రెండు వాహనాలు సీజ్
నిందితుల్లో ఒకరు మహిళ
జాతీయ రహదారి, మాకవరపాలెం ప్రాంతాల్లో శనివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో అరెస్టు అయిన ముగ్గురులో ఇద్దరు మహారాష్ర్టకు చెందినవారు. మరో మహిళ చిత్తూరు జిల్లాకు చెందినదిగా పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న రెండు కార్లను సీజ్‌చేసినట్టు పోలీసులు తెలిపారు.
నక్కపల్లి: జాతీయ రహదారిపై రూ.రెండు లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారు వినియోగించిన రెండు కార్లను సీజ్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు కాగిత చెక్‌పోస్టు వద్ద యలమంచిలి సీఐ వెంకట్రావు వాహనాలు తనిఖీ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి త మిళనాడుకు గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నారు. రూ. రెండు లక్షల విలువైన గంజాయి, రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన సందీప్ కృష్ణ, సోహాన్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
మాకవరపాలెంలో మహిళ అరెస్టు
మాకవరపాలెం : గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ పి.రమేష్ తెలిపారు. బస్సులో గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు శనివారం స్థానిక బస్టాండులో ఓ మహిళను విచారించగా, బ్యాగ్‌నుంచి 8 కిలోల గంజాయి బయటపడిందన్నారు. ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఆవులప్రోలు సాలమ్మగా గుర్తించామని చెప్పారు. ఈ మేరకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ వివరించారు.
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
Published Sat, Mar 5 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM
Advertisement