
సాక్షి, హైదరాబాద్: డేటా బదిలీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అక్కడి అధికారులను బలి చేయాలని చూ స్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ వ్యవహారంలో డేటా టీడీపీ సభ్యత్వానికి సంబంధించింది కాదని అది ఏపీ ప్రజ ల డేటా అని లోకమంతా తెలుసన్నారు. గురువా రం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ‘కొందరు తెలిసీతెలియక ‘ఐటీ గ్రిడ్స్’వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరిస్తున్నారు. ఏపీ మంత్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యా దు చేయడం దౌర్భాగ్యం. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి కంకణం కట్టుకున్నాయి.
టీఆర్‌ఎస్ 24 లక్షల ఓట్లను తొలగించి గెలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దొంగే దొంగ అన్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు తమ డేటా చోరీ అయిందని కొన్నిసార్లు, కాలేదని మరికొన్ని సార్లు పూటకో వైఖరితో ముందుకు సాగుతున్నారు. జర్నలిస్టు సంఘా లు ఒక కమిటీ వేసుకుని ఐటీ గ్రిడ్స్‌పై నిష్పాక్షికంగా విచారణ చేసి ప్రజలకు వాస్తవాలు చెబితే మంచిది. చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగలరు. ఆయన ట్రాప్‌లో పడి కొన్ని మీడియా సంస్థలు కూడా అలాగే చేయాలనుకుంటున్నాయి. ఏపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, వ్యవస్థల ను చంద్రబాబు ముంచేస్తారు’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment