హిలేరియస్‌, ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్‌ చూశారా? | Aadavallu Meeku Johaarlu Trailer Out Now | Sakshi
Sakshi News home page

Aadavallu Meeku Johaarlu Trailer: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్‌ వచ్చేసింది!

Published Sun, Feb 27 2022 8:21 PM | Last Updated on Sun, Feb 27 2022 8:28 PM

Aadavallu Meeku Johaarlu Trailer Out Now - Sakshi

శర్వానంద్, రష్మికా మందన్న జంటగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఇందులో ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి సీనియర్‌ నటీమణులు నటించారు. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ఇందులో హీరో శర్వానంద్‌ వరుసగా పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటాడు. కానీ అతడి ఫ్యామిలీలో ఉన్న ఆడవాల్లకు పిల్ల నచ్చకపోవడంతో అవి రిజెక్ట్‌ అవుతూ ఉంటాయి. దీంతో పెళ్లి లేట్‌ అవుతుండటంతో హీరో ఇరిటేట్‌ అవుతుంటాడు.

ఒకసారైతే ఏకంగా ప్లాట్‌ఫామ్‌ పైనే పెళ్లి చూపులు పెడతాడు. ఇందులో బ్రహ్మానందం కూడా కనిపించాడు. ఇలా పెళ్లి చూపుల తతంగం సీరియల్‌లా కొనసాగుతున్న సమయంలో రష్మిక పరిచయం, వారి మధ్య ప్రేమను చూపించారు. అయితే పెళ్లనేసరికి మాత్రం.. అబ్బాయి ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటే అమ్మాయి ఉద్యోగం చేస్తుందని చెప్తుంది హీరోయిన్‌ తల్లి. దీంతో హీరో ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్లకు షాక్‌ కొట్టినంత పనవుతుంది.

మరి వీళ్లిద్దరి పెళ్లికి హీరో కుటుంబంలోని ఆడాళ్లు ఒప్పుకుంటారా? ఈ మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఎదురవతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. నాకు ఆస్కార్‌ వద్దు, సినిమా ఆడితే చాలు, నీకు, మీ ఆడాళ్లకొస్తే బాధ, నాకు, మా మగాళ్లకొస్తే కాదా? అన్న డైలాగులు బాగున్నాయి.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదలకానుంది.  కుటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement