
'గిరిజన ద్రోహి మంత్రి రావెల'
పాడేరు(విశాఖపట్నం): ఏపీ సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గిరిజన ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావులు విమర్శించారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో బాక్సైట్కు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోవడంతో వారు నిరసన తెలిపారు.
పాడేరులో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.