డబ్బుతో వస్తేనే టీడీపీ టికెట్లు | TDP leader and former MLA Ramesh Kumar Reddy comments on party | Sakshi
Sakshi News home page

డబ్బుతో వస్తేనే టీడీపీ టికెట్లు

Published Wed, Apr 10 2024 5:22 AM | Last Updated on Wed, Apr 10 2024 5:22 AM

TDP leader and former MLA Ramesh Kumar Reddy comments on party  - Sakshi

ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన వారికి మొండిచెయ్యి చూపారు 

నాయకులను కాపాడుకోలేని బాబు రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు? 

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌ రెడ్డి 

రాయచోటి టౌన్‌: తెలుగుదేశం పార్టీలో సూట్‌కేసుల్లో డబ్బు తీసుకొచ్చినవారికే టికెట్లు కేటాయిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా జెండామోసినవారికి, పార్టీకోసం అహరి్నశలు కష్టపడినవారికి మొండిచెయ్యి చూపుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) సోదరుడు, అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ నేత, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్కుమార్‌రెడ్డి ఆరోపించారు.

రాయచోటిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాతికేళ్లుగా అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ కోసం పని చేశానని, నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ జెండాలను మోశానని, టికెట్‌ ప్రకటించేటప్పుడు కనీసం తనను సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్లు కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డారు.

పార్టీ నాయకులకు గ్యారంటీ ఇవ్వలేని చంద్రబాబు ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు నా­యు­డు లేని హైప్‌ సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్త కొత్త వ్యక్తులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థిగా మాగంటి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్‌ ఇలా విదేశాల నుంచి అప్పటికప్పుడు సూట్‌ కేసులతో దిగిన వారికి టికెట్లు ఇస్తున్నారన్నారు.

రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, మదనపల్లె ఇలా చాలా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను రెచ్చగొట్టి రేసులో పెట్టారని వాపోయారు. అందుకే ఆ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

నేడు వైఎస్సార్‌సీపీలో చేరిక 
వినుకొండ దగ్గర జరుగుతున్న మేం సిద్ధం బస్సుయాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు రమేష్కుమార్‌ రెడ్డిప్రకటించారు. తన వ్యక్తిత్వం తెలిసినవారు, తన పనితీరు నచ్చి నవారు తనతో కలసి వస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా తెలిపారు. వైఎస్సార్‌సీపీలో పదవులకోసం కాకుండా తెలుగు దేశం పార్టీ ఓటమే ధ్యేయంగా పని చేస్తానని, అందుకోసం అహరి్నశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement