అక్కడ బోల్తా పడినా ఓటీటీలో మాత్రం​ సూపర్‌ హిట్‌ | Sharwanands Sreekaram Movie Creats Records In OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో రికార్డులు క్రియేట్‌ చేస్తోన్న ‘శ్రీకారం’

Published Sat, May 1 2021 12:40 PM | Last Updated on Sat, May 1 2021 5:44 PM

Sharwanands Sreekaram Movie Creats Records In OTT - Sakshi

శర్వానంద్, ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ఇటీవలె ఓటీటీలో రిలీజైంది. అయితే ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం కలెక‌్షన్ల వద్ద బోల్తా కొట్టినా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఈ నెల 16 సన్‌నెక్స్ట్‌ యాప్‌లో రిలీజైన ఈ సినిమా అక్కడ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ‘శ్రీకారం

సన్‌నెక్స్ట్‌లో తక్కువ సమయంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా  ‘శ్రీకారం’ నిలిచింది. ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ని సంపాదించి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. థియేటర్స్‌లో సత్తా చూపించకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజేస్తూ మెసేజ్‌ ఓరియంటెడ్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమాను కిశోర్‌ డైరెక్ట్‌ చేయగా, గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా.. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.

చదవండి : శ్రీకారం సినిమాపై ప్రభాస్‌ కామెంట్‌
శర్వానంద్‌కే ఎందుకిలా జరుగుతోంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement