పార్టీ పటిష్టతకు కృషి చేస్తా
Published Mon, Dec 12 2016 11:52 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
డీసీసీ మాజీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ ∙
జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
300 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనతోనే..
సాక్షి, రాజమహేంద్రవరం :
పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేస్తానని డీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజసభ్య సభ్యుడు వి.విజయసాయిరెడ్డిల సమక్షంలో పార్టీలో చేరారు. వై.ఎస్.జగ¯ŒS పార్టీ కండువా కప్పి దుర్గేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు డీసీఎంఎస్ డైరెక్టర్ ఎలుగుబంటి అచ్యుత్‌రామ్; మాజీ జెడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రయ్య, పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలు, అనుచరులు 300 మంది పార్టీలో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజమహేంద్రవరం రూర ల్ కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు(బాబు), రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర, రాజమహేంద్రవరం నాగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, పార్టీనేతలు పోలుకిరణ్‌మోహ¯ŒSరెడ్డి, గుర్రం గౌతమ్, అడపాహరి తదితరులు పాల్గొన్నారు.
పార్టీకి మరింత బలం
సౌమ్యునిగా పేరొందిన కందుల దుర్గేష్ వైఎస్సార్‌సీపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మంచి వాగ్ధాటి కలిగిన దుర్గేష్ ప్రజా సమస్యలను బలంగా వినిపించగలరని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన దుర్గేష్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాదాపు దుర్గేష్ వెంట పయనించాయి. దుర్గేష్, ఆయన అనుచరులు వైఎస్సార్ సీపీలో చేరడంతో ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నామ మాత్రమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement
Advertisement