
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి గురునాథరావు, ముప్పిడి శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆరి్డనేటర్, ఎంపీ పీవీ విుథున్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద జెట్టి గురునాథరావు మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ ఇతరులకు లాభం చేకూర్చే పార్టీలాగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం నేర్చుకున్నారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ నేతల వ్యవహారశైలి నచ్చక వైఎస్సార్‌సీపీలో చేరామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment