giddi eeswari
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్
సాక్షి, విశాఖసిటీ: పార్టీపై నమ్మకంతో గెలిపిస్తే ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గారు. ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతూ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన నేతల తలరాతల్ని ఓటర్లు మార్చారు. విశ్వాసఘాతుకానికి పాల్పడితే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఓటర్లు బుద్ధి చెప్పారు. ఫిరాయింపుదారులు మళ్లీ తలెత్తుకోనివ్వకుండా గుర్తుండిపోయే ఓటమిని రుచిచూపించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించి అధికార టీడీపీకి అమ్ముడు పోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని ఘెర పరాజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. 2014లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గిడ్డిని ఓడించి బుద్ధి చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన భాగ్యలక్ష్మి చేతిలో 40,900 ఓట్ల తేడాతో గిడ్డి ఈశ్వరి ఓటమి పాలైంది. అదే విధంగా అరకులో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2014లో విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సర్వేశ్వరరావు స్థానంలో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టి.. 2019 అరకు ఎమ్మెల్యే టికెట్‌ను టీడీపీ అప్పగించింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శెట్టి ఫాల్గుణ ఫిరాయింపు ఎమ్మెల్యే కుమారుడు, తాజా మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ని 33,172 ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. ఎలాంటి సానుభూతి చూపకుండా అరకు ప్రజలు కిడారిని ఇంటికి సాగనంపారు. ఇక అరకు ఎంపీగా వైఎస్సార్సీపీ విజయం సాధించిన కొత్తపల్లి గీత.. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచింది. టీడీపీ, బీజేపీ వైపు చూసిన గీత.. చివరికి జనజాగృతి పార్టీని స్థాపించి విశాఖ ఎంపీగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీకి గీత చేసిన అన్యాయాన్ని గుర్తించుకున్న ప్రజలు.. డిపాజిట్ రాకుండా చేశారు. 12 లక్షల పై చిలుకు ఓట్లు పోలైన విశాఖ ఎంపీ స్థానంలో ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీతకు కేవలం 1,127 ఓట్లు మాత్రమే పోలవ్వడం హాస్యాస్పదం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. -
గిడ్డి ఈశ్వరి వీడియోతో బాబు బండారం బట్టబయలు!
-
గిడ్డి ఈశ్వరి వీడియోతో బాబు బండారం బట్టబయలు!
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలుచేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బండారం బట్టబయలైంది. ఇటీవల పార్టీ మారిన గిడ్డి ఈశ్వరితో చంద్రబాబు కుదుర్చుకున్న భారీ డీల్ గుట్టు రట్టయింది. మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పొరేషన్ పదవి ఇస్తామని ఆశజూపి.. ఆమెను పార్టీలోకి తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు స్వయంగా డీల్ గురించి గిడ్డి ఈశ్వరే వెల్లడించారు. ఈ మేరకు కార్యకర్తలతో ఆమె మాట్లాడుతున్న వీడియో ‘సాక్షి’కి చిక్కింది. చంద్రబాబు ఆఫర్‌ను అనుచరులకు వెల్లడించిన గిడ్డి ఈశ్వరి.. ఆఫర్ బాగుందని, వెళ్లకతప్పదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా మనకు పదవి కావాలంటూ ఆమె వెల్లడించారు. అన్ని పనుల్లో కమీషన్లు కూడా వస్తాయని ఆమె అన్నారు. అధికార టీడీపీ నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కొందరికి పదవుల ఎరవేసి.. మరికొందరికి డబ్బు ఆశ జూపి.. కాంట్రాక్టుల్లో కమీషన్ల ప్రలోభాలు చూపి.. టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లొంగదీసుకొని.. తమ పార్టీలో చేర్చుకుంటుందన్న మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా గిడ్డి ఈశ్వరి వ్యవహారంలో ‘సాక్షి’ చేతికి వీడియో సాక్ష్యం చిక్కింది. టీడీపీ నేతల ప్రలోభాల గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పవాణి తీవ్రంగా స్పందించారు. గిడ్డి ఈశ్వరి వీడియోతో చంద్రబాబు బండారం బయటపడిందని ఆమె అన్నారు. సీఎం హోదాలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు తాము ఏదైతే చెప్పామో.. అదే ఈ వీడియోతో నిజమైందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభ పెడుతున్నారని స్పష్టమైందని అన్నారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారని గతంలో పేర్కొన్న చంద్రబాబే ఇప్పుడా పని చేస్తున్నారని విమర్శించారు. తాజా వీడియోతో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని ఆమె అన్నారు. -
టీడీపీ తీరుపై కేంద్రం సిగ్గుపడుతోంది
► ఎమ్మెల్యేలను కొనుక్కోవడమేనా ప్రజాస్వామ్యం... ► వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ఆరోపణ ► సేవ్‌డెమొక్రసీ కోసం గడపగడపకు యాత్రలు చేపడతామని వెల్లడి గోపాలపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు అప్రజాస్వామ్య పాలనపై కేంద్రం సిగ్గుపడుతోందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరజూపి కొనుక్కోవడం, అభివృద్ధిని గాలికొదిలేయడం ప్రజాస్వామ్యమా అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, దాడిశెట్టి రాజా, కళావతి, కంబాల జోగులు, పుష్ప శ్రీవాణి ఢిల్లీలో ‘సేవ్‌డెమొక్రసీ’ యాత్ర ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రలో అధికార పార్టీ తీరుపై కేంద్రం ఎంత చిన్నచూపుతో ఉందో వివరించారు. టీడీపీ చర్యలను నిరసిస్తూ.. వైఎస్సార్ సీపీ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. అడ్డగోలు సంపాదనతో ఎమ్మెల్యేలను కొంటున్నారు పట్టిసీమ, రాజధాని భూములపై అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదు. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఇది అత్యంత దారుణం. ఒక పార్టీ బీఫాంతో గెలిచిన ఎమ్మెల్యేలను మరో పార్టీ వారు కొనడం రాక్షసపాలనగానే భావిస్తున్నాం. టీడీపీ ప్రభుత్వ ఆగడాలపై పుస్తకరూపంలో కేంద్రానికి విన్నవించాం. టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి ఎరజూపి ఓట్లేయించుకని ఇపుడు మొహం చాటేసింది. ఫీజు రీయింబర్సుమెంట్ మంజూరు చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదని వాపోయారు. ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షాన ఉన్నారు. వైఎస్సార్ సీపీ పోరు ఇది ఆరంభమే. - బూడి ముత్యాలనాయుడు, మాడుగుల ఎమ్మెల్యే కిడారిని రూ. 30 కోట్లతో కొన్నారు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.30 కోట్లిచ్చి కొన్నారు. కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ సీపీకి నమ్మకద్రోహం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి వెన్నుపోటుపొడిచారు. కొణతాల రామకృష్ణను గురువంటునే ఆయనకు భంగపాటుకు గురిచేశారు. కిడారి స్వలాభం కోసం గిరిజనులను టీడీపీకి తాకట్టుపెట్టారు. గిరిజనులు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అభిమానంతో జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోరుతూ ఓట్లేస్తే ఇలా పార్టీ ఫిరాయించారు. ఏజెన్సీలో 50 ఎకరాల మైనింగ్ దోచుకోడానికి కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరడం దారుణం. పార్టీ ఫిరాయింపులపై జాతీయ నాయకులను, ప్రధాన పార్టీల నాయకులను కలిసి అన్నివిషయాలు చర్చించాం. టీడీపీ చర్యలు హాస్యాస్పదమని కేంద్రంలో నాయకులు విమర్శిస్తున్నారు. - గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే -
రావెల కడుపున కీచకుడు
సాక్షి, హైదరాబాద్: ‘తండ్రేమో అసైన్డు భూములను యథేచ్ఛగా దోచుకుంటున్నాడు... కొడుకు సుశీల్అమ్మాయిలను చెరబడుతున్నాడు.. మంత్రి కడుపున కీచకుడు పుట్టాడు.. తక్షణమే రావెల కిషోర్‌బాబును ఏపీ మంత్రివర్గం నుంచి తొలగించాల’ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో సహచర ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పుష్ప శ్రీవాణితో కలసి మాట్లాడారు. తాము మొదట్నుంచీ గిరిజనులనే మంత్రిగా నియమించాలని కోరుతున్నా పట్టిం చుకోలేదన్నారు. దళితుడైన రావెలను మంత్రిని చేయడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇప్పటికైనా మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కొడుకు కీచక పర్వాన్ని దృష్టిలో ఉంచుకుని రావెలను మంత్రి పదవి నుంచి తప్పించాలన్నారు. తక్షణమే రావెల కొడుకును అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఓవైపు ఎన్టీఆర్ జలసిరి అని గొప్పలు చెప్పుకొంటున్నారని, మరోవైపు గిరిజన గ్రామాల్లో తాగునీరే లేదన్నారు. చంద్రబాబు, చినబాబు అవినీతిలో నిండా మునిగిపోయారని, ఇక ప్రజా సమస్యలు ఎక్కడ పరిష్కరిస్తారన్నారు. వైఎస్ జగన్ జెండా, అజెండాపై గెలిచిన ఎమ్మెల్యేలను కోట్లు గుమ్మరించి కొనుగోలు చేస్తున్న చంద్రబాబు నీచబుద్ధి బయటపడిందని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే తమ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. తక్షణం అరెస్టు చేయాలి: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఏపీ మంత్రి తనయుడు రావెల సుశీల్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. శనివారం ఆమె బంజారాహిల్స్‌లోని అంబేడ్కర్‌నగర్‌లో బాధితురాలు ఫాతిమా బేగంను పరామర్శించిన అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కేసు విషయంపై ఆరా తీశారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఆమెకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వెల్లడించారు. సుశీల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి మద్దతే ముస్లిమ్స్ అసోసియేషన్ డిమాండ్ ముస్లిం మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మద్దతే ముస్లిం అసోసియేషన్ అధ్యక్షులు మోమిన్‌బాష డిమాండ్ చేశారు. సుశీల్ చర్యకు నిరసనగా హైదరాబాద్‌లోని సైనిక్‌పురి సాయినగర్‌లోని అసోసియేషన్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. మద్యం సేవించి ఓ ముస్లిం మహిళ చేయి పట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోమిన్‌బాష పేర్కొన్నారు. సుశీల్‌పై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
రావెల రాజీనామా చేయాల్సిందే
ఏపీ మంత్రుల్లో రావెల కిశోర్‌బాబు గిరిజన శాఖ మంత్రిగా ఉండటం సిగ్గుచేటుగా భావిస్తున్నామని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. గతంలో తాము ఏమైనా మాట్లాడితే అజ్ఞానులు అనేవారని, కానీ కిశోర్ బాబు 55 ఎకరాల అసైన్డ్ భూములను స్వాహాచేయడమే కాక, ఆయన కుమారుడు ఒక టీచర్‌పై అత్యాచారయత్నం చేయడం దారుణమని, అతడిని అరెస్టు చేయాలని, రావెల తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రపంచస్థాయి రాజధాని అంటున్నారు గానీ, పేద రైతులు, పేద కూలీలను మోసగిస్తూ వాళ్ల భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో స్వాహా చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు, మంత్రులు అందరూ బినామీ పేర్లతో భూములను ఆక్రమించుకున్నారని, ఓటుకు కోట్లు కేసులో పూర్తిగా మునిగిపోయి వీటిని పట్టించుకోవడం లేదని ఆర్కే మండిపడ్డారు. రాజధాని అభివృద్ధి పేరుతో రైతులను భయపెట్టి, హింసించి, వాళ్ల పొట్టగొట్టి భూములు లాక్కున్నారని, ఆ డబ్బును ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేందుకు ఉపయోగిస్తున్నారని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. మంత్రులు భూములు కొనుక్కుంటే తప్పేంటని అనడం దురదృష్టకరమని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. -
ఏయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఏయూ విద్యార్థులను కేజీహెచ్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఏయూ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళుతోందంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చేపట్టనున్న ఏయూ బంద్‌కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మద్దతు తెలిపారు. -
చంద్రబాబు గవర్నర్‌కు లేఖ ఇవ్వడం అబద్దమా?
విశాఖపట్నం: ఇకపై బాక్సైట్ కోసం ప్రతి గిరిజనుడు ఆయుధాలతో పోరాడుతాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే(పాడేరు) గిడ్డి ఈశ్వరి అన్నారు. మా ప్రాణాలు అడ్డుపెట్టయినా బాక్సైట్‌ను కాపాడుకుంటామని ఆమె చెప్పారు. విశాఖలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మన్యం బంద్ కు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బంద్ ప్రారంభం మాత్రమేనన్నారు. 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తవ్వకాలు ఆపాలంటూ గవర్నర్‌కు లేఖ ఇవ్వడం అబద్దమా.. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండని అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ లేఖను నిన్నటికి నిన్న వెబ్సైట్ లోంచి తొలగించేశారని ఎమ్మెల్యే వివరించారు. జీవో 97ను జారీ చేసినందుకు ఏ కార్యక్రమం తలపెట్టినా చంద్రబాబుకు గిరిజనుల ఆగ్రహం తప్పదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు. -
'నాపై ఏసీపీ దౌర్జన్యకరంగా వ్యవహరించారు'
పాడేరు: వైఎస్సార్సీపీ నేత, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి అరెస్ట్ అక్రమమని, పోలీసులు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పూనుకుంటున్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పాడేరులో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి పూర్తిగా కొమ్ముకాస్తోందని విమర్శించారు. ఇటీవల విశాఖ కలెక్టరేట్లో తాము ఆందోళన చేసి వినతిపత్రం ఇవ్వాలని వేచివుంటే మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా ఏసీపీ రమణ తనపై దౌర్జన్యకరంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రమేయం ఏమీ లేకున్నా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తెలుగుదేశం పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని, ఈ విషయంలో ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలకు అండగా ఉంటున్నారనే అక్కసుతోనే వైఎస్సార్సీపీ నేతలపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. -
'గిరిజన ద్రోహి మంత్రి రావెల'
పాడేరు(విశాఖపట్నం): ఏపీ సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గిరిజన ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావులు విమర్శించారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోవడంతో వారు నిరసన తెలిపారు. పాడేరులో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై మంత్రి రావెల కిశోర్ బాబు చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి రావెల క్షమాపణ చెప్పాల్సిందేనని నాయకులు పట్టుబట్టారు. అయితే, ఈ అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించలేదు. దాంతో సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.