సీఎం నివాసంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్న కిశోర్ చంద్రదేవ్
సాక్షి, అమరావతి: బాక్సైట్ లైసెన్సులు రద్దు చేసింది తానేనని, బాక్సైట్ లీజుల విషయంలో టీడీపీపై బురద జల్లుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సీఎం నివాసం వద్ద ప్రజావేదిక హాలులో ఆదివారం కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కు పచ్చ కండువా వేసి చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు కారకుడు రాజశేఖర్‌రెడ్డి అని, దానిని అడ్డుకోవడానికి కృషి చేసింది కిషోర్‌చంద్రదేవ్ అని చంద్రబాబు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కులముద్ర లేదని చెప్పుకున్నారు. దేశంలో ప్రతిపక్ష నేతలపై నరేంద్రమోదీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాబోయే సీఎం జగన్ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే కుట్ర రాజకీయాలకు రుజువు అన్నారు.
హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న టీడీపీ నేతలను టీఆర్‌ఎస్ బెదిరిస్తోందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలపై విమర్శలు చేశారు. ఆ మూడు పార్టీలు ముసుగు రాజకీయాలు ఎందుకని, ముగ్గురూ కలిసి పోటీ చేస్తే సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. బీహార్ కన్సల్టెంట్ ప్రశాంత్‌కిషోర్, జగన్‌మోహన్‌రెడ్డిల ఆటలు సాగవన్నారు. తాను ఐదేళ్లుగా ప్రజల కోసం కష్టపడ్డానని, పునాదుల నుంచి రాష్ట్రాన్ని నిర్మిస్తున్నానని అన్నారు. మార్చి 1న విశాఖకు వచ్చే మోదీని రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై నిగ్గదీయాలన్నారు. కిషోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరిక సంతోషకరమన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో టీడీపీ జెండా ఎగరాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment