శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం శ్రీకారం. కిశోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. భూమికి, మనిషికి మధ్య ఉన్న ప్రేమకథే ఈ శ్రీకారం. మహాశివరాత్రి సందర్భంగా రిలీజైన ఈ సినిమాను ప్రభాస్ అభినందించాడు. "నా ప్రియమైన సోదరుడు శర్వానంద్‌కు ఆల్ ద బెస్ట్. శ్రీకారం సినిమా చూశాను, చాలా బాగుంది. చిత్రయూనిట్‌కు ఇదే నా బెస్ట్ విషెస్" అని పేర్కొన్నాడు. డార్లింగ్ ప్రభాస్ సపోర్ట్ చేయడంతో సంతోషపడిపోయిన శర్వానంద్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
కాగా రైతు కొడుకు రైతు కావడం లేదనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. 'వ్యవసాయాన్ని ఓ ఉద్యోగంగానో, వ్యాపారంగానో ఎవరూ చూడటం లేదు.. వ్యవసాయంలో నష్టాలు వస్తుండటంతో ఇటువైపు ఆసక్తి చూపడం లేదు. ఒక్కొక్కరుగా కాకుండా ఊర్లోని అందరూ కలసి ఉమ్మడి వ్యవసాయం చేయాలి.. వచ్చిన లాభాలను సమానంగా పంచుకోవాలి. అలా చేయడం వల్ల ఎవరూ నష్టపోరని మా సినిమాలో చూపిస్తున్నాం. చదువుకున్నవాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే నష్టాలు రావు' అని శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Thank you so much Prabhas anna ❤️ pic.twitter.com/gsoDSbXQJw
— Sharwanand (@ImSharwanand) March 10, 2021
Comments
Please login to add a commentAdd a comment