Kishore reddy
-
ఇది మంచి ప్రభుత్వం
-
భూమా అఖిల ప్రియాపై భూమా కిషోర్ రెడ్డి ఫైర్
-
వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ ఆళ్లగడ్డ ఇన్చార్జి భూమా కిషోర్ రెడ్డి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బీజేపీ ఆళ్లగడ్డ ఇన్చార్జి భూమా కిషోర్రెడ్డితోపాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్థానిక బీజేపీ నాయకులు, దాదాపు 500మంది అభిమానులు సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి (నాని), వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, కర్నూల్ విజయా డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద కిషోర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బీజేపీ.. టీడీపీకి సీ టీమ్ పార్టీలా తయారైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నా. ఆళ్లగడ్డ అభ్యర్థిగా గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తాను. పెత్తందార్లను ఎదిరించి నిలబడ్డ నేతలుగా భూమా దంపతులు పేరు గడించారు. కానీ వారి కడుపున పుట్టిన అఖిల ప్రియ ఆళ్లగడ్డలో అరాచకశక్తిగా మారారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటాం. భూమా బంధువర్గం అంతా అఖిలప్రియకు దూరంగా జరిగారు’ అని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. -
యాంకర్‌ను పెళ్లి చేసుకున్న 'శ్రీకారం' సినిమా డైరెక్టర్
'శ్రీకారం' సినిమా దర్శకుడు కిశోర్ రెడ్డి వివాహం చేసుకున్నారు. తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యతో ఆయన వివాహం జరిగింది. శర్వానంద్ హీరోగా శ్రీకారం అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ తెలుగులో 'లవ్.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి' వంటి చిత్రాలతో పాటు కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన శ్రీకారం సినిమా తనకు మంచి విజయంతో పాటు గౌరవం కూడా తీసుకొచ్చింది. నేడు మార్చి 1న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో యాంకర్ కృష్ణ చైతన్యను కిశోర్ రెడ్డి వివాహం చేసుకున్నారు. యాంకర్ కేసీగా ఆమె అందరికీ సుపరిచితమైనదే.. కృష్ణ చైతన్య కొల్ల గతంలో ఆర్జేగా కూడా పనిచేసింది. ఆర్జే స్మైలీ క్వీన్ పేరుతో ఆమె రేడియో జాకీగా వ్యవహరించేవారు. పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలతో పాటు సినిమా కార్యక్రమాలకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరిస్తుంది. కిశోర్- కృష్ణ చైతన్యల వివాహానికి సినీ పరిశ్రమ నుంచే కాకుండా మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కానీ వారి వివాహానికి సంబంధించిన ఫోటోలో ఇంకా బయటకు రాలేదు కానీ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
Hyderabad: హిందీ నేర్చుకుంటూ.. ఆదాయం అందుకుంటూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోని రిసెప్షన్లో ఉన్న వ్యక్తుల్ని ‘‘కిత్నా రూపియా టెస్ట్ కే లియే? (పరీక్షలకు ఎంత ఖర్చవుతుంది?)’’అని ఆఫ్రికాకు చెందిన కవాంగు(25) అడుగుతోంది. కెన్యా నుంచి న్యూరో సర్జన్‌ను సంప్రదించడానికి నగరానికి వచ్చిన ముగ్గురు రోగులు తనకు కస్టమర్లుగా ఉన్నారు. వారికి అవసరమైన సంప్రదింపులు, పరీక్షల ఏర్పాట్ల నుంచి రెస్టారెంట్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం దాకా అన్నీ కవాంగు బాధ్యతలే. విదేశీయులకు అత్యున్నత వైద్యసేవల్ని మాత్రమే కాదు ఆదాయమార్గాలను కూడా నగర వైద్యం అందిస్తున్న తీరుకు కువాంగు ఒక ఉదాహరణ. తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అలాంటి ఫెసిలిటేటర్ సహాయంతో సంక్లిష్టమైన కాలేయ సమస్యకు కవాంగు చికిత్స పొందింది. ఆ తర్వాత తానే ఫెసిలిటేటర్‌గా మారితే రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చని అర్థమయ్యాక కవాంగు మూడేళ్లుగా అదే పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నారు. ఆ వృత్తి కోసం కొంచెం హిందీ కూడా నేర్చుకుందామె. ‘హిందీ భాష నేర్చుకోవడం కోసం కోర్సులో చేరడంతోపాటు బాలీవుడ్ సినిమాలు చూడటం ప్రారంభించాను‘అని ఆమె చెప్పారు. టోలీచౌకి కేంద్రంగా... ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తున్నవారికి కేంద్రంగా నగరంలోని టోలీచౌకి మారిందని ఓ ఆసుపత్రికి చెందిన మార్కెటింగ్ విభాగ ప్రతినిధి తెలిపారు. ఈ ఏరియాలోని ప్రీమియర్ అపార్ట్మెంట్లో అద్దెకుండేవారిలో అత్యధికులు ఈ తరహా సేవల్లో నిమగ్నమవుతున్నారన్నారు. చాలామంది ఇక్కడ ట్రావెల్ లేదా స్టడీ వీసాపై మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌కి సంబంధించిన సమస్యల గురించి భయపడివారు తమపేరు తదితర వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, ‘‘మాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు నైరోబీలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు మాకు సహాయం చేస్తారు’’అని నైరోబీకి చెందిన మార్గరెట్ కారీ చెప్పారు. కొన్ని ఆసుపత్రులు దేశీయ రోగులతో పోలిస్తే అంతర్జాతీయ రోగులకు ట్రీట్మెంట్ రేట్లు అమాంతం 50 శాతం మేర పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఫెసిలిటేటర్లకు బిల్లును బట్టి 15 నుంచి 20 శాతం కూడా ఇస్తున్నారని సమాచారం. ‘సోమాలియాలో ఆరోగ్య సంరక్షణకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. దాంతో చికిత్స కోసం థాయ్‌లాండ్, మలేషియా, చైనాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు చాలామంది భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్‌కు వస్తున్నారు, అందువల్ల నేనిక్కడ ఉంటూ బంధువులు, స్నేహితులకు సహాయం చేయడం ప్రారంభించాను. అలా చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు’అని 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన సోమాలియా జాతీయుడైన జువేద్ అన్నారు. ఏజెన్సీలూ ఉన్నాయి... మెడికల్ టూరిజమ్ సేవలు అందించే కొన్ని అంతర్జాతీయ కంపెనీలు చట్టప్రకారం కొందరిని ఫెసిలిటేటర్లుగా నియమించుకుని రోగులకు సహాయకులుగా వినియోగిస్తాయి. ఇలాంటి సంస్థలు ఢిల్లీ, ముంబై, బెంగుళూర్లలో ఎక్కువ. వాటి సేవలు హైదరాబాద్‌కు ఇంకా విస్తృతంగా వ్యాపించలేదు. దాంతో ఇక్కడ వ్యక్తిగతంగా సేవలు అందించే ఫెసిలిటేటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటున్న విదేశీ విద్యార్థులు నగరంలోని హైదరాబాద్, ఉస్మానియా వంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లు, పన్నెండేళ్ల పాటు నర్సింగ్ స్టాఫ్, ఫిజియోథెరపీ స్టాఫ్‌గా సేవలు అందించినవాళ్లు కూడా జోర్డాన్, ఇరాక్, సిరియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చి అక్కడి పరిచయాలను, అరబిక్ భాష మీద పట్టు లాంటి సానుకూల అంశాలతో ఫెసిలిటేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ఉభయ కుశలోపరి విధానం మా ఆసుపత్రికి నైజీరియా, కెన్యా, సుడాన్, సోమాలియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరి కోసం మేం అధికారికంగా ఉన్న సంస్థల నుంచి ఫెసిలిటేటర్ల సేవలు అందుకుంటాం. అరుదుగా మాత్రం తెలిసిన, పరిచయస్తులను ఉపయోగించుకుంటాం. రోగులకు ఎదురయ్యే భాషా పరమైన ఇతర అవరోధాలకు పరిష్కారంగానూ, మరోవైపు ఇక్కడ విద్యార్జన తదితర పనులపై వచ్చేవారికి ఆదాయమార్గంగానూ ఈ విధానం ఉపకరిస్తోంది. –డా.కిషోర్‌రెడ్డి, అమోర్ ఆసుపత్రి -
భూమా అఖిలప్రియపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోదరుడు
సాక్షి, బొమ్మలసత్రం (నంద్యాల): ఆళ్లగడ్డ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్‌రెడ్డి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న ఓ వివాహానికి వస్తుండగా అఖిల ప్రియ తన కాన్వాయ్‌ను అడ్డుపెట్టి అనుచరులతో ఘర్షణకు దిగారన్నారు. తన డ్రైవర్‌ను కిడ్నాప్ చేసేందుకు అఖిల ప్రయత్నించిందన్నారు. అఖిలప్రియ గత నెల రోజుల నుంచి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. చదవండి: (పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు) -
శ్రీకారం థియేటర్స్‌లోకి రావడానికి 4 ఏళ్లు పట్టిందట
‘‘నా మొదటి సినిమా ‘శ్రీకారం’ థియేటర్స్‌లోకి రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఏంటి? ఇంత సమయం పట్టింది అనుకున్నా. కానీ, మా నిర్మాతలు తొలి సినిమా తీసేందుకు మంచి కథ కోసం దాదాపు 7 ఏళ్లు వేచిచూశారట.. ఇది నాకు స్ఫూర్తిగా అనిపించింది’’ అని దర్శకుడు కిశోర్ అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ‘శ్రీకారం’ ఈ నెల 11న విడుదలైంది. చిత్రదర్శకుడు కిశోర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాది చిత్తూరు జిల్లా. డిగ్రీ పూర్తయ్యాక ఓ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. తెలుగులో ‘లవ్.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి’ వంటి చిత్రాలతో పాటు కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. 2016లో నేను తీసిన ‘శ్రీకారం’ అనే షార్ట్ ఫిల్మ్ చూసి, ఇదొక సినిమా కంటెంట్ అని చాలామంది అన్నారు. ఆ తర్వాత 14 రీల్స్ ప్లస్‌లో ‘శ్రీకారం’ సినిమా చేసే అవకాశం రావడం హ్యాపీ. వ్యవసాయం నేపథ్యంలో మా సినిమాలో ఎవరూ చెప్పని, చూపించని విషయాలను ప్రస్తావించడంతో మంచి స్పందన వస్తోంది. ‘శ్రీకారం’ మంచి విజయంతో పాటు గౌరవం కూడా తీసుకొచ్చింది. నా తర్వాతి సినిమా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అన్నారు. చదవండి: Sreekaram Review: శర్వానంద్ మెప్పించాడా? -
నేటి నుంచి గ్యాస్ బంద్
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో మంగళవారం నుంచి వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపేసి సమ్మె చేస్తున్నట్లు జిల్లా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, కిషోర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరులోని ఓ హోటల్లో ఫెడరేషన్ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఆలిండియా సంఘం పిలుపులో భాగంగా తాము సమ్మెలోకి వెళుతున్నామన్నారు. డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దీర్ఘకాలంగా పరిష్కరించడం లేదన్నారు. పలుమార్లు చర్చించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెలోకి వెళుతున్నట్లు వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్స్పై ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ డిసిప్లినరీ గైడ్‌లైన్స్ పేరుతో డిస్ట్రిబ్యూటర్సపై ఒత్తిడి తెస్తోందని ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కిషోర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ గైడ్లైన్స 2001లో రూపొందించారన్నారు. మార్కెటింగ్‌లో జరిగే చిన్నచిన్న పొరపాట్లకు లక్షల కొద్దీ అపరాధం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గైడ్లైన్స సరళతరం చేసే వరకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకూడదని నిర్ణయించామన్నారు. అంతేగాక ఆధార్ సీడింగ్ వల్ల తమపై అదనపు భారం పడిందని, సబ్సిడీ రాకపోయినా వినియోగదారులు తమను బాధ్యులుగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కోశాధికారి భాస్కరయ్య, జిల్లాలోని అన్ని కంపెనీల గ్యాస్ డీలర్లు పాల్గొన్నారు.