Sreekaram Movie
-
యాంకర్‌ను పెళ్లి చేసుకున్న 'శ్రీకారం' సినిమా డైరెక్టర్
'శ్రీకారం' సినిమా దర్శకుడు కిశోర్ రెడ్డి వివాహం చేసుకున్నారు. తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యతో ఆయన వివాహం జరిగింది. శర్వానంద్ హీరోగా శ్రీకారం అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ తెలుగులో 'లవ్.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి' వంటి చిత్రాలతో పాటు కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన శ్రీకారం సినిమా తనకు మంచి విజయంతో పాటు గౌరవం కూడా తీసుకొచ్చింది. నేడు మార్చి 1న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో యాంకర్ కృష్ణ చైతన్యను కిశోర్ రెడ్డి వివాహం చేసుకున్నారు. యాంకర్ కేసీగా ఆమె అందరికీ సుపరిచితమైనదే.. కృష్ణ చైతన్య కొల్ల గతంలో ఆర్జేగా కూడా పనిచేసింది. ఆర్జే స్మైలీ క్వీన్ పేరుతో ఆమె రేడియో జాకీగా వ్యవహరించేవారు. పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలతో పాటు సినిమా కార్యక్రమాలకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరిస్తుంది. కిశోర్- కృష్ణ చైతన్యల వివాహానికి సినీ పరిశ్రమ నుంచే కాకుండా మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కానీ వారి వివాహానికి సంబంధించిన ఫోటోలో ఇంకా బయటకు రాలేదు కానీ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అక్కడ బోల్తా పడినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్
శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ఇటీవలె ఓటీటీలో రిలీజైంది. అయితే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల వద్ద బోల్తా కొట్టినా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఈ నెల 16 సన్నెక్స్ట్ యాప్‌లో రిలీజైన ఈ సినిమా అక్కడ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ‘శ్రీకారం సన్‌నెక్స్ట్‌లో తక్కువ సమయంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా ‘శ్రీకారం’ నిలిచింది. ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ని సంపాదించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. థియేటర్స్‌లో సత్తా చూపించకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజేస్తూ మెసేజ్ ఓరియంటెడ్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమాను కిశోర్ డైరెక్ట్ చేయగా, గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా.. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. చదవండి : శ్రీకారం సినిమాపై ప్రభాస్ కామెంట్ శర్వానంద్‌కే ఎందుకిలా జరుగుతోంది! -
ఓటీటీలో శ్రీకారం: రేపటి నుంచే ప్రసారం
యువ కథానాయకుడు శర్వానంద్ నటించిన లేటెస్ట్ చిత్రం 'శ్రీకారం'. ఈ సినిమా బాగుందంటూ ప్రశంసలైతే దక్కాయి కానీ కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. పైగా అప్పుడు 'జాతిరత్నాలు' కూడా థియేటర్లలో ఆడుతుండటంతో శ్రీకారం దాని పోటీ తట్టుకోలేక ఫెయిల్ అయింది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. సన్నెక్స్ట్ యాప్‌లో ఏప్రిల్ 16 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయిన వారు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసేయండి.. ఇదిలా వుంటే జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆహా, క్రాక్, నాంది ఆహాలో ప్రసారం అవుతుండగా తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాలు కూడా వరుసగా ఈ నెల 16, 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. చదవండి: శర్వానంద్ సినిమా బాగున్నా కలెక్షన్లు రావట్లే ఆహాలో చావు కబురు చల్లగా, మరికొత్త సినిమాలు.. -
శర్వానంద్‌కే ఎందుకిలా జరుగుతోంది!
టాలీవుడ్లో విభిన్న కథలు ఎంచుకోవడంలో యువ కథానాయకుడు శర్వానంద్ ఎప్పుడూ ముందుంటాడు. తన సినిమాలకు మంచి టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఇటీవల తను నటించిన ‘శ్రీకారం’ చిత్రం విడుదలవగా, మొదటి ఆటతోనే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకులు సైతం యువతకు ప్రేరణ అని, వారు తప్పక చూడాలని మెచ్చుకున్నారు. ఇంకేముంది హిట్ ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులంతా సంబరపడిపోయారు. కానీ అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. వస్తే వరుస హిట్లు, లేదా వరుస ఫ్లాపులు శర్వానంద్ కెరీర్‌ను చూస్తే 'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి' సినిమాల వరుస హిట్లతో అతడి మార్కెట్ బాగానే పెరిగింది. మధ్యలో ‘రాధ’ నిరాశ పరిచినా.. ‘మహానుభావుడు’తో మళ్లీ హిట్ ట్రాక్‌లో పడ్డాడని అనుకున్నారంతా! ఇంకేముంది సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. కానీ మహానుభావుడు తర్వాత ఆ హవాను కొనసాగించలేకపోయాడు. ప్రేమ కథా చిత్రంగా విడుదలైన ‘పడి పడి లేచే మనసు’ శర్వా కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా అయింది. తర్వాత ‘రణరంగం’ కూడా అంతగా ఆడలేదు. తమిళ రీమేక్ ‘జాను’ పర్వాలేదనిపించింది. తర్వాత వచ్చిన ‘శ్రీకారం’ అయినా అతడిని పరాజయాల బాట నుంచి బయట పడేస్తుందని అంతా అనుకున్నారు. ఈ సినిమా మంచి టాకే తెచ్చుకునప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దీనికి ప్రధాన కారణం చిన్న సినిమా అనుకున్న ‘జాతిరత్నాలు’ పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం శ్రీకారం కలెక్షన్లను చూస్తే బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవని సినీ పండితులు అంటున్నారు. ఏదేమైనా శర్వా కెరీర్లో మరో డిజాస్టర్‌గా ‘శ్రీకారం’ మిగలనుంది. శర్వా చేసిన చివరి నాలుగు చిత్రాలను పరిశీలిస్తే అవేవీ కూడా చెత్త సినిమాలు అనడానికి వీల్లేదు. మంచి కథనే ఎంచుకొని అభిరుచి ఉన్న దర్శకులతోనే సినిమాలు చేశాడు. ఆయా సినిమాల ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించడంతో శర్వాకు ఈసారి హిట్టు ఖాయం అన్న ఫీలింగే కలిగించింది ప్రతి సినిమా కూడా. కానీ ఏదీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. మరి తన తదుపరి సినిమాతోనైనా శర్వా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. ( చదవండి: విజయంతో పాటు గౌరవం తెచ్చింది: శ్రీకారం డైరెక్టర్ ) -
శ్రీకారం థియేటర్స్‌లోకి రావడానికి 4 ఏళ్లు పట్టిందట
‘‘నా మొదటి సినిమా ‘శ్రీకారం’ థియేటర్స్‌లోకి రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఏంటి? ఇంత సమయం పట్టింది అనుకున్నా. కానీ, మా నిర్మాతలు తొలి సినిమా తీసేందుకు మంచి కథ కోసం దాదాపు 7 ఏళ్లు వేచిచూశారట.. ఇది నాకు స్ఫూర్తిగా అనిపించింది’’ అని దర్శకుడు కిశోర్ అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ‘శ్రీకారం’ ఈ నెల 11న విడుదలైంది. చిత్రదర్శకుడు కిశోర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాది చిత్తూరు జిల్లా. డిగ్రీ పూర్తయ్యాక ఓ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. తెలుగులో ‘లవ్.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి’ వంటి చిత్రాలతో పాటు కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. 2016లో నేను తీసిన ‘శ్రీకారం’ అనే షార్ట్ ఫిల్మ్ చూసి, ఇదొక సినిమా కంటెంట్ అని చాలామంది అన్నారు. ఆ తర్వాత 14 రీల్స్ ప్లస్‌లో ‘శ్రీకారం’ సినిమా చేసే అవకాశం రావడం హ్యాపీ. వ్యవసాయం నేపథ్యంలో మా సినిమాలో ఎవరూ చెప్పని, చూపించని విషయాలను ప్రస్తావించడంతో మంచి స్పందన వస్తోంది. ‘శ్రీకారం’ మంచి విజయంతో పాటు గౌరవం కూడా తీసుకొచ్చింది. నా తర్వాతి సినిమా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అన్నారు. చదవండి: Sreekaram Review: శర్వానంద్ మెప్పించాడా? -
‘శర్వానంద్ కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ మూవీ శ్రీకారం’
‘‘శ్రీకారం’ సినిమా శర్వానంద్ కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసింది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇంత మంచి సినిమా చూసి చాలారోజులైందని అందరూ అభినందిస్తున్నారు’’ అని నిర్మాత గోపీ ఆచంట అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా కిషోర్.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. సక్సెస్ మీట్లో డైరెక్టర్ బి.కిషోర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మంచి కథ పడితే ప్రతి ఆర్టిస్ట్ ఎలివేట్ అవుతాడనడానికి ‘శ్రీకారం’ ఒక ఉదాహరణ’’ అన్నారు నటుడు సాయికుమార్. ‘‘యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా ‘శ్రీకారం’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘కిషోర్ ప్రతి సీన్‌ను నిజాయతీగా చెప్పాడు.. ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు డైరెక్టర్ బాబీ. ‘‘కొన్ని సినిమాల్లోని పాత్రలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడతాయి.. అలాంటి సినిమా ‘శ్రీకారం’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. ‘‘శ్రీకారం’ సంతోషాన్నిచ్చే సినిమా’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. చదవండి: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ కొత్త సినిమా -
శ్రీకారం సినిమాపై ప్రభాస్ కామెంట్
శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం శ్రీకారం. కిశోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. భూమికి, మనిషికి మధ్య ఉన్న ప్రేమకథే ఈ శ్రీకారం. మహాశివరాత్రి సందర్భంగా రిలీజైన ఈ సినిమాను ప్రభాస్ అభినందించాడు. "నా ప్రియమైన సోదరుడు శర్వానంద్‌కు ఆల్ ద బెస్ట్. శ్రీకారం సినిమా చూశాను, చాలా బాగుంది. చిత్రయూనిట్‌కు ఇదే నా బెస్ట్ విషెస్" అని పేర్కొన్నాడు. డార్లింగ్ ప్రభాస్ సపోర్ట్ చేయడంతో సంతోషపడిపోయిన శర్వానంద్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. కాగా రైతు కొడుకు రైతు కావడం లేదనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. 'వ్యవసాయాన్ని ఓ ఉద్యోగంగానో, వ్యాపారంగానో ఎవరూ చూడటం లేదు.. వ్యవసాయంలో నష్టాలు వస్తుండటంతో ఇటువైపు ఆసక్తి చూపడం లేదు. ఒక్కొక్కరుగా కాకుండా ఊర్లోని అందరూ కలసి ఉమ్మడి వ్యవసాయం చేయాలి.. వచ్చిన లాభాలను సమానంగా పంచుకోవాలి. అలా చేయడం వల్ల ఎవరూ నష్టపోరని మా సినిమాలో చూపిస్తున్నాం. చదువుకున్నవాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే నష్టాలు రావు' అని శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. Thank you so much Prabhas anna ❤️ pic.twitter.com/gsoDSbXQJw — Sharwanand (@ImSharwanand) March 10, 2021 చదవండి: మొదటి ఫోన్ చరణ్ నుంచే వచ్చింది: శర్వానంద్ Sreekaram Review: శర్వానంద్ మెప్పించాడా? -
'శ్రీకారం' మూవీ రివ్యూ
టైటిల్ : శ్రీకారం నటీనటులు : శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, సాయికుమార్, మురళీ శర్మ, రావు రమేశ్ తదిరులు నిర్మాణ సంస్థ : 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీ ఆచంట దర్శకత్వం : బి.కిశోర్ సంగీతం : మిక్కీ జె. మేయర్ సినిమాటోగ్రఫీ : జే యువరాజ్ ఎడిటింగ్ : మార్తండ్ కె వెంకటేశ్ విడుదల తేది : మార్చి 11, 2021 'జాను' సినిమాతో నిరాశపర్చిన శర్వానంద్ ఈసారి లవ్‌స్టోరీని కాకుండా రైతుల స్టోరీని ఎంచుకున్నాడు. "కావాల్సినంత ప్రేమ.. సరిపోయే సెంటిమెంట్.. అల్లరి చేసే ఫ్రెండ్స్.. ఏడిపించే నాన్న.. నవ్వించే విలన్.. అందమైన అమ్మాయి.. అన్నం పెట్టే భూమి.. దీని చుట్టూ తిరిగే హీరో కారెక్టర్.. ఇదే శ్రీకారం కథ" అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కథ, కాన్సెప్ట్ పూర్తిగా రివీల్ చేశాడు శర్వానంద్. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా నేడు(మార్చి 11)న రిలీజైంది. దీనికి పోటీగా మరో రెండు, మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఇటీవల రైతు కథాంశం మీద వచ్చిన సినిమాలు తక్కువే. చాలా కాలం తర్వాత వస్తున్న ఈ కర్షకుల చిత్రం ఎలా ఉంది? రైతు బిడ్డగా శర్వానంద్ ఏ మేరకు మెప్పించాడు? అన్న అంశాలను రివ్యూలో తెలుసుకుందాం... కథ: అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్) ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన పనితనంతో ఆఫీస్‌లో అందరి మన్ననలు పొందుతాడు. చైత్ర(ప్రియాంకా అరుళ్ మోహన్) ఇతడిని బుట్టలో వేసుకునేందుకు ఎంత ట్రై చేసినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంటాడు. ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించేందుకు డిసైడ్ అవుతుంది. కానీ కార్తీక్ మాత్రం ఉద్యోగం మానేసి వ్యసాయం చేయడానికి తన గ్రామానికి వెళ్తాడు. వ్యవసాయం దండుగ అని వదిలేసిన కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు. అసలు కార్తిక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్ ఎలా పరిష్కరించాడు? టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలిచాడు అనేదే మిగతా కథ. నటీనటులు విభిన్నమైన కథాంశాలను ఎంచుకునే శర్వానంద్ ఈ సినిమాలోనూ నటనతో మెప్పించాడు. కంప్యూటర్ ముందు యంత్రంలా పని చేసే యువ సాఫ్ట్వేర్ పొలంలోకి దిగుతే ఎలా ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లు చూపించాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన కార్తిక్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. తనకు ఉన్న అనుభవంతో కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా చక్కగా పండించాడు. కథనంతా తన భూజాన వేసుకొని నడిపించాడు. తుంటరి పిల్ల చైత్ర పాత్రలో ప్రియాంకా అరుళ్ మోహన్ మెప్పించింది.ఇక ఈ సినమాకు మరో ప్రధాన బలం హీరో తండ్రి కేశవులు పాత్ర చేసిన రావు రామేశ్‌ది. నిరుపేద రైతు కేశవులు పాత్రలో రావు రమేశ్ ఒదిగిపోయాడు. ఇక మంచితనం ముసుగు కప్పుకొని జనాన్ని మోసం చేసే ఏకాంబరం పాత్రలో సాయి కుమార్ పర్వాలేదనిపించారు. హీరో తల్లిగా ఆమని ఆకట్టుకుంది. నరేశ్, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తే ఎంత లాభం ఉంటుందో తెలియజేసే కథే ‘శ్రీకారం’. వ్యవసాయం, రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్. కష్టంపడి పనిచేసి పంటను పండించిన రైతు.. తన పంటను అమ్ముకోలేక ఎంతటి కష్టాలు పడుతాడో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు.. వారిని ఎలా పీక్కుతింటారనేది వాస్తవానికి దగ్గరగా చూపించాడు. మంచి సందేశాత్మక కథ అయినప్పటికీ.. ఇది అందరికి తెలిసిన సబ్జెక్టే. రైతుల కష్టం నేపథ్యంలో ఇప్పటికే బోలెడు చిత్రాలు వచ్చాయి. కొత్తదనం లేకపోవడం ఈ సినిమా ప్రధాన లోపం. దానికి తోడు స్లో నెరేషన్ కూడా ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెంచలదాస్ రాసి పాడిన ‘వస్తానంటివో’ పాట తప్ప మిగతావన్ని అంతంతమాత్రమే. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్. ‘ఒక హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేస్తున్నాడు.. ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రమే తన కొడుకును రైతు చేయడం లేదు’, ‘తినేవాడు నెత్తి మీద జుట్టంతా ఉంటే.. పండించేవాడు మూతి మీద మీసం అంత లేరు’లాంటి సంభాషణలతో రైతుల దీనగాథను వివరించారు. అలాగే ‘పనిని పట్టి పరువు.. పరువుని పట్టి పలకరింపు’, ‘ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందాం అని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా’అనే డైలాగ్స్ యువతను ఆలోచింపజేస్తాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. ఎడిటర్ మార్తండ్ కె వెంకటేశ్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. b ప్లస్ పాయింట్స్ శర్వానంద్ నటన సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ స్లో నేరేషన్ సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమా కోసం 40 ఎకరాల్లో వ్యవసాయం: హీరో
‘‘మనందరం ‘జై జవాన్ – జైకిసాన్ ’ అంటుంటాం. వారికి మించిన హీరోలు లేరు. అయితే రైతులు లేకుంటే జవాన్లకి కూడా అన్నం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు నిజమైన గౌరవం ఇవ్వడం లేదు. వారిని గౌరవించాలి’’ అని శర్వానంద్ అన్నారు. కిశోర్ బి. దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శర్వానంద్ చెప్పిన విశేషాలు. ► రైతు కొడుకు రైతు కావడం లేదనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. వ్యవసాయాన్ని ఓ ఉద్యోగంగానో, వ్యాపారంగానో ఎవరూ చూడటం లేదు.. వ్యవసాయంలో నష్టాలు వస్తుండటంతో ఇటువైపు ఆసక్తి చూపడం లేదు. ఒక్కొక్కరుగా కాకుండా ఊర్లోని అందరూ కలసి ఉమ్మడి వ్యవసాయం చేయాలి.. వచ్చిన లాభాలను సమానంగా పంచుకోవాలి. అలా చేయడం వల్ల ఎవరూ నష్టపోరని మా సినిమాలో చూపిస్తున్నాం. చదువుకున్నవాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే నష్టాలు రావు. ► ఒక సందేశాన్ని వినోదాత్మకంగా, భావోద్వేగంగా, కమర్షియల్‌గా చెప్పడం కత్తి మీద సామే. కానీ కిశోర్ చక్కగా తెరకెక్కించాడు. తండ్రిని చూసి చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలనుకుంటాడు హీరో.. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తాడు ► ఈ సినిమా కోసం చిత్తూరు జిల్లాలో 40 ఎకరాల్లో వ్యవసాయం చేశాం. లాక్డౌన్ లో వ్యవసాయం నేర్చుకున్నాను. నాకు సినిమాలు లేనప్పుడు, నటన ఇక చాలు అనుకున్నప్పుడు వ్యవసాయం చేస్తాను. -
శ్రీకారం ఆడియో ఫంక్షన్లో గాయపడ్డ వ్యక్తి మృతి
సాక్షి, ఖమ్మం: రెండు రోజుల క్రితం జిల్లాలోని మమత మెడికల్ కాలేజీ ప్రాంగణంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకకు జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలో చిరంజీవిని చూడటానికి అభిమానులు అత్యుత్సాహం చూపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివ బుధవారం మరణించాడు. ప్రకాష్ నగర్‌కు చెందిన శివ వంటమాస్టార్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన చిరంజీవిని చూసేందుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చదవండి: శర్వానంద్ నాకు మరో రామ్‌చరణ్ లాగా: చిరు -
'శ్రీకారం' ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఫోటోలు
-
ఖమ్మంలో ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్ వేడుక
-
శర్వానంద్ నాకు మరో రామ్‌చరణ్ లాగా: చిరు
‘‘ఒక యాక్టర్ కొడుకు యాక్టర్, డాక్టర్ కొడుకు డాక్టర్, రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు కావాలనుకుంటారు. కానీ ఓ రైతు కొడుకు రైతు అవ్వాలని అనుకోడు. రైతు కొడుకు కూడా గర్వంగా నేను రైతే అవుతాను అనే రోజులు మళ్లీ రావాలి. ఆ రోజు వస్తుందనే ఆశాభావం ఉంది’’ అని చిరంజీవి అన్నారు. వ్యవసాయ జీవితం నేపథ్యంలో శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా కిశోర్ బి. దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీకారం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘శర్వానంద్ నాకు మరో రామ్‌చరణ్ లాగా. తను చిన్నప్పుడు నాతో కలసి థమ్స్అప్ యాడ్ చేశాడు. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో అతిథి పాత్ర చేశాడు. ఆ రకంగా తన నటనకి శ్రీకారం చుట్టింది నేనే. చూస్తుండగానే సినిమా సినిమాకి పరిణతి సాధిస్తూ సినిమాలు చేస్తున్నాడు. మన చదువుతోటి వ్యవసాయానికి అధునాతన టెక్నాలజీని జోడిస్తే వ్యవసాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లొచ్చు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ–‘‘నేను చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి ఫ్యాన్. ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్ వేడుక ఇంత పెద్ద ఎత్తున ఖమ్మంలో జరగడానికి ప్రధాన కారణం చిరంజీవి. ‘ఆచార్య’ షూటింగ్ కొంతైనా ఖమ్మంలో చేయాలని ఆయన్ని కోరడంతో ఇల్లందులోని మైన్స్ వద్ద షూటింగ్ చేస్తున్నారు’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘బాస్ (చిరంజీవి) ముందు మాట్లాడాలంటే టెన్షన్‌గా ఉంది. ‘శర్వా... నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీ తలరాతను తిరగరాస్తాడు’ అని చిరంజీవిగారు చెప్పిన మాటను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంకల్పమే నన్ను స్టార్‌ని చేసి నా స్టార్‌ని మార్చింది. వారసత్వం ద్వారా చాలామందికి ఆస్తులు వస్తాయి. కానీ చిరంజీవిగారి క్యారెక్టర్, ఆ వారసత్వం నా స్నేహితుడు రామ్‌చరణ్ తేజ్‌కి వచ్చింది.. అది ఇంకెవ్వరికీ దక్కదు’’ అన్నారు. దర్శకుడు కిశోర్ మాట్లాడుతూ – ‘‘శర్వానంద్గారిని ఒక హీరోలా కాదు.. నా అన్నలా భావిస్తున్నాను’’ అన్నారు. గోపీ ఆచంట మాట్లాడుతూ –‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ఈ వేడుకలో మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, పాటల రచయితలు పెంచల్ దాస్, కేకే, భరద్వాజ, నిర్మాత చెరుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవికి శర్వా పాధాభివందనం -
‘శ్రీకారం’ వేడుక: ముఖ్య అతిథిగా మెగాస్టార్
సాక్షి, ఖమ్మం: హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్ జంటగా నటించిన శ్రీకారం చలన చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహక సంస్థ శ్రేయాస్ మీడియా ప్రతినిధి దొబ్బల వేణు తెలిపారు. ఆదివారం వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6గంటల నుంచి ప్రారంభమవుతుందని, ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హాజరవుతారని తెలిపారు. సినీ దర్శకుడు డి.కిషోర్, సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్, చిత్ర బృందం పాల్గొంటుందని తెలిపారు. ఎంట్రీ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో శ్రేయాస్ మీడియా గ్రూపు ప్రతినిధులు నల్లి శ్యామ్, నరేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సినిమాల శాంపిల్ రెడీ.. చూసేందుకు మీరు సిద్ధమా -
ఫస్ట్‌కాల్ రామ్ చరణ్ నుంచే వచ్చింది: శర్వానంద్
‘‘శ్రీకారం’ కథ విన్నప్పుడు ఒక బాధ్యతగా ఈ సినిమా చేయాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరో హీరోయిన్లుగా కిశోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీకారం’. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘మాది రైతు కుటుంబమే. లాక్డౌన్ లో ఓ మూడు నెలలు నేను మా పొలం దగ్గరే గడిపాను. ‘శ్రీకారం’ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్‌కాల్ నాకు చరణ్ (హీరో రామ్‌చరణ్) నుంచి వచ్చింది. వ్యవసాయాన్ని చులకనగా చూస్తున్నారు. చదువుకున్నవారు వ్యవసాయం చేస్తే టెక్నాలజీని ఊపయోగించి మరింత బాగా చేస్తారు’’ అని అన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ తమ కథను తాము స్క్రీన్ పై చూసుకుంటున్నట్లుగా ఫీలై థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అని దర్శక, రచయిత కిశోర్ అన్నారు. ‘‘డైలాగ్స్ పెద్ద ఎస్సెట్. దర్శకుడిగా కిశోర్‌కు మంచి భవిష్యత్తు ఉంది’’ అని నిర్మాత గోపీ అన్నారు. ‘‘మంచి కథలనే ఎంచుకునే ఓ అరుదైన నటుడు శర్వానంద్. భూమికీ, మనిషికీ మధ్య ఉన్న ప్రేమకథే ‘శ్రీకారం’ సినిమా. ఈ భూమి మీద పైసా కూడా దోచుకోలేనిది ఒక్క రైతు మాత్రమే’’ అని అన్నారు డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా. ‘‘ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో వెళ్లి ఈ సినిమాను చూడండి’’ అన్నారు ప్రియాంకా అరుళ్ మోహనన్. -
శర్వానంద్‌కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో..
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. శనివారం 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్న బర్త్ డే బాయ్ శర్వాకి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, స్నేహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బర్త్‌డే సందర్భంగా శర్వానంద్‌కి ఊహించని సర్ప్రైజ్ ఎదురయ్యింది. తన బెస్ట్ ఫ్రెండ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్‌కు మర్చిపోలేని పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అర్థరాత్రి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసి శర్వానంద్ చేత కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిలో శర్వానంద్.. రామ్ చరణ్, మరో స్నేహితుడితో కలిసి బర్త్ డే కేక్ కట్ చేయడం చూడవచ్చు. ఆచార్య సినిమాకు సంబంధించి తన షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్, రెండు రోజుల క్రితం భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్నేహితుడు శర్వానంద్ కోసం సర్ప్రైజ్ బర్త్ డే పార్టీ అరెంజ్ చేశారు. రామ్ చరణ్, శర్వానంద్‌తో పాటు మరో స్నేహితుడు విక్కి కూడా ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. Thank you @AlwaysRamCharan for hosting a great party ❤️❤️❤️ pic.twitter.com/jJf03cRMp0 — Sharwanand (@ImSharwanand) March 6, 2021 శ్రీకారం మూవీని పూర్తి చేసిన శర్వానంద్ ప్రస్తుతం తరువాత సముద్రం సినిమాతో బిజీగా ఉన్నాడు.అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దార్థ్, అను ఇమ్యానుయేల్, అదితి రావ్ హైదరీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం బృందం శర్వానంద్ బర్త్ డే సందర్భంగా మహా సముద్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసింది. పోస్టర్ని బట్టి ఈ సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో శర్వానంద్ చేతిలో ఆయుధంతో.. చాలా కోపంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకారం సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని తెలియజేస్తూ సాగే ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటించారు. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. -
సినిమాల శాంపిల్ రెడీ.. చూసేందుకు మీరు సిద్ధమా
కంప్యూటర్ వదలి నాగలి పట్టి, వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. చావు కబురు చల్లగా చెబుతాడు మరో యువకుడు. గ్రామంలో జరిగే ఊహించని పరిణామాలకు భయపడతారు గ్రామప్రజలు. ఒక గ్యాంగ్‌స్టర్ అండర్‌వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ నాలుగు కథలూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈలోపు నాలుగు సినిమాలకు సంబంధించిన చిన్న శాంపిల్‌ని ట్రైలర్, టీజర్ రూపంలో చూపించాయి ఆయా నిర్మాణసంస్థలు. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, కార్తికేయ చేసిన ‘చావు కబురు చల్లగా..’, సముద్రఖని ‘ఆకాశవాణి’, రామ్‌గోపాల్‌వర్మ ‘డి కంపెనీ’ సినిమాలకు సంబంధించి కొత్త విశేషాలు బయటకొచ్చాయి. జోడీ కుదిరింది ‘‘రామ్‌తో కలిసి సినిమా చేయబోతున్నందుకు సూపర్ డూపర్ ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి పేరుని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెనే ఎంపిక చేసినట్లు శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మట్టికి.. మనిషికి మధ్య ప్రేమకథ ఉద్యోగం చేస్తున్న కంపెనీ యూఎస్ బ్రాంచ్‌కి మేనేజర్ కావాల్సిన యువకుడు వ్యవసాయం కోసం పొలంలో కాలు పెట్టాడు. నాగలి పట్టాడు. మట్టికి మనిషికి మధ్య ఉన్న ప్రేమకథను మరోసారి గుర్తు చేయడానికి శ్రీకారం చూట్టాడు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన¯Œ హీరో హీరోయిన్లుగా కిశోర్ దర్శకత్వం వహించిన ‘శ్రీకారం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కిశోర్ దర్శకత్వంలో గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. బస్తీ ప్రేమకథ అబ్బాయి శవాలబండి డ్రైవర్. అమ్మాయి నర్స్. అబ్బాయికి అమ్మాయిపై లవ్వు. కానీ అమ్మాయికి అబ్బాయంటే కోపం. మరి.. ప్రేమకథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నకు ‘చావు కబురు చల్లగా..’లో సమాధానం దొరుకుతుంది. కార్తికేయ, లావాణ్యా త్రిపాఠీ జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. కౌశిక్ దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో బస్తీ బాలరాజుగా కార్తికేయ, మల్లిక పాత్రలో లావణ్యా త్రిపాఠీ నటించారు. గ్రామంలో అలజడి అడవికి దగ్గరగా ప్రశాంతంగా ఉన్న ఓ గ్రామంలో ఊహించని అలజడి రేగుతుంది. భయంతో గ్రామస్తులు రాత్రివేళ దేనికోసమో అన్వేషిస్తుంటారు. ఆ గ్రామంలో ఏం జరిగింది? అనే మిస్టరీ వీడాలంటే ‘ఆకాశవాణి’ చూడాల్సిందే. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో అశ్వి¯Œ గంగరాజు దర్శకత్వంలో పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆకాశవాణి’. దీని టీజర్‌ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘డి– కంపెనీ’. అక్షత్ కాంత్, ఇర్రా మోర్, నైనా గంగూలీ, రుద్ర కాంత్ ప్రధాన పాత్రల్లో స్పార్క్ సాగర్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘‘గ్యాంగ్‌స్టర్ స్థాయి నుంచి అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి దావూద్ ఇబ్రహీం ఎలా ఎదిగాడు? 1993లో ముంబయ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సూత్రధారి ఎవరు? అనే అంశాలను ప్రస్తావించాం. ఈ 26న తెలుగు, హిందీలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
నిన్ను లవ్‌లో పడేయాలంటే ఏం చేయాలంటావ్!
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు టాలీవుడ్ హీరో శర్వానంద్. జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘శ్రీకారం’. వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని తెలియజేస్తూ వస్తున్న ఈ సినిమాను ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా కథనందిస్తున్నారు. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్లను గురువారం ముగ్గురు హీరోలతో విడుదల చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్, నాచురల్ స్టార్ నాని, నితిన్ చేతులు మీదుగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్లో రైతుగా శర్వానంద్ ఆకట్టుకుంటున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని రైతుగా మారిన హీరో వ్యవసాయం గురించి చెప్పే సంభాషణలు బాగున్నాయి. కాగా ట్రైలర్‌పై మరో టాలీవుడ్ హీరో నితిన్ స్పందించారు. హిట్టు కళ కనిపిస్తోందంటూ కామెంట్ చేశాడు. అదే విధంగా అడ్వాన్స్‌గా బర్త్‌డే విషెస్ తెలిపాడు. ఇక రావు రమేష్, నరేష్, మురళీ శర్మ, సాయి కుమార్, ఆమని, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా మార్చి 11 శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చదవండి: ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్ వచ్చేసిందోచ్! ప్లీజ్ ఏదైనా చెయ్యండి: తాప్సీ బాయ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ -
వ్యవసాయం లాభసాటిగా మారాలి
‘‘జనాభా పెరిగే కొద్దీ తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అలాంటప్పుడు వ్యవ సాయం లాభసాటిగా మారాలి కానీ, నష్టాల్లో కూరుకుపోతోంది. దానికి పరిష్కారం చెప్పడానికి ‘శ్రీకారం’ ద్వారా ప్రయత్నం చేశాడు కిషోర్. ఈ చిత్రకథ ఆసక్తికరంగా ఉంది’’ అని డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నారు. శర్వానంద్ హీరోగా కిషోర్ బి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న రిలీజ్ కానుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ‘శ్రీకారం’ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ని త్రివిక్రమ్ విడుదల చేశారు.‘‘నాలుగేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. ‘శ్రీకారం’తో ఫ్యూచర్ ఫిల్మ్ చేశాను. ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే విధంగా చాలా విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు బి. కిషోర్. ‘‘అత్యధిక థియేటర్స్‌లలో గ్రాండ్‌గా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు రామ్ ఆచంట. -
‘తినేవాళ్లు జుట్టంతా.. పండించేవాళ్లు మీసమంతా’: శ్రీకారం టీజర్
‘ఓ హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్.. ఒక ఇంజినీర్ తన కొడుకు ఇంజినీర్ చేస్తున్నాడు. కానీ ఒక రైతు మాత్రం తన కొడుకును రైతును చేయడం లేదు. ఈ ఒక్కటి నాకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఆయన హీరోగా, కిశోర్.బి దర్శకత్వం వహించిన చిత్రం శ్రీకారం. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న శ్రీకారం బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ మహేశ్ టీజర్‌ను విడుదల చేశాడు. వాస్తవ ఘటనల నేపథ్యంతో సినిమా తీస్తున్నట్లు టీజర్లో ఉంది. వ్యవసాయ ప్రాధాన్యం తెలిపేలా సినిమా నేపథ్యం ఉందని తెలుస్తోంది. ‘తినేవాళ్లు నెత్తిమీద జుట్టు అంత ఉంటే.. పండించేవాళ్లు మూతిమీద మీసం అంతమంది కూడా లేరు’ అంటూ రైతుల గురించి శర్వానంద్ చెప్పిన డైలాగ్స్ హృదయాలను హత్తుకునే విధంగా ఉన్నాయి. కుటుంబ చిత్రంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే’, ‘వస్తానంటివో పోతానంటివో భలేగుంది బాల’ పాటలు విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే సాయంత్రం 4.05 గంటలకు టీజర్ విడుదల చేస్తారని ప్రకటించగా.. దాదాపు ఓ గంట ఆలస్యంగా విడుదల చేశారు. -
షేక్ చేస్తున్న శర్వానంద్ ‘భలేగుంది బాలా’ సాంగ్
శర్వానంద్, ప్రియాంక అరుళ్మోహన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్ .బి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి భలేగుంది బాలా అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. (చదవండి : పవన్‌తో సినిమాపై రానా స్పందన) 'వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే..కట్టమింద బోయే అలకల చిలక భలేగుంది బాలా..దాని ఎధాన ఉండే పూల పూల రైకా భలేగుంది బాలా' అంటూ పెంచల్ దాస్ స్వయంగా రాసి.. పాడిన ఈ పాట అలా విడుదలైందో లేదో ఇలా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగుతూ ఈ పాట అందరిని అలరిస్తోంది. శర్వానంద్ మాస్ డాన్సులు వేస్తుంటే.. లంగావోణిలో ప్రియాంక వయ్యారంగా నడుస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ రైతుగా కనిపించనున్నాడు. -
తిరుపతిలో శ్రీకారం
శర్వానంద్, ప్రియాంక అరుళ్మోహన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్ .బి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత గురువారం ‘శ్రీకారం’ చిత్రం షూటింగ్‌ను పునః ప్రారంభించారు. తిరుపతిలో షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్లు, సీనియర్ నరేశ్‌లతో పాటు మరికొంతమంది నటులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ. జె. మేయర్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జె. యువరాజ్, ఆర్ట్: అవినాశ్ కొల్లా. -
యంగ్ పొంగల్
పండగంటే ఎవరింటికి వాళ్లు చేరుకోవాలి. థియేటర్లోకి సినిమా రావాలి. కుటుంబమంతా కలసి ఆ సినిమాకు వెళ్లాలి. సినిమాకు సంక్రాంతి ముఖ్యం. సంక్రాంతికి సినిమా ముఖ్యం. సంక్రాంతి బరిలో దిగడానికి భారీ సినిమాలు పోటీపడుతుంటాయి. స్టార్ హీరోలు ఇద్దరు ముగ్గురు పండగ పోటికీ సిద్ధమైతే, యంగ్ హీరోలకు ఛాన్స్ మిస్. కానీ వచ్చే సంక్రాంతి పూర్తిగా యంగ్ కాబోతోంది. ఈ పొంగల్ (సంక్రాంతి)కి వినోదం వడ్డించడానికి యంగ్ హీరోలు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. రంగ్ దే 25 సినిమాలు చేసిన నితిన్‌కు ఇప్పటివరకు ఒక్క సంక్రాంతి రిలీజ్ లేకపోవడం విశేషం. ‘రంగ్ దే’తో తొలిసారి పొంగల్‌కి తన సినిమాను విడుదల చేయబోతున్నారు నితిన్. అలాగే పెళ్లి తర్వాత నితిన్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శర్వాతో శ్రీకారం శర్వానంద్‌కి సంక్రాంతి కలిసొస్తుంది. గతంలో ‘ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి’ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. శర్వానంద్ కెరీర్లో మంచి హిట్స్‌గా ఈ సినిమాలు నిలబడ్డాయి. ఇప్పుడు ‘శ్రీకారం’తో మరోసారి సంక్రాంతికి థియేటర్స్‌లోకి రాబోతున్నారు. కొత్త దర్శకుడు కిశోర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో శర్వానంద్ రైతుగా కనిపించనున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిక. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కావాల్సింది. కరోనా వల్ల సంక్రాంతికి వాయిదా వేశారని సమాచారం. బ్యాచిలర్ వస్తున్నాడు అఖిల్‌కి ఇది తొలి సంక్రాంతి. హీరోగా అఖిల్ థియేటర్లో సందడి చేయబోతున్న తొలి సంక్రాంతి. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా సమ్మర్లో విడుదల కావాల్సింది. కరోనా వల్ల పొంగల్‌కి పోస్ట్‌పోన్ అయింది. ఇందులో అఖిల్ పాత్ర పేరు నాగార్జున అని టాక్. ఇదో రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని సమాచారం. కరోనాతో సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. షూటింగులు ఆగిపోయాయి. సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. సినిమా సందడి లేకపోవడం సినీ ప్రేమికులకు పెద్ద లోటు. త్వరలో థియేటర్లు ఆరంభం అయి, సందడి మొదలవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
వస్తున్నాం.. హైస్సా
హీరో శర్వానంద్ రైతుగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ ఏప్రిల్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. ‘పట్టరా పట్టు హైస్సా.. ఎత్తరా ఎత్తు హైలెస్సా!!, వసున్నాం రా హైస్సా.. ఏప్రిల్ 24న హైలెస్సా’’ అని చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు. హరీష్ కట్టా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
శర్వానంద్ ‘శ్రీకారం’ ముహూర్తం ఫిక్స్!
శర్వానంద్ ‘శ్రీకారం’కు ముహూర్తం ఖరారయింది. విభిన్న కథలతో తనకంటూ టాలీవుడ్లో ఓ పత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తాజాగా చేస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ప్రస్తుతం ‘జాను’చిత్రంతో బిజీగా ఉన్న శర్వా.. ఈ సినిమాతో పోటు ‘శ్రీకారం’చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో వావ్ అనిపించిన శర్వానంద్.. తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ తెలిపాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదల చేయబోతున్నట్లు అపీషియల్‌గా అనౌన్స్ చేశాడు. చిత్ర విడుదల ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తూ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో శర్వానంద్‌కు జంటగా ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈసినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లో కలర్ ఫుల్ షర్ట్, లుంగీ ఎత్తి కట్టి, నల్ల తువ్వాల భుజంపై వేసుకుని పొలాల్లో నడిచి వస్తున్న శర్వా లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఆ ఒక్క పోస్టర్‌తో చిత్రంపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. ‘శతమానంభవతి’ తర్వాత పల్లెటూరు నేపథ్యంలో చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో శర్వా రైతుగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు.} చదవండి: ‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా! ప్రేమికులను కట్టిపడేస్తున్న ‘ఊహకు ఊపిరి పోసి’