- పి.గన్నవరంలో బహిరంగ సభ, కన్నబాబు రాక
నేడు వైఎస్సార్ సీపీలో భారీగా చేరికలు
Published Mon, Apr 24 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
పి.గన్నవరం :
పి.గన్నవరంలో మంగళవారం సాయంత్రం జరుగనున్న బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో భారీగా చేరనున్నారని పార్టీ కోఆరి్డనేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు వెల్లడించారు. స్థానిక గణపతి గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను సోమవారం సాయంత్రం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన పి.గన్నవరం మండల నాయకులు ఉలిశెట్టి బాబీ, పిల్లి శ్రీనుల నాయకత్వంలో కొండేటి ఆధ్వర్యంలో 600 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరనున్నారని మోహనరావు చెప్పారు. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు అంబాజీపేట నుంచి పి.గన్నవరం అక్విడెక్టు వరకూ మోటారు సైకిలు ర్యాలీ జరుగు తుందన్నారు. అక్కడ దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో పాటు, జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఈ చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. మిగిలిన మూడు మండలాల్లో కూడా ఇదే రీతిలో చేరికలు ఉంటాయని కొండేటి చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేసారు. మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర రావు, వాసంశెట్టి చినబాబు, రాష్ట్ర నాయకులు మెల్లం మహలక్ష్మీ ప్రసాద్, పేరి శ్రీనివాస్, జిల్లా నాయకులు దొమ్మేటి వెంకట శివరామన్, తోలేటి బంగారునాయుడు తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు.
Advertisement
Advertisement