | Sakshi
Sakshi News home page

చంద్రబాబు గవర్నర్కు లేఖ ఇవ్వడం అబద్దమా?

Published Sat, Nov 7 2015 10:28 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

చంద్రబాబు గవర్నర్కు లేఖ ఇవ్వడం అబద్దమా? - Sakshi

చంద్రబాబు గవర్నర్కు లేఖ ఇవ్వడం అబద్దమా?

విశాఖపట్నం: ఇకపై బాక్సైట్ కోసం ప్రతి గిరిజనుడు ఆయుధాలతో పోరాడుతాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే(పాడేరు) గిడ్డి ఈశ్వరి అన్నారు.
మా ప్రాణాలు అడ్డుపెట్టయినా బాక్సైట్ను కాపాడుకుంటామని ఆమె చెప్పారు. విశాఖలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మన్యం బంద్ కు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బంద్ ప్రారంభం మాత్రమేనన్నారు.

2011లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తవ్వకాలు ఆపాలంటూ గవర్నర్కు లేఖ ఇవ్వడం అబద్దమా.. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండని అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ లేఖను నిన్నటికి నిన్న వెబ్సైట్ లోంచి తొలగించేశారని ఎమ్మెల్యే వివరించారు. జీవో 97ను జారీ చేసినందుకు ఏ కార్యక్రమం తలపెట్టినా చంద్రబాబుకు గిరిజనుల ఆగ్రహం తప్పదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement