షేక్‌ చేస్తున్న శర్వానంద్‌ ‘భలేగుంది బాలా’ సాంగ్‌ | Sharwanand Sreekaram Movie Bala Bagundi Song Released | Sakshi
Sakshi News home page

షేక్‌ చేస్తున్న శర్వానంద్‌ ‘భలేగుంది బాలా’ సాంగ్‌

Published Mon, Nov 9 2020 9:54 PM | Last Updated on Mon, Nov 9 2020 10:05 PM

Sharwanand Sreekaram Movie Bala Bagundi Song Released - Sakshi

శర్వానంద్, ప్రియాంక అరుళ్‌మోహన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్‌ .బి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి భలేగుంది బాలా అంటూ సాగే పాట లిరిక‌ల్ వీడియోను చిత్ర‌యూనిట్ సోమవారం విడుదల చేసింది.
(చదవండి : పవన్‌తో సినిమాపై రానా స్పందన)

'వ‌చ్చానంటివో పోతానంటివో వ‌గ‌లు ప‌లుకుతావే..క‌ట్ట‌మింద బోయే అల‌క‌ల చిల‌క భ‌లేగుంది బాలా..దాని ఎధాన ఉండే పూల పూల రైకా భలేగుంది బాలా' అంటూ పెంచ‌ల్ దాస్ స్వ‌యంగా రాసి.. పాడిన ఈ పాట అలా విడుదలైందో లేదో ఇలా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ప‌ల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగుతూ ఈ పాట అందరిని అల‌రిస్తోంది. శర్వానంద్ మాస్ డాన్సులు వేస్తుంటే.. లంగావోణిలో ప్రియాంక వయ్యారంగా నడుస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ‌ర్వానంద్ రైతుగా క‌నిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement