టీడీపీ రౌడీ రాజకీయం.. YSRCP సర్పంచ్‌పై హత్యాయత్నం | Kutami Red Book Effect, High Tension In Koilakuntla Kampamalla, More Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీ రౌడీ రాజకీయం.. YSRCP సర్పంచ్‌పై హత్యాయత్నం

Published Thu, Mar 13 2025 10:08 AM | Last Updated on Thu, Mar 13 2025 11:30 AM

Kutami Red Book Effect: High Tension In Koilakuntla Kampamalla

నంద్యాల, సాక్షి: కూటమి పాలనలో అరాచకాలు ఆగడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసుకుని దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా మంత్రి బీసీ జనార్థన్‌ రెడ్డి అనుచరులు.. కోవెలకుంట్ల మండలం కంపమల్లలోచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్‌ లోకేశ్వర్‌ రెడ్డి(Lokeshwar Reddy)పై దాడికి పాల్పడగా.. ఆయన తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు. టీడీపీ గుండాల హల్‌చల్‌తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

లోకేశ్వర్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు. ఆయన ఇంట్లో చొరబడి లోకేశ్వర్‌తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ప్రాణ భయంతో పరిగెడుతున్న లోకేశ్వర్‌ రెడ్డిని పొలంలో పడేసి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి వెంకట్రామిరెడ్డి,తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి కూడా గాయాలైనట్లు సమాచారం.

ప్రాణాపాయ స్థితిలో.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లోకేశ్వర్‌ రెడ్డిని.. స్థానికంగా నంద్యాల ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో వైఎస్సార్‌సీపీకి పట్టు ఉండడంతో.. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఆయన్ని అడ్డుతొలగించుకోవాలని టీడీపీ ఈ దాడికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement