
సాక్షి, నంద్యాల జిల్లా: టీడీపీ అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్ కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు. ఓటుకు డబ్బులు ఇస్తామని స్లిప్పులు తీసుకుని టిక్కులు వేసి డబ్బులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, పచ్చ ప్రలోభాలు తారస్థాయికి చేరాయి. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బుతో పాటు వివిధ తాయిలాలను ఎర వేస్తున్నారు. కొన్ని చోట్ల కుటుంబాలను ఎంపిక చేసుకొని రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి వివిధ హామీలను గుప్పిస్తూ నగదును పంపిణీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment