బాబూ.. 4 ఓట్ల కోసం ఇన్ని చిల్లరేషాలా: తలసాని | Talasani Srinivas Yadav fires on Chandrababu Naidu  | Sakshi
Sakshi News home page

బాబూ.. 4 ఓట్ల కోసం ఇన్ని చిల్లరేషాలా: తలసాని

Published Sat, Apr 13 2019 12:55 PM | Last Updated on Sat, Apr 13 2019 4:44 PM

Talasani Srinivas Yadav fires on Chandrababu Naidu  - Sakshi

ఎన్టీఆర్‌ను చంద్రబాబు మర్చిపోయారేమో కానీ నిద్రలో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవరిస్తున్నారని..

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు చిల్లర వ్యక్తులకన్నా అధ్వాన్నంగా ఉందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లడగాలని, కానీ చంద్రబాబు మాత్రం నాలుగు ఓట్ల కోసం చిల్లరేషాలు వేసారన్నారు. చంద్రబాబు మొహంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని, ఆయన మాటల్లో పొంతన ఉండటం లేదన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో తలసాని మీడియాతో మాట్లాడుతూ..   దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను చంద్రబాబు మర్చిపోయారేమో కానీ నిద్రలో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలన్నీ అబద్దాలేనన్నారు. 40 ఏళ్ల సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబువి నీతిమాలిన చర్యలేనన్నారు.

తెలంగాణలో ఆంధ్రప్రజలను కొడుతున్నారని, నాయకుల ఆస్తుల విషయంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని అసత్యప్రచారానికి ఒడిగట్టారని మండిపడ్డారు. చంద్రబాబు నీతిమంతుడైతే.. తన ఆస్థులన్నీ తీసుకొని వెళ్లిపోవాలని సవాల్‌ విసిరారు. ఇక  ఈవీఎంల తీరుపై చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఎన్నికల ముందు ఒకరోజు టీవీల్లో కనిపించేందుకు ఈసీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డ్రామలాడారన్నారు. గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16 స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పరిపాలన దక్షత కారణంగానే అద్భుతమైన తీరు రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement