Gopi ACHANTA
-
యాక్షన్ ఎంటర్టైనర్ షురూ
శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ కొట్టి, డైరెక్టర్ పరశురామ్‌తో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. శ్రీనివాస్ కెరీర్లో పదో చిత్రంగా రూపొందుతోంది. ఈ నెల రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: జిమ్షి ఖలీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. -
‘శర్వానంద్ కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ మూవీ శ్రీకారం’
‘‘శ్రీకారం’ సినిమా శర్వానంద్ కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసింది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇంత మంచి సినిమా చూసి చాలారోజులైందని అందరూ అభినందిస్తున్నారు’’ అని నిర్మాత గోపీ ఆచంట అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా కిషోర్.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. సక్సెస్ మీట్లో డైరెక్టర్ బి.కిషోర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మంచి కథ పడితే ప్రతి ఆర్టిస్ట్ ఎలివేట్ అవుతాడనడానికి ‘శ్రీకారం’ ఒక ఉదాహరణ’’ అన్నారు నటుడు సాయికుమార్. ‘‘యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా ‘శ్రీకారం’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘కిషోర్ ప్రతి సీన్‌ను నిజాయతీగా చెప్పాడు.. ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు డైరెక్టర్ బాబీ. ‘‘కొన్ని సినిమాల్లోని పాత్రలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడతాయి.. అలాంటి సినిమా ‘శ్రీకారం’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. ‘‘శ్రీకారం’ సంతోషాన్నిచ్చే సినిమా’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. చదవండి: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ కొత్త సినిమా -
వేదాంతం ఆరంభం
సునీల్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘వేదాంతం రాఘవయ్య’. సి. చంద్రమోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇదే బేనర్లో ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ ‘వేదాంతం రాఘవయ్య’కు కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. తొలి సీన్‌కి గోపీ ఆచంట కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కరుణాకరన్ క్లాప్ కొట్టి , గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట స్క్రిప్ట్‌ను దర్శకుడు సి. చంద్రమోహన్‌కు అందజేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: దాము నర్రావుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లైన్ ప్రొడ్యూసర్: కె.ఆర్.కె. రాజు. -
తిరుపతిలో శ్రీకారం
‘శ్రీకారం’ సినిమా కోసం నాగలి పట్టారు శర్వానంద్. రైతుగా మారి తిరుపతిలో వ్యవసాయం మొదలెట్టారు. ఏం పండిస్తున్నారంటే.. మంచి సినిమాను పండిస్తున్నాం అంటున్నారు చిత్రబృందం. శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభం అయింది. సుమారు 15రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని తెలిసింది. ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: మిక్కీ జే మేయర్. -
సంక్రాంతికి శ్రీకారం
వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే కార్యక్రమాలకు హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ చుట్టారు. ఆయన హీరోగా నటించనున్న కొత్త చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాతో కిశోర్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్ క్లాప్ ఇవ్వగా, ఎన్నారై శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు మొదటివారంలో ప్రారంభం కానుంది. మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు యువరాజ్ కెమెరామెన్. ‘శ్రీకారం’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... శర్వానంద్ కెరీర్లో హిట్ చిత్రాలుగా నిలిచిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’(2016), ‘శతమానం భవతి’ (2017) చిత్రాలు సంక్రాంతికి రిలీజైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘రణరంగం’, ‘96’ తెలుగు రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నారు శర్వానంద్. -
మంచి రోజు.. మంచి వార్త
‘ఫిదా’, ‘తొలి ప్రేమ’ విజయాలతో జోష్‌గా ఉన్న వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ఖరారైంది. ‘అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా 14 రీల్స్ ప్లస్ అనే బేనర్‌ను స్థాపించారు. ఈ బేనర్‌పైనే వరుణ్ తేజ్ సినిమా రూపొందనుంది. ‘‘మంచి రోజు మంచి వార్త’’ అన్నారు వరుణ్ తేజ్.‘‘14 రీల్స్ ప్లస్ బ్యానర్ తొలి సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందనుందని శుభప్రదమైన ఉగాది రోజున ప్రకటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత రామ్ ఆచంట. -
అమెరికాలో ఏకధాటిగా...
‘అ ఆ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నితిన్ నటిస్తున్న సినిమా ‘లై’. ‘లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి’ అన్నది ఉపశీర్షిక. మేఘా ఆకాష్ కథానాయిక. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ఏకధాటిగా జరుగుతోంది. యూనిట్ సభ్యుల సమక్షంలో హను రాఘవపూడి పుట్టినరోజును బుధవారం జరుపుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘జూన్ రెండో వారం వరకు అమెరికాలోని వెగాస్, లాస్ ఏంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో, చికాగోలో చిత్రీకరణ జరుపుతాం. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కాగా, ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు డాన్ బిల్జిరియాన్ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృ«థ్వి, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: మణిశర్మ, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి.