అనధికార సమావేశంలో
బీసీసీఐ సభ్యుల నిర్ణయం
చెన్నై: బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్.శ్రీనివాసన్‌ను మరోసారి ఎన్నుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్)పై చర్చించేందుకు ఆదివారం అనధికారికంగా సమావేశమైన 21 మంది బోర్డు సభ్యుల్లో ఎక్కువ మంది ఆయనకే మద్దతు పలికారు. ఈసారి ఈస్ట్‌జోన్ సభ్యులు మద్దతిచ్చిన వ్యక్తే అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు నేరుగా, ఒకరు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని శ్రీనికి మద్దతిచ్చారు. మరోవైపు నవంబర్ తొలి వారంలో స్పాట్ ఫిక్సింగ్‌పై ముద్గల్ కమిటీ తుది నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనుంది. దీంతో ఈనెల 30న జరగాల్సిన ఏజీఎమ్‌ను అప్పటి వరకు వాయిదా వేయాలని నిర్ణయించారు. దీనికోసం ఈనెల 26నే వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
మళ్లీ శ్రీనివాసన్‌నే ఎన్నుకుందాం!
Published Mon, Sep 8 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement