మావోయిస్టుల సంచారం... పోలీసులు కూంబింగ్ | police combing operation in visakhapatnam | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల సంచారం... పోలీసులు కూంబింగ్

Published Tue, Sep 1 2015 10:02 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

police combing operation in visakhapatnam

విశాఖపట్టణం : విశాఖపట్టణంలోని మాకవారిపాలెం మండలంలో 15 మంది మావోలు సంచరించినట్లు పోలీసులుకు సమాచారం అందింది. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకూ ఏఎస్‌సీ సత్య ఏసుబాబు నేతృత్వంలో డివిజన్ పరిధిలోని పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కాగా, మంగళవారం కూడా పోలీసులు ఈ కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

మావోయిస్టుల సంచారం నేపథ్యంలో మండలంలోని బాక్సైట్ శుద్ధి కర్మాగారం వద్ద భారీ భద్రతను పోలీసులు  ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మావోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండలంలోని బాక్సైట్ శుద్ధి కర్మాగారం ప్రాంతంలో మావోలు సంచరించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement