విచారణకు హాజరైన గురునాథ్ | IPL probe panel meets Srinivasan, Gurunath | Sakshi
Sakshi News home page

విచారణకు హాజరైన గురునాథ్

Published Fri, Dec 20 2013 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

IPL probe panel meets Srinivasan, Gurunath

చెన్నై: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్‌లు... ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారిస్తోన్న ముద్గల్ కమిటీ ముందు హాజరయ్యారు. సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ చెన్నైలో వరుసగా అందర్నీ విచారిస్తోంది.
 
  అయితే విచారణకు హాజరైన మెయ్యప్పన్ మాత్రం తాను ఏ విషయాన్ని వెల్లడించలేనని ఓ లేఖను కమిటీకి అందజేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్ శ్రీకాంత్, ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ రామన్‌లను కూడా ఈ కమిటీ ప్రశ్నించింది. మరో రెండు రోజుల్లో బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సావంత్‌ను విచారించనుంది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీ ఇప్పటి వరకు శ్రీశాంత్, చండిలా, సిద్ధార్ధ్‌త్రివేది, ఢిల్లీ, ముంబై పోలీసు అధికారులతో పాటు అనేక మందిని విచారించి వివరాలు సేకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement