joined in ysrcp
-
వైఎస్సార్సీపీలో భారీగా కొనసాగుతున్న చేరికలు
తణుకు అర్బన్/నరసాపురం రూరల్/భీమవరం/పాలకొల్లు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీగా వైఎస్సార్సీపీలో ఆదివారం చేరారు. అత్తిలి గోగులమ్మ పేటలో టీడీపీ, జనసేన పార్టీల మద్దతుదారులైన 30 కుటుంబాలు మంత్రి కారుమూరి సమక్షంలో పార్టీలో చేరాయి. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జనసేన, టీడీపీల నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. భీమవరం 39వ వార్డుకు చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పాలకొల్లు మండలం చింతపర్రులో వైఎస్సార్సీపీ నేత పెన్మెత్స రామరాజు ఆధ్వర్యంలో నవ్యాంధ్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షుడు దిద్దే సత్యనారాయణ, అతని అనుచరులు 100 మందికి పైగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. రాజమహేంద్రవరంలోని బర్మా కాలనీకి చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎంపీ మార్గాని భరత్ సమక్షంలో, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట వరలక్ష్మీ కాలనీకి చెందిన 500 మంది టీడీపీ కార్యకర్తలు మంత్రి చెల్లుబోయిన సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ
చిత్తూరు రూరల్: టీడీపీ పేరుకు మాత్రమే బీసీల పార్టీ అని.. కానీ, నిజానికి అది బీసీల వ్యతిరేక పార్టీ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత రావూరి ఈశ్వరరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీని నమ్ముకుని తాను వీధిలో పడ్డానని కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీలోని ఓ నలుగురు నాయకులు తన కొంపముంచారని ఆరోపించారు. చిత్తూరు గురునగర్ కాలనీలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో పార్టీలో తనను పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. అంతేకాక.. రూ.340 కోట్లు విలువచేసే తన ఫ్యాక్టరీని మూయించారన్నారు. ఇన్నాళ్లు పార్టీలో ఉన్నందుకు తన పరువు పూర్తిగా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిజానికి.. ప్రజాసేవ చేస్తూ 24 ఏళ్లు టీడీపీకి బానిసలా సేవచేశానని.. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా అనేక సంవత్సరాలు పనిచేశానని ఆయన చెప్పారు. పైగా.. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మనోహర్ విజయంలో కీలకపాత్ర పోషించానన్నారు. కానీ, పార్టీ కోసం ఇంతలా కృషిచేసిన తనకు టీడీపీ తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపించారు. టీడీపీలోని ఆ నలుగురు నేతలు తనను దారుణంగా అవమానించారని.. వీరు చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గ నేతలను అస్సలు ఎదగనివ్వడంలేదని ఆయన చెప్పారు. ప్రస్తుత టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గురజాల జగన్మోహన్కు కూడా వారి నుంచి అవమానాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇలాంటి నీచమైన పార్టీ నుంచి తాను వైదొలుగుతున్నానని.. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రావూరి ఈశ్వరరావును వైఎస్సార్సీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి కలిశారు. రావూరికి పార్టీ కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించి తన విజయానికి పాటుపడాలని అభ్యర్థించారు. సీఎం వైఎస్ జగన్ సింహంలాంటి వారని, ఆయన చేస్తున్న అభివృద్ధి తనకు బాగా నచ్చిందని రావూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయానందరెడ్డి గెలుపునకు తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గురునాథరావు
సాక్షి, అమరావతి: ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆరి్డనేటర్, ఎంపీ పీవీ విుథున్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద జెట్టి గురునాథరావు మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ ఇతరులకు లాభం చేకూర్చే పార్టీలాగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం నేర్చుకున్నారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ నేతల వ్యవహారశైలి నచ్చక వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ ఆళ్లగడ్డ ఇన్చార్జి భూమా కిషోర్ రెడ్డి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బీజేపీ ఆళ్లగడ్డ ఇన్చార్జి భూమా కిషోర్రెడ్డితోపాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్థానిక బీజేపీ నాయకులు, దాదాపు 500మంది అభిమానులు సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి (నాని), వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, కర్నూల్ విజయా డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద కిషోర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బీజేపీ.. టీడీపీకి సీ టీమ్ పార్టీలా తయారైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నా. ఆళ్లగడ్డ అభ్యర్థిగా గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తాను. పెత్తందార్లను ఎదిరించి నిలబడ్డ నేతలుగా భూమా దంపతులు పేరు గడించారు. కానీ వారి కడుపున పుట్టిన అఖిల ప్రియ ఆళ్లగడ్డలో అరాచకశక్తిగా మారారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటాం. భూమా బంధువర్గం అంతా అఖిలప్రియకు దూరంగా జరిగారు’ అని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన 500మంది టీడీపీ కార్యకర్తలు
-
వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్
-
నేడు వైఎస్సార్ సీపీలో భారీగా చేరికలు
పి.గన్నవరంలో బహిరంగ సభ, కన్నబాబు రాక పి.గన్నవరం : పి.గన్నవరంలో మంగళవారం సాయంత్రం జరుగనున్న బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో భారీగా చేరనున్నారని పార్టీ కోఆరి్డనేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు వెల్లడించారు. స్థానిక గణపతి గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను సోమవారం సాయంత్రం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన పి.గన్నవరం మండల నాయకులు ఉలిశెట్టి బాబీ, పిల్లి శ్రీనుల నాయకత్వంలో కొండేటి ఆధ్వర్యంలో 600 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరనున్నారని మోహనరావు చెప్పారు. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు అంబాజీపేట నుంచి పి.గన్నవరం అక్విడెక్టు వరకూ మోటారు సైకిలు ర్యాలీ జరుగు తుందన్నారు. అక్కడ దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో పాటు, జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఈ చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. మిగిలిన మూడు మండలాల్లో కూడా ఇదే రీతిలో చేరికలు ఉంటాయని కొండేటి చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేసారు. మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర రావు, వాసంశెట్టి చినబాబు, రాష్ట్ర నాయకులు మెల్లం మహలక్ష్మీ ప్రసాద్, పేరి శ్రీనివాస్, జిల్లా నాయకులు దొమ్మేటి వెంకట శివరామన్, తోలేటి బంగారునాయుడు తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. -
‘సోకులగూడెం’ వైఎస్సార్సీపీలో చేరిక
గిరిజనులకు అనంతబాబు సాదర ఆహ్వానం రంపచోడవరం : ‘టీడీపీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. గ్రామంలో ఒక్క ఇల్లు ఇచ్చారు, మిగిలిన వారి పరిస్థితి ఏమిటీ? అంటూ సోకులగూడెంలోని మొత్తం గిరిజనులు దండుగా వైఎస్సార్ సీపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) సమక్షంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, పెద్దలు పార్టీలో చేరారు. పార్టీ అధినేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై విశ్వాసంతో పార్టీలో చేరినట్టు వారు చెప్పారు. గిరిజన తెగల్లో తేడాలు చూపుతూ ఒక వర్గానికి పింఛను మంజూరు చేస్తున్నారని, గ్రామానికి కనీసం రోడ్డు కూడా లేదని వారు వాపోయారు. భవిష్యత్తులో సమస్యలు తీరాయతాయన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అనంతబాబు మాట్లాడుతూ గిరిజనులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇదే పరిస్థితి ఏజెన్సీలో అనేక గ్రామాల్లో ఉందన్నారు. గిరిజనుల సమస్యలు పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లతామన్నారు. సోకులగూడేనికి చెందిన వెంకటేశ్వర్లు, సండ్రు ప్రసాద్‌లుతో కలిసి సుమారు 150 మందికి పార్టీలో చేరారు. వీరికి అనంతబాబు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ పత్తిగుళ్ల భారతి, సర్పంచిల సమాఖ్య అ««ధ్యక్షుడు పండా రామకృష్ణదొర, ఎంపీటీసీ కారుకోడి పూజ, పార్టీ యూత్ అధ్యక్షుడు రాపాక సుదీర్, మహిళ అధ్యక్షురాలు కాపారపు రూతూ, ప్రచార కమిటీ వీఎం కన్నబాబు, ఖాన్, జాఫర్, పరదా బాబురావుదొర, బొప్పా సత్యనారాయణ, విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్ సీపీలోకి ‘కొల్లుబోయిన’
పెద్దాపురం రానున్న వైఎస్సార్ సీపీ నాయకులు పెద్దాపురం : అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా యువజన అధ్యక్షుడు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరనున్నారు ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులంతా పెద్దాపురం రానున్నట్లు నియోజకవర్గ కో–ఆరి్టనేటర్ తోట సుబ్బారావు నాయుడు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఉదయం 11.25 గంటలకు శ్రీనివాస్ యాదవ్ ముహూర్తం ప్రకారం పార్టీలో చేరతారని, తదుపరి స్థానిక సుధా కాలనీ క్యాంపు కార్యాలయం నుంచి సుమారు 1000 బైక్‌లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 5 గంటలకు స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించే సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇ¯ŒSఛార్జి చలమలశెట్టి సునీల్, తుని, రంపచోడవరం, కొత్తపేట ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, సీనియర్ నాయకులు కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయ్ భాస్కర్, ఆయా నియోజకవర్గాల కో–ఆరి్డనేటర్లు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని సుబ్బారావు నాయుడు పిలుపునిచ్చారు. -
బాబు పాలనకు చరమగీతం తథ్యం
కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్ వైఎస్సార్సీపీలో వంద మంది చేరిక యర్రవరం (ఏలేశ్వరం) : రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పాలనకు చరమగీతం తప్పదని నియోజకవర్గ కోఆరి్డనేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. మండలంలోని యర్రవరంలో శుక్రవారం కోర్డినేటర్ సమక్షంలో గ్రామ ఉపసర్పంచ్ దాసరి రమేష్, సహకార సంఘ ఉపాధ్యక్షుడు నీరుకొండ అర్జునరావు, మాజీ ప్రజాప్రతినిధులు భీశెట్టి అప్పలరాజు, రామిశెట్టి వెంకటరమణ, తోట పెద్దిరాజు, బుద్ద లోవబాబుతో పాటు సుమారు వంద మంది వైఎస్సార్సీపీలో చేరారు. ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అన్నివర్గాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అమలు కాని హామీలతో గెద్దెనెక్కిన బాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజన్న పాలన రావాలంటే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని సీఎం చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అలమండ చలమయ్య , మండల కన్వీనర్ బెహరా దొరబాబు, సామంతుల సూర్యకుమార్, ఇజనగిరి ప్రసాద్, సామంతుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ పటిష్టతకు కృషి చేస్తా
డీసీసీ మాజీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ ∙ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక 300 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనతోనే.. సాక్షి, రాజమహేంద్రవరం : పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేస్తానని డీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజసభ్య సభ్యుడు వి.విజయసాయిరెడ్డిల సమక్షంలో పార్టీలో చేరారు. వై.ఎస్.జగ¯ŒS పార్టీ కండువా కప్పి దుర్గేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు డీసీఎంఎస్ డైరెక్టర్ ఎలుగుబంటి అచ్యుత్‌రామ్; మాజీ జెడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రయ్య, పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలు, అనుచరులు 300 మంది పార్టీలో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజమహేంద్రవరం రూర ల్ కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు(బాబు), రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర, రాజమహేంద్రవరం నాగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, పార్టీనేతలు పోలుకిరణ్మోహ¯ŒSరెడ్డి, గుర్రం గౌతమ్, అడపాహరి తదితరులు పాల్గొన్నారు. పార్టీకి మరింత బలం సౌమ్యునిగా పేరొందిన కందుల దుర్గేష్ వైఎస్సార్సీపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మంచి వాగ్ధాటి కలిగిన దుర్గేష్ ప్రజా సమస్యలను బలంగా వినిపించగలరని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన దుర్గేష్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాదాపు దుర్గేష్ వెంట పయనించాయి. దుర్గేష్, ఆయన అనుచరులు వైఎస్సార్ సీపీలో చేరడంతో ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నామ మాత్రమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీలో నేడు దుర్గేష్ చేరిక
బలోపేతం కానున్న పార్టీ సాక్షి, రాజమహేంద్రవరం : కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అ««దl్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలసి ఆయన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని తన నివాసం నుంచి అనుచరులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్ పయనమయ్యారు. వివాదరహితుడు, మంచి వక్తగా పేరొందిన దుర్గేష్ చేరిక వైఎస్సార్ సీపీకి లాభిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దుర్గేష్ ఎమ్మెల్సీగా ఎన్నికై ఆరేళ్లు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా దళితవాడల్లో ఎక్కువగా అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా అనుచరులను సంపాదించుకున్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం దుర్గేష్ 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. మొదట రాజమండ్రి వీటీ కాలేజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1980లో ఎ¯ŒSఎస్‌యూఐ రాజమండ్రి టౌ¯ŒS కార్యదర్శిగా, 1982 నుంచి జిల్లా అధ్యక్షునిగా పని చేశారు. 1984లో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులై అంచెలంచెలుగా ఎదుగుతూ, 2014లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీకి దుర్గేష్ చేసిన సేవలను గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. ఉద్దండులతో అనుబంధం సౌమ్యునిగా పేరొందిన కందుల దుర్గేష్ జిల్లా స్థాయిలో మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లతో మంచి అనుబంధం కొనసాగించారు. ఆయా కాలాల్లో వారి ఆదేశాల మేరకు పార్టీ పటిష్టతకు కృషి చేశారు. రాష్ట్రస్థాయిలో వైఎస్ అనుచరుడిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరెడ్డి పేదల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డితోనే సాధ్యమని భావించి తాను వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు దుర్గేష్ చెప్పారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
అయినవిల్లిలంక(అయినవిల్లి) : అయినవిల్లిలంకకు చెందిన వంద మంది కార్యకర్తలు మంగళవారం రాత్రి పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి చిట్టిబాబు, పార్టీ మండలాధ్యక్షుడు మట్టపర్తి శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకూ వీరు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టు తెలిపారు. జగ¯ŒSమోహ¯ŒS రెడ్డి ఆశయాలు నచ్చి తాము పార్టీలోకి చేరామన్నారు. పార్టీలో చేరిన వారిలో ముత్తాబత్తుల వెంకట్రావు, పిల్లి శ్రీనివాసరావు, వారా శ్రీనివాసరావు, కుసుమ ఆంజనేయులు, మచ్చా శ్రీను, కె.బెనర్జి, వందే విశ్వేశ్వరరావు, మద్దెల శోభనబాబు తదితరులు ఉన్నారు.కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్రకార్యదర్శి గుత్తుల నాగబాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నంబూరి శ్రీరామచంద్రరాజు, గన్నవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.