సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన భూమా కిషోర్‌రెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భూమా కిషోర్‌రెడ్డితోపాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్థానిక బీజేపీ నాయకులు, దాదాపు 500మంది అభిమానులు సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి (నాని), వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, కర్నూల్ విజయా డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద కిషోర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బీజేపీ.. టీడీపీకి సీ టీమ్ పార్టీలా తయారైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నా. ఆళ్లగడ్డ అభ్యర్థిగా గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తాను. పెత్తందార్లను ఎదిరించి నిలబడ్డ నేతలుగా భూమా దంపతులు పేరు గడించారు. కానీ వారి కడుపున పుట్టిన అఖిల ప్రియ ఆళ్లగడ్డలో అరాచకశక్తిగా మారారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటాం. భూమా బంధువర్గం అంతా అఖిలప్రియకు దూరంగా జరిగారు’ అని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment