విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు టాలీవుడ్ హీరో శర్వానంద్. జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘శ్రీకారం’. వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని తెలియజేస్తూ వస్తున్న ఈ సినిమాను ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా కథనందిస్తున్నారు. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌లను గురువారం ముగ్గురు హీరోలతో విడుదల చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్, నాచురల్ స్టార్ నాని, నితిన్ చేతులు మీదుగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్‌లో రైతుగా శర్వానంద్ ఆకట్టుకుంటున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకొని రైతుగా మారిన హీరో వ్యవసాయం గురించి చెప్పే సంభాషణలు బాగున్నాయి. కాగా ట్రైలర్‌పై మరో టాలీవుడ్ హీరో నితిన్ స్పందించారు. హిట్టు కళ కనిపిస్తోందంటూ కామెంట్ చేశాడు. అదే విధంగా అడ్వాన్స్‌గా బర్త్‌డే విషెస్ తెలిపాడు. ఇక రావు రమేష్, నరేష్, మురళీ శర్మ, సాయి కుమార్, ఆమని, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా మార్చి 11 శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment