
సాక్షి, నంద్యాల జిల్లా: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆన్‌లైన్ మోసాల గురించి మాట్లాడటం కంటే ఆళ్లగడ్డలో జరిగే అరాచకాల గురించి మాట్లాడితే బాగుండేదంటూ భూమా అఖిల ప్రియపై వైఎస్సార్‌సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపాలిటీలో ఉద్యోగాల కోసం రెండు లక్షల తీసుకోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
‘‘అసెంబ్లీలో ఆళ్లగడ్డ రైతుల ప్రస్తావన రాకపోవడం, మద్దతు ధర గురించి మాట్లకపోవడం దారుణం. గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు పెరిగాయని బాదుడే బాదుడు అంటూ తిరిగారు. కూటమి ప్రభుత్వం హయాంలో గతంలో కంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయంపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. 15 మంది ఎమ్మెల్యే పేర్లు చెప్పుకొని అక్రమ వసూళ్లు చేస్తున్నారు. తర్వాత వడ్డీతో సహా చెల్లించేలా చేస్తాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బెల్టు షాపులు, కల్తీ మద్యం అమ్ముతున్నారు ముందు వాటి గురించి తేల్చడంటూ భూమా కిషోర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Comments
Please login to add a commentAdd a comment