బ్లాక్‌ బస్టర్‌ గ్యారెంటీ: హీరో శర్వానంద్‌ | Ram Charan to launch the trailer of Sharwanand Manamey | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ బస్టర్‌ గ్యారెంటీ: హీరో శర్వానంద్‌

Published Sun, Jun 2 2024 12:31 AM | Last Updated on Sun, Jun 2 2024 12:33 AM

Ram Charan to launch the trailer of Sharwanand Manamey

‘‘మనమే’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్‌ చేసే సినిమా. ఈ చిత్రాన్ని తల్లితండ్రులకు అంకితం ఇస్తున్నాం. ఈసారి బ్లాక్‌ బస్టర్‌ గ్యారెంటీ’’ అన్నారు హీరో శర్వానంద్‌. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రామ్‌చరణ్‌ లాంచ్‌ చేశారు. అనంతరం జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో ఈ సినిమా ఓ మ్యాజిక్‌.. ఆ మ్యాజిక్‌ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘మనమే’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్‌ కూఛిబొట్ల. ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌ కృతీ ప్రసాద్, అసోసియేట్‌ప్రోడ్యూసర్‌ ఏడిద రాజా మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement