Gurunath
-
వైఎస్సార్సీపీలో చేరిన ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గురునాథరావు
సాక్షి, అమరావతి: ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆరి్డనేటర్, ఎంపీ పీవీ విుథున్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద జెట్టి గురునాథరావు మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ ఇతరులకు లాభం చేకూర్చే పార్టీలాగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం నేర్చుకున్నారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ నేతల వ్యవహారశైలి నచ్చక వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. -
డ్రైవర్ గురునాథానికి కన్నీటి వీడ్కోలు
గరిడేపల్లి: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో తీవ్ర గాయాలపాలై మరణించిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథానికి గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్‌ను కాపాడబోయి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండకు అదేరోజు రాత్రి తీసుకువచ్చారు. బుధవారం బంధుమిత్రులు కడసారి గురునాథం భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టారు. నల్లగొండ, సూర్యాపేట తహసీల్దార్ల సంఘం అధ్యక్షులు షేక్ మౌలానా, షేక్ జమీరుద్దీన్, గరిడేపల్లి తహసీల్దార్ హెచ్.ప్రమీల గురునాథం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రూ.20 వేల సాయాన్ని అతని కుటుంబ సభ్యులకు సంఘం తరఫున అందించారు. అక్క అన్న అభిమానంతో కాపాడే సాహసం చేశాడు పేద కుటుంబానికి చెందిన గురునాథం తహశీల్దార్ విజయారెడ్డి వద్ద నమ్మకంగా పనిచేసేవాడని, ఆమెను అక్కా అని ఆప్యాయంగా పిలుస్తుండేవాడని బంధువులు తెలిపారు. అందుకే మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని చెప్పారు. -
విచారణకు హాజరైన గురునాథ్
చెన్నై: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్లు... ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారిస్తోన్న ముద్గల్ కమిటీ ముందు హాజరయ్యారు. సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ చెన్నైలో వరుసగా అందర్నీ విచారిస్తోంది. అయితే విచారణకు హాజరైన మెయ్యప్పన్ మాత్రం తాను ఏ విషయాన్ని వెల్లడించలేనని ఓ లేఖను కమిటీకి అందజేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్ శ్రీకాంత్, ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ రామన్లను కూడా ఈ కమిటీ ప్రశ్నించింది. మరో రెండు రోజుల్లో బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సావంత్‌ను విచారించనుంది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీ ఇప్పటి వరకు శ్రీశాంత్, చండిలా, సిద్ధార్ధ్త్రివేది, ఢిల్లీ, ముంబై పోలీసు అధికారులతో పాటు అనేక మందిని విచారించి వివరాలు సేకరించింది. -
చెన్నైని నడిపించింది గురునాథే: హస్సీ
న్యూఢిల్లీ: తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం క్రికెట్ అంటే మక్కువ కారణంగానే స్టేడియంలో కనిపించేవాడని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ చెబుతున్నప్పటికీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. సాక్షాత్తూ చెన్నై జట్టు ఆటగాడే గురునాథ్ గురించి నిజం చెప్పేశాడు. సీఎస్కే జట్టును గురునాథ్ నడిపించేవాడని ఓపెనర్ మైక్ హస్సీ కుండబద్దలు కొట్టాడు. తను రాసిన ‘అండర్నీత్ ది సదరన్ క్రాస్’ అనే పుస్తకంలో ఈ విషయాలు చెప్పాడు. ‘మా జట్టు ఓనర్ ఇండియా సిమెంట్స్ చీఫ్ ఎన్.శ్రీనివాసన్. ఆయన బీసీసీఐకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జట్టుపై పూర్తి బాధ్యతలను గురునాథ్‌కు అప్పగించారు. కెప్లెర్ వెస్సెల్స్‌తో కలిసి గురునాథ్ జట్టును నడిపించాడు’ అని ఆ పుస్తకంలో వివరించాడు. ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో గురునాథ్‌పై ముంబై పోలీసులు చార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గురునాథ్‌కు జట్టుకు ఎలాంటి సంబంధం లేదని శ్రీనివాసన్ చెబుతూ వస్తున్నారు. -
సొంత జట్టుకు వ్యతిరేకంగా బెట్టింగ్
ముంబై: ఐపీఎల్ ఆరో సీజన్లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై ముంబై పోలీసులు నమోదు చేసిన చార్జిషీట్లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లపై ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాగే బెట్టింగ్‌లో నిండా మునిగిన గురునాథ్ మెయ్యప్పన్ తమ సొంత జట్టుకు వ్యతిరేకంగా బెట్లు కాసేవాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. గురునాథ్, విందూ దారాసింగ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో ఇది తేలిందని చెప్పారు. ‘మే 12న రాజస్థాన్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి వీరిద్దరు మాట్లాడుకున్నారు. చెన్నై 130-140 పరుగులు సాధిస్తుందని విందూకు చెప్పాడు. ఆ రోజు చెన్నై 141 పరుగులు చేసింది. ఇలాంటి సమాచారం సెషన్ బెట్టింగ్‌కు చాలా కీలకంగా మారుతుంది. అలాగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుస్తుందని గురునాథ్ బెట్టింగ్ కాశాడు. అంతేకాకుండా మే 14న ఉదయం చెన్నై, ఢిల్లీ మ్యాచ్ గురించి మాట్లాడుతూ మనం కచ్చితంగా గెలుస్తాం.. టీమ్‌లో ఎలాంటి మార్పులు లేవు అని విందూకు చెప్పాడు. కేకేఆర్, బెంగళూరు మ్యాచ్‌కు సంబంధించిన అంతర్గత విషయాలను కూడా గురునాథ్ బహిర్గతం చేశాడు. ముంబైతో జరిగే మ్యాచ్‌ను సన్‌రైజర్స్ గెలుస్తుందని కూడా చెప్పాడు. మెయ్యప్పన్ వాయిస్ శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపాం. నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం’ అని తమ చార్జిషీట్లో విపులంగా వివరించారు. గురునాథ్ కచ్చితంగా చెన్నై జట్టు యజమాని అని సాక్షి నరేశ్ హిమ్మత్‌లాల్ మకానీ చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంపైర్ రవూఫ్ బెట్టింగ్ కాసేవాడు: పోలీసులు పాకిస్థాన్ అంపైర్ అసద్ రవూఫ్ ఐపీఎల్ సందర్భంగా బుకీల నుంచి బహుమతులు స్వీకరించడమే కాకుండా స్వయంగా బెట్టింగ్ కూడా కాసేవాడని పోలీసులు తెలిపారు. దీనికి తగిన సాక్ష్యాలను తమ చార్జిషీట్లో పొందుపరిచారు. మ్యాచ్‌కు సంబంధించిన సమాచారాన్ని బుకీలను అందించినందుకు రవూఫ్ విలువైన బహుమతులు పొందాడని, అలాగే తాను స్వయంగా అంపైరింగ్ చేసే మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు దిగేవాడన్నారు. విందూ, బుకీలతో మాట్లాడిన ఫోన్ రికార్డులను పోలీసులు సంపాదించారు. ‘మే15న మధ్యాహ్నం విందూతో ‘ఈరోజు జీవితంలో గెలుపో.. ఓటమో తేలుతుంది’ అని రవూఫ్ చెప్పడంతో వెంటనే విందూ బుకీలకు ఫోన్ చేసి అతడు చెప్పిన మ్యాచ్‌పై భారీ మొత్తంలో బెట్ కాయమని చెప్పాడు’ అని పోలీసుల రిపోర్ట్‌లో పేర్కొన్నారు.