సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపింది. కోట్ల రూపాయల డబ్బును వెదజల్లి ఓటర్లను లోబర్చుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనికి చంద్రబాబు నాయుడు పోలీసు యంత్రాంగంతో పాటు సొంత సంస్థ హెరిటేజ్‌తో పాటు విశాఖ డైరీని వాడుకుంటున్నారు. తాజాగా విశాఖ జిల్లా మకవరపాలెంలో హెరిటేజ్ పాలవ్యాన్‌లో రూ.3.95లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖలో పాలవ్యాన్‌ల ద్వారా డబ్బులు తరలించి జిల్లాలోని ఓటర్లకు పంచేందుకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎన్నికల స్వ్వాడ్ అధికారుల తనిఖీల్లో ఈ సొమ్ము పట్టుపడింది. సొమ్ము తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు. ఇటీవలే విశాఖ డెయిరీ వ్యాన్‌లో రూ. 6లక్షలు పట్టుపడిన సంగతి తెలిసిందే. చోడవరం నుంచి చీడికాడ వైపు వెళ్తున్న వ్యాన్లలో తనిఖీలు నిర్వహించి రూ. ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ డెయిరీ, హెరిటేజ్ వ్యాన్లలో సొమ్ము రవాణా
జిల్లాలో డబ్బు రవాణా అంతా హెరిటేజ్, విశాఖ డెయిరీ వ్యాన్లలోనే జరుగుతోంది. అనకాపల్లి పార్లమెంటు టీడీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ తమ కుటుంబ సంçస్థగా మారిన విశాఖ డెయిరీ వ్యాన్ల ద్వారా కోట్లాది రూపాయలను మారుమూల పల్లెలకు చేరవేస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పాలక్యాన్లలో పాలిథిన్ కవర్లలో పెట్టి పైకి పాలు కన్పించేలా చేసి రవాణా చేస్తున్నారని ఓ ఇంటిలిజెన్స్ అధికారి సాక్షి వద్ద వ్యాఖ్యానించారు. హెరిటేజ్ డెయిరీ వ్యాన్లలో కూడా డబ్బుల రవాణా జరుగుతోందని తాజాగా గురువారం పట్టుబడిన డబ్బును బట్టి అర్ధమవుతోంది. మరోవైపు విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ తన విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఇతర వాహనాల ద్వారా పంపిణీ సాగిస్తున్నట్టు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు దాదాపు నాలుగున్నర కోట్ల నగదుతో పాటు పెద్ద ఎత్తున మద్యం తదితర పట్టుబడ్డాయంటే రానున్న వారం రోజుల్లో ఇంకెంత దొరుకుతుందో అంతు చిక్కడం లేదు. పట్టుబడిన మద్యం, డబ్బులో 90 శాతం టీడీపీ నేతలకు చెందినదేనని అధికారులు సైతం ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment