Bauxite
-
లండన్ కోర్టులో ఏపీ గెలుపు
సాక్షి, అమరావతి: లండన్ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. విశాఖపట్నం ప్రాంతంలో బాక్సైట్ ఒప్పందానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం, యుఏఈకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా) మధ్య ఏర్పడిన వివాదంపై లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రాష్ట్రానికి చెందిన అధికారులు, న్యాయ నిపుణులు తమ వాదనలను బలంగా వినిపించారు. భారతదేశం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపించిన వాదనలతో ఆర్బిట్రేషన్ కోర్టు ఏకీభవిస్తూ, ఈ కేసు తమ పరిధిలోది కాదని పేర్కొంటూ కొట్టేసింది. గిరిజనుల డిమాండ్ మేరకు బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రాకియాతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం రాకియా తన జాయింట్ వెంచర్ సంస్థ ఎన్రాక్తో కలిసి ఏర్పాటు చేసే అల్యూమినియం పరిశ్రమకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాక్సైట్ సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. అయితే, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన సంస్కృతికి విఘాతం ఏర్పడుతుందని ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో బాక్సైట్ సరఫరా వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెద్దగా లేదని, గిరిజన ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఇండియా, యుఏఈల మధ్య ఉన్న బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ (బీఐటీ) ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని రాకియా సంస్థ తమకు బాక్సైట్ సరఫరా చేయకపోవడం వల్ల నష్టపోయామంటూ లండన్ మధ్యవర్తిత్వ కోర్టులో కేసు వేసింది. ఏపీ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం తమకు బాక్సైట్ ఇవ్వకపోవడం వల్ల తాము అల్యూమినియం పరిశ్రమ కోసం పెట్టిన పెట్టుబడిని నష్టపోయామని, ఇందుకు నష్టపరిహారం ఇవ్వాలని వాదించింది. ఈ కేసులో దాదాపు 273 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా.. ఈ అంశంపై రాకియా సంస్థ కోర్టుకు వెళ్లక ముందే చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రభుత్వం తరఫున ప్రతినిధులు పలుసార్లు రాకియాతో సంప్రదింపులు జరిపినా అంగీకరించలేదు. దీంతో సీఎం వైఎస్ జగన్ సూచనలతో అధికారులు పకడ్బందీగా లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం నుంచి గనుల శాఖ ఉన్నతాధికారులు, ఏపీ ఎండీసీ అధికారులు, న్యాయ నిపుణులు లండన్ కోర్టులో బాక్సైట్ ఒప్పందాల రద్దు పర్యవసానాలను బలంగా వినిపించారు. లండన్ న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వినిపించిన వాదనలతో ఏకీభవిస్తూ.. ఈ కేసు తమ పరిధిలోకి రాదని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఇది అతి పెద్ద విజయమని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ‘సాక్షి’కి తెలిపారు. లండన్‌లో ఉన్న ఆయన తుది విచారణ సందర్భంగా లండన్ కోర్టుకు వెళ్లారు. తీర్పు ఏపీకి అనుకూలంగా రావడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
బాక్సైట్ తవ్వకాలపై టీడీపీ నేతల దుష్ప్రచారం
-
అవాస్తవాల ప్రచారానికి టీడీపీ, రామోజీ ఆపసోపాలు
సాక్షి, అమరావతి: నిన్నటిదాకా అక్కడ తవ్వుతున్నది లేటరైట్ కాదు... బాక్సైట్‌ను తవ్వేస్తున్నారంటూ అసత్య వార్తలు. తీరా ఆ రాతల్లో అక్షరం కూడా నిజం లేదని తేలేసరికి... ఇపుడు అది లేటరైటే కానీ... దాన్ని అక్రమంగా రోడ్డు మార్గంలో తరలించేస్తున్నారంటూ మరో కథనం!!. ఇదీ ‘ఈనాడు’ తీరు. పైపెచ్చు తవ్విన లేటరైట్‌ను కడపలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని, అది కూడా భారీ వాహనాలపై తరలించేస్తున్నారని... దాని కోసం రోడ్డుకు దగ్గర్లోనే లేటరైట్ డంప్ వేశారని... ఇలా రకరకాల పాయింట్లతో కథనాన్ని వండేసింది ఈనాడు!. నిజానికి కాస్త ఇంగితజ్ఞానం ఉన్నవారెవరికైనా ఈ రాతల్లోని డొల్లతనం ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే లేటరైట్‌ను అధికారికంగా లీజుకు తీసుకున్నపుడు... తవ్విన ఖనిజాన్ని ఒక ప్రాంతం నుంచి మరోచోటకు తరలించడం తప్పు కాదనేది జగమెరిగిన సత్యం. అందుకోసం అందుబాటులో ఉన్న మార్గాన్ని ఎంచుకోవటం కూడా తప్పేమీ కాదు. అయినా అక్కడి రోడ్డు స్థానిక గ్రామాలను కలిపేందుకు కూడా చాలా అవసరం. అలాంటి రోడ్డును లీజుదారు తానే నిర్మించుకుని, వాడుకోవటంలో తప్పేంటన్నది ‘ఈనాడు’కు, ఈ కథనాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నేతలకు మాత్రమే తెలిసిన రహస్యం. అవాస్తవాల ప్రచారానికి టీడీపీ, రామోజీ ఎన్ని ఆపసోపాలు పడుతున్నారో ఈ కథనం చూస్తే తెలియకపోదు. దారి అందరూ వినియోగించుకుంటారు... విశాఖ జిల్లా నాతవరం మండలంలో లేటరైట్‌ను తవ్వి తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలానికి భారీ వాహనాల్లో తరలించి నిల్వ చేస్తున్నారనేది కథనం సారాంశం. రౌతులపూడి మండలం జల్దాం నుంచి విశాఖ జిల్లా నాతవరం మండలం సిరిపురం వరకు రోడ్డు నిర్మించడం తప్పనేది వీళ్ల పాయింటు. అసలు ఏదో ఒక దారి లేకుండా తవ్విన ఖనిజాన్ని బయటకు తరలించడం సాధ్యమా? నిర్మించిన రోడ్డు కేవలం ఖనిజ రవాణాకే పరిమితం కాదు కదా!!. పైపెచ్చు లీజుదారు ఖనిజాన్ని వెలికితీసి అమ్ముకోవడానికి ఎక్కడో ఒకచోటుకు తరలించడం తప్పనిసరి. లీజుకు తీసుకునేదే ఖనిజాన్ని తవ్వి విక్రయించడానికి. అలాంటప్పుడు తవ్వడం, తవ్విన దాన్ని తరలించడం తప్పు ఎలా అవుతుందనేది ఇక్కడ అసలు ప్రశ్న. ఇక లీజుదారు సౌలభ్యాన్ని బట్టి ఎక్కడో ఒకచోట నిల్వ చేసుకోవడం తప్పనిసరి. అందులో భాగంగానే భమిడిక లేటరైట్ లీజు ప్రాంతంలో తవ్విన ఖనిజాన్ని రోడ్డుకు దగ్గరగా ఉండటంతో రౌతులపూడి మండలం రాఘవాపురంలో నిల్వ చేసుకున్నారు. దీనికి మైనింగ్ శాఖ అనుమతి ఉంది. ఒకవేళ అటవీ ప్రాంతంలో స్టాక్ పాయింట్ పెడితే అక్కడికి భారీ వాహనాలు వెళ్లడం వల్ల ఇబ్బంది కాదా? అదే జరిగితే వీళ్లు మరో రకంగా రాద్ధాంతం చేసి ఉండేవారని కూడా వినవస్తోంది. భారీ వాహనాల్లో కాకుండా సైకిళ్లపై తరలించాలా? భారీ వాహనాల్లో యధేచ్చగా తరలిస్తున్నారనేది ‘ఈనాడు’ ఫోటోలతో సహా చేసిన మరో ఆరోపణ. నిజానికి ఖనిజాన్ని భారీ వాహనాలైన టిప్పర్లు, లారీల్లో కాకుండా సైకిళ్లు, బైకులపై తరలిస్తారేమో రామోజీకి, చంద్రబాబుకే తెలియాలి. ఎందుకంటే వారి అనయాయుడు సుజనా చౌదరికి మాత్రమే అలా తరలించే తెలివితేటలున్నాయి కనక. మోటారు సైకిళ్లపై వందల టన్నుల స్టీల్‌ను తరలించిన ఫ్రాడ్ చరిత్ర తనకున్నది కనక. ఇక్కడ మైనింగ్ అధికారులు ఇచ్చిన పర్మిట్ల ప్రకారమే లీజుదారు స్టాక్ పాయింట్‌కు తరలిస్తుండగా... దాన్ని కూడా అక్రమమంటూ చిత్రీకరించే ప్రయత్నం చేయటం ఈనాడుకే చెల్లించదనుకోవాలి. కడపే కాదు అన్ని సిమెంటు పరిశ్రమల్లో లేటరైటే ఈ ఖనిజాన్ని కడప సిమెంట్ పరిశ్రమకు తరలిస్తున్నట్లు టీడీపీ నేతలు పదేపదే విమర్శించటం... ఈనాడు రాయటం కూడా విచిత్రమే. ఎందుకంటే ఖనిజాన్ని తవ్విన తర్వాత లీజుదారు పరిశ్రమలకు అమ్ముకోకుండా ఏం చేస్తారు? కడపలోని సిమెంటు పరిశ్రమలే కాదు రాష్ట్రంలోని అన్ని సిమెంటు పరిశ్రమలకూ కొంత లేటరైట్ కావాలి. సిమెంటు తయారీలో దీన్ని కూడా వినియోగించాల్సి ఉంటుంది. కాకపోతే అది ఒక శాతం లోపే. కాబట్టి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని సిమెంట్ పరిశ్రమలు ఈ లేటరైట్‌ను కొంటున్నాయి. అవన్నీ వదిలేసి కడప సిమెంటు పరిశ్రమలకు తరలిస్తున్నారని పేర్కొనటం పెద్ద కుట్రేనన్నది పరిశీలకుల మాట. ఇవన్నీ ఒకెత్తయితే మొన్నటివరకు బాక్సైట్ తవ్వకాలు జరిగిపోతున్నాయని హైడ్రామా నడిపిన వారంతా అసలు అక్కడ ఆ ఖనిజమే లేదని నిరూపణ కావడంతో కంగుతిని ఈ కొత్త నాటకానికి తెరతీశారన్నది వాస్తవంగా కనిపిస్తోంది. అది లేటరైటేనని ఒప్పుకుంటూనే... ఖనిజాన్ని తవ్వడం, తరలించడం, నిల్వ చేయడం లాంటి సాధారణ అంశాలు కూడా అక్రమమనే వింత ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం. లేటరేట్ దారి మళ్లలేదు.. అంతా సక్రమమే – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ అన్ని అనుమతులు తీసుకుని రౌతులపూడి ప్రాంతంలో లీజుదారే రోడ్డు నిర్మించుకున్నారు. అందులో అక్రమం ఏమీ లేదు. మైన్‌లో నుంచి మెటీరియల్ తీసుకువెళ్లి స్టాక్ పాయింట్లో నిల్వ చేసుకున్నారు. స్టాక్ పాయింట్‌కు అనుమతి ఉంది. నిబంధనల ప్రకారం కూడా మైనింగ్ చేసుకోకూడదంటే ఎలా? మైనింగ్ ప్రాంతానికి వెళ్లి ధర్నా చేయడం సరికాదు. మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమ మైనింగ్‌ను మేమెందుకు ప్రోత్సహిస్తాం? ఏదో జరిగిపోతోందని అమాయకులైన గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదు. పర్మిట్ల ప్రకారమే ఖనిజాన్ని తరలిస్తున్నారు. ఎక్కడా ఉల్లంఘన జరగలేదు. ఇంతకుముందు బాక్సైట్ తవ్వుతున్నారని ఆరోపణలు చేశారు. అందులో నిజం లేదని మేం నిరూపించడంతో ఇప్పుడు దారి మళ్లిస్తున్నారని అంటున్నారు. మైనింగ్ జరక్కుండా ఆపాలన్నది వాళ్ల ఉద్దేశం కావచ్చు. దానివల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది. పరిశ్రమలకు మెటీరియల్ కొరత ఏర్పడుతుంది. సక్రమంగా ఉన్నా ఏదో ఒక ఆరోపణ చేయడం సరికాదు. అక్రమ మైనింగ్ జరిగితే ఉక్కుపాదంతో అణచివేస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
అభివృద్ధి పేరిట మా ప్రాంతాన్ని బలోపేతం చేశారు
-
బాక్సైట్ లైసెన్సులు రద్దు చేసింది నేనే..
సాక్షి, అమరావతి: బాక్సైట్ లైసెన్సులు రద్దు చేసింది తానేనని, బాక్సైట్ లీజుల విషయంలో టీడీపీపై బురద జల్లుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సీఎం నివాసం వద్ద ప్రజావేదిక హాలులో ఆదివారం కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కు పచ్చ కండువా వేసి చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు కారకుడు రాజశేఖర్‌రెడ్డి అని, దానిని అడ్డుకోవడానికి కృషి చేసింది కిషోర్‌చంద్రదేవ్ అని చంద్రబాబు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కులముద్ర లేదని చెప్పుకున్నారు. దేశంలో ప్రతిపక్ష నేతలపై నరేంద్రమోదీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాబోయే సీఎం జగన్ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే కుట్ర రాజకీయాలకు రుజువు అన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న టీడీపీ నేతలను టీఆర్ఎస్ బెదిరిస్తోందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలపై విమర్శలు చేశారు. ఆ మూడు పార్టీలు ముసుగు రాజకీయాలు ఎందుకని, ముగ్గురూ కలిసి పోటీ చేస్తే సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. బీహార్ కన్సల్టెంట్ ప్రశాంత్‌కిషోర్, జగన్మోహన్రెడ్డిల ఆటలు సాగవన్నారు. తాను ఐదేళ్లుగా ప్రజల కోసం కష్టపడ్డానని, పునాదుల నుంచి రాష్ట్రాన్ని నిర్మిస్తున్నానని అన్నారు. మార్చి 1న విశాఖకు వచ్చే మోదీని రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై నిగ్గదీయాలన్నారు. కిషోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరిక సంతోషకరమన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో టీడీపీ జెండా ఎగరాలని కోరారు. -
బాక్సైట్ పోరాటంలో గిరిజనులకు అండ
అనంతగిరి, డుంబ్రిగుడ (అరకులోయ): బాక్సైట్ పోరాటంలో గిరిజనులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం గాలికొండ వ్యూ పాయింట్ నుంచి బాక్సైట్ కొండను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రకృతికి విఘాతం కల్గించే పనులకు పాల్పడితే సహించేది లేదని, గిరిజనులకు అండగా పోరాటం చేస్తామని తెలిపారు. అనంతరం ఎగుశోభ పంచాయతీ భీసుపురం గ్రామంలో గిరిజనులతో ముఖముఖి మాట్లాడారు. హుద్‌హుద్ తుపాను సాయం చాలా మందికి అందలేదని గిరిజనులు ఆయనకు వివరించారు. బాక్సైట్ తీయడం వల్ల సుమారు 300 గ్రామాల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, బాక్సైట్ తీసేందుకు ఇచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయించేలా చూడాలని కోరారు. బాక్సైట్‌పై గిరిజనులు పోరాటం సాగించాలని.. అండగా నిలబతామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆంత్రాక్స్ బాధితులకు పరామర్శ కునిడి, పోతంగి, తోటవలస, కొత్తవలస గిరిజన గ్రామాలను సందర్శించిన పవన్‌కల్యాణ్.. పోతంగిలో ఆంత్రాక్స్ బాధితులను పరామర్శించారు. గిరిజన ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, గిరిజన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. డుంబ్రిగుడలోని కస్తూర్బాగాం«ధీ బాలికల పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. -
లేటరైట్ ముసుగులో బాక్సైట్ లూటీ
-
రూ.30 వేల కోట్ల స్వాహాకు సర్కారు పెద్దల స్కెచ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.30 వేల కోట్ల లూటీకి సర్కారు పెద్దలు స్కెచ్ వేశారు. విశాఖ జిల్లాలో లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీకి పక్కాగా వ్యూహం పన్నారు. అత్యంత విలువైన బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నిబంధనల ప్రకారం అనుమతుల్లేవు. దీంతో అక్కడున్న ఖనిజం బాక్సైట్ కాదు, లేటరైట్ అంటూ ధ్రువపత్రాలు తెచ్చుకుని తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకు మినీ మైనింగ్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ ముసుగులో లీజులు దక్కించుకునేందుకు 30 మంది బినామీలతో దరఖాస్తులు చేయించారు. ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న ఆ ఫైల్‌కు నేడో రేపో ఆమోదముద్ర పడనుంది. విశాఖ జిల్లాలో ఒక్క పంచాయతీలోనే రూ.30 వేల కోట్లకు పైగా విలువైన బాక్సైట్‌ను కొల్లగొట్టేందుకు సాగుతున్న కుతంత్రమిది.. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీలోని సుందరకోట, అసనగిరి, బమిడికలొద్ది, తొరడ గ్రామాల్లో 2 కోట్ల టన్నులకు పైగా బాక్సైట్ ఖనిజ నిక్షేపాలున్నాయి. దేశంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వరంగ సంస్థలకే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అనుమతులివ్వడానికి వీల్లేదు. ముడి ఖనిజంలో అల్యూమినియం 40 శాతంలోపు ఉంటే లేటరైట్‌గా, అంతకు మించి ఉంటే బాక్సైట్‌గా పరిగణిస్తారు. లేటరైట్‌ను సిమెంట్ తయారీలో, బాక్సైట్‌ను అల్యూమినియం తయారీకి ఉపయోగిస్తారు. నాలుగేళ్లలో ఖనిజం మారిపోయింది సుందరకోట గ్రామంలోని ఖనిజంలో అల్యూమినియం 40 శాతంలోపే ఉందని, అందువల్ల తమకు లేటరైట్ తవ్వకాలకు అనుమతివ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన సింగం భవానీ గతంలో మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అధికారులు అక్కడున్నది లేటరైట్ కాదు, బాక్సైట్ అని నిర్ధారించారు. ఆమె దరఖాస్తును 2010 ఏప్రిల్‌లో తిరస్కరించారు. కానీ, విచిత్రంగా నాలుగేళ్ల అనంతరం ఆ ప్రాంతంలో ఉన్నది లేటరైట్‌గా పేర్కొంటూ అధికారులు 2014 ఫిబ్రవరి 3న సుందరకో టలో 4.97 హెక్టార్లలో 20 ఏళ్లపాటు తవ్వకాల కు ఆమెకు అనుమతులిచ్చేశారు. దీంతో అప్పటి నుంచి లీజుదారు లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వేస్తున్నారు. ఒడిశాలోని వేదాంత అల్యూమినియం కర్మాగారానికి సరఫరా చేస్తున్నారు. దాదాపు 1.50 లక్షల టన్నుల బాక్సైట్‌ను తవ్వి తరలించేశారని అంచనా. వాటాలివ్వకుంటే అంతేమరి! 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్దల కళ్లు బాక్సైట్ నిక్షేపాలపై పడ్డాయి. లీజుదారు సింగం భవానీని భారీగా వాటాలడిగారు. బేరం కుదరకపోవడంతో అధికార బలం ప్రయోగించారు. భవానీకి అనుకూలంగా పంచాయతీ సర్పంచ్ ఏకపక్షంగా ఎన్ఓసీ ఇచ్చారంటూ టీడీపీ నేతలు అప్పటి కలెక్టర్ యువరాజ్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కలెక్టర్ పంచాయతీ తీర్మానం బోగస్ అని తేల్చారు. 2015 డిసెంబర్లో భవానీ లీజును రద్దు చేశారు. కానీ, బమిడికలొద్ది, తొరడ గ్రామాల్లో తవ్వకాలకు టీడీపీ నేతల బినామీలు చేసుకున్న దరఖాస్తులకు మాత్రం అనుమతిలిచ్చేశారు. తేలని వాటాలు.. ఆగిన తవ్వకాలు తొరడలో 20 లక్షల టన్నుల ఖనిజ నిల్వలున్న 25 హెక్టార్లను విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పిట్టాచలం గ్రామస్తుడు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు కిల్లో లోవరాజుకు 2015లో 20 ఏళ్లపాటు లేటరైట్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు. దాంతో అప్పటినుంచి అక్కడ లేటరైట్ పేరిట బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక బమిడికలొద్దిలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో లేటరైట్ తవ్వకాలకు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు జర్తా లక్ష్మణరావుకు లీజు అనుమతిలిచ్చారు. ఈ లీజు విషయంలో టీడీపీ నేతల మధ్య వాటాల కోసం విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటాల వంచాయతీ తేలకపోవడంతో తవ్వకాలు మొదలు కాలేదు. లేటరైట్కే లీజులిచ్చాం.. ‘‘విశాఖ జిల్లా సరుగుడు పంచాయతీ పరిధిలో ఉన్నది లేటరైట్గానే గుర్తించి తవ్వకాలకు అనుమతులిచ్చాం. గతంలో ఆ ప్రాంతంలో ఉన్నది లేటరైట్ కాదు, బాక్సైట్ అని మైనింగ్ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల గురించి నాకు తెలియదు. ప్రస్తుతం తొరడ గ్రామంలో లేటరైట్ మైనింగ్ జరుగుతున్న మాట వాస్తవమే’’ – సూర్యచంద్రరావు, అసిస్టెంట్ డైరెక్టర్, మైనింగ్ శాఖ -
బాక్సైట్ కోసమే అవుట్ పోస్టులు
► త్వరలో అన్ని సంఘాలతో కలిసి ఆందోళన ► గిరిజన సమాఖ్య నేతలు కొయ్యూరు(పాడేరు): మావోయిస్టులను అడ్డుకునేందుకే మన్యంలో అవుట్‌పోస్టుల ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికా రులు చెబుతున్నా, దాని వెనక బాక్సైట్‌ను తరలించుపోయే పన్నగం ఉందని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు గోకిరి చిన్నారావు,మండల పీసా కమిటీ కోశాధికారి స్వామి నాయుడు ఆరోపించారు. మావోయిస్టులు తగ్గిపోయారని పోలీసులే చెబు తున్నారని, అదే పోలీసులు మావో యిస్టులను అడ్డుకునేందుకు అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. వారు శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. చింతపల్లి డీఎస్పీ అనీల్ మాట్లాడుతూ రాళ్లగెడ్డలో ఇది వరకు ఏర్పాటు చేసిన అవుట్‌పోస్టు,త్వరలో ఏర్పాటు చేయనున్న తూరుమామిడి అవుట్‌పోస్టులు మావోయిస్టులు,గంజాయి స్మగ్లర్లను అడ్డుకోవడం కోసమే నని కోసం తెలిపారన్నారు.ఎవరైనా అవుట్‌పోస్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని గంజాయి స్మగ్లర్లు, మావోయిస్టులకు సహకరిస్తున్నట్టుగా చిత్రీకరిస్తూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. బాక్సైట్ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది తప్ప పూర్తిగా కాదన్నారు. బాక్సైట్ తవ్వేందుకు రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను రద్దు చేయలేదని తెలిపారు.ఈ జీవో రద్దు కాకపోవడంతో గిరిజనుల్లో నేటికీ బాక్సైట్ భయం ఉందన్నారు. త్వరలో అన్ని సంఘాలను కలుపుకొని అవుట్ పోస్టులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని తెలిపారు. ఖనిజాల తరలింపు కోసమే... పాడేరు రూరల్ : ఏజెన్సీలో ఏ కట్టడమైన, తవ్వకాలైన పీసా కమిటీలు, గ్రామ పంచాయతీల అనుమతితోనే చేయాలని, కానీ అందుకు విరుద్ధంగా పోలీసులు ఔట్‌పోస్టులు నిర్మించడం చట్టాన్ని ఉల్లఘించడమేనని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు ఔట్‌పోస్టుల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. గతంలో కూడా ఏజెన్సీలో ఔట్‌పోస్టులు ఉండేవని, కానీ అభివృద్ధి›మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని తెలిపారు. బాక్సైట్, లేట్రైట్, గ్రానైట్, రోడ్మెటల్ తరలించుకుపోయే గ్రీన్‌హంట్ మాఫీయాను కాపాడడానికే ఈ ఔట్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన ప్రాంతంలో సమస్యల గురించి ప్రశ్నిస్తే మావోయిస్టుల సానుభూతిపరులుగా, గంజా యి స్మగ్లర్లుగా చిత్రీకరించడం తగదని పేర్కొన్నారు. -
బాక్సైట్ కోసమే గిరిజన ఎమ్మెల్యేల కొనుగోలు
మాజీ స్పీకర్ మనోహర్ చింతపల్లి: మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నార మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలోనే మన్యం ఖనిజ సంపదపై కన్నేశారన్నారు. విదేశీ కంపెనీలతో తవ్వకాలకు ఒప్పందం కుదుర్చుకుని బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నిచడంతో గిరిజనులు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయని, దీంతో చంద్రబాబు వెనక్కు తగ్గారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారని, అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలకు తెరలేపారని విమర్శించారు. గిరిజనులు ఆందోళన చేయడంతో పాత జీవోలను రద్దుచేసిన చంద్రబాబు, కొత్త జీవో రద్దు చేయకుండా ఇంతకాలం గిరిజనులను మభ్యపెట్టారని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రకటనతో అసలు రూపం బయట పడిందని చెప్పారు. గిరినాభివృద్ధికి బాక్సైట్ తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం లేదని, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగిస్తే గిరిజన ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు తాను మచ్చలేని వ్యక్తినని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెపుతుంటారని, విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు ఎక్కడ నుంచి వస్తున్నాయని మనోహర్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే సంతల్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని నీతులు వల్లించిన చంద్రబాబు, ఇక్కడ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఉగ్రంగి లక్ష్మణరావు, సర్పంచ్‌లు సాగిన దేవుడమ్మ, అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అసలు విషయాన్ని బయటపెట్టిన రావెల
బాక్సైట్ జీవో రద్దుచేయలేదని బయటపెట్టిన మంత్రి మోదకొండమ్మ జాతర సాక్షిగా బయటపడిన టీడీపీ కుట్ర కలవరపడుతున్న గిరి పుత్రులు మన్యంలో మళ్లీ రగులుకుంటున్న బాక్సైట్ ఉద్యమం అమాయక గిరిజనంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అమ్మవారి జాతరను అడ్డుపెట్టుకున్నారు.. ప్రభుత్వ ఉత్సవంగా గుర్తించామంటూనే మన్యంలో సంతోషాన్ని లాగేసుకున్నారు.. నాడు ఆదివాసీ దినోత్సవం వేదికగా బాక్సైట్ తవ్వుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే, నేడు గిరిజన ఉత్సవం సందర్భంగా మంత్రి రావెల కిశోర్‌బాబు అదే మాటను పునరుద్ఘాటించారు. బాక్సైట్‌పై అడవి బిడ్డలు చేసిన పోరాటాలు, త్యాగాలకు తలొగ్గి వెనక్కు తగ్గినట్లు ఇన్నాళ్లూ నటించిన ప్రభుత్వం తెరవెనుక కుట్రలు బయటపడుతున్నాయి. విశాఖపట్నం : బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.97ను గిరిజనులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా పార్టీ యంత్రాంగం చేసిన బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం నేపధ్యంలో తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్యమం సద్దుమణిగింది. ఇక బాక్సైట్ జోలికి ప్రభుత్వం రాదనుకునే సంతోషంతో గిరిజనులు మోదకొండమ్మ అమ్మవారి జాతర జరుపుకుంటున్నారు. ఈ జాతరకు వచ్చిన రాష్ర్ట గిరిజన శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు బాక్సైట్ గురించి అక్కడ ఏమీ మాట్లాడలేదు. పైగా గిరిజనులు అడవిని కాపాడుకోవడం వల్లనే పచ్చగా ఉన్నారని తేనె పలుకులు పలికి వెళ్లిపోయారు. జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించామని, రూ.50 లక్షలను నిర్వహణ ఖర్చులుగా ప్రభుత్వం ఇస్తోందని ప్రకటించారు. కానీ ఆ ఆనందాన్ని గిరజనులకు ఆయన ఎంతో సేపు నిలువనివ్వలేదు. నర్సీపట్నం వెళ్లగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. తవ్వకాల కోసం జారీ చేసిన జీవోను రద్దు చేయలేదని, గిరిజనుల ఆమోదం తోనే బాక్సైట్ తవ్వకాలకు ముందుకు వెళతామన్నారు. సోమవారం కూడా అరకులో ఇవే వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా బాక్సైట్ తవ్వుతున్నామనే విషయాన్ని కూడా గిరిజనులు సంతోషంగా జరుపుకుంటున్న ఆదివాసీ ఉత్సవాల్లోనే చంద్రబాబు ప్రకటించి చిచ్చు పెట్టారు. మళ్లీ అదే విధంగా గిరిజనుల ఆనందాన్ని హరించేలా వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంపైనా కుట్ర అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం వెనుక కూడా ప్రభుత్వ కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యవహరిస్తున్నారు. ఆమె నేతృత్వంలోనే జాతర ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. కనీవినీ ఎరుగని రీతితో అత్యంత వైభవంగా జాతర జరిపేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం గురించి తెలుసుకున్న ప్రభుత్వం జాతర విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావించింది. అంతేకాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాధాన్యాన్ని తగ్గించాలనుకుంది. మరోవైపు రూ. 50 లక్షలు ఇవ్వడం ద్వారా గిరిజనులకు తామోదో మేలు చేస్తున్నట్లు చూపించి, ఇదే అదునుగా బాక్సైట్ తవ్వకాలకు మళ్లీ అంకురార్పణ చేయాలని కుట్ర పన్నింది. అదే రావెల వ్యాఖ్యల్లో బయటపడింది. ఎమ్మెల్యేకు ఎరవేసింది ఇందుకేనా! అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల టీడీపీలోకి జంపయిన విషయం తెలిసిందే. భారీగా ముడుపులు ఆశచూపి ఆయనను చేర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే ముడుపులతో పాటు బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకించకుండా ఉండేలా చేయడం కూడా కిడారి చేరికలో భాగమని తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన కిడారి సొంత నియోజకవర్గంలో బాక్సైట్‌కు అనుకూలంగా మంత్రి మాట్లాడే ధైర్యం చేయడం వెనుక కుట్ర ఇదేనని గిరిజనులు భావిస్తున్నారు. కేవలం రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు చేస్తున్న కుట్రలకు కిడారి వంటి గిరిజన ద్రోహులు చేస్తున్న ప్రయత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమని, అవసరమైతే మళ్లీ బాక్సైట్ ఉద్యమ దివిటీని రగిలిస్తామని వారు అంటున్నారు. ఏది ఏమైనా గిరిజనులు అత్యంత పవిత్రంగా, సంతోషంగా జరుపుకునే మోద కొండమ్మ జాతర సమయంలో వారి జీవితాలను చిదిమేయాలనే ప్రభుత్వ కుట్రలు బయటపడటం మన్యంలో కలకలం రేపింది. -
బాక్సైట్ తవ్వబోమని తీర్మానం చేద్దాం
పద్దులపై చర్చలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సాక్షి, హైదరాబాద్: ‘రాబోయే కాలంలో బాక్సైట్ తవ్వబోమని, గిరిజనుల పక్షాన నిల బడతామని, పర్యావరణాన్ని కాపాడతామని శాసనసభలో తీర్మానం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి’ అని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. -
అసలు మంత్రే లేకపోతే ఎలా: రఘువీరా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి హెచ్చిరించారు. జీవో రద్దుకై మే నెలలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏజెన్సీలో పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం మైనార్టీలను మోసగిస్తోందని, అసలు మైనార్టీ మంత్రే లేకుండా వారికి ఫలాలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించారు. ఆదివారం విశాఖలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనారిటీల న్యాయ సాధికారత యాత్రను రఘువీరా ప్రారంభించారు. బీఆర్ అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘువీరా మాట్లాడారు. ఈ యాత్ర ఏప్రిల్ 25న కర్నూలులో ముగుస్తుందన్నారు. యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 125 అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. -
ఖాకీల తీరుతో కలకలం
పోలీసులు, మావోయిస్టుల ఆధిపత్య పోరులో సమిధలవుతున్న గిరిజనం మాజీ సర్పంచ్ హత్య సంఘటనలో గిరిజనులను నిర్బంధించిన పోలీసులు తమ వారిని విడిచిపెట్టాలని విలపించిన కుటుంబసభ్యులు బాధితల వేదన చూసి కంటతడిపెట్టిన ఎమ్మెల్యే ఈశ్వరి విశాఖపట్నం/చింతపల్లి: మన్యంలో బాక్సైట్ వ్యవహారం గిరిజనుల స్వేచ్ఛకు, మనుగడకు భంగం కలిగిస్తోంది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం సాగిస్తున్న గిరిజనులకు అడుగడుగునా నిర్బంధాలు ఎదురవుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో 97ను జారీ చేసిన నేపథ్యంలో మావోయిస్టులు మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరు సాగిస్తున్నారు. తాజాగా ఈ బాక్సైట్ వ్యవహారంలో ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరు మొదలవడంతో గిరిజనులకు ప్రాణసంకటంగా మారింది. అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల చర్యల మూలంగా గిరిజన నలిగిపోతున్నారు. బాక్సైట్ వ్యవహారంలో మావోయిస్టులు టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ సాగిన వెంకటరమణను హత్య చేసిన ఘటనపై పోలీసులు పలు గ్రామాల గిరిజనులను అదుపులోకి తీసుకొని నిర్బంధించారు. దీంతో చింతపల్లి ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో పోలీసు యంత్రాంగం ఇదే తరహాలో వ్యవహరించి తీవ్ర వైఫల్యాలను చవిచూసి తమ పంథా మార్చుకున్నారు. గిరిజనులతో మైత్రికి ప్రయత్నించి గిరిజనుల్లో ధైర్యాన్ని నింపి ఏడాదిగా మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. అయితే గత అనుభవాలను, గిరిజనులతో మైత్రిని విస్మరించి పోలీసులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. తెల్లారకముందే గ్రామాల్లోకెళ్లి అనుమానితులుగా భావించి గిరిజనులను తీసుకొచ్చే ఒరవడి ప్రారంభించడంతో విశాఖ మన్యం ఒక్కసారిగా వేడెక్కింది. గిరిజనులతో మైత్రి బూటకమా? ఇంతకాలం గిరిజనులతో మైత్రి పేరిట చేసిన సేవలన్నీ మావోయిస్టుల కట్టడికోసమేనా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మావోయిస్టులు ఎంతోమందిని ఇన్ఫార్మర్ల పేరిట హత్య చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో భాగంగా జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ రవిశంకర్‌ను, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఉగ్రంగి సోమలింగంను మావోయిస్టులు కాల్చి చంపారు. ఆయితే ఏ సంఘటనలోనూ ఏజెన్సీ పోలీసు యంత్రాంగం గిరిజనులను ఈ హత్యలకు బాధ్యులను చేస్తూ ఎవరినీ వే ధించిన దాఖలాలు లేవు. నేరుగా మావోయిస్టులనే టార్గెట్ చేస్తూ గిరిజనుల మద్దతుతో మావోయిస్టు కార్యకలాపాలకు అడుగడుగునా కళ్లెం వేస్తూ గిరిజనుల మన్ననలు పొందిన పోలీసుల తీరు వెంకటరమణ హత్య సంఘటనలో పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి హోంగార్డు వరకు గిరిజనులతో చెలిమికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. దీనికి ప్రతిఫలంగా మావోయిస్టు కార్యకలాపాలకు కంచుకోటగా ఉండే చింతపల్లి మండలం కోరుకొండ నడిబొడ్డులో మావోయిస్టు నాయకుడు శరత్‌ను గిరిజనుల మట్టుపెట్టి ఏకే47 తుపాకీతో సహా పోలీసులకు అప్పగించారు. దీనిని అప్పటి డీజీపీ ఓ శుభపరిణామంగా పేర్కొన్నారు. మరి మావోయిస్టులు నేడు చేసిన హత్యా నేరాన్ని గిరిజనులపై రుద్ది, చిత్రహింసలకు గురిచేస్తూ గిరిజనులను గ్రామాల నుంచి తీసుకువచ్చి ఇంటరాగేషన్ పేరిట ఎక్కడుంచారో కూడా తెలియని ఆందోళనకర పరిస్థితిని ఎందుకు సృష్టిస్తున్నారో? అంతుచిక్కడం లేదని బాధిత కుటుంబాలు విలపిస్తున్నాయి. విలపించిన బాధిత కుటుంబాలు మావోయిస్టులు సాగిన వెంకటరమణను హత్య చేసిన నేపథ్యంలో మూడు రోజులుగా పోలీసులు జర్రెల, అసంపల్లి, కోండ్రుపల్లి, గిల్లగొంది గ్రామాల నుంచి 28 మందిని నిర్బధించారని బాదిత కుటుంబాలతోపాటు ఆయా గ్రామాల గిరిజనులు సోమవారం చింతపల్లి చేరుకున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలీసు స్టేషన్ మెయిన్ గేటువద్ద తమ వారిని వదిలిపెట్టాలంటూ విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. చంటి పిల్లల్ని చంకన పెట్టుకొని పస్తులతో వారు పడిన బాధలు వర్ణనాతీతం. ‘అయ్యా మాకేపాపం తెలియదు.. నా భర్తను మూడు రోజులుగా నిర్బంధించారు.. ఒక్కసారి చూడనీయండంటూ జెర్రెల ఎంపీటీసీ ఉగ్రంగి జగ్గమ్మ .. బాబూ నా కొడుకును ఒక్కసారి చూపించండి అంటూ ఓ తల్లి... నా ఏడాది పాప నాన్నకోసం ఏడుస్తోంది నన్ను అతని దగ్గర కు పంపండి’ అంటూ ఓ మహిళ రోదించారు. కంటతడిపెట్టిన ఎమ్మెల్యే ఈ సంఘటన తెలుసుకొని చింతపల్లి చేరుకొన్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని బాధిత గ్రామాల గిరిజనులంతా చుట్టుముట్టి బోరున విలపించారు. పోలీసులు తమవారిని ఎత్తుపోయారంటూ ఆవేదనకు లోనయ్యారు. దీంతో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సైతం వారితో పాటు విలపించడంతో అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ బాధలోనే ఆమె పోలీసు అధికారులకు ఫోన్ చేసి అయ్యా మా గిరిజనులకు ఈ దుస్థితి నుంచి విముక్తి కలింగించండంటూ దగ్ధద స్వరంతో ప్రాధేయ పడ్డారు. ఇంత అన్యాయం ఏమిటని, ప్రజాస్వామ్యంలో ఉన్న గిరిజనులపై ఇంతటి నిర్బంధ వాతావరణం ఏమటని వాపోయారు. -
బాక్సైట్ వివాదం కొత్త మలుపు
-
బాక్సైట్ వివాదం కొత్త మలుపు
జీవో-97ను రద్దు చేయాలంటూ జెర్రెల పంచాయతీ తీర్మానం తవ్వకాలు గిరిజన హక్కులకు భంగకరమని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ‘బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు సర్కారు గత నవంబరు 5వ తేదీన జారీ చేసిన జీవో 97వల్ల గిరిజనుల ఉపాధికి గండి పడుతుంది. ఇది అమలైతే గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుంది. అందువల్ల తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలి.’ అని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లాలోని జెర్రెల గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల వారు డిసెంబర్ 23వ తేదీన ఈ మేరకు తీర్మానం చేశారు. 28వ తేదీన మొత్తం గ్రామ పంచాయతీ సమావేశమై మళ్లీ ఇదే అంశాలపై ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి తాజాగా ప్రభుత్వానికి పంపించింది. గ్రామపంచాయతీ తీర్మానం ప్రతులు గిరిజన సంక్షేమం, భూగర్భ గనులు, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులకు అందాయి. దీంతో బాక్సైట్ వివాదం కొత్త మలుపు తిరిగినట్లయింది. గిరిజన గ్రామ పంచాయతీ తీర్మానాన్ని కాదని ముందుకెళితే ఇబ్బంది అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు. విశాఖ జిల్లా జెర్రెల, చింతపల్లి బ్లాకుల్లోని 3,030 ఎకరాల అభయారణ్యాన్ని బాక్సైట్ మైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి బదలాయిస్తూ చంద్రబాబు సర్కారు గత ఏడాది నవంబరు 5న జీవో 97 జారీ చేయడంపై గిరిజనులు, గిరిజన సంఘాలు మండిపడుతున్న విషయం విదితమే. ఈ జీవోను రద్దు చేయకపోతే తాము గ్రామాల్లోకి వెళ్లడం ఇబ్బందవుతుందని విశాఖ జిల్లాలోని కొందరు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో జీవో 97ను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసెంబ్లీలో ప్రకటించారు. అయితే తన సర్కారు జారీ చేసిన జీవో 97 గురించి మాత్రం ప్రస్తావించనేలేదు. బాక్సైట్ తవ్వకాలు జరపరాదని గిరిజనులు డిమాండు చేస్తుంటే జీవో 97ను రద్దు చేయకుండా బాక్సైట్ సరఫరా ఒప్పందాలను రద్దు చేయడంలో అర్థమే లేదు... జీవో 97ను రద్దు చేయాలని విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, రాజన్న దొర కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో బాబు సర్కారు కుటిల యత్నాలను గుర్తించిన జెర్రెల గ్రామ పంచాయతీ సమావేశమై జీవో 97ను రద్దు చేయాల్సిందేనని తీర్మానం చేసి పంపింది. ముందరికాళ్లకు బంధం వేసినట్లే.. జెర్రెల గ్రామపంచాయతీ తీర్మానంతో ప్రభుత్వ ముందరికాళ్లకు బంధం వేసినట్లయిందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీవో 97ను రద్దు చేయకతప్పని పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. ‘గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా గ్రామసభ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు జీవో 97ను రద్దు చేయాలని, ఇక్కడ మైనింగ్ జరపరాదని గ్రామసభ తీర్మానం చేసి కాపీని ప్రభుత్వానికి పంపింది. దీనిని కాదని ముందుకు వెళ్లడమంటే గ్రామపంచాయతీ నిర్ణయాన్ని తోసిపుచ్చినట్లవుతుంది. ఇది న్యాయపరంగా వివాదమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో తెలియాల్సి ఉంది’ అని గిరిజన సంక్షేమశాఖకు చెందిన ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
మంత్రి, ఎంపీ డుమ్మా
నామమాత్రంగా ఐటీడీఏ సమావేశం గిరిజన సమస్యలపై సాగని చర్చ మన్యంలో అభివృద్ధి పనుల తీరుపై పాడేరు, అరకు ఎమ్మెల్యేల అసంతృప్తి పాడేరు: ఈ ఏడాది గత రెండుసార్లు బాక్సైట్ రభసతో ర ద్దయిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఈసారి కొనసాగినప్పటికీ నామమాత్రంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ అధ్యక్షతన సోమవారం వైటీసీ కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులుగా ఉన్న గిరిజన సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు, అరకు ఎంపీ కొత్తపల్లి గీతతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం హాజరుకాలేదు. గిరిజన సమస్యలపై పూర్తిస్థాయి చర్చ కొనసాగలేదు. 25 అజెండా అంశాలపై చర్చ సాదాసీదాగా సాగిపోయింది. నాలుగు గంటల వ్యవధిలోనే సమావేశం ముగిసిపోయింది. ప్రధానంగా విద్య, వైద్యం, ఇంజనీరింగ్ శాఖల పథకాలపై చర్చ కొనసాగింది. ఏజెన్సీలో నత్తనడకన సాగుతున్న ప్రగతిపై పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ పథకాల కింద 2012-13 నుంచి ఇప్పటి వరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ కు 2162 పనులు మంజూరైతే 1285 పనులు మాత్రమే పూర్తికావడం, 194 పనులు ప్రారంభించకపోవడం, పీఆర్ ఇంజనీరింగ్‌లో 2876 పనులు మంజూరైతే నేటికీ 980 పనులు చేపట్టకపోవడం, 621 పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీలో అంగన్వాడీ భవనాలు, రోడ్ల నిర్మాణం, చెక్‌డ్యాం మరమ్మతు పనులు స్తంభించాయని, వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు పలు ప్రతిపాదనలు చేశారు. పాడేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో వికలాంగుల కోసం సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలని, గిరిజనుల్లో రక్తహీనతపై వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, జననీ సురక్ష ప్రోత్సాహక సొమ్ము చెల్లింపు, సీఆర్టీలకు కనీస వేతనాల మంజూరు, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఏజెన్సీలో గ్రావిటీ పథకాలు సరిగా పని చేయడం లేదని, కాంట్రాక్టర్ల కోసమే ఈ పథకాలు కొనసాగుతున్నాయని, పనుల్లో నాణ్యత లేదని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఏజెన్సీలోని ఏరియా ఆస్పత్రులలో గైనకాలజిస్ట్, చిల్డ్రన్ స్పెషలిస్ట్‌ల నియామకం, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం/హెల్త్ అసిస్టెంట్లను నియమించాలని, కేజీహెచ్‌లోని ఎస్టీసెల్‌లో పనిచేసే గిరిజన కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పీహెచ్సీలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్, పీవోల దృష్టికి తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్యశాఖలో చాలా పోస్టులు ఖాళీ ఉంటున్నాయని, వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించాలన్నారు. సీసీడీపీ పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోందని, పనులు పూర్తికాకపోతే టెండర్లు రద్దు చే యాలన్నారు. మన్యంలో కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి పాడేరు: ‘రాష్ట్రంలో పాడేరు ఐటీడీఏ అతి పెద్దది.. నేటికీ విశాఖ ఏజెన్సీలో 1336 గ్రామాలకు ప్రభుత్వ పథకాలు చేర్చడం సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి.. దీన్ని అధిగమించేందుకు రోడ్డు నిర్మాణం, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు దృష్టి పెడుతున్నాం’ అని కలెక్టర్ ఎన్.యువరాజ్ చెప్పారు. సోమవారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో 11 మండలాల్లో అభివృద్ధి పథకాల పర్యవేక్షణకు ఏడాదికి రెండుసార్లు జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. 3 నెలలకు ఒకసారి నిర్వహించే ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి జిల్లాస్థాయి అధికారులంతా కచ్చితంగా హాజరుకావాలని చెప్పారు. డ్వామా, ఆర్టీసీ, జీసీసీ, టూరిజం శాఖలను ఐటీడీఏ పాలకవర్గంలో సభ్యులుగా చేర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. అటవీ నిబంధనల కారణంగా నిలిచిపోయిన 28 రోడ్లకుగాను 16 రోడ్లను పూర్తి చేసేందుకు అనుమతి లభించిందన్నారు. విద్యుత్ కనెక్షన్లు కారణంగా ప్రారంభానికి నోచోకోని 10 మంచినీటి పథకాల కోసం రూ.10 లక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అటవీ ఉత్పత్తుల కొనుగోలు, డీఆర్ డిపోల డీలర్ల నియామకాలు గిరిజన అభ్యర్థులతో భర్తీకి జీసీసీ ఎండీ రవిప్రకాష్ దృష్టికి తీసుకు వెళ్లి ప్రభుత్వానికి తగు చర్యల కోసం ప్రతిపాదిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఐటీడీఏ పీఓ ఎం.హరినారాయణన్ మాట్లాడుతూ ఏజెన్సీలో పనులు చేపట్టి పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం రూ.23 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఆశ్రమాల్లోని 50 వేల మంది విద్యార్థులకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తహీనతకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి తగిన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఎల్.శివశంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఐటీడీఏ ఏపీఓ ఎస్‌విఎస్‌ఎస్ కుమార్, గిరిజన సంక్షేమ, పంచాయితీరాజ్, ఎస్ఎంఐ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అన్నిశాఖల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
'బాక్సైట్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం'
విశాఖపట్నం: కలెక్టర్ యువరాజ్ అధ్యక్షతన జరిగిన పాడేరు ఐటీడీఏ పాలక వర్గ సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు పాల్గొనగా, మంత్రి రావెల కిషోర్ గైర్హాజరయ్యారు. పాలక వర్గ సమావేశంలో గిరిరజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై చర్చించారు. కాగా, బాక్సైట్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని గిడ్డి ఈశ్వరి తెలిపారు. రూ.5లక్షల కోట్ల సోమ్ము ప్రభుత్వానికి అవసరమా.. లేక లక్షల మంది గిరిజనుల సంక్షేమం అవసరమా అని కిడారి సర్వేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీవో నంబర్ 97ను రద్దు చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని సర్వేశ్వరరావు స్పష్టంచేశారు. -
బాక్సైట్ భగభగలు
-
బాక్సైట్ అంటే ఏంటమ్మా?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను అడిగిన గనుల శాఖ మంత్రి పీతల సుజాత హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ మన్యంలో ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. గిరిజన ఎమ్మెల్యేలంతా బాక్సైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. స్థానిక గిరిజనులు దీనిపై ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు బాక్సైట్ అంటే ఏమిటో తెలియక పోవడం విచిత్రం. బాక్సైట్ అంటే ఏమిటో ఓ ఎమ్మెల్యేను అడిగి మంత్రి తెలుసుకోవడం తాజాగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో చెప్పారు. బాక్సైట్ అంటే ఏంటమ్మా అని మంత్రి పీతల సుజాత తనను అడిగారని తెలిపారు. సొంత శాఖకు సంబంధించిన విషయం గురించి తెలియని మంత్రులు ఉన్నారంటే ఏమనాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం రగులుతూంటే సంబంధిత మంత్రికి దీనిపై కనీస అవగాహన లేకపోవడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్సవ్ టెన్షన్
26న మావోయిస్టుల ఏవోబీ బంద్ నిరసన వారోత్సవాల్లో అరకు ఉత్సవం ఆందోళనలో అధికారగణం క్రైస్తవుల నుంచీ అభ్యంతరం విశాఖపట్నం: శీతాకాలమైనా భగభగలాడుతున్న మన్యంలో ప్రభుత్వం మరో వేడిని రాజేస్తోంది. బాక్సైట్ తవ్వకాల జీవోకు నిరసనగా కొన్నాళ్ల నుంచి ఏజెన్సీలో తీవ్ర అలజడి రేగుతోంది. అయినప్పటికీ అరకు ఉత్సవ్ నిర్వహించి ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తోంది. గిరిజనులతోపాటు మావోయిస్టులు బాక్సైట్‌పై గుర్రుగా ఉన్నారు. పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరోవైపు క్రిస్మస్ పండగ వేళ విశాఖ, అరకు ఉత్సవాలు నిర్వహించడంపై క్రైస్తవుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఈ నెల 25, 26, 27ల్లో జరగాల్సిన విశాఖ ఉత్సవ్‌ను జనవరి 1, 2, 3 తేదీలకు వాయిదా వేసింది. మూడు రోజుల క్రితం వరకు అరకు ఉత్సవ్ తేదీలు ఇంకా ఖరారు కాలేదని సాక్షాత్తూ పాడేరు సబ్‌కలెక్టర్ శివశంకర్ కూడా చెబుతూ వచ్చారు. ఇంతలో అనూహ్యంగా సోమవారం 25 నుంచే అరకు ఉత్సవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే అరకు ట్రైబల్ మ్యూజియం ఎదుట అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం మరోసారి ధర్నా, ర్యాలీ నిర్వహించారు. బాక్సైట్ జీవోను రద్దు చేయకుండా ఉత్సవ్ జరగనీయబోమన్నారు. ఈ నెల 11న అరకు మండలం గెమ్మెల అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అరకు ఉత్సవ్‌ను బహిష్కరించాలని ఇప్పటికే మావోయిస్టులు పిలుపునిచ్చారు. పైగా సోమవారం నుంచి వీరు నిరసన వారోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. 26న ఏవోబీ బంద్ చేపట్టనున్నారు. తొలిరోజే ఇన్ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుడిని కాల్చి చంపి ఉనికిని చాటుకున్నారు. బలగాలను దింపి.. అరకు ఉత్సవ్ నిర్వహణపై ప్రభుత్వం మొండి వైఖరితోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. నాలుగు రోజుల క్రితం కలెక్టర్ పాడేరులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి మీడియాను అనుమతించలేదు. ప్రభుత్వం మూడు రోజుల క్రితం నుంచి ఏజెన్సీలో భారీగా సాయుధ బలగాలను దించి కూంబింగ్ జరిపిస్తోంది. చుట్టూ భద్రతా దళాలను మోహరించి అరకు ఉత్సవ్‌ను నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ మొండివైఖరి అధికారుల్లోనూ భయాందోళనలను రేకెత్తిస్తోంది. మూడు రోజులపాటు ఉత్సవ్ నిర్వహణ కత్తిమీద సామేనని, మావోయిస్టుల నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని వీరు ఆందోళన చెందుతున్నారు. అరకు ఉత్సవ్‌పై క్రైస్తవుల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. క్రిస్మస్ దృష్ట్యా విశాఖ ఉత్సవ్‌ను వాయిదా వేసిన ప్రభుత్వం అరకు ఉత్సవ్‌ను ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. అరకు ఉత్సవ్‌ను అడ్డుకుంటాం.. ప్రభుత్వం క్రిస్మస్ రోజున అరకు ఉత్సవ్‌కు పూనుకోవడం అన్యాయం. ఇది క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయడమే. విశాఖ ఉత్సవ్‌ను వాయిదా వేసి అరకు ఉత్సవ్‌ను ఎలా నిర్వహిస్తారు. క్రిస్మస్ రోజు జాతీయ సెలవు దినం. ప్రభుత్వ ఉద్యోగులు, క్రైస్తవులు ఆరోజు అరకు ఉత్సవాలకు ఎలా వెళ్తారు? ఏజెన్సీలో క్రైస్తవులు లేరా? రాష్ట్రంలోని క్రైస్తవ పెద్దలందరితోనూ చర్చిస్తాం. అరకు ఉత్సవ్‌ను అడ్డుకుంటాం. వాయిదా వేసే దాకా ఉద్యమిస్తాం. -డాక్టర్ ఎం.జేమ్స్ స్టీఫెన్, క్రైస్తవ ప్రతినిధి. విశాఖ -
బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం
బెదింపులు, నిర్బంధాలకు లొంగేది లేదు కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొడతాం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హెచ్చరిక పాడేరు: మన్యంలో బాక్సైట్ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పాలకపక్షం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొడతామని, నిర్బంధాలు, బెదిరింపులకు లొంగేది లేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరైన చింతపల్లిలోని బహిరంగసభకు వేలాది మంది గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా గళం విప్పారని అన్నారు. బాక్సైట్ దోపిడీకి అడ్డంగా ఉన్నామనే అక్కసుతో తనపై సంబంధం లేని అభియోగాలు మోపి, తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ఇలాంటి నిర్బంధాలతో బాక్సైట్ ఉద్యమాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఉద్యమం సాగిస్తున్నామని, గిరిజనుల హక్కులు, చట్టాలను అడ్డుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో జీఓ 97ను నిలుపుదల చేస్తామని మంత్రులు నోటిమాటతో సరిపెట్టారని, ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. ఏడాదికాలంగా బాక్సైట్‌పై సీఎం చంద్రబాబు ఒకమాట, మంత్రులు మరో మాట చెబుతూ గిరిజనులను మోసగిస్తున్నారని విమర్శించారు. బాక్సైట్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రత్యక్ష పోరుకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాను సభలో హెచ్చరిస్తే దాన్ని వక్రీకరించారన్నారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్రాస్ పిటీషన్ దాఖలు చేస్తే హైకోర్టు తనకు స్టే ఇచ్చిందని తెలిపారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడానికి తాము చేస్తున్న ధర్మపోరాటంలో విజయం సాధించి తీరుతామని ఈశ్వరి అన్నారు. -
'తిరుపతి కొండలు తవ్వండి.. భక్తులు ఊరుకుంటారా ?'
విశాఖపట్నం : 'బాక్సైట్' వ్యతిరేక ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని విశాఖపట్నంలోని శ్రీ శారదాపీఠం స్వామిజీ శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు, పెద్దబయలు మండలాల్లో స్వరూపానందేంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులకు దుప్పట్లు, చీరలు ఆయన అందజేశారు. అనంతరం స్వరూపానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గిరిజన సంపదను కొల్లగొట్టేందుకు యత్నం జరుగుతోందని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని ఆయన ఆరోపించారు. పురాణకాలంలో రాముడు, కృష్ణుడు నడియాడిన కొండలివని తెలిపారు. ఆంజనేయుడూ ఓ గిరిజనుడే అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి గుర్తు చేశారు. చేతనైతే తిరుపతి, సింహాచలం కొండలను తవ్వండి అని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ కొండలు తవ్వితే భక్తులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రతి ఆదివాసీ బాక్సైట్ తవ్వకాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. విదేశీ మూకలను తరిమికొట్టండని గిరిజనులకు ఆయన సూచించారు. విశాఖపట్నం జిల్లా అరకులో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో 97ను జారీ చేసింది. ఈ జీవోపై ప్రజలు, గిరిజనలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సదరు జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ఆర్ సీపీ నిరసన
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు భూపాల్ రెడ్డి, మారుతి నాయుడుతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
విశాఖలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
-
విశాఖలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ అనకాపల్లి బయల్దేరారు. అక్కడ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ నర్సీపట్నం మీదుగా చింతపల్లి బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు నిరసనగా జిల్లాలోని చింతపల్లిలో ఇవాళ బహిరంగ సభ జరగనుంది. 'విశాఖ బాక్సైట్ - గిరిజనుల హక్కు' అనే నినాదంతో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. బాక్సైట్ ఖనిజ తవ్వకాలపై వైఎస్ఆర్ సీపీ కార్యచరణను ఆయన ప్రకటిస్తారు. -
'బాక్సైట్ తవ్వకాలను వెంటనే నిలిపేయాలి'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వంర్యంలో చింతపల్లిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విలువైన భూములను ప్రభుత్వం తమ అనుచరులకు అప్పనంగా కట్టబెడుతుందని బొత్స ఆరోపించారు. -
'శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం'
విశాఖపట్నం: బాక్సైట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. ఆదివాసీల భూములను వేరొకరికి ఇచ్చే హక్కు ఎవరికి లేదన్నారు. కేంద్రంలో పెద్దన్న మోదీ, రాష్ట్రంలో చిన్నతమ్ముడు చంద్రబాబు ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా చింతపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. -
బాక్సైట్ దారిలో బాబుగారి వేషాలెన్నో!
-
బాక్సైట్ దారిలో బాబుగారి వేషాలెన్నో!
► అధికారంలో ఒక మాట.. ప్రతిపక్షంలో మరో బాట ► నిజాలన్నీ దాచి నిందలు వేయడం బాబు నైజం (సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) విశాఖ బాక్సైట్‌పై రాష్ర్టవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అన్ని పక్షాలూ తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి.తవ్వకాలకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా మన్యం అట్టుడుకుతోంది. గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు తెలీకుండానే ఆ జీవో వచ్చింది అని చెబుతున్నారు. ఏ ప్రభుత్వంలోనైనా సీఎంకు తెలియకుండా ముఖ్యమైన జీవోలు జారీ అవుతా యా? అది నిజమయితే అలాంటి సీఎం పరిపాలనకు పనికివస్తాడా? ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన బాబు ఇపుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు? ఎందు కు జీవోలు జారీ చేస్తున్నారు? ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత కనపడగానే డ్రామాలు ఎందుకు మొదలు పెట్టారు? జీవో తనకు తెలియకుండా వచ్చిందని చెబుతున్న చంద్రబాబు ఇపుడు రద్దు చేసే అవకాశం తన చేతుల్లోనే ఉన్నా ఎందుకు చేయడం లేదు? ఈ జీవో వల్ల ఉపయోగమెవరికి? నష్టపోయేదెవరు? నిలుపుదల చేస్తున్నానంటూనే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వెనక మర్మమేమిటి? తాను తప్పు చేస్తూ నెపం పక్కవారిపై నెట్టేసే బాబు నైజం అనేకమార్లు బైటపడింది. ఇపుడు కూడా ఆయన నిజాలన్నీ దాచేసి దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డిపై బురదజల్లేందుకు మరోమారు ప్రయత్నించారు.. అందుకే విశాఖ బాక్సైట్ ఉదంతం పూర్వాపరాలను ఓ మారు పరిశీలిద్దాం.. ► ఎన్నికల ముందు ఏం చెప్పారు?... ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారు? ‘బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తాం. ఎట్టిపరిస్థితులలోనూ తవ్వకాలను అనుమతించేది లేదు’ అంటూ ప్రగల్భాలు పలికారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ లీజులు, అల్యూమినా కర్మాగారం ఏర్పాటు ఒప్పందం గిరిజనుల హక్కులకు తీవ్ర భంగకరమని, వాటిని రద్దు చేయాలని అసెంబ్లీ లోపలా, వెలుపలా డిమాండ్ చేశారు. అంతేకాదు గవర్నర్ వద్దకు ఓ ప్రతినిధి బృందాన్ని పంపించి విశాఖ బాక్సైట్ గనుల లీజుతో పాటు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. విశాఖ బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలంటూ చంద్రబాబు స్వయంగా 24.12.2011న గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. 24.04.12న అదే లేఖను మరోమారు విడుదల చేశారు. ► అధికారంలోకి రాగానే యూటర్న్... ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట.. పగ్గాలు చేపట్టగానే ఆయనది వేరే బాట.. ఇదీ చంద్రబాబు నైజం. అనేక సందర్భాలలో ఇది రుజువయ్యింది. ప్రతిపక్షంలో ఉండగా గిరిజనుల హక్కుల కోసం పోరాటమన్న చంద్రబాబు పగ్గాలు చేపట్టగానే యూటర్న్ తీసుకున్నారు. గిరిజనుల హక్కులను కాలరాసే ‘జీవో 97’ని జారీ చేశారు. జీవో 97తో ప్రభుత్వం మన్యంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న 1212 హెక్టార్ల( 3,030 ఎకరాల)భూమిలోనూ, చింతపల్లి, జై భూములలో బాక్సైట్ మైనింగ్ చేపట్టే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఇక్కడ వెలికితీసిన బాక్సైట్ ముడి నిక్షేపాలను నర్సీపట్నం సమీపంలో ‘అన్‌రాక్’ కంపెనీ నెలకొల్పిన రిఫైనరీకి, జిందాల్ గ్రూప్ నెలకొల్పబోతున్న రిఫైనరీకి తరలిస్తారు. ► మన్యంలో దావానలం.. బాక్సైట్ తవ్వకాలతో చంద్రబాబు తలపెట్టిన దారుణమైన విధ్వంసానికి వ్యతిరేకంగా మన్యంలోని గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు, పర్యావరణ వేత్తలు, వామపక్షాలతో సహా వివిధ రాజకీయ పార్టీలు వారికి అండగా పోరాడుతున్నాయి. గిరిజన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఏకంగా శాసనసభ్యత్వానికే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా, వారి హక్కుల పరిరక్షణకై జీవో 97కు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 2న మన్యంలో పర్యటిస్తానని ప్రకటించారు. అన్నివైపుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుండడం, ప్రతిపక్షనేత గిరిజనులకు బాసటగా నిలవడంతోనే సీఎం తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ► జీవో 97 రాజ్యాంగ ఉల్లంఘనే... ప్రస్తుతం విశాఖ బాక్సైట్ తవ్వకాల కోసం ఎంపిక చేసిన ప్రాంతం గిరిజనులు ఉండే రిజర్వ్డ్ ఏజెన్సీ ప్రాంతం. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం గిరిజనులకు, వారు నివసించే ప్రాంతాలకు రాజ్యాంగపరంగా కొన్ని రక్షణలు ఉంటాయి. ప్రభుత్వాలైనా గిరిజనుల జీవనం, సంక్షేమాన్ని దెబ్బతీసే కార్యకలాపాలను చేపట్టడానికి వీల్లేదు. ఒకవేళ బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో సిఫార్సు చేయాలి. ఆ కమిటీని ప్రభుత్వమే నియమించాలి. కానీ ఏడాదిన్నరయినా ప్రభుత్వం ఇంత వరకు కౌన్సిల్‌ను ఏర్పాటు చేయలేదు. కౌన్సిల్ నియామకం కాకుండా మైనింగ్ సిఫార్సుకు తావు లేదని ప్రభుత్వానికి తెలిసినా ఏకపక్షంగా జీవో 97 జారీ చేసింది. అలాగే గిరిజన ప్రాంతంలో ఏం చేయతలపెట్టినా గ్రామ సభల ఆమోదం పొందాలి. గవర్నర్ సిఫార్సు చేయాలి. ఆ తర్వాత రాష్ర్టపతి ఆమోదం కూడా పొందా లి. వీటిలో ఏ ఒక్కటినీ చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదు. ► సుప్రీం మార్గదర్శకాలూ ఉన్నాయి... అటవీ ప్రాంతాలలోని అమూల్యమైన సంపదను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడానికి వీలులేకుండా సుప్రీం కోర్టు 1997లో చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ఆదివాసీల భూములను అప్పటి ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు మైనింగ్ లీజులకిచ్చింది. ఆ నిర్ణయాన్ని ‘సమత’ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో సవాలు చేసింది. కింది కోర్టుల్లో వారి పిటిషన్ వీగిపోయినా సుప్రీం అత్యంత ముఖ్యమైన తీర్పును వెలువరించింది. దాని ప్రకారం... ఆదివాసీలు, గిరిజనులు నివసించే ప్రాంతాలలోని ప్రకృతి, ఖనిజ వనరులు ఏవైనా స్థానిక ప్రజల సంక్షేమానికే ఉపయోగించాలి. అలాగే మన్యంలో గనుల్ని తవ్వే హక్కులు గిరిజనులకు మాత్రమే చెందుతాయని అంతవరకు ఉన్న చట్టం. గిరిజనులకు ఉన్న ఈ హక్కుకు సుప్రీంకోర్టు మద్దతు పలికింది. ► 70వ దశకంలోనే బాక్సైట్‌పై అంచనాలు తూర్పు కనుమల్లో బాక్సైట్ సంపద నిక్షిప్తమై ఉందని 70వ దశకంలోనే గుర్తించారు. 21శాతం బాక్సైట్ నిక్షేపాలున్న ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఆ సంపదను వాణిజ్యపరంగా ఉపయోగించాలని 1970లోనే ఏపీఐడీసీ ప్రయత్నించింది. మెకాన్ సంస్థతో 1975 ఏప్రిల్‌లో సర్వే చేయించారు. 1987లో రష్యన్ సంస్థతో కలసి ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపుల క్రమబద్ధ్దీకరణ చట్టం -1970 ప్రకారం గిరిజనుల భూములని ఏ రకంగానైనా గిరిజనేతరులకు బదలాయించడం నిషిద్ధం. ఆ తర్వాత ఈ చట్టానికి చేసిన సవరణ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు మైనింగ్ చేయడం కూడా నిషిద్ధ్దం. ► గతంలోనే బాబు యత్నాలు.. వెన్నుపోటుతో అధికారం చేజిక్కించుకోగానే బాక్సైట్ నిక్షేపాలపై బాబు కన్నుపడింది. సుప్రీం తీర్పు అందుకు ఆటంకంగా మారింది. గిరిజనుల చట్టాలూ ఆయన కాళ్లకు అడ్డంపడ్డాయి. అయినా బాబు దుబాయ్ నుంచి ఓ బృందాన్ని పిలిపించి, అక్కడి కొండల్ని చూపించి తవ్వుకోవడానికి మీరు రెడీనా అని అన్నారు. దుబాయ్ ప్రతినిధి బృందానికి సకల సదుపాయాలూ కల్పించాలని సూచిస్తూ 29-02-2000న సీఎం చంద్రబాబు కార్యదర్శి స్వయంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. దుబాయ్ బృందం 2000 మేలో హైదరాబాద్ వేంచేయగా సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. చట్టాలను, సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని బాబు తన ‘చాణక్యం’ అంతా ఉపయోగించి 2000 మే, జూన్లలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్‌తో ప్రత్యేక తీర్మానం చేయించారు. 2000 మే 24న విశాఖ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్లో జరిపిన భేటీలో ఈ కౌన్సిల్‌తో ‘మన్యంలో గనుల్ని గిరిజనేతరులు కూడా తవ్వవచ్చు’ అని దుర్మార్గమైన తీర్మానం చేయిం చారు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధ సంస్థ. అది గిరిజనుల హక్కుల పరిరక్షణకు పనిచేయాల్సిన సంస్థ. కానీ దానితోనూ నిబంధనలకు విరుద్ధమైన తీర్మానాలు చేయించిన ఘనుడు చంద్రబాబు.ఆయన ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడిచిన తర్వాతే విశాఖ బాక్సైట్ మైనింగ్ లీజుల్ని నేరుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రమాదం దాపురించింది. ఆ తర్వాత దుబాయ్ అల్యూమినియం కంపెనీ(దుబాల్)కు లీజులు కట్టబెట్టేందుకు బాబు చేయని ప్రయత్నమే లేదు. 2004 మేలో దుబాయి బాబులు రంగంలోకి దిగిపోయారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో బాబు ఆశలు ఆవిరయ్యాయి. బాక్సైట్ నిక్షేపాలను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి తానూ ముడుపులు మింగేయాలని తహతహలాడిన చంద్రబాబు ఇపుడు తానేమీ ఎరగనట్లు వైఎస్ హయాంలోనే బాక్సైట్ లీజుల వ్యవహారం ఆరంభమయినట్లు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ► గిరిజన సంక్షేమానికి అనుగుణంగానే వైఎస్ నిర్ణయాలు చంద్రబాబు చేసిన చట్ట సవరణలు, ప్రత్యేక తీర్మానాల కారణంగా విశాఖ బాక్సైట్ మైనింగ్ లీజులు నేరుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే అవకాశం ఉన్నా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సంయమనం పాటించింది. బాక్సైట్ గనుల లీజుల్ని నేరుగా కంపెనీలకు కేటాయించలేదు. నిజానికి లీజు తమ పేరిటే ఉండాలని బాబు తీసుకువచ్చిన దుబాల్ కంపెనీ గట్టిగా పట్టుబట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలోని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కే సర్వహక్కులు ఉంటాయని వైఎస్ సర్కార్ స్పష్టం చేసింది. జిందాల్, అన్‌రాక్, నాల్కో వంటి కంపెనీలు బాక్సైట్‌ను అల్యూమినా, అల్యూమినియంగా మార్చే కర్మాగారాలని వేలకోట్ల పెట్టుబడిపెట్టి అక్కడే నెలకొల్పాలని వైఎస్ సర్కార్ నిర్ణయించింది. బాక్సైట్ దొరికే చోటే కర్మాగారం ఏర్పాటయితే గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. అంతేకాదు బాక్సైట్ శుద్ధి కర్మాగారాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో లాభాలు - టర్నోవర్లలో ప్రభుత్వం, సంస్థలు, ఏపీఎండీసీలు తమ వంతుగా ఎంతెంత శాతాన్ని గిరిజనుల సంక్షేమానికి వెచ్చించాలన్న స్పష్టమైన నిబంధనలూ ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చే రాయల్టీలో 25%, ఏపీఎండీసీ ఖనిజ విక్రయాల ద్వారా పొందే ఆదాయంలో 20%, అల్యూమినా కర్మాగారం సాధించే లాభంలో 0.5% మొత్తాన్ని ఈ ప్రాంతంలోని గిరిజనుల ఆర్థిక, సామాజిక ప్రగతికి వెచ్చించాలని స్పష్టమైన నిబంధన ఉంది. చంద్రబాబులా నచ్చిన కంపెనీలకు నిబంధనలను అతిక్రమించి మరీ అడ్డగోలుగా అన్నీ కేటాయించే నైచ్యానికి వైఎస్ ఎన్నడూ దిగజారలేదు. షరతులతో కూడిన ఆరు గనుల తవ్వకం లీజులను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ పేరిట మంజూరు చేసింది. 1957 గనుల చట్టం, 1960 ఖనిజాల రాయితీ నియమావళి మేరకే ఒప్పందాలు జరిగాయి. అంతకు ముందు ప్రభుత్వాల హయాంలో ప్రయత్నాలు జరిగినట్లే వైఎస్ హయాంలోనూ బాక్సైట్ అనుబంధ పరిశ్రమల స్థాపనకు (గిరిజనుల సంక్షేమానికి విఘాతం కలగకుండా) నిబంధనల మేరకు ప్రయత్నాలు జరిగాయి. అయినా వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాలను వైఎస్ పూర్తిగా నిలిపేశారు. ► దొంగే దొంగా అన్నట్లు... విశాఖ బాక్సైట్ వ్యవహారంలో ఆది నుంచి నేటి వరకు జరిగిందిదే. తన నేరాలన్నిటినీ దాచిపెట్టి పక్కవారిపై నెపం మోపడానికి ప్రయత్నించడం బాబు నైజం. బాక్సైట్ లీజుల వ్యవహారాన్ని రాజశేఖరరెడ్డి మీద, కాంగ్రెస్ మీద నెట్టేయడానికి శ్వేత పత్రంలో ఆయన చేయని ప్రయత్నమే లేదు. చంద్రబాబు చెప్పినట్లు వైఎస్ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలు జరిగాయనేది శుద్ధ అబద్దం. ఇన్నేళ్లు అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరగనేలేదు. ఒక్క తట్ట కూడా బాక్సైట్‌ను ఎత్తి పోయలేదు. వైఎస్‌కు ముందు, వైఎస్ తర్వాత బాక్సైట్ తవ్వకాల కోసం నిబంధనలను అతిక్రమించి అనేక ప్రయత్నాలు చేసింది చంద్రబాబే. ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలు నిషేధించాలని ఉద్యమాలు చేసిన, చేయించిన బాబు అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకోవడానికి కారణాలు వెతకనక్కరలేదు. గిరిజనుల ప్రయోజనాలను పణంగా పెట్టి బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తేనే ఆయన మెచ్చిన కంపెనీలు బాగుపడతాయి. అందుకే హడావుడిగా జీవో జారీ చేశారు. వ్యతిరేకత రావడంతో ఆ జీవో సంగతే తనకు తెలియదంటున్నారు. ప్రస్తుతానికి జీవోను నిలుపుదల చేశామని చెబుతున్నారు.. గిరిజనుల సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ది ఉంటే జీవోనే రద్దు చేయవచ్చు కదా? అది వదిలేసి శ్వేతపత్రాలు విడుదల చేయడం దేనికి సంకేతం? చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే జీవోను రద్దు చేసేవారని, అలా కాకుండా నిలుపుదల చేయడంలోనే ఏదో కుట్ర పొంచి ఉందని గిరిజన సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ► ఆద్యుడు చంద్రబాబే.. అయినా ైవె ఎస్పై బురదజల్లే యత్నం విశాఖ బాక్సైట్ లీజులకు ఆద్యుడు చంద్రబాబే. 1995లో పదవి చేపట్టగానే ఆయన బాక్సైట్ నిక్షేపాలపై కన్నేశారు. నిబంధనలను మార్చి, గిరిజనులను ఏమార్చి 2000లోనే దుబాయ్ కంపెనీ ప్రతినిధులను తీసుకొచ్చి బాక్సైట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ నిజాలన్నీ దాచి ఇపుడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు 2004 ఎన్నికల్లో గెలిచినట్లయితే దుబాయ్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బాక్సైట్ తవ్వకాలతో యథేచ్ఛగా దోపిడీ సాగించేవారే. ఆయన ఓడిపోవడంతో వినాశకరమైన దుబాయ్ ఒప్పందాలకు బ్రేక్ పడింది. బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ దృష్టిపెట్టినా గిరిజనుల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతమూ కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. -
బాక్సైట్ అనుమతుల్లో చంద్రబాబు దగా
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాక్సైట్ అనుమతుల విషయమై గిరిజనులను దగాచేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మండిపడ్డారు. బాక్సైట్ అనుమతుల ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆయన విజయవాడ నుంచి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా బాక్సైట్ అనుమతులు ఇవ్వొద్దని లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అనాడు చంద్రబాబు తాను ఇచ్చిన లేఖను విస్మరించి ఇప్పుడు మాట మార్చి బాక్సైట్ అక్రమ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారన్నారు. వారం రోజుల కిందట బాక్సైట్ గనుల విషయంలో అధికారులు ప్రభుత్వానికి తెలియకుడా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పిన ముఖ్యమంత్రి తాజాగా వైట్‌పేపర్ పేరుతో వాటికి అనుమతులు మంజూరు చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 18నెలలు అవుతున్నా ఇంతవరకు గిరిజన సలహామండలి ఏర్పాటు చేయలేదన్నారు. విదేశీ కార్పొరేట్ సంస్థ రసాల్ కైమా కంపెనీ కోసం సీఎం బాక్సైట్ అనుమతులు మంజూరు చేయటం శోచనీయమన్నారు. అరకు, పాడేరు గిరిజన ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రజలు ఆందోళణ చేస్తున్నా ప్రభుత్వం మోసపూరితంగా బాక్సైట్‌కు అనుమతులు జారీ చేసిందని చెప్పారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో బాక్సైట్‌కు వ్యతిరేకంగా మైనింగ్ గిరిజన సంఘాల ఆద్వర్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా వామపక్ష పార్టీలన్నింటినీ సమీకరించి పోరాటంలో దిగుతామని చెప్పారు. ఈనెల 30వ తేదీన తమ పార్టీ కేంద్ర కమిటీ నాయకురాలు బృందాకరత్ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి బాక్సైట్ తవ్వకాలను పరిశీలిస్తారని చెప్పారు. ఆ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. -
మైనింగ్ లీజు రద్దు చేసినా అనుమతులెవరిచ్చారు?
విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలపై ఎమ్మెల్సీ శర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. బాక్సైట్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో కొన్ని వాస్తవాలు వెల్లడించలేదన్నారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మైనింగ్ లీజు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అనుమతులు ఎవరిచ్చారని అందులో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు వైఖరి ఎందుకు మారిందో చెప్పాలన్నారు. -
బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
గిరిజన సంఘం, బాక్సైట్ వ్యతిరేక ఐక్యకార్యాచరణ కమిటీ హెచ్చరిక కలెక్టరేట్ వద్ద ధర్నా మహారాణిపేట (విశాఖ): గిరిజనుల గొంతు కోసే బాక్సై ట్ జోలికొస్తే అంతుచూస్తామని గిరి జన సంఘం, బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. చింతపల్లి ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 97ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి గిరిజనుల జీవనాన్ని ఫణంగా పెడుతూ బాక్సైట్ తవ్వకాలు చేపడతామంటూ మొండికేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు నిరసనగా సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. వీరికి పాడేరు, అరకు, పాలకొండ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర్రావు, విశ్వరాయి కళావతి, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు చంద్రబాబు 2012లో కేంద్రానికి, గవర్నర్‌కు రాసిన లేఖలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలు చేపడతామని ఇటీవల జారీ చేసిన జీవోను చూస్తే ఆయన ఊసరవిల్లి తనాన్ని చూసి ఎవరికైనా మతిపోతుందన్నారు. జీవో 97 గవర్నర్ ఆమోదం పొంది వస్తే ఆ జీవో గిరిజన సంక్షేమ శాఖా మంత్రికి తెలియకుండా వచ్చిందని సాక్షాత్తు సీఎం చెప్పడం ఆయన నక్కలమారి జిత్తు వేషాలకు నిదర్శనమన్నారు. గిరిజన చట్టాలపై మంత్రి అయ్యన్న మతీసుతీ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలో 1/70 చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మైనింగ్ తవ్వితే లేని అభ్యంతరం ఇక్కడెందుకు వస్తుందో చెప్పాలనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులంతా నిద్రాహారాలు మాని ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే బాక్సైట్ తవ్వొద్దని గిరిజనులెవరూ చెప్పడం లేదని, కొంతమంది నాయకులే వారిని రెచ్చగొడుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గిరిజనులంటే మీకు అంతచులకనగా ఉందా? మీకు దమ్ము ధైర్యముంటే ఏజెన్సీ ప్రాంతానికి రండి.. మిమ్మల్ని గిరిజనులు తరిమి కొట్టకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేవారు. గిరిజనుల సంపదను దోచుకోవాలనే ముందు చూపుతోనే చంద్రబాబు రెండేళ్లవుతున్నా ఇంత వరకు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మాట్లాడుతూ గిరిజనుల గురించి, గిరిజన చట్టాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం తెలుసు? బాక్సైట్ తవ్వకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు చెప్పింది, సాక్షాత్తు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో నియమించిన కేంద్రమంత్రి వర్గ సమావేశం బాక్సైట్ తవ్వకాలు చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంకా అనేక సంస్థలు కోర్టుకెల్లి 1/70 చట్టం, పీసా, పర్యావరణ చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి చట్టాలకు అనుకూలంగా తీర్పులు తెస్తే వాటన్నింటినీ తుంగలో తొక్కి బాక్సైట్ తవ్వకాలు చేపట్టడానికి గిరిజనులు అమాయకులు కాదన్నారు. ఇప్పటికే ఏజెన్సీలో అభ్యర్థులను డిపాజిట్ల్లు రాకుండా ఓడించారని.. ఇంకా నువ్వు ముందుకెల్తే గిరిజనులు చూస్తూ ఊరుకోబోరని బాబును హెచ్చరించారు. ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంఘం, ఏపీ గిరిజన ఐక్యసంఘం, ఆదివాసీ రిజర్వేషన్ సంరక్షణ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, ఏయూ గిరిజన ఉద్యోగుల సంఘం, గిరిజన మహిళా సమన్వయ కమిటీ, రిమోట్ ఏజెన్సీ ట్రైబల్ ఎంపవర్మెంట్ సొసైటీ సంఘీబావం పలికాయి. -
బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
తవ్వకాలను అడ్డుకొని తీరుతాం ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతిజ్ఞ సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో బాక్సైట్ జోలికి వస్తే ఖబడ్దార్ అని బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా హెచ్చరించింది. విశాఖపట్నంలోని గిరిజన భవన్లో ఆదివారం కమిటీ సదస్సు జరిగింది. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని జేఏసీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. గిరిజనుల గోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు వినిపించడం లేదా? పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. రాజధాని ప్రాంతానికి వెళ్లి మీకు నేనున్నానంటూ అక్కడి రైతులకు భరోసా ఇచ్చిన పవన్ కల్యాణ్ తీరా వారి భూములను ప్రభుత్వం లాక్కుంటున్నప్పుడు మాత్రం పత్తా లేకుండాపోయారని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు రక్షణ కల్పిస్తామని డీజీపీ రాముడు చెబుతున్నారని, ఎన్ని బలగాలను దించినా తమ 11 మండలాల్లోని గిరిజనులు ఒక్కొక్కరూ ఒక్కో సైనికుడై ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి వైఎస్సార్సీపీ వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 2న చింతపల్లిలో పర్యటించి, బహిరంగ సభలో పాల్గొంటారని ఈశ్వరి ప్రకటించారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని, అధికారంలో లేనప్పుడు బాక్సైట్‌ను వ్యతిరేకించిన ఆయన అధికారంలోకి వచ్చాక తవ్వడానికి ప్రయత్నిస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు బీజం పడిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఒక్క జీఓ కూడా జారీ చేయలేదని గుర్తుచేశారు. బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర గవర్నర్ నోరు మెదపక పోవడం దారుణమని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న వాటిని ఆయన అడ్డుకోవాలని కోరారు. -
రాజ్యాంగ రక్షణ ఛత్రం ఛిద్రం
టీఏసీని ఏర్పాటు చేయని ప్రభుత్వం బాక్సైట్ గనుల తవ్వకాలకు ప్రభుత్వ కుట్ర వైస్సార్ కాంగ్రెస్‌కు భయపడే అడ్డగోలు నిర్ణయం మండిపడుతున్న గిరిజన ప్రజాప్రతినిధులు రాజ్యాంగ హక్కుల కోసం ఉద్యమానికి సన్నద్ధం బాక్సైట్ గనులను తమ అస్మదీయ విదేశీ సంస్థలకు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు అన్నింటినీ తుంగలో తొక్కేసింది. గిరిజన ప్రాంతల రక్షణ, గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలో నిర్దేశించిన ‘గిరిజన సలహా మండలి(టీఏసీ)తో నిమిత్తం లేకుండా బాక్సైట్ గనుల తవ్వకాలకు జీవో జారీ చేసేసింది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే సభ్యులుగా ఉండనుండటంతో ఏకంగా టీఏసీనే ఏర్పాటు చేయకుండా పనికానిచ్చేసింది. రాజ్యాంగ రక్షణ ఛత్రాన్ని ఛిద్రం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న గిరిజన ప్రజాప్రతినిధులు ఉద్యమానికి ఉద్యుక్తమవుతున్నారు. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో టీఏసీ గురించి స్పష్టంగా నిర్దేశించింది. గిరిజన ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు టీఏసీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. టీఏసీ ఆమోదంతోనే గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలిన స్పష్టం చేసింది. ఏజెన్సీలో బాక్సైట్ గనులను 1960లోనే గుర్తించారు. కాగా 1986లో నాటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా బాక్సైట్ గనుల తవ్వకాల ప్రతిపాదన తొలిసారి తెరపైకి వచ్చింది. నాటి నుంచి కూడా టీఏసీ సభ్యులు బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తునే ఉన్నారు. 2000-2002లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల కోసం దుబాయికి చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ టీఏసీ ఆమోదం సాధించడం సులువు కాదని గ్రహించి 2004 ఎన్నికల తరువాత చూద్దామని వాయిదా వేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈసారి ఏకంగా టీఏసీని నీరుగార్చేస్తూ అడ్డగోలుగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు భయపడే... రాజ్యాంగం ప్రకారం గిరిజన ప్రాంతాల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు టీఏసీలో సభ్యులుగా ఉండాలి. 2014 ఎన్నికల్లో రాష్ట్రం లో 8 ఎస్టీ నియోజకవర్గాల్లో ఏకంగా 7 ని యోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గిరిజన ప్రాం తాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సా ర్ కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా గెలిచా రు. ఈ నేపథ్యంలో టీఏసీని నియమిస్తే అందులో 90శాతంమంది సభ్యులు వైఎస్సా ర్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులే ఉంటారు. వైఎస్సార్‌కాంగ్రెస్ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తుండటంతో టీఏసీ ఆమోదం పొందడం దుర్లభమని చంద్రబాబు ప్రభుత్వ గుర్తించింది. ఒకానొక దశలో తమ పార్టీ గిరిజన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి టీఏసీలో సభ్యులుగా చేర్చాలని వ్యూహం పన్నింది. అది అంతగా ఆచరణ సాధ్యంకాదని గ్రహించి ఏకంగా టీఏసీని నియమించకూడదని నిర్ణయించుకుంది. టీఏసీ ఏర్పాటు చేయకుండానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేసేసింది. అంటే గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ వ్యవస్థ టీఏసీని నిర్వీర్యం చేస్తూ అడ్డగోలుగా నిర్ణయం తీసుకుంది. ఉద్యమానికి గిరిజన ప్రజాప్రతినిధుల ఉద్యుక్తం ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారంపై గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. గిరిజన ప్రాంతాలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ వ్యవస్థ టీఏసీని నియమించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనకు ఉద్యుక్తమవుతున్నారు. అందుకోసం గిరిజన ప్రజాప్రతినిధులు విశాఖపట్నంలో ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు. తామే అనధికారికంగా టీఏసీగా ఏర్పడి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానించి గవర్నర్, రాష్ట్రపతులకు నివేదించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అధికారికంగ టీఏసీని నియమించనందున తమ ప్రాంత హక్కుల కోసం తామే టీఏసీగా ఏర్పడినట్లు ఆ నివేదికలో పొందుపరుస్తామని ఆ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిఏకంగా గిరిజనులను చైతన్యపరచడంతోపాటు ప్రభుత్వంపై న్యాయపోరాటానికి కూడా ఉద్యుక్తమవుతున్నారు. -
2న పాడేరులో వైఎస్ జగన్ బహిరంగ సభ
-
2న పాడేరులో వైఎస్ జగన్ బహిరంగ సభ
హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. 'బాక్సైట్ తవ్వకాలు-గిరిజనుల హక్కులు' అనే అంశం పై డిసెంబర్ 2న పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. బాక్సైట్ తవ్వకాలను నిరోధించేందుకు 11 మంది సభ్యులతో గిరిజన హక్కుల కమిటీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గిడ్డి ఈశ్వరి, కె.సర్వేశ్వరరావు, కే.రాజన్నదొర, పి. పుష్పశ్రీవాణి, వి. కళావతి, వంతల రాజేశ్వరి, తెల్లం బాలరాజా, గుడివాడ అమర్నాథ్, సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, విజయసాయి రెడ్డిలను సభ్యులుగా నియమించారు. -
'పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం'
విశాఖపట్నం: బాక్సైట్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బాక్సైట్ తవ్వకాలపై పవన్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 2న పాడేరు నియోజకవర్గంలోని చింత పల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఈశ్వరి తెలిపారు. -
మంత్రి గంటాకు విశాఖ మీద ప్రేముంటే..
-
'చంద్రబాబుది ఏరుదాటాక తెప్పతగలేసే తీరు'
విశాఖపట్నం: సీఎం చంద్రబాబు నాయుడుది ఏరుదాటాక తెప్పతగలేసే తీరని మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి బాబూరావు విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలపై ఎన్నికలకు ముందొక మాట, తర్వాత మరోమాట ఆయనకే చెల్లిందన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వీలుగా చంద్రబాబు సర్కార్ జారీచేసిన జీవో నంబర్ 97కు నిరసనగా అఖిలపక్షం పిలుపు మేరకు శనివారం విశాఖ మన్యం బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుడు గొల్లపల్లి మీడియాతో మాట్లాడారు. ఏపీలో మోసాలు, దోపిడీల పరంపర కొనసాగుతున్నదని, మన్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం చేస్తున్న పోరాటంలో మంత్రులు కూడా కలిసిరావాలన్నారు. గిరజన హక్కులను కాపాడేందుకు వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతుందని, అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా వెనకాడబోదని గొల్లపల్లి అన్నారు. -
మంత్రి గంటాకు విశాఖ మీద ప్రేముంటే..
విశాఖపట్నం: ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలపై నిరసన గళం వినిపించిన చంద్రబాబు.. ఇప్పుడు గిరిజన సంపదను తవ్వి ఎత్తుకుపోతామని చెబుతుండటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. అఖిలపక్షం పిలుపుమేరకు విశాఖ మన్యంలోని 13 మండలాల్లో శనివారం బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమర్ నాథ్ మాట్లాడారు. 'లక్షల కోట్ల విలువైన గిరిజన సంపదను ఎవరికి ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలి... మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ అంటే ప్రేముంటే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి జీవో నంబర్ 97ను రద్దు చేయించాలి' అని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాల జీవో(నంబర్ 97)ను రద్దు చేసేవరకు గిరిజనుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. -
మన్యం పరిస్థితిపై ఆరా
అల్లిపురం: సీఆర్పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐజీ ఎం.విష్ణువర్ధనరావు, ఒడి శా ఐజీ పియూష్ ఆనంద్‌లు శుక్రవారం మన్యంలో పర్యటించి ఏరియల్ సర్వే చేపట్టినట్లు తెలిసింది. ముంచంగిపుట్టులో పాఠశాల విద్యార్థులతో మాట్లాడాక సీఆర్పీఎఫ్ శిబిరాలను సందర్శించారు. బాక్సైట్ తవ్వకాలపై ఏపీఎండీసీకీ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఐజీల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏజెన్సీ పర్యటన ముగించుకొని నగరానికి చేరుకున్న వారిని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసినట్టు సమాచారం. ఈ సందర్బంగా మన్యంలో తాజా పరిస్థితిపై సమీక్షించినట్లు తెలిసింది. -
ఆందోళన బేఖాతరు.. బాక్సైట్ తవ్వకాలకు ఓకే
-
ఆందోళన బేఖాతరు.. బాక్సైట్ తవ్వకాలకు ఓకే
విశాఖపట్నం: ఆందోళనలు, నిరసనలు పట్టించుకోకుండా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మైనింగ్‌కు అనుమతిస్తూ జీవో నంబర్.97ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. దీని ప్రకారం నర్సీపట్నంలోని రిజర్వ్ ఫారెస్ట్ డివిజన్లోని 1212 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. ఏపీఎండీసీకి మైనింగ్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి మైనింగ్ కార్యక్రమాలు జరపాలని ఇందులో పేర్కొంది. దీంతోపాటు గిరిజనులు అధికంగా ఉండే చితపల్లి, జర్రెల అటవీ ప్రాంతంలో కూడా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు అక్కడ ఉన్న గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. చాలా ఏళ్లుగా ఇక్కడ బాక్సైట్ తవ్వకాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటిని పట్టించుకోకుండా తాజాగా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు, గిరిజన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో ఎదురు చూడాల్సిందే. -
బాక్సైట్ తవ్వకాలపై తీర్మానం
బాక్సైట్ తవ్వకాలకు వ్యతికేకంగా 20 గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. చింతపల్లి మండలం బలపం అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారు. 1/70 చట్టాన్ని అమలు పరచాలని ఈ సమావేశంలో ప్రజలు తీర్మానించారు. బాక్సైట్ గనుల్లో గుణపాలు దించితే.. తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ ప్రజాప్రతినిధులు ప్రతిన బూనారు. ఈ కార్యక్రమంలో బాక్సైట్ చింతపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన 20 గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కాగా.. ఇటీవల బాక్సైట్ తవ్వకాలను ఆపాలంటూ.. తెలుగు దేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు అరెస్టు చేసిన సంగతితెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు బాక్సైట్ మైనింగ్ కి వ్యతిరేకంగా తీర్మానం చేయడం జిల్లా వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. -
టీడీపీకి రాజీనామా చేసి బాక్సైట్‌పై ఉద్యమిస్తాం
అధికార పార్టీలో సభ్యులమైనప్పటికీ తాము కూడా గిరిజనులమేనని, పదవుల కన్నా తమ ప్రాంతం మాకు ముఖ్యమని మావోయిస్టుల చెరలో ఉన్న టీడీపీ నాయకులు ముక్కల మహేష్, మామిడి బాలయ్యపడాల్, వండలం బాలయ్య ప్రజా కోర్టులో స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రజాకోర్టులో ఆదివాసీలు ముగ్గురి అభిప్రాయాలను కోరగా ఇందుకు వీరు స్పందిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారమైనంత మాత్రాన తాము మన్యంలో పుట్టి పెరిగిన గిరిజనులమేనని, బాక్సైట్ తవ్వకాల వల్ల తాము కూడా నిరాశ్రయులమయ్యే పరిస్థితి నెలకొంటుందని, తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు ముందుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈనెల 18న తమ పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి, పదవులకు పార్టీకి చెందిన వారంతా రాజీనామాలు చేస్తామని అన్నారు. దీంతో ఆదివాసీలు, మావోయిస్టులు శాంతించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు వారి అభిప్రాయాలతో ఏకీభవించి మావోయిస్టు నాయకులు ముగ్గురు నాయకులను విడుదల చేస్తున్నట్లు ప్రజాకోర్టులో ప్రకటించారు. -
బాక్సైట్ జోలికొస్తే టీడీపీ అంతుచూస్తాం
కార్యకర్తలను కూడా వదలబోమని మావోల హెచ్చరిక {పజాకోర్టులో స్పష్టం చేసిన మావోయిస్టు అగ్రనేతలు జీకేవీధి: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల జోలికొస్తే అధికార టీడీపీ అంతు చూస్తామని మావోయిస్టు అగ్రనేతలు స్పష్టం చేశారు. ఏఓబీ సరిహద్దు చిత్రకొండ అడవుల్లో బుధవారం సాయంత్రం మావోయిస్టుల ఆధీనంలో ఉన్న టీడీపీ నేతల విడుదలపై ప్రత్యేక ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు కైలాసం, ఆజాద్, నవీన్ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖ మన్యంలో నిక్షిప్తమైన బాక్సైట్ ఖనిజాలను వెలికి తీసేందుకు తొలిసారిగా తెలుగుదేశం పార్టీయే బీజం వేసిందని, అప్పటి నుంచి ఈ ప్రాంత గిరిజనులంతా అభద్రతాభావంతో జీవించాల్సి వస్తోందన్నారు. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారినా బాక్సైట్ తవ్వకాలు మాత్రం కొనసాగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నాయని చెప్పారు. అధికారంలో ఉన్న వారు బాక్సైట్ ఖనిజాన్ని తవ్వుతామంటుంటే, ప్రతిపక్షంలో ఉన్న నేతలు తవ్వకాలను అడ్డుకుంటామంటూ వ్యతిరేకించడం పరిపాటిగా మారిందన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమంటూ ఉద్యమాలు చేసి అధికారంలోకి రాగానే ఆదివాసీ దినోత్సవం నాడే సీఎం చంద్రబాబు నాయుడు బాక్సైట్ ఖనిజాన్ని వెలికితీస్తామని ప్రకటన చేసి తన నిరంకుశత్వాన్ని నిరూపించుకున్నారని మండిపడ్డారు. మన్యంలో అపారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలపై ఏ ఒక్కరూ కూడా గునపం దింపినా అధికార టీడీపీ కార్యకర్తలను సైతం ఆదివాసీ గిరిజనులు మన్నించబోరని మావోయిస్టునేతలు హెచ్చరించారు. ప్రాణత్యాగాలకైనా సిద్ధమే : బాక్సైట్ తవ్వకాల వల్ల అటవీ సంపద అంతరించిపోతే తాము జీవించడానికి వేరే దారి లేదని ప్రజాకోర్టులో సుమారు 20 గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టయినా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అధికార టీడీపీ నాయకులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రతి ఒక్కరు ఈ పోరాటాన్ని కొనసాగించాలని గిరిజనులు కోరారు. -
మళ్లీ కలకలం
బాక్సైట్ ఉద్యమం ఉధృతానికి మావోయిస్టుల యత్నం ముగ్గురు టీడీపీ నాయకుల కిడ్నాప్ నేడు చర్చలకు ప్రజాసంఘాలు వరుస సంఘటనలలో గిరిజనుల బెంబేలు బాక్సైట్ భగభగలతో మన్యం వేడెక్కుతోంది. ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారు. బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ జీకే వీధి మండలానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు మంగళవారం కొత్తగూడ వద్ద కిడ్నాప్ చేశారు. దీంతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారపార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. వీరిని విడిపించడానికి ప్రజాసంఘాలు బుధవారం మావోయిస్టులతో చర్చలకు సిద్ధమవుతున్నాయి. విశాఖపట్నం: బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ గిరిజన ఉద్యోగ సంఘాలతో మావోయిస్టులు ఇటీవల సమావేశమవుతున్నారు. దళసభ్యులు రాత్రిళ్లు గ్రామాల్లో తిరుగుతూ ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు వెదజల్లుతున్నారు. బ్యా నర్లు కడుతున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కిడ్నాప్‌నకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జీకే వీధి మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు ముక్తల మహేష్, జన్మభూమి కమిటీ మండల అధ్యక్షుడు మండలం బాలయ్యలను మంగళవారం కిడ్నాప్ చేశారు. వీరంతా అధికారపార్టీకి చెందినవారే కావడం విశేషం. లేఖల కలకలం..: మన్యంలో గాలికొండ ప్రాంతంలో కొంత, జల్లెల ప్రాంతంలో ఎక్కువగా బాక్సైట్ తవ్వకాలకు అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ మావోయిస్టు కమిటీలు లేఖలు విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా ఏజెన్సీలో గ్రీన్‌హంట్ పేరుతో పోలీస్ కూంబింగ్‌ను నిలిపివేయాలని సీపీఐ(మావోయిస్టు) ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ విడుదల చేసిన లేఖలో డిమాండ్ చేసింది. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం విడుదల చేసిన లేఖలోనూ ప్రభుత్వంపైనా ,పోలీసులపైనా తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేసి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. బాక్సైట్ తవ్వకాలను ఆపకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకాకుండా ఈనెల 7నుంచి 13వ తేదీ వరకు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రాణాలు తీస్తున్న బాక్సైట్:బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరించిన గిరిజన నేతలను మావోయిస్టులు మట్టుబెట్టిన సంఘటనలు ఎన్నో.. మూడేళ్ల కిందట జీకేవీధి మండలం ఏబులం గ్రామానికి చెందిన మండల ఉపాధ్యక్షుడు (సీపీఐ)సోమలింగం బాక్సైట్ ప్రాంతంలో మట్టి నమూనా సేకరించడంతో దళసభ్యులు అతని ఇంటిపై దాడిచేసి గ్రామంలోనే అతడ్ని హతమార్చారు. రెండేళ్ల క్రితం చింతపల్లి మండలం చౌడుపల్లికి చెందిన (కాంగ్రెస్ పార్టీ) జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సోమలింగంను అతని ఇంటిలోనే కాల్చి చంపారు. -
ఉద్యోగిపై ఒత్తిడి
బాక్సైట్ ఉద్యమానికి సహకరించాలంటున్న మావోయిస్టులు వెళితే బైండోవర్ కేసులు పెడతామంటున్న పోలీసులు చింతపల్లి: మన్యంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా పనిచేయాలంటూ ఇంతకాలం ఆదివాసీలు, గిరిజన ప్రజాప్రతినిధులను కోరిన మావోయిస్టులు ఇప్పుడు ఉద్యమానికి సహకరించాలంటూ ఏజెన్సీ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. శుక్రవారం రాత్రి సిరిబాల సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల కిట్‌బ్యాగుల్లో ఈమేరకు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. జీకేవీధి అటవీ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని కొద్ది రోజులుగా ప్రజా ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులను పిలిపించుకొని బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలకు సహకరించాలని కోరినట్టు సమాచారం. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య ఇంత వరకు అమాయక గిరిజనులు, ప్రజా ప్రతినిధులే నలిగిపోయారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. బాక్సైట్ తవ్వకాలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధులపైనే ఒత్తిడి తెచ్చేవారు. తాజాగా ఉద్యమాలు చేపట్టాలంటూ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో మన్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళనలు చోటుచేసుకుంటున్నాయి. ఏజెన్సీలోని చింతపల్లి, జీకేవీధి మండలాల్లో 1350 హెక్టార్లలో 246 మిలియన్ టన్నులు, అనంతగిరి,అరకులోయ ప్రాంతాల్లో 318 మిలియన్ టన్నుల బాక్సైట్ ఖనిజం వెలికితీతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో తవ్వకాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా సూచన ప్రాయంగా ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం ఖనిజ తవ్వకాలకు చాపకింద నీరులా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కొన్నేళ్ళుగా బాక్సైట్‌ను ఆదివాసీలతోపాటు మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తవ్వకాల వల్ల వందలాది గ్రామాలు ఖాళీ అయిపోతాయని, ప్రధానంగా వాణిజ్య సంపద అయిన కాఫీ తోటలు దెబ్బ తింటాయని, భూగర్భ జ లాలు అడుగంటి పోయి సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని పర్యావరణవేత్తలు తలలు బాదుకుంటున్నారు. తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీతోపాటు వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాలు ఉద్యమాలు చేస్తునే ఉన్నాయి. ఎన్నో విధ్వంసాలు.. బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గతంలో మావోయిస్టులు సమిడి రవిశంకర్, ఉగ్రంగి సోమలింగం, జీకేవీధి వైస్ ఎంపీపీ సాగిన సోమలింగంలను దారుణంగా హత్య చేశారు. పలు విధ్వంసాలు సృష్టించారు. ఏపీఎండీసీలో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న పలువురు గిరిజన యువకుల ఇళ్లను ఇటీవల జర్రెలలో కూల్చివేశారు. ఇలా బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఇంత వరకు గిరిజనప్రజా ప్రతినిధులపైనే ఒత్తిడి తెచ్చిన దళసభ్యులు ఇటీవల ఉద్యోగుల సహకారం కోరుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. -
మావోయిస్టుల సంచారం... పోలీసులు కూంబింగ్
విశాఖపట్టణం : విశాఖపట్టణంలోని మాకవారిపాలెం మండలంలో 15 మంది మావోలు సంచరించినట్లు పోలీసులుకు సమాచారం అందింది. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకూ ఏఎస్సీ సత్య ఏసుబాబు నేతృత్వంలో డివిజన్ పరిధిలోని పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కాగా, మంగళవారం కూడా పోలీసులు ఈ కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో మండలంలోని బాక్సైట్ శుద్ధి కర్మాగారం వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మావోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండలంలోని బాక్సైట్ శుద్ధి కర్మాగారం ప్రాంతంలో మావోలు సంచరించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. -
రగిలిన బాక్సైట్ చిచ్చు
ఉధృతం కానున్న ఉద్యమం మావోయిస్టుల చర్యలతో వేడెక్కిన మన్యం గూడెంకొత్తవీధి: బాక్సైట్ చిచ్చు మన్యంలో సెగలు రేపుతుంది. అదను చూసి మావోయిస్టులు పంజా విసిరారు. ఈసారి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా బాక్సైట్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. బాక్సైట్ ప్రభావిత ప్రాంతాలైన జర్రెల, మొండిగెడ్డ పంచాయతీల్లో కొందరు గిరిజన యువకులు పునరావాస కమిటీలుగా ఏర్పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ 13 మందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమించింది. బాక్సైట్ ఏజెంట్‌గా పని చేస్తున్నారంటూ మావోయిస్టులు గతంలో ప్రజాకోర్టులు నిర్వహించి కమిటీ సభ్యులను హెచ్చరించి వదిలేశారు. 2011లో ఈ సంఘటన జరిగినప్పటికీ అదే గిరిజన యువకులు యథావిధిగా చింతపల్లి ఏపీ ఖనిజ అభివృద్ధి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వీరు పద్ధతి మార్చుకోకపోవడం మావోయిస్టులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి జర్రెల, మొండిగెడ్డ పంచాయితీ కేంద్రాల్లో సాయుధులైన 30 మంది మావోయిస్టులు, వందలాది మంది మిలీషియా సభ్యులతో కలిసి కోరాబు లక్ష్మీ నారాయణ, రీమలి శ్రీను, కొలగాని బాబూరావు, సాగిన బంగారయ్య ఇళ్లను ధ్వంసం చేసి నిప్పంటించారు. బాక్సైట్ ఉద్యమం ఉధృతం కానుందా..? ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. అప్పుడప్పుడు చప్పగా సాగే బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం 2010 లో మావోయిస్టులు చర్యలతో వేడెక్కింది. బాక్సైట్‌కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడాన్ని నిరశిస్తూ, దీనికి ప్రతీకారంగా అప్పటి జెడ్పీ ఉపాధ్యక్షుడు ఉగ్రంగి సోమలింగంను చౌడుపల్లి గ్రామంలో దళసభ్యులు హతమార్చారు. రాజకీయ పార్టీల నాయకులంతా తమ పదవులకు రాజీనామా చే సి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా సుమారు 3 నెలల పాటు అజ్ఞాతంలోని వెళ్లిపోయారు. మావోయిస్టుల పిలుపుతోనే మళ్ళీ వెనక్కి వచ్చిన వీరు బాక్సైట్ ఉద్యమంలో పాల్గొన్నారు. కాలక్రమంలో బాక్సైట్ ఉద్యమం చల్లబడింది. మావోయిస్టులకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ సైతం ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు బాక్సైట్ తవ్వకాల అంశాన్ని గతేడాది తెరపైకి తెచ్చింది. మన్యంలో వేలాది హెక్టార్లలో నిక్షిప్తమైవున్న ఖనిజ తవ్వకాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆ శాఖ కార్యాలయంచింతపల్లిలో కొనసాగుతోంది. ఇందులో పని చేస్తున్న గిరిజన యువకుల ఇళ్లను ఈ కారణంగానే మావోయిస్టులు ధ్వంసం చేసి నిప్పటించారు. ప్రజాకోర్టులో లొంగిపోండి.. ఈస్ట్ డివిజన్ కమిటీ పిలుపు బాక్సైట్ పునరావాస కమిటీ సభ్యులుగా పని చేస్తున్న వారంతా వారం రోజుల్లోగా ప్రజా కోర్టులో లొంగిపోవాలని ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి జర్రెల, మొండిగెడ్డ ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడిన మావోయిస్టులు సంఘటన ప్రదేశం వద్ద పెద్ద పెద్ద గోడపత్రికలు అతికించి వెళ్లారు. పునరావాస కమిటీ సభ్యులారా! మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి గ్రామాల్లో సాధారణ జీవితాలను గడపాలని, కుటుంబ సభ్యులు వీరిపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో వారిని కూడా గ్రామం నుంచి తరిమేస్తామని, జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కు వ్యతిరేకంగా కరపత్రాలను అతికించారు. ఎస్ఆర్ కంపెనీ ప్రయోజనాల కోసమే మన్యంలో పోలీసు బలగాలు తిరుగుతున్నాయని, తమ ఆరోపణలకు సమాధానం చెప్పి గిరిజన గ్రామాల్లో దత్తత నిజస్వరూపాన్ని నిరూపించుకోవాలంటూ సీపీఐ మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. -
బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలి
ఇందుకు గిరిజన యువత నడుంబిగించాలి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు బల్లపురాయిలో వైఎస్సార్సీపీ ర్యాలీ పెదబయలు : మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని మారుమూల లక్ష్మీపేట పంచాయతీ బల్లపురాయి గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తవ్వకాల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్, గిరిజనుల ప్రాణాల కంటే చంద్రబాబుకు బాక్సైటే ముఖ్యమా? అంటూ నినాదాలు చేశారు. కిలుములు గ్రామం నుంచి బల్లపురాయి వరకు ర్యాలీ సాగింది. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన్యం వాసులు ఇప్పటికే వ్యాధులతో విలవిల్లాడుతున్నారని, వైద్య సేవలు నామమాత్రమని, దీనిపై స్పందించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విలువైన ఖనిజాన్ని దోచుకోడానికి బడా కంపెనీలతో ఒప్పందం కురూర్చుకున్నాయని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలతో మన్యం అతలాకుతలం అవుతుందని, ఒడిశా వాసుల మాదిరి ఇక్కడివారు ఇతర రాష్ట్రాలకు వలసబాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తుందన్నారు. గిరిజనుల కష్టాలు ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా అంతా ఉద్యమించాలన్నారు. గ్రామాల్లోని చదువుకున్న యువత గిరిజనులను చైతన్య పరిచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. అడవి తల్లిని కాపాడుకోడానికి పాణాలు అర్పించినా ఫరవాలేదన్నారు. బాక్సైట్ తవ్వితే పదవికి రాజీనామా మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసం గునపం పడితే పదవికి రాజీనామా చేస్తానని అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ప్రకటించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలతో కలిసి బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. తవ్వకాలను అడ్డుకోవడానికి ఎంతకైనా తెగిస్తానని అన్నారు. కార్యక్రమంలో పెదబయలు ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాంగి సింహాచలం, పార్టీ మండల నాయకులు పాండురంగస్వామి, ప్రసాద్, సందడి కొండబాబు, ఎంపీటీసీ సభ్యులు పోయిభ కృష్ణారావు, లక్ష్మీపేట, అడుగులపుట్టు, సీకరి, గంపరాయి సర్పంచ్‌లు సొనాయి కమలమ్మ, అనిత,సన్యాసి, కమలాకర్, మండల కో-ఆప్సన్సభ్యులు షేక్ అబ్దుల్లా, ఉప సర్పంచ్ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
అర్ధంతరంగా ముగింపు
- అజెండా అంశాలపై సాగని చర్చ - బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానించాలన్న ఎమ్మెల్యేలు, ఎంపీపీలు - కుదరదన్న కలెక్టర్ యువరాజ్ - ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు - స్తంభించిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం పాడేరు : ఐటీడీఏ పాలవర్గ సమావేశంలో బాక్సైట్ భగభగలు మరోసారి మిన్నంటాయి. ఏజెన్సీలో ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానించాలంటూ ఎమ్మెల్యేలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు పట్టుబట్టడంతో అజెండాలోని అంశాలు చర్చించకుండానే అర్ధంతరంగా ముగిసింది. బాక్సైట్ రగడతో ఈ ఏడాది ఏప్రిల్ 26న నిర్వహించిన సమావేశం కూడా అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. ఇదే అంశం పునరావృతం కావడంతో రెండోసారి పాలక మండలి సమావేశం స్తంభించింది. ఆది వారం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఐటీడీఏ వైస్ చైర్మన్, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్సీ పప్ప ల చలపతిరావు హాజరయ్యారు. సంబంధిత మంత్రులు రాలేదు. సమావేశం ప్రారంభించగానే పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, జి.మాడుగుల, పెదబయలు, హుకుం పేట, అరకు, జికేవీధి, చింతపల్లి, డుంబ్రిగుడ ఎంపీపీలు ఎంవి గంగరాజు, ఉమా మహేశ్వరరావు, టి.మాధవి, అరుణకుమారి, సాగిన బాలరాజు, కవడం మచ్చమ్మ, జమున, చింతపల్లి, పాడేరు, జీకేవీధి జెడ్పీటీసీలు కంకిపాటి పద్మకుమారి, పోలుపర్తి నూకరత్నం, గంటా నళినిలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానించాలని, కొండకుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదించాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు ఈ తీర్మానాల కోసం ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు లేచి నిలబడి నినాదాలు చేశారు. బాక్సైట్ అంశాన్ని ఎజెండాలో చేర్చాలన్నారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్పర్సన్ దీనిపై మౌనం వహించారు. జిల్లా కలెక్టర్ యువరాజ్ స్పందిస్తూ బాక్సైట్ అంశంపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని, ఐటీడీఏ పాలక మండలిలో తీర్మానం చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. ఐటీడీఏ పాలకవర్గం ద్వారా సబ్ కమిటీని వేసి బాక్సైట్‌పై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు పట్టు విడవలేదు. గత పాలక మండలి సమావేశంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానించి ప్రజా ప్రతినిధులు అందించిన తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి పంపించామని, ఈసారి ముఖ్యమంత్రి, ప్రిన్సిపాల్ సెక్రటరీలను తాను కలిసినప్పుడు ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకు వెళతానని కలెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి ఎమ్మెల్యేలు మళ్లీ అడ్డుతగిలారు. బాక్సైట్‌పై ఏ నివేదిక అయినా తవ్వకాలకు వ్యతిరేకంగానే ఉంటుం దని, దీనిపై తక్షణమే తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం ముందుకు సాగనివ్వకపోవడంతో కలెక్టర్ అరగంటసేపు వేచిచూస్తామని చెప్పి తర్వాత సమావేశం ముగిసినట్టు ప్రకటించారు. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు బాక్సైట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లారు. ఐటీడీఏ పీవో హరినారాయణన్‌తోపాటు, అన్ని శాఖల జిల్లా, డివిజన్‌స్థాయి అధికారులంతా హాజరయ్యారు. గిరిజన సంక్షేమంపై చిన్న చూపు... గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం అలక్ష్యం వహించిందని, పాలక మండలి సమావేశానికి సంబంధిత మంత్రులు హాజరుకాకపోవడం ఇందుకు నిదర్శనమని, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. గిరిజనుడిని గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఈ ప్రభుత్వం నియమించ లేకపోయిందని విమర్శించారు. పాలకవర్గ సమావేశానికి కచ్చితంగా ప్రభుత్వం తరపున మంత్రి హాజరయ్యేవారని, ప్రజా సమస్యలకు పరిష్కారం ఉండేదని, మంత్రులు హాజరుకాలేని పరిస్థితులు ఉంటే గతంలో ఐటీడీఏ పాలక మండలి సమావేశాలను వాయిదా వేసేవారని అన్నారు. మంత్రులు డుమ్మాకొట్టడం విచారకరమన్నారు. గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం నిధులు విదల్చడం లేదని, పథకాలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే తీరులో ఇలాంటి సమావేశాలు మిగిలిపోకూడదని, జవాబుదారీగా, గిరిజన సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పాలకమండలి సమావేశం వేదికగా ఉండాలని, ఇకనైనా పాలకవర్గ సమావేశాలను నిర్దుష్టంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు
- బాక్సైట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టుల సమావేశం - ఉద్యమాల్లో కలిసిరావాలని ప్రజాప్రతినిధులకు పిలుపు చింతపల్లి: మన్యంలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి కలిసిరాకపోతే తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మావోయిస్టు నేతలు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం జీకేవీధి మండలం మారుమూల ప్రాంతంలో కొందరు ప్రజా ప్రతినిధులతో మావోయిస్టులు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొన్నేళ్లుగా గిరిజనులు అలుపెరుగని ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజాభీష్టానికి మద్దతుగా తాము కూడా ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధంగా ఉన్నాము, బాక్సైట్ తవ్వకాల వల్ల వేలాది మంది గిరిజన కుటుంబాలు నిరాశ్రయులవుతారు. గిరిజనుల ఓట్లతో పదవులు పొందిన నాయకులంతా వారి అభీష్టం మేరకు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనాలని, లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించినట్లు తెలిసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని నీతులు వల్లించిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తవ్వకాలు చేపడతామంటే మౌనంగా ఉండటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని హెచ్చరించినట్లు తెలిసింది. ఏజెన్సీలోని టీడీపీ నాయకులు, ప్రజా ప్రతిని దులు ప్రజలకు మద్దతుగా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల్లో తప్పకుండా పాల్గొనాలని, తవ్వకాలు నిలిపివేసేందుకు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెట్టే బాధ్యత కూడా స్థానిక నేతలే తీసుకోవాలని దళసభ్యులు సూచించినట్లు తెలిసింది. పార్టీకు, పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమాలు చేయాలని, ప్రజల మద్దతు కోసం మొక్కుబడిగా ర్యాలీలు, ధర్నాలలో పాల్గొంటే తాము సహించమని హెచ్చరించి నట్లు తెలిసింది. అన్ని గ్రామాలలో నేతలపై ప్రజలే ఒత్తిడి తీసుకు వస్తారని, ఇతర రాజకీయపార్టీలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో ఉద్యమాలు చేయాలని సూచించినట్లు తెలిసింది. మావోయిస్టుల హెచ్చరికలతో టీడీ పీనేతల గుండెల్లో గుబులు చోటు చేసుకుంది. ఇప్పటికే కొంత మంది అధికార పార్టీ నాయకులు ప్రభుత్వం చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఇక సమరమే
మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రత్యక్షపోరుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం పాడేరులో నిర్వహించిన తొలి అఖిలపక్ష సమావేశంలో విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖనిజ తవ్వకాలను వ్యతిరేకించాయి. ఏజెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీల నాయకుల ఇళ్ల ముందు వచ్చే నెల మూడో తేదీన ఆందోళనకు తీర్మానించాయి. అలాగే చింతపల్లిలో భారీ బహిరంగ సభకు నిర్ణయించాయి. ఈ సమావేశానికి పర్యావరణ నిపుణులను రప్పించాలని తీర్మానించాయి. - బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్షపోరుకు విపక్షాలు సిద్ధం - సంఘటితంగా అడ్డుకోవాలని నిర్ణయం - 3న మండల కేంద్రాల్లో ఆందోళన - అఖిలపక్ష సమావేశంలో తీర్మానం పాడేరు: మన్యంలో బాక్సైట్ ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపించారు. బాక్సైట్ మాట ఎత్తనివ్వకుండా ఆది వాసీలు, గిరిజన సంఘాలను పోలీసులు నిర్బంధానికి గురి చేస్తున్నారని వాపోయారు. స్థానిక గిరిజన భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సారథ్యంలో మంగళవారం నిర్వహించారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఏజెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీల నాయకుల ఇళ్ల ముందు వచ్చే నెల మూడో తేదీన ఆందోళనకు తీర్మానించారు. అలాగే చింతపల్లిలో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. ఈ సమావేశానికి పర్యావరణ నిపుణులను రప్పించాలని తీర్మానించారు. ఆదివాసీలకు ఎరవేసి విలువైన ఖనిజాన్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాల నేతలు ధ్వజమెత్తారు. ఐక్య ఉద్యమాలతో అడ్డుకోవాలని, దీనికి అఖిలపక్షాలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, సీపీఎం, గిరిజన సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉద్యమాలకు సిద్ధమని ప్రకటించారు. గత ఎన్నికల ముందు బాక్సైట్‌ను వ్యతిరేకించిన బీజేపీ, తెలుగుదేశం పార్టీలే ఇప్పుడు తవ్వకాలకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆ రెండు పార్టీల నేతలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమంటూ గిరిజనులను మభ్యపెడుతున్నారని దుయ్యబ ట్టారు. ఇటీవల జర్రెలలో ప్రజలు ఏర్పాటు చేసిన సమావేశానికి తనను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టకుంటే పోలీసుల నుంచి ఇటువంటి నిర్బంధ చర్యలు ఎందుకని నిలదీశారు. గిరిజనులకు జీవన్మరణ సమస్య అయిన ఈ ఉద్యమానికి అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం నాయకుడు శంకురాజు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి పేరుతో బాక్సైట్ తవ్వకాలు అవసరం లేదని, కాఫీతో మన్యానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. బాక్సైట్ తవ్వితే పర్యావరణానికి ముప్పు తప్పదన్నారు. వ్యవసాయం, అడవులు నాశనమవుతాయని అన్నారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి శంకరరావు, ఏపీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎం శ్రీను మాట్లాడుతూ బాక్సైట్ వెలికితీస్తే గిరిజనులకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆదివాసీలకు వంద ఉద్యోగాలు రావని, 200 పై చిలుకు గ్రామాలు ధ్వంసమవుతాయన్నారు. ఏపీ గిరిజన సంఘం బాక్సైట్ ప్రభావిత 200 గ్రామాల్లో రెండు వారాలపాటు పాదయాత్రతో ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతుందని, ఐక్య ఉద్యమాలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జి.మాడుగుల ఎంపీపీ ఎం.వి.గంగరాజు మాట్లాడుతూ బాక్సైట్ వ్యవహారంపై చంద్రబాబు మొండి వైఖరి అవలంభిస్తున్నారని, ప్రజాభీష్టానికి విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలు జరిగితే ఉద్యమం తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాంగి సత్తిబాబు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
మళ్లీ బాక్సైట్ సెగ
ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధం కావాలని దళసభ్యుల పిలుపు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు మావోయిస్టు లేఖలు మారుమూల గూడేల్లో ఉద్రిక్త పరిస్థితులు మండల కేంద్రాల్లో సీపీఎం రాస్తారోకో బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు మన్యంలో ఊపందుకుంటున్నాయి. పాడేరు, అరకు ఎమ్మెల్యేలతోపాటు వామపక్షాలు దీనికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఖనిజ తవ్వకాల మాటతో రగిలిపోతున్న గిరిజనులను తమకు అనుకూలంగా మలచుకోడానికి మావోయిస్టులు పావులు కదుపుతున్నారు. పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలంటూ మన్యంలోని ప్రజాప్రతినిధులకు తాజాగా లేఖలు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం పెదబయలు, అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సర్పంచ్‌లు సమావేశమై ఖనిజ తవ్వకాలను వ్యతిరేకించాలని తీర్మానించారు. దీంతో ఇంత వరకు ప్రశాంతంగా ఉన్న మన్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. చింతపల్లి: చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లోని జర్రె ల, సప్పర్ల, కోరుకొండ ప్రాంతాలలో నిక్షిప్తమైవున్న బాక్సైట్ ఖనిజాన్ని వెలికితీసేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విదేశీ కంపెనీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మన్యంలో బాక్సైట్ తవ్వకాలతో వేలాది మంది నిరాశ్రయులవుతారు. ప్రధాన వాణిజ్యపంటైన కాఫీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోనే దీనిని వైఎస్సార్సీపీతోపాటు ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకించారు. ఆందోళనలు చేపట్టారు. నిజానికి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పు డే బాక్సైట్ తవ్వకాల అంశానికి బీజం పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో తవ్వకాలకు ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో మాజీ మంత్రి మణికుమారి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు జీకేవీధిభారీ బహిరంగ సభలో తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక మరోసారి బాక్సైట్ తవ్వకాల అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తవ్వకాలను అడ్డుకునేందుకు తమపార్టీ నేతలు, కార్యకర్తలను ఇప్పటికే సన్నద్ధం చేశారు. సోమవారంనాటి ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలోనూ ఇదే అంశం కీలకమైంది. వైఎస్సార్సీపీ నాయకులంతా బాక్సైట్‌కు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మావోయిస్టులు కూడా మరోసారి బాక్సైట్ వ్యతిరేక పోరాటం ఉధృతానికి ప్రణాళికలు రూపొందించారు. చింతపల్లి, జీకేవీధి మండలంలోని అన్ని పార్టీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రత్యేక లేఖలు రాశారు. బాక్సైట్ తవ్వకాల జోలికి రామని గతంలో పేర్కొన్న టీడీపీ నేతలు ఇప్పుడు విదేశీ కంపెనీలతో లాలూచీ పడి మన్యం ప్రజలను మోసం చేస్తున్నారని, అన్ని వర్గాల వారు దీనిని వ్యతిరేకించాలని ఆయా లేఖల్లో పేర్కొన్నారు. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు ఏజెన్సీ ప్రాంత గిరిజనులతోపాటు ఇక్కడ నివసిస్తున్న గిరిజనేతరులు, వ్యాపారులు కూడా సహకరించాలని కోరినట్టు తెలిసింది. సీపీఎం రాస్తారోకో అరకులోయ: బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానించాలంటూ నియోజవర్గం పరిధిలోని అరకులోయ, డుంబ్రిగుడ, పెదబయలు, అనంతగిరి మండల కేంద్రాల్లో సోమవారం రాస్తారోకో చేపట్టారు. సీపీఎం మండల కార్యదర్శి పొద్దు బాలదేవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జంక్షన్ వద్ద అరకులోయలో రాస్తారోకో నిర్వహించారు. బాలదేవ్ మాట్లాడుతూ రెండేళ్ల అనంతరం జరిగిన ఐటీడీఏ పాలక వర్గ సమావేశంలో గిరిజనులకు ముప్పుతెచ్చే బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానిస్తారని అంతా భావించారన్నారు. టీడీపీ నాయకులు, అధికారులు గౌరవ సభ్యుల నోరునొక్కేశారన్నారు. అరకులోయ ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత గిరిజనుల సంక్షేమానికి కృషి చేయకపోగా, కీలకమైన పాలక వర్గ సమావేశాన్ని డుమ్మా కొట్టడం సరికాదన్నారు. చంద్రబాబుతో కుమ్మక్కయి రాకుండా తప్పించుకున్నారన్నారు. ఐటీడీఏ ద్వారా బాక్సైట్ తవ్వకాలు చేపడతామని సీఎం చెబుతుంటే ప్రజాప్రతినిధిగా ఖండించకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు హరి, రామారావు, భగత్రామ్, తదితరులు పాల్గొన్నారు. -
'గిరిజన ద్రోహి మంత్రి రావెల'
పాడేరు(విశాఖపట్నం): ఏపీ సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గిరిజన ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావులు విమర్శించారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోవడంతో వారు నిరసన తెలిపారు. పాడేరులో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
బాక్సయిట్‌పై మహోద్యమం
బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఏజెన్సీవాసులు ఆందోళన బాట పడుతున్నారు. పాడేరు, అరకు ఎమ్మెల్యేల సారధ్యంలో మహోద్యమానికి ఉద్యుక్తులవుతున్నారు. గురువారం పెదబయలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. ప్రాణాలు పణంగా పెట్టయినా బాక్సైట్‌ను అడ్డుకుంటామని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. అసెంబ్లీలో బాక్సైట్ తవ్వకాల రద్దుపై తీర్మానం చేయాలని ఈశ్వరి డిమాండ్ చేశారు. పెదబయలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన్యంలోని బాక్సైట్ జోలికొస్తే తరిమికొడతామని ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం పెదబయలు మండల కేంద్రంలో మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ కూడిలిలో రాస్తారోకో నిర్వహించారు. మన్యంలో అపారమైన ఖనిజ సంపద ఉందని, దానిని వెలికితీస్తే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని గిరిజనులకు తాగునీరు దొరకని దుస్థితి దాపురిస్తుందన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయన్నారు. గిరిజనులు గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఖనిజాల తవ్వకాలపై జరుగుతున్న కుట్రలను గ్రామాల్లో ప్రజలకు వివరిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం కే ంద్రంతో చేతులు కలిపి బాక్సైట్ తవ్వకాలకు కుట్రపన్నుతోందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అరకు ప్రాంతాన్ని దత్తత తీసుకుంటాననడం గిరిజనులపై ప్రేమ కాదని, ఇక్కడి ఖనిజాలను కొల్లగొట్టడానికి కుట్రపన్నుతున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు లంబసింగి ప్రాంతంపై కన్నేశారని అన్నారు. వీటిని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని,వైఎస్సార్ సీపీ నాయకులు జర్సింగి సూర్యనారాయణ, సందడి కొండబాబు, పద్మాకరరావు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు వంతాల అప్పారావు, కాతారి సురేష్‌కుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సింహాచలం, గోమంగి ఎంపీటీసీ సభ్యుడు కూడ బొంజుబాబు పాల్గొన్నారు. -
బాక్సైట్ దోపిడీని అడ్డుకుంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ స్పష్టీకరణ {పజా సమస్యలపై పార్టీ నిరంతర పోరాటం ఎంపీ గీత కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి పాడేరు :విశాఖ ఏజెన్సీలో గిరిజనుల సంపదైన బాక్సైట్‌ను దోచుకుని రాజధాని నిర్మాణానికి ఉపయోగించాలనే ప్రభుత్వ కుట్రను ప్రాణాలు ఒడ్డైనా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలమంతా అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన ఇక్కడి ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటైన పాడేరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. బాక్సైట్ ఖనిజాలు తవ్వాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలను తామంతా అడ్డుకుంటామన్నారు. వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో బాక్సైట్ వ్యతిరేక పోరాటాలను ఉధృతం చేస్తుందని, అవసరమైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కూడా రప్పిస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు గిరిజనులందరికీ మేలు చేస్తానని హామీలు ఇచ్చి, ఇప్పుడు విస్మరించారని ఆరోపించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తన ప్రాంతంలో ఉన్న ఆన్‌రాక్ ఫ్యాక్టరీ పక్షాన నిలిచి బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు, ఆరు నెలల్లో తన నిజ స్వరూపం రుజువు చేసుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై ఉన్న అభిమానం, ఆదరణతో కొత్తపల్లి గీతను రికార్డు మెజార్టీతో ఎంపీగా గిరిజనులు గెలిపించారని అయితే ఆమె మాత్రం అధికారం, డబ్బు ఆశతో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పని చేస్తుండటం గిరిజనులను బాధిస్తుందన్నారు. బాక్సైట్‌కు కొత్తపల్లి గీత అనుకూలమో, వ్యతిరేకమో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భిక్షతో గెలిచిన కొత్తపల్లి గీతకు దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరకు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనుల పక్షాన వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. హుద్‌హుద్ తుఫానుతో ఏజెన్సీలోని కాఫీ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినా వాటిని పరిశీలించకుండానే మొక్కుబడి సాయాన్ని ప్రకటించారన్నారు. ఈ సమావేశంలో పాడేరు, చింతపల్లి, జీకేవీధి జెడ్పీటీసీ సభ్యులు పి.నూకరత్నం, పద్మకుమారి, నళిని, మహిళా విభాగం జిల్లా నేత పీల వెంకటలక్ష్మి, పాడేరు, జీకేవీధి, జి.మాడుగుల ఎంపీపీలు వర్తన ముత్యాలమ్మ, సాగిన బాలరాజు, ఎం.వెంకట గంగరాజు, పాడేరు మాజీ ఎంపీపీ ఎస్.వి.వి.రమణమూర్తి, కొయ్యూరు, పాడేరు వైస్ ఎంపీపీలు వై.రాజేశ్వరి, ఎం.బొజ్జమ్మ, పలు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచులు కర్రి నాయుడు, వారం చిట్టిబాబునాయుడు, కె.చంద్రమోహన్‌కుమార్, పాడేరు కో-ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్ జోగిరాజు, టి.ఎస్.రాందాసు, ఎ.బొంజునాయుడు, ఐసరం హనుమంతరావు, కె.చిన్నయ్య, చిట్టిబాబు, లకే రత్నాభాయి, సూరిబాబు, రామస్వామి, రఘునాథ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
బాక్సైట్ భగభగలు
⇒ తవ్వకాల ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ⇒ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలు అంతటా దహనం ⇒ తాడోపేడో తేల్చుకుంటామంటున్న సీపీఎం, గిరిజన సంఘాలు పాడేరు/చింతపల్లి: బాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యంలో మంటలు రేగుతున్నాయి. దీని తవ్వకాలకు ప్రయత్నాలు ముమ్మరం చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం, గిరిజన సంఘం నేతలు శనివారం పాడేరు, చింతపల్లి, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. డివిజన్ కేంద్రమైన పాడేరులో సీపీఎం, గిరిజన సంఘం నాయకులంతా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేశారు. సీఎం చంద్రబాబు నాయుడును గిరిజన ద్రోహిగా పేర్కొంటూ ఆ యన దిష్టిబొమ్మను దహనం చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రాణాలనైనా అర్పిస్తామంటూ సీపీఎం, గిరిజన సంఘం నాయకులు పాలికి లక్కు, ఎంఎం శ్రీను, సుందరరావు, వై.మంగమ్మలు ప్రకటించారు. చింతపల్లిలోనూ బాక్సైట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. ర్యాలీ అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మెయిన్‌రోడ్డు వద్ద కొంతసేపు రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం నేత బోనంగి చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఏజెన్సీలోని నేతలంతా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాల న్నారు. సీపీఎం నాయకులు గోపీనాయని తిరుపతి, శాంతి పాల్గొన్నారు. ముంచంగిపుట్టులో ముంచంగిపుట్టు: బాక్సైట్‌కు వ్యతిరేకంగా సీపీఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. సీపీఎం నాయకులు కె.త్రినాథ్, పి.శాస్త్రిబాబు, పి.సత్యనారయణలు మాట్లాడుతూ తవ్వకాలతో ఏజెన్సీ వాతావారణం, పంటలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో బాక్సైట్ ను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే బహుళజాతి కంపెనీలతో బేరసారాలు చేయడం దారుణమన్నారు. -
సమరోత్సాహం
బాక్సైట్‌పై మావోయిస్టుల యుద్ధం గ్రామాలలో చైతన్య సదస్సులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ఆదివాసీలు పాడేరు : ప్రభుత్వం బాక్సైట్ తుట్టె ను కదపడం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు కలిసొచ్చింది. విశాఖ ఏజెన్సీలో విలువైన ఈ ఖనిజాన్ని వెలికితీసి ఆర్థికంగా లాభపడాలనుకున్న టీడీపీ ప్రభు త్వ చర్యలు దళసభ్యులకు అనుకూలమయ్యాయి. బాక్సైట్ తవ్వకాలను వ్యతి రేకిస్తున్న ఆదివాసీలు మావోయిస్టులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా మన్యంలో స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంతో తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారు. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల మారుమూల ప్రాంతాలతోపాటు ఒడిశా సరిహద్దుల్లోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు మావోయిస్టు పార్టీ ఇటీవల శ్రీకారం చుట్టింది. కాకులు దూరని కారడవుల్లో గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తూ గిరిజనుల మద్దతును కూడగడుతున్నది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని నాయకులు కూడా విశాఖ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి గిరిజనులను మరింత చైతన్య పరుస్తున్నట్లు తెలిసింది. దీంతో విశాఖ ఏజెన్సీ, ఏఓబీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మారుమూల గూడేలు, ఒడిశాకు చెందిన గిరిజనులు కూడా మావోయిస్టుల పిలుపునకు స్పందించి బాక్సైట్ వ్యతిరేక సదస్సులకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అడవినే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలను అడవి నుంచి తరమికొట్టే ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలనే మావోయిస్టుల పిలుపునకు మారుమూల గిరిజనులు స్పందిస్తున్నారని చెప్పడానికి ఇటీవల మావోయిస్టులు నిర్వహించిన సదస్సులే నిదర్శనం. ఈ పరిస్థితితో పోలీసుశాఖ అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున కూంబింగ్‌కు సమాయత్తం అవుతుంది. ఇప్పటికే చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు, మావోయిస్టుల బూటు చప్పుళ్లతో అటవీ ప్రాంతాలు మారు మోగుతున్నాయి. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
తవ్వితే కష్టమే!
‘దేశం’ నేతల్లో బాక్సైట్ గుబులు! ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేక పోరాటం చేసింది మనమే సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేల తీర్మానం అడ్డుకునేందుకు ఉమ్మడి ప్రయత్నాలు! ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ అనుకూల నిర్ణయం స్వపక్షంలోనే గుబులు రేపుతోంది. ఒకపక్క ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, మరోపక్క వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుండడం, దానికి గిరిజ నుల నుంచి భారీగా మద్దతు లభిస్తుండడంతో జిల్లా ప్రజాప్రతినిధులకు సంకటంగా మారింది. సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదిలోనే స్వపక్షం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి బాక్సైట్ తవ్వకాలు వ్యతిరేకించి తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సమ్మతిస్తే ప్రజల్లో అభాసుపాలవుతామని సొంత పార్టీ మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సీఎం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న మన్యంలో మళ్లీ మావోయిస్టులు బలపడేందుకు స్వయంగా ప్రభుత్వమే పూనుకున్నట్లు అవుతుదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధిపై చర్చించడానికి మంత్రి గంటా ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు. ఇందులో ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించి ఆయనతో నిర్ణయం ఉపసంహరించేలా చేయాలని తీర్మానించారు. ‘విశాఖ జిల్లా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఆదిశగా ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి పోరాటం చేసింది మనమే. కాని ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్లీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మనమే చేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. అందుకే ఎమ్మె ల్యేలు, మంత్రులు అంతా కలిసి సీఎం చంద్రబాబును కలుద్దాం. బాక్సైట్ తవ్వకాల అనుమతులు ఇవ్వకుండా ఆయన్ను ఒప్పిద్దాం. వాస్తవాలు వివరించకపోతే ఆతర్వాత నష్టపోయేది మనమే’.. అంటూ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో గంటాకు వివరించారు. దీంతో ఆయనకూడా పార్టీ నేతల అభిప్రాయంతో ఏకీభవించారు. భేటీకి మరో మంత్రి అయ్యన్న హాజరుకాకపోయినా ఆయన కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి గంటా దృష్టికి తీసుకువచ్చారు. విశాఖ అభివృద్ధికి అసెంబ్లీలో సీఎం ప్రకటించిన ప్రాజెక్టులే కాకుండా మరిన్ని కొత్తవి తెచ్చుకోవడంతోపాటు నగరాభివృద్ధికి ఇంకా ఏంచేయాలి? అనేదానిపై మంత్రి గంటా, ఎమ్మెల్యేలు చర్చించారు. విశాఖ అభివృద్ధితోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చాలా కీలకమని అందువల్ల మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిచేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టులు, ఐఐటీ, మెడికల్ కాలేజీలు, ఐఐఎంలతోపాటు ఉత్తరాంధ్రకు పెద్దదిక్కైన కేజీహెచ్ అభివృద్ధి ఇలా అన్ని ప్రాజెక్టులు మూడు జిల్లాలతో ముడిపడి ఉన్నందున జిల్లాల వారీగా విడిపోయి ప్రయత్నించే బదులు ఉత్తరాంధ్ర మంత్రులు,ఇతర ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే మేలనే భావనకు వచ్చారు. ముఖ్యంగా రైల్వేజోన్ సాధన కోసం చంద్రబాబు అనుమతితో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలని ఉమ్మడి నిర్ణయం వెలిబుచ్చారు. అయ్యన్న డుమ్మా.. : జిల్లా అభివృద్ధిపై మంత్రి గంటా నిర్వహించిన భేటీకి మరో మంత్రి అయ్యన్న గైర్హాజరు కావడం మరోసారి ఇద్దరిమంత్రుల మధ్య ముదిరిన విబేధాలను స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచీ ఈ ఇద్దరు ఉప్పునిప్పుగా ఉంటున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సైతం ఇద్దరినీ పిలిచి క్లాస్ పీకినా మంత్రుల్లో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా ఆదివారం నాటి భేటీకి అయ్యన్నతోపాటు ఆయన వర్గం విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా హాజరుకాలేదు. ముందే హెచ్చరించిన వైఎస్సార్ సీపీ వాస్తవానికి గత నెలలో సీఎం చంద్రబాబు నగరంలో జరిగిన గిరిజన సదస్సుకు హాజరై ఏజెన్సీలో బాక్సైట్ తవ్వితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రకటించారు. ఆ వెంటనే నిరసనగా వైఎస్సార్సీపీ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డిఈశ్వరి,కిడారి సర్వేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మన్యం జోలికి రావద్దని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏజెన్సీలోని 11 మండలాల గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు రోజుల తరబడి ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్సీపీ సైతం మద్దతుగా నిలిచి పోరాటబాట పట్టింది. ఇటీవల కొందరు మావోయిస్టులు సైతం బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం చేపడతామని ప్రకటించారు. దీంతో వరుసపెట్టి ప్రభుత్వనిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతుండడంతో జిల్లా అధికార పార్టీలో కాక రేపింది. -
బాక్సైట్ భయం
ఐటీడీఏ అధికారుల్లో ఆందోళన మారుమూల ప్రాంతాల్లో పర్యటనకు వెనకడుగు పాడేరు ఐటీడీఏను ఇప్పుడు బాక్సైట్ భూతం భయపెడుతోంది. పార్టీలకతీతంగా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తుండగా జనం ఇప్పటికే రోడ్లపైకి వస్తుండడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. పులిమీద పుట్రలా మావోయిస్టులు ఐటీడీఏను టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. పాడేరు : ఐటీడీఏ ద్వారా బాక్సైట్ తవ్వకాలు చేపట్టి గిరిజనుల అభివృద్ధికే నిధులను వెచ్చిస్తామని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9న విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి పాడేరు ఐటీడీఏ పైనే పడింది. గిరిజనుల సంక్షేమం కోసం ఆవిర్భవించిన ఐటీడీఏను బాక్సైట్ తవ్వకాల వ్యాపార సంస్థగా మార్చి వేయనుందనే ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో ఏజెన్సీ అంతటా పార్టీలకతీతంగా ఆందోళన మొదలైంది. ప్రశాంతంగా ఉన్న పాడేరు ఐటీడీఏలో బాక్సైట్ తవ్వకాల ప్రకటన కలకలం రేపింది. పులిమీద పుట్రలా మావోయిస్టులు కూడా బాక్సైట్ తవ్వకాల ప్రకటనను నిరసిస్తు ఈ కార్యాలయాన్ని కూల్చివేస్తామని ప్రకటించడం అధికారులను కలవరానికి గురి చేస్తోంది. ఐటీడీఏ కార్యాలయ సముదాయంలో ప్రాజెక్టు ఆఫీసర్ చాంబర్‌తోపాటు కాఫీ, ఉద్యానవనం, వ్యవసాయ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగాలు, గిరిజన సంక్షేమ డీడీ కార్యాలయం, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, జాతీయ ఉపాధి హామీ పథకం విభాగాలు పని చేస్తున్నాయి. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాల ప్రకటన వీరందరినీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. ముఖ్యమంత్రి ప్రకటన సమయం నుంచి ప్రాజెక్టు అధికారితో సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు మారుమూల గ్రామాల పర్యటనలకు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు అధికమవడం, బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టడంతో అధికార యంత్రాంగం మారుమూల ప్రాంతాలకు వెళ్లడంలేదు. ప్రశాంతంగా ఉన్న ఐటీడీఏకు బాక్సైట్ తవ్వకాల ప్రకటన అశాంతిని నెలకొల్పింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యాలయంపేనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ కార్యాలయ ప్రాంతంలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు జరిగినా అప్రమత్తమవుతోంది. ఇక్కడ అధికారులకు కూడా పలు సూచనలు జారీచేసినట్లు కూడా సమాచారం. -
‘మావో’..రేవో!
బాక్సైట్‌పై మన్యంలో మళ్లీ అలజడి బహిరంగంగా మావోయిస్టుల సభలు భారీ విధ్వంసాలకు వ్యూహం? ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, విశాఖ ఏజెన్సీలో మళ్లీ యుద్ధమేఘాలు అలముకున్నాయి. బాక్సైట్‌పై చావో రేవో అన్నట్లు మావోయిస్టులు ఉద్యమాన్ని ముందుకు నడపాలని భావిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ కాస్త ప్రశాంతంగా ఉన్న మన్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, కేవలం మిలీషియా వ్యవస్థే కొద్దిపాటిగా పని చేస్తోందని పోలీసు యంత్రాంగం భావిస్తున్న తరుణంలో.. అగ్నికి ఆజ్యం పోసినట్లు బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రశాంతమైన మన్యంలో అశాంతికి కారణమైంది. పాడేరు: గిరిజనుల్లో తమ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో మావోయిస్టులంతా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రధాన అజెండాగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో బాకై ్సట్ తవ్వకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉండటంతో ఈ చర్యలను అడ్డుకునే ప్రయత్నంలో బాకై ్సట్ వ్యతిరేక ఉద్యమాన్ని మావోయిస్టులు ఉధృతం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యమంతో మావోయిస్టు పార్టీ గిరిజనులతో మమేకమయ్యేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మారుమూల పల్లెల్లో ప్రజాకోర్టుల నిర్వహణను వేగవంతం చేస్తోంది. ఏజెన్సీలోని అన్ని రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలను కూడా బాకై ్సట్ ఉద్యమానికి సహకరించాలని మావోయిస్టు పార్టీ ప్రకటనలు చేస్తోంది. అలజడి మొదలైంది ఇలా..! కొద్దిరోజుల క్రితం జి.మాడుగుల మండలంలోని మారుమూల కిల్లంకోట ప్రాంతంలో పోలీసు ఇన్ఫార్మర్ పేరిట బాలకృష్ణ అనే గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చి పోలీసులకు సవాల్ విసిరారు. ప్రజాకోర్టును నిర్వహించారు. తాజాగా శనివారం కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దులో గాలికొండ దళ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాక్సైట్ వ్యతిరేక సదస్సును నిర్వహించిన విషయం విదితమే. ఈ సదస్సుకు ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరుకావడంతో మావోయిస్టు పార్టీలో నూతనోత్సాహం ఏర్పడింది. అలాగే ఒడిశాలోని మాచ్‌ఖండ్ ఏఎస్ఐ నివాస గృహంలో బాంబులు అమర్చి మరింత భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే తరహాలో అన్ని మారుమూల గ్రామాల్లోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల పేరిట సదస్సులు నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ నేతలు నిర్ణయించినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీకి కొత్త క్యాడర్? ఏఓబీ, విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు కొత్తక్యాడర్ రూపుదిద్దుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల ఏఓబీలో సంచరించి కీలకమైన సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఛతీస్ఘడ్ రాష్ట్రంలో పని చేసిన కొంత మంది మావోయిస్టు నేతలను ఏఓబీలోకి రప్పించినట్లు తెలుస్తుంది. గాలికొండ, కోరుకొండ దళాల్లో కూడా కొత్తక్యాడర్ నియమితులైనట్లు సమాచారం. మరికొన్ని ప్రాంతాలను వేదికగా చేసుకొని కొత్త దళాల ఏర్పాటు, యువతను భాగస్వామ్యం చేసి మావోయిస్టు ఉద్యమాన్ని మరింత ఉధతం చేసే ఆలోచనలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లో గ్రామస్థాయి పోరాట కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. పోలీసుల్లో గుబులు! మావోయిస్టుల ఉనికి లేదంటున్న పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో మళ్లీ గట్టి నిఘా పెట్టాల్సివస్తోంది. ఇందుకు ఇన్ఫార్మర్ల వ్యవస్థపైనే వారు అధికంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఉలిక్కిపడిన పోలీసులు సీలేరు : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఒకే రోజు మావోయిస్టులకు సంబంధించిన సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ ప్రాంత పోలీసులు ఉలిక్కి పడ్డారు. కొయ్యూరు, జీకేవీధి సరిహద్దు ప్రాంతాల్లో బహిరంగ సభ పెట్టడం, ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడం, ఒడిశా ఒనకఢిల్లీలో ఒక పోలీసు అధికారి ఇంటిలో మావోయిస్టులు బాంబు పెట్టారన్న అంశాలు కలకలం రేపడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై ఆదివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీలేరులో ఆదివారం జరిగిన వారపుసంతలో సీఆర్పీఎఫ్ బలగాలు అణువణువూ గాలింపు చేపట్టారు. అనుమానితులను ఆరాతీసి విడిచిపెట్టారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఎవరైనా చర్యలకు ఉపక్రమిస్తే బుద్ధి చెబుతామని ప్రకటించడంతో, అధికార పార్టీ కావడంతో టీడీపీ నాయకులకు గుబులు పట్టుకుంది. -
ఎర్రబడుతున్న ఏజెన్సీ
* బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలోకి మావోయిస్టులు * విశాఖ ఏజెన్సీలో బహిరంగ సభ నిర్వహణ * గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుకు ప్రణాళిక * ‘బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్’అని అల్టిమేటం * ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకూ హెచ్చరిక * చత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టు అగ్రనేతల పర్యవేక్షణ! * ప్రతివ్యూహానికి పోలీసుల సమాయత్తం * ఏదేమైనా సరే తవ్వుతామంటున్న అధికారపార్టీ నేతలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాల అంశం కేంద్ర బిందువుగా విశాఖ ఏజెన్సీ ‘ఎరుపెక్కుతోంది’. విశాఖ ఏజెన్సీలో అపారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలను తవ్వాలన్న సీఎం చంద్రబాబు ప్రకటన ఏజెన్సీలో కొన్ని రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే గిరిజనులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గళమెత్తాయి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే స్పందించిన మావోయిస్టు పార్టీ తాజాగా ప్రత్యక్ష కార్యాచరణకు ఉపక్రమించింది. విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు-జీకే వీధి మధ్య ఓ ప్రదేశంలో మావోయిస్టు పార్టీ గిరిజనులతో శనివారం బహిరంగ సభ నిర్వహించింది. మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ, ఆదివాసీ విప్లవ రైతుకూలీ సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశానికి దాదాపు 600మందికిపైగా గిరిజనులు సంప్రదాయ ఆయుధాలు చేతబట్టి హాజరుకావడం గమనార్హం. ‘చంద్రబాబు డౌన్ డౌన్... బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం... మన్యాన్ని పరిరక్షించుకుంటాం’అని నినదించారు. ఈ సందర్భంగా మావోయిస్టు నేతలు మాట్లాడుతూ... ఐటీడీయే ముసుగులో ప్రైవేటు సంస్థలకు బాక్సైట్ నిల్వలను కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు ప్రస్తుతం సామ్రాజ్యవాద శక్తులకు తొత్తుగా మారారని దుయ్యబట్టారు. దంతేవాడ నుంచి అగ్రనేతల పర్యవేక్షణ! బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని విశాఖ ఏజెన్సీలో మళ్లీ పాగా వేసేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కొన్నేళ్ల క్రితం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) నుంచి చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడకు తరలివెళ్లిన మావోయిస్టు అగ్రనేతలు ఈ ఉద్యమ ప్రణాళికను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. దంతేవాడలో గొప్ప ఫలితాలనిచ్చిన వ్యూహాన్నే బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి అన్వయించి మన్యంపై పట్టు సాధించాలన్నది పార్టీ వ్యూహం. ఇందులో భాగంగానే బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించింది. ‘మన్యం పితూరీ సైన్యం’పేరిట ఏజెన్సీలో గ్రామగ్రామాన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. సామాన్య గిరిజనులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు తప్పనిసరిగా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. బాక్సైట్ తవ్వకాలను సమర్థించే ఏ ఒక్క ప్రజాప్రతినిధినీ మన్యంలో తిరగనీయమని తేల్చిచెప్పింది. మావోయిస్టు పార్టీ నిర్వహించిన ఈ సమావేశంలో గాలికొండ ఏరియా కమిటీ ఇన్చార్జ్ జాంబ్రీ పాల్గొన్నట్లు తెలుస్తోంది. గిరిజనులతో మావోయిస్టులు సమావేశం నిర్వహించారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు ప్రాబల్యం పెంచుకోకుండా కట్టడి చేయడంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు సమాచా రం. దీనిపై నర్సీపట్నం ఏఎస్సీ సత్య ఏసుబాబును ‘సాక్షి’ సంప్రదించగా మన్యంలో మావోయిస్టులు బాక్సైట్ వ్యతిరేక బహిరంగ సభ నిర్వహించిన విషయం తమకు తెలిసిందన్నారు. దీని పూర్వాపరాలు తెలుసుకున్న తరువాత తగిన కార్యాచరణ ప్రణాళిక చేపడతామన్నారు. -
బాక్సైట్ జోలికొస్తే.. బుల్లెట్‌తో బుద్ధి
మావోయిస్టుల హెచ్చరిక కారడవుల్లో భారీ సమావేశం పోరుకు రాజకీయ నేతలకు పిలుపు పెద్ద ఎత్తున గిరిజనుల హాజరు అనేక గ్రామాల్లో గిరిజనుల ర్యాలీలు, నిరసనలు చింతపల్లిరూరల్: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల జోలికి వస్తే ఆయుధాలతో బుద్ధి చెబుతామని గాలికొండ ఏరియా కమిటీ, ఆదివాసీ విప్లవ రైతుకూలీ సంఘం నేతలు హెచ్చరించారు. శనివారం కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన సంప్రదాయ ఆయుధాలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వందలాదిగా తరలి వచ్చిన ఆదివాసీలను ఉద్దేశించి సమావేశంలో విప్లవ నేతలు మాట్లాడారు. అడవిపై సర్వాధికారాలు ఆదివాసీలకే ఉన్నప్పటికీ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకుపోయేందుకు ప్రయత్నం చేపడుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఆదివాసీలంతా బుద్ధి చెప్పాలని కోరారు. సంవత్సరాల కాలంగా అడవిలో ఉన్న సంపదను కాపాడుకుంటున్న ఆదివాసీలకు అన్ని రకాలుగా ముప్పు వాటిల్లే ప్రయత్నాన్ని చేపడుతున్న ప్రభుత్వాన్ని గ్రామగ్రామాన ఆదివాసీలంతా ఎదురొడ్డి పోరాటం చేయాలన్నారు. మన్యం పితూరి సైన్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు. విలువైన బాక్సైట్‌ను ఏదో ఒకలా తరలించుకుపోయేందుకు ప్రతి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. నిన్న మొన్నటి వరకు తాము బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏవేవో బూటకాలు చెబుతూ ఐటీడీఏ పేరున దొడ్డిదారిన బాక్సైట్ తవ్వకాలను చేపడతామని ప్రకటించిందని మావోయిస్టు నేతలు గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని బట్టి అడవిలో ఉన్న సంపదపై సామ్రాజ్యవాదులు దృష్టి సారించారని అర్ధమవుతోందని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలతో మన్యసీమకు ఎంతో నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని, అన్ని రాజకీయ పక్షాలు చిత్తశుద్ధితో ఉద్యమాలు చేపట్టాలని కోరారు. ఏజెన్సీలో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపడుతోందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఉద్యమకారులై పోరాడాలని సూచించారు. తుపాకీ తూటాలతోనే నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వచ్చే దొంగలను తరిమి కొట్టేందుకు సంప్రదాయ ఆయుధాలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన్యంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమంలో పాత్ర వహించాలని కోరారు. కొయ్యూరు, జీకేవీధి మండలాల నుంచి ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయ కత్తి, గొడ్డలి, విల్లంబులతో ఆడ, మగ తేడా లేకుండా ఈ సమావేశానికిహాజరయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టు నేతలతో కలిసి పెద్ద ఎత్తున ఆదివాసీలు నినాదాలు చేశారు. ఈ నినాదాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. -
మన్యంలో ‘బాక్సైట్’పై యుద్ధమేఘాలు!
తవ్వకాలకు వ్యతిరేకంగా ‘మావో’ల కమిటీలు! మూడు వారాల నుంచి నియామకాలు? కమిటీల నిర్వహణలో యువతకు భాగస్వామ్యం పెదబయలు : మన్యంలో బాక్సైట్ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పీసా చట్టం అమలుకు ప్రభుత్వం గ్రామసభల ద్వారా కమిటీలు ఏర్పాటు చేస్తుంటే, దానికి దీటుగా ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు మావోయిస్టులు మన్యంలోని 11 మండలాల్లోనూ బాక్సైట్ వ్యతిరేక కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మూడు వారాల నుంచి కమిటీల ఏర్పాటు జరుగుతుండగా, గ్రామాల్లో ఉన్న మిలీషియా కమిటీలు, మండలాల్లో దళాలు నూతనంగా ఏర్పడిన బాక్సైట్ వ్యతిరేక కమిటీలకు సూచనలు, సలహాలిస్తూ పని చేస్తుందని సమాచారం. మన్యంలో ఉన్న బాక్సైట్ ఖనిజాన్ని వెలికి తీస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢంకాపథంగా చెబుతుండంతో ఇప్పటికే గిరిజన సంఘాలు గిరిజనులను ఉద్యమాలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ మావోయిస్టుల ఉనికి బలహీన పడిందని ప్రభుత్వం, పోలీసు నిఘావర్గాలు వెల్లడిస్తున్న ఈ తరుణంలో, వారు తమ ఉనికి కోల్పోకుండా గిరిజనులకు మరింతా చేరువయ్యేందుకు తమ వంతుగా బాక్సైట్ ఉద్యమానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నూతన కమిటీల ద్వారా గ్రామాల్లో బస చేసి బాక్సైట్ తవ్వకాల వల్ల జరిగే నష్టాలు, ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టే వ్యూహంపై కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిసింది. దీనికి కీలకంగా యువతపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు భోగట్టా. గ్రామాల్లో ఉన్న యువతను, ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఈ కమిటీల్లో చేర్పి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు వినికిడి. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం మన్యంలో ఎక్కడ రోడ్లు వేసినా, ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా వాటిని అడ్డుకోవాలని కమిటీలకు సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. -
బాక్సైట్ సభ ఆటంకానికి యత్నం
జర్రెలలో బహిరంగ సభ ప్రభుత్వం తీరుపై గిరిజనుల ఆందోళన పెద్ద ఎత్తున మోహరించిన బలగాలు పోలీసులతో నేతల వాగ్వాదం జీకేవీధి: బాక్సైట్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ, పలు పార్టీల ప్రజా ప్రతినిధులు ఆదివారం మండలంలోని జర్రెలలో చేపట్టిన సభకు గిరిజనులు హాజరుకాకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సభ నిర్వహించకుండా విఫలయత్నం చేశారు. ఉదయం 8 గంటల నుంచేఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించారు. చింతపల్లి మీదుగా జర్రెల వెళ్ళే రహదారిలో చౌడుపల్లి వద్ద తనిఖీలు చేపట్టారు. మన్యంలోని విలువైన ఖనిజ సంపదను కాపాడుకునే ప్రయత్నంలో మారుమూల జర్రెల, మొండిగెడ్డ, వంచుల పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల గిరిజనులు ఈ సభకు హాజరు కావాలి. పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తారోనన్న భయంతో అనేక గ్రామాల గిరిజనులు రాలేకపోయారు. ముందుగానే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ మారుమూల గ్రామాల గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. సభ జరుగుతుండగా ఓ గిరిజనుడ్ని అదుపులోకి తీసుకోవడంతో ప్రజా ప్రతినిధులు. పోలీసుల మధ్య సుమారు 2 గంటలపాటు వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశంలో వివిధపార్టీల నాయకులు మాట్లాడుతుండగా గునుకురాయికి చెందిన సూకూరు చిన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గతంలో కేసులు ఉన్నాయని అందుకే తమ వెంట తీసుకు వెళుతున్నామని చెప్పడంతో అక్కడున్నవారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజా ప్రతినిధులంతా పట్టుబట్టడంతోఎట్టకేలకు పోలీసులు అతడ్ని విడిచి పెట్టారు. -
పోరుబాట
ఉద్యమాలకు సిద్ధమవుతున్న గిరిజనం జర్రెలలో నేడు భారీ సభ 21న పాడేరు రానున్న రాఘవులు బాక్సైట్ తేనెతుట్టె కదులుతోంది. అటవీ సంపద జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఏజెన్సీవ్యాప్తంగా వ్యతిరేక ఉద్యమానికి గిరిజనం సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖనిజం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేయించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏకంగా తవ్వకాలకు నిర్ణయించినట్టు ప్రకటించడాన్ని ఆదివాసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాణాలు ఎక్కుపెడుతున్నారు. సీఎం వైఖరిని నిరసిస్తూ జీకేవీధి మండలం జర్రెలలో ఆదివారం ఆందోళనకు నిర్ణయించారు. పాడేరు: బాక్సైట్ ఖనిజ నిల్వలకు విశాఖ ఏజెన్సీ పెట్టింది పేరు. ఇక్కడున్నంత విలువైన ఖనిజం మరెక్కడా లేదు. అరకులో 54.47మిలియన్ టన్నులు, సప్పర్లలో 210.25మిలియన్‌టన్నులు, జీకేవీధిలో 38.42, జెర్రెలలో 224.60 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు గతంలో నిపుణులు వెల్లడించారు. లక్షల కోట్ల విలువైన ఈ సంపదను వెలికితీస్తే ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వస్తుందని తేల్చారు. వాస్తవాని కి వీటి తవ్వకాలతో జలాశయాలు దెబ్బతిని మైదానంలోని నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోతుంది. ప ర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఐటీడీఏలకు తవ్వకాల బాధ్యత అప్పగిస్తామని చెబుతున్న సీఎం అసలు దానికి తవ్వకాల నైపుణ్యమే లేనప్పుడు ఇదెలా సాధ్యమనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోపక్క చంద్రబాబు ప్రకటనపై గిరిజన సంఘాలు,పర్యావరణ సంస్థలు మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బాక్సైట్ జోలికి వస్తే ప్రాణాలైనా ఒడ్డి గిరిజనుల సంపదను కాపాడుతామని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు హెచ్చరించారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివారం జర్రెలలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్టు జర్రెల సర్పంచ్ అడపా విజయకుమారి, ఎంపీటీసీ సభ్యురాాలు ఉగ్రంగి జగ్గమ్మ తెలిపారు. పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘా లు, గిరిజనులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సీపీఎం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలు ఇటీవల సాగాయి. ఆందోళనకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఇప్పటికే పిలుపునిచ్చాయి. సీపీఎం కూడా ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఆపార్టీ రాష్ట్ర నేత బివి రాఘవులు ఈ నెల 21న పాడేరు వస్తున్నారు. ఉద్యమానికి ఆరోజు ప్రణాళికను రూపొందిస్తారు. బీజేపీ నాయకులు కురసా బొజ్జయ్య, కురసా రాజారావు తదితరులు బాక్సైట్‌కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. -
''బాక్సైట్ జోలికి రావొద్దు''
-
బాక్సైట్ గభగలు
మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు గిరిజన సంఘాల ఆందోళన, రాస్తారోకో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం అధినేత వైఖరితో టీడీపీలోనూ అంతర్మథనం మన్యంలో బాక్సైట్ వివాదానికి మరోసారి తెరలేపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై గిరిజనులు భగ్గుమంటున్నారు. విశాఖ ఏజెన్సీలో ఉన్న అపారమైన ఈ ఖనిజాన్ని ఐటీ డీఏ ఆధ్వర్యంలో వెలికితీయడానికి అనుమతిస్తున్నట్టు శనివారం గిరిజన సదస్సులో ఆయన ప్రకటించడంపై అడవిబిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపద జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఏజెన్సీవ్యాప్తంగా మరో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి గిరిజనులు సిద్ధమవుతున్నారు. పాడేరు: బాక్సైట్‌ను అక్రమంగా తవ్వి గిరిజనుల ఉనికినే ప్రశ్నార్థకం చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారంటూ ఏజెన్సీలో అన్ని వర్గాల గిరిజనులు విమర్శిస్తున్నారు. గిరిజన చట్టాలు, హక్కులను నిర్వీర్యం చేసి అటవీ సంపదను దోచుకోవడానికి టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు మళ్లీ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నా రు. ఇందుకోసం వివిధ రాజకీయ పక్షాలు, గిరి జన సంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నా రు. బాక్సైట్ జోలికి వస్తే ప్రాణాలైనా ఒడ్డి గిరి జ నుల సంపదను కాపాడుతామని ఇప్పటికే వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు హెచ్చరించారు. మరోవైపున బాబు వైఖరితో స్థానిక టీడీపీ నేతలు కూడా సతమతమవుతున్నారు. పదేళ్లుగా బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి బాక్సైట్‌ను తవ్వి అభివృద్ధి చేస్తానని ప్రక టించడాన్ని ఆ పార్టీ నేతలే ఖండిస్తున్నారు. ఏజెన్సీలో టీడీపీ ఇప్పటికే మనుగడ కోల్పోయింది. సర్పంచ్, స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గిరిజనులు తిరస్కరించారు. వారి విశ్వాసాన్ని చూరగొనాల్సిందిపోయి ‘దేశం’ ప్రభుత్వాధినేత గిరిజనుల సంపదనే దోచుకునే విధంగా ప్రకటించడం మన్యం లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ గిరిజ న సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లో సురేం ద్ర ఆధ్వరంయలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్ జంక్షన్లో సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల కేంద్రం డుం బ్రిగుడలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పెదబయలులో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాక్సైట్ జోలికొస్తే తరిమి కొడతామంటూ హెచ్చరించారు. ముంచంగిపుట్టులో వైఎస్సార్ సీపీ నాయకుడు పాంగి పాండురంగస్వామి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. గిరిజన సంఘం ఆందోళన ఏజెన్సీలోని బాక్సైట్ జోలికి వస్తే ఖబడ్దా ర్ అంటూ గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం పాడేరులో ఆం దోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందు గా పాడేరు వీధుల్లో ర్యాలీ నిర్వహించి బాక్సైట్ తవ్వకాల యోచనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీడీఏ ఎదు ట రాస్తారోకో చేపట్టి సీఎం చంద్రబాబు వైఖరిని దుయ్యబట్టారు. బాబును గిరిజ న ద్రోహిగా పేర్కొంటూ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అవహేళన చేశారని విమర్శించారు. పీసా చట్టం ప్రకారం మైనిం గ్‌కు గ్రామ సభల అనుమతి తప్పనిసరి అయినా సీఎం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, బడాబాబులకు గిరిజన సంపదను దోచి పెట్టేందుకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమాన్ని ఏజెన్సీవ్యాప్తంగా ఉధృతం చేస్తామని, అన్ని రా జకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో ఐక్యపోరాటం చేస్తామని చెప్పారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.అప్పారావు, సీఐటీయూ నేత ఎల్.సుందరరావు, గిరిజన సంఘం నాయకులు రాందాసు, విశ్వనాథం పాల్గొన్నారు. టీడీపీ ఆలోచన దుర్మార్గం బాక్సైట్ తవ్వకాలు చేపడతామని సీఎం ప్రకటించడం అత్యంత దుర్మార్గమని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏజెన్సీ అంతటా మహోద్యమం చేపడతామన్నారు. గిరిజనాభివృద్ధిని బాక్సైట్‌తో ముడిపెట్టడం టీడీపీ ద్వంద్వ పాలనకు నిదర్శనమన్నారు. గిరిజనులంతా వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారనే అక్కసుతోనే చర ద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిని ప్రతి గిరిజనుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అన్ని రాజకీయ పక్షాలు, గిరిజన ఉద్యోగ, విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమం చేస్తుందన్నారు. అవసరమైతే ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీస్థాయిలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని చేపడతానని స్పష్టం చేశారు. - సర్వేశ్వరరావు, అరకు ఎమ్మెల్యే -
అప్పుడు కాదని..ఇప్పుడు ఔనని
బాక్సైట్‌పై మాట మార్చిన సీఎం బాబు నాడు వ్యతిరేకించి నేడు పచ్చజెండా సీఎం వ్యాఖ్యలపై నిరసన మళ్లీ పోరుకు సన్నాహాలు సాక్షి,విశాఖపట్నం: ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల తేనెతుట్టె మళ్లీ కదిలింది. ఇప్పటివరకు తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న గిరిజనులు,పర్యావరణకారులను కాదని తమ ప్రభుత్వం వీటిని తవ్వితీస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో నిరసనలు మిన్నంటుతు న్నాయి. ఒకరకంగా బాబు బాక్సైట్ నిల్వలపై ద్వంద్వ వైఖరిని చాటుకున్నట్లైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖనిజం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించి, ఉద్యమాలు చేయించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే సీఎం హోదాలో ఏకంగా తవ్వకాలు చేపట్టడానికి నిర్ణయించినట్లు ప్రకటించడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. గిరిజనుల బతుకులకు, పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతాయనే సాకుతో ప్రతిపక్షంలో ఉండి తవ్వకాలను అడ్డుకోగా, ఇప్పుడు తమ ప్రభుత్వం వీటిని తవ్వితీస్తుం దని ప్రకటించడంతో గిరిజనులు మండిపడుతున్నారు. అపారమైన నిల్వలు.. ఏజెన్సీ బాక్సైట్ ఖనిజ నిల్వలకు పెట్టింది పేరు. ఇక్కడున్నంత విలువైన ఖనిజం మరెక్కడా లేదు. అరకులో 54.47మిలియన్ టన్నులు, సప్పర్లలో 210.25మిలియన్‌టన్నులు, గూడెంలో 38.42, జెర్రెలలో 224.60 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అప్పట్లో నిపుణులు వెల్లడించారు. లక్షలకోట్ల విలువైన ఈ సంపదను వెలికితీస్తే ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వస్తుందని తేల్చారు. అప్పటి సీఎం వైఎస్ కొన్ని కంపెనీలకు బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారు. పర్యావరణానికి విఘాతం అంటూ విమర్శలు వచ్చాయి. దీనికి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అడ్డం తగిలి ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. గిరిజనుల బతుకులను సమాధి చేయవద్దని కపట ప్రేమ నటించారు. తీరా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే వ్యక్తి ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేసి తీరుతామని చెప్పడంతో ఇప్పుడు రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి వీటి తవ్వకం వలన జలాశయాలు దెబ్బతిని మైదాన ప్రాంతంలోని నదుల్లోని నీటి ప్రవాహం తగ్గిపోతుంది. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఐటీడీఏలకు తవ్వకాల బాధ్యత అప్పగిస్తామని చెబుతున్న సీఎం అసలు దానికి తవ్వకాల నైపుణ్యమే లేనప్పుడు ఇదెలా సాధ్యమనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోపక్క చంద్రబాబు ప్రకటనపై గిరిజన సంఘాలు,పర్యావరణ సంస్థలు మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. గిరిజనుల బాగుకోసం కాదు.. బడా కంపెనీల మేలుకే : శర్మ బాక్సైట్ తవ్వకాలు చేపడితే నీటివనరులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జలాశయాలు దెబ్బతింటాయి. ఖనిజం తవ్వకాల వలన గిరిజనుల జీవనంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఐటీడీఏ మైనింగ్ బాధ్యత ఇస్తే దానిపేరుతో మళ్లీ ప్రైవేటు కంపెనీలు రెచ్చిపోతాయి. బాక్సైట్‌ను తవ్వడం వలన ప్రైవేటు వ్యాపారులకు కోట్లకుకోట్ల ఆదాయం వస్తుంది. రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి వచ్చేది చాలా తక్కువ. సీఎం చెబుతున్నట్లు మైనింగ్ వలన గిరిజనులకు ఆదాయం పెరగదు. కేవలం జిందాల్,అన్‌రాక్ కంపెనీలకు భారీగా లాభాలు కట్టబెట్టేందుకే బాబు గిరిపుత్రులపై ప్రేమ చూపుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా నాతో మాట్లాడి బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిద్దాం అని చెప్పి ఇప్పుడు సీఎం అయ్యాక ఉద్దేశం మార్చుకోవడం సబబు కాదు. మరోవైపు ఏజెన్సీలో బాక్సైట్ తవ్వాలంటే పీసా చట్టం అడ్డం వస్తుంది. గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా ఈ పనిచేస్తే చట్టాలను ఉల్లంఘించినట్లే. తవ్వితే ఊరుకోం: ఎమ్మెల్యే ఈశ్వరి పాడేరు: ఏజె న్సీలో బాక్సయిట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి హెచ్చరించారు. బాక్సయిట్ తవ్వి గిరిజనుల సంక్షేమానికి వినియోగిస్తామన్నడం చట్టవిరుద్ధమన్నారు. పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్న బాబు బాక్సయిట్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని.. అధికారం చేపట్టగానే గిరిజనుల సంపదను దోచుకునే ప్రయత్నాలు దారుణమన్నారు. మాట మార్చిన బాబు: సీపీఎం విశాఖపట్నం: జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు బాక్సైట్‌ను తవ్వుతామని చెప్పడాన్ని సీపీఎం జిల్లా కమిటీ ఖండించింది. నిన్నటి వర కు బాక్సైట్‌ను వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం శోచనీయమని రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్. నరసింగరావు తెలిపారు. -
ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్!
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక్కడ బాక్సైట్ తవ్వకాలపై ప్రత్యేక పాలసీ ఒకటి తీసుకొస్తామన్నారు. ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వేందుకు ఐటీడీఏకు అనుమతులు ఇస్తామన్నారు. ఏడాదిలోగా ఏజెన్సీలోని అన్ని ప్రాంతాలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తామని తెలిపారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉద్యానవన పంటలు, కాఫీ తోటల పెంపునకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే.. ఇంతకుముందు ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు వద్దంటూ భారీ స్థాయిలో ఉద్యమాలు కూడా చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రాంతంలో జిందాల్ సంస్థ అల్యూమినా ఫ్యాక్టరీ పెడతామంటే టీడీపీ, సీపీఎం నాయకులు కలిసి సంయుక్తంగా భారీ ఉద్యమమే నిర్వహించారు. చంద్రబాబు కూడా దానికి పూర్తి మద్దతు తెలిపారు. అప్పుడు అంతలా వ్యతిరేకించి, ఇప్పుడు అధికారంలోకి వచ్చీ రాగానే డబ్బు కోసం ఇలా చేయడమేంటన్న వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
గ ‘లీజు’లపై హడల్!
=కొత్త దరఖాస్తులకు {పతిపాదనలు కరువు =ఎన్ఓసీల జారీలో జాప్యం =పెండింగ్‌లో సుమారు 600 దరఖాస్తులు సాక్షి, విశాఖపట్నం : గనుల లీజులంటేనే జిల్లా అధికారులు హడలెత్తిపోతున్నారు. బాక్సైట్‌పై ఉద్యమం, ఖనిజ తవ్వకాలపై ఆరోపణల నేపథ్యంలో లీజుల విషయంలో చొరవ చూపడం లేదు. గత ప్రతిపాదనలు తప్ప తాజాగా ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సులు చేయడం లేదు. దీంతో జిల్లాలో సుమారు 600 దరఖాస్తులు ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో జిల్లాకు అదనంగా ఆదాయం పెరగడం లేదు. జిల్లాలో బాక్సైట్, క్వార్ట్జ్, కాల్షైట్, లైమ్‌స్టోన్, మైకా, గ్రానైట్‌తో పాటు రోడ్డు, బిల్డింగ్ నిర్మాణ సామగ్రి లభ్యమవుతున్నాయి. ఏజెన్సీతో పాటు మైదానంలోనూ పలుచోట్ల సహజ సిద్ధంగా ఉన్నాయి. వీటిని లీజుకివ్వడంద్వారా వచ్చే ఆదాయంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో బాక్సైట్ గనులను లీజుకివ్వొద్దని గిరిజనుల ఆందోళన, దేశంలో పలుచోట్ల లీజుకి మించి తవ్వకాలతో ఖనిజాలు లూటీ అవుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి. దీంతో కొత్తగా మైనింగ్ లీజులో కచ్చితత్వం ఉండాలని, సహజ సంపదకు జవాబుదారీ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 2ను జారీ చేసింది. ఈ క్రమంలో మైనింగ్ లీజు దరఖాస్తును తొలుత తహశీల్దార్‌కు పంపి, సాధ్యాసాధ్యాలపై నివేదిక తెచ్చుకోవాలి. దానిపై ఆర్డీఓ, గనుల శాఖ ఏడీ, డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్ సంయుక్త పరిశీలన చేసిన నివేదిక ఇవ్వాలి. కలెక్టర్ దాన్ని పరిశీలించాక అనుమతులు ఇవ్వడానికి ఇబ్బందుల్లేవని నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలి. అనంతరం ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. గతంలో నేరుగా తహశీల్దార్లు ఇచ్చే నివేదిక ఆధారంగా అనుమతులొచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో తహశీల్దార్ స్థాయిలో కొన్ని, ఆర్డీఓ స్థాయిలో కొన్ని, కలెక్టర్ స్థాయిలో కొన్ని పరిశీలన దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 600 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మధ్య నాలుగైదు లీజులు మంజూరైనా అవన్నీ గతంలో ప్రతిపాదించినవే. తాజాగా కొత్తగా ఒక్కటి కూడా ప్రతిపాదించలేదు. జిల్లాలో 450 మైనర్, 40 మేజర్ లీజులున్నాయి. వాటి ద్వారా ఏటా రూ.25 నుంచి 30 కోట్ల ఆదాయం వస్తోంది. కొత్త వాటికి అనుమతులివ్వకపోవడంతో దాదాపు రూ. 10-15 కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది.