
సునీల్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘వేదాంతం రాఘవయ్య’. సి. చంద్రమోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇదే బేనర్‌లో ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ ‘వేదాంతం రాఘవయ్య’కు కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. తొలి సీన్‌కి గోపీ ఆచంట కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కరుణాకరన్ క్లాప్ కొట్టి , గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట స్క్రిప్ట్‌ను దర్శకుడు సి. చంద్రమోహన్‌కు అందజేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: దాము నర్రావుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లైన్ ప్రొడ్యూసర్: కె.ఆర్.కె. రాజు.
Comments
Please login to add a commentAdd a comment