![Sreekaram Is Highest Grossing First Day Collections Of Sharwanand Career Gopi Achanta Says - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/13/Ram1.jpg.webp?itok=gxL3CrMM)
గోపీ ఆచంట, అజయ్ భూపతి, కిషోర్, సాయిమాధవ్, సాయికుమార్, గోపీచంద్ మలినేని, బాబీ, రామ్ ఆచంట
‘‘శ్రీకారం’ సినిమా శర్వానంద్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసింది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇంత మంచి సినిమా చూసి చాలారోజులైందని అందరూ అభినందిస్తున్నారు’’ అని నిర్మాత గోపీ ఆచంట అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా కిషోర్.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ బి.కిషోర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు.
‘‘మంచి కథ పడితే ప్రతి ఆర్టిస్ట్ ఎలివేట్ అవుతాడనడానికి ‘శ్రీకారం’ ఒక ఉదాహరణ’’ అన్నారు నటుడు సాయికుమార్. ‘‘యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా ‘శ్రీకారం’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘కిషోర్ ప్రతి సీన్‌ను నిజాయతీగా చెప్పాడు.. ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు డైరెక్టర్ బాబీ. ‘‘కొన్ని సినిమాల్లోని పాత్రలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడతాయి.. అలాంటి సినిమా ‘శ్రీకారం’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. ‘‘శ్రీకారం’ సంతోషాన్నిచ్చే సినిమా’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా.
చదవండి:
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ కొత్త సినిమా
Comments
Please login to add a commentAdd a comment