
శర్వానంద్
‘శ్రీకారం’ సినిమా కోసం నాగలి పట్టారు శర్వానంద్. రైతుగా మారి తిరుపతిలో వ్యవసాయం మొదలెట్టారు. ఏం పండిస్తున్నారంటే.. మంచి సినిమాను పండిస్తున్నాం అంటున్నారు చిత్రబృందం. శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభం అయింది. సుమారు 15రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని తెలిసింది. ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: మిక్కీ జే మేయర్.
Comments
Please login to add a commentAdd a comment