శర్వానంద్
హీరో శర్వానంద్ రైతుగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ ఏప్రిల్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. ‘పట్టరా పట్టు హైస్సా.. ఎత్తరా ఎత్తు హైలెస్సా!!, వసున్నాం రా హైస్సా.. ఏప్రిల్ 24న హైలెస్సా’’ అని చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు. హరీష్ కట్టా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
Comments
Please login to add a commentAdd a comment