
సాక్షి, బొమ్మలసత్రం (నంద్యాల): ఆళ్లగడ్డ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్‌రెడ్డి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న ఓ వివాహానికి వస్తుండగా అఖిల ప్రియ తన కాన్వాయ్‌ను అడ్డుపెట్టి అనుచరులతో ఘర్షణకు దిగారన్నారు.
తన డ్రైవర్‌ను కిడ్నాప్ చేసేందుకు అఖిల ప్రయత్నించిందన్నారు. అఖిలప్రియ గత నెల రోజుల నుంచి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు.
చదవండి: (పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment