‘‘నా మొదటి సినిమా ‘శ్రీకారం’ థియేటర్స్‌లోకి రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఏంటి? ఇంత సమయం పట్టింది అనుకున్నా. కానీ, మా నిర్మాతలు తొలి సినిమా తీసేందుకు మంచి కథ కోసం దాదాపు 7 ఏళ్లు వేచిచూశారట.. ఇది నాకు స్ఫూర్తిగా అనిపించింది’’ అని దర్శకుడు కిశోర్ అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ‘శ్రీకారం’ ఈ నెల 11న విడుదలైంది.
చిత్రదర్శకుడు కిశోర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాది చిత్తూరు జిల్లా. డిగ్రీ పూర్తయ్యాక ఓ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. తెలుగులో ‘లవ్.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి’ వంటి చిత్రాలతో పాటు కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. 2016లో నేను తీసిన ‘శ్రీకారం’ అనే షార్ట్ ఫిల్మ్ చూసి, ఇదొక సినిమా కంటెంట్ అని చాలామంది అన్నారు. ఆ తర్వాత 14 రీల్స్ ప్లస్‌లో ‘శ్రీకారం’ సినిమా చేసే అవకాశం రావడం హ్యాపీ. వ్యవసాయం నేపథ్యంలో మా సినిమాలో ఎవరూ చెప్పని, చూపించని విషయాలను ప్రస్తావించడంతో మంచి స్పందన వస్తోంది. ‘శ్రీకారం’ మంచి విజయంతో పాటు గౌరవం కూడా తీసుకొచ్చింది. నా తర్వాతి సినిమా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment