makavarapalem
-
ఈ గ్రామంలో పెన్షన్లు లేపేస్తున్న.. టీడీపీ బెదిరింపులు
-
పిల్లలూ.. మనం జంతువులను పుస్తకాల్లోనే చూడాలేమో..!
హెచ్ఎం: పిల్లలూ... మీరెప్పుడైనా పులిని చూశారా... విద్యార్థులు: ఊహు.. చూడలేదు సార్... హెచ్ఎం: పోనీ.. ఏనుగునీ.. విద్యార్థులు: (లేదన్నట్టుగా తెల్ల మొహం) హెచ్ఎం: భవిష్యత్తులో మీరు వీటిని జూలో, పుస్తకాల్లోనే చూడాల్సిన పరిస్థితి రావొచ్చేమో.. విద్యార్థులు: ఎందుకు సార్? హెచ్ఎం: ఎందుకంటే... అడవులు నశించిపోవడంతో జంతు సంపద కూడా అంతరించిపోతోంది.. అంటూ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోసూరు రాము బోధించారు. విద్యార్థులతో జంతు మాస్క్‌లు ధరింపజేసి, ఆయన కూడా మాస్క్ వేసుకొని బోధన చేశారు. దేశంలో వేలల్లో ఉన్న జంతు సంపద వందల్లోకి చేరిందని.. ప్రస్తుత పరిస్థితులను విద్యార్థులకు వివరించారు. వినూత్న రీతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తిగా విషయాన్ని అర్థం చేసుకుంటారనే ఇలా చేశానని ఆయన చెప్పారు. (క్లిక్ చేయండి: కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!) -
టీడీపీకి ఓటు వేయను అన్నందుకు దళితుడిని కొట్టుకుంటూ..
మాకవరపాలెం: విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో టీడీపీకి ఓటు వేయనన్న దళితుడిపై ఆ పార్టీవారు దాడిచేసి కొట్టారు. కులం పేరుతో దూషించారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు గంట్యాడ రాజు తనపై దాడిచేసి కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. మండలంలోని భీమబోయినపాలెం గ్రామానికి చెందిన గంట్యాడ రాజు శనివారం రాత్రి ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ భవనం వద్ద ఉన్నారు. అదే సమయంలో ఈ నెల 16న జరగనున్న ఎంపీటీసీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు తమ పార్టీకి ఓటు వేయాలని రాజును కోరారు. తాను టీడీపీకి ఓటు వేయనని, వైఎస్సార్సీపీకే వేస్తానని రాజు చెప్పారు. దీంతో వారంతా ఆయనపై దాడిచేసి కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. కులం పేరుతో నానా దుర్భాషలాడారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తనపై దాడిచేశారని, దీనిపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని రాజు పోలీసుల్ని కోరారు. గాయపడిన రాజును బంధువులు వెంటనే 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని, విచారిస్తున్నామని ఎస్ఐ రామకృష్ణారావు చెప్పారు. (చదవండి: కుప్పంలో మరోసారి టీడీపీ నేతల దౌర్జన్యం) -
నిన్న విశాఖ.. నేడు హెరిటేజ్
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపింది. కోట్ల రూపాయల డబ్బును వెదజల్లి ఓటర్లను లోబర్చుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనికి చంద్రబాబు నాయుడు పోలీసు యంత్రాంగంతో పాటు సొంత సంస్థ హెరిటేజ్‌తో పాటు విశాఖ డైరీని వాడుకుంటున్నారు. తాజాగా విశాఖ జిల్లా మకవరపాలెంలో హెరిటేజ్ పాలవ్యాన్‌లో రూ.3.95లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖలో పాలవ్యాన్ల ద్వారా డబ్బులు తరలించి జిల్లాలోని ఓటర్లకు పంచేందుకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎన్నికల స్వ్వాడ్ అధికారుల తనిఖీల్లో ఈ సొమ్ము పట్టుపడింది. సొమ్ము తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు. ఇటీవలే విశాఖ డెయిరీ వ్యాన్‌లో రూ. 6లక్షలు పట్టుపడిన సంగతి తెలిసిందే. చోడవరం నుంచి చీడికాడ వైపు వెళ్తున్న వ్యాన్లలో తనిఖీలు నిర్వహించి రూ. ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ డెయిరీ, హెరిటేజ్ వ్యాన్లలో సొమ్ము రవాణా జిల్లాలో డబ్బు రవాణా అంతా హెరిటేజ్, విశాఖ డెయిరీ వ్యాన్లలోనే జరుగుతోంది. అనకాపల్లి పార్లమెంటు టీడీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ తమ కుటుంబ సంçస్థగా మారిన విశాఖ డెయిరీ వ్యాన్ల ద్వారా కోట్లాది రూపాయలను మారుమూల పల్లెలకు చేరవేస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పాలక్యాన్లలో పాలిథిన్ కవర్లలో పెట్టి పైకి పాలు కన్పించేలా చేసి రవాణా చేస్తున్నారని ఓ ఇంటిలిజెన్స్ అధికారి సాక్షి వద్ద వ్యాఖ్యానించారు. హెరిటేజ్ డెయిరీ వ్యాన్లలో కూడా డబ్బుల రవాణా జరుగుతోందని తాజాగా గురువారం పట్టుబడిన డబ్బును బట్టి అర్ధమవుతోంది. మరోవైపు విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ తన విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఇతర వాహనాల ద్వారా పంపిణీ సాగిస్తున్నట్టు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు దాదాపు నాలుగున్నర కోట్ల నగదుతో పాటు పెద్ద ఎత్తున మద్యం తదితర పట్టుబడ్డాయంటే రానున్న వారం రోజుల్లో ఇంకెంత దొరుకుతుందో అంతు చిక్కడం లేదు. పట్టుబడిన మద్యం, డబ్బులో 90 శాతం టీడీపీ నేతలకు చెందినదేనని అధికారులు సైతం ధ్రువీకరించారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
రెండు వాహనాలు సీజ్ నిందితుల్లో ఒకరు మహిళ జాతీయ రహదారి, మాకవరపాలెం ప్రాంతాల్లో శనివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో అరెస్టు అయిన ముగ్గురులో ఇద్దరు మహారాష్ర్టకు చెందినవారు. మరో మహిళ చిత్తూరు జిల్లాకు చెందినదిగా పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న రెండు కార్లను సీజ్‌చేసినట్టు పోలీసులు తెలిపారు. నక్కపల్లి: జాతీయ రహదారిపై రూ.రెండు లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారు వినియోగించిన రెండు కార్లను సీజ్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు కాగిత చెక్‌పోస్టు వద్ద యలమంచిలి సీఐ వెంకట్రావు వాహనాలు తనిఖీ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి త మిళనాడుకు గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నారు. రూ. రెండు లక్షల విలువైన గంజాయి, రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన సందీప్ కృష్ణ, సోహాన్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మాకవరపాలెంలో మహిళ అరెస్టు మాకవరపాలెం : గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను అరెస్టు చేసినట్టు ఎస్ఐ పి.రమేష్ తెలిపారు. బస్సులో గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు శనివారం స్థానిక బస్టాండులో ఓ మహిళను విచారించగా, బ్యాగ్‌నుంచి 8 కిలోల గంజాయి బయటపడిందన్నారు. ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఆవులప్రోలు సాలమ్మగా గుర్తించామని చెప్పారు. ఈ మేరకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ వివరించారు. -
మావోయిస్టుల సంచారం... పోలీసులు కూంబింగ్
విశాఖపట్టణం : విశాఖపట్టణంలోని మాకవారిపాలెం మండలంలో 15 మంది మావోలు సంచరించినట్లు పోలీసులుకు సమాచారం అందింది. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకూ ఏఎస్సీ సత్య ఏసుబాబు నేతృత్వంలో డివిజన్ పరిధిలోని పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కాగా, మంగళవారం కూడా పోలీసులు ఈ కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో మండలంలోని బాక్సైట్ శుద్ధి కర్మాగారం వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మావోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండలంలోని బాక్సైట్ శుద్ధి కర్మాగారం ప్రాంతంలో మావోలు సంచరించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించారు.