సంక్రాంతికి శ్రీకారం | Sharwanand Sreekaram Movie Launch | Sakshi

సంక్రాంతికి శ్రీకారం

Jul 1 2019 12:53 AM | Updated on Jul 1 2019 12:53 AM

Sharwanand Sreekaram Movie Launch - Sakshi

గోపీ, కిశోర్, శర్వానంద్, రామ్‌

వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే కార్యక్రమాలకు హీరో శర్వానంద్‌ ‘శ్రీకారం’ చుట్టారు. ఆయన హీరోగా నటించనున్న కొత్త చిత్రం ‘శ్రీకారం’.  ఈ సినిమాతో కిశోర్‌ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. 14రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్‌ క్లాప్‌ ఇవ్వగా, ఎన్నారై శశికాంత్‌ వల్లూరి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్టు మొదటివారంలో ప్రారంభం కానుంది. మిక్కి జె. మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు యువరాజ్‌ కెమెరామెన్‌. ‘శ్రీకారం’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... శర్వానంద్‌ కెరీర్‌లో హిట్‌ చిత్రాలుగా నిలిచిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’(2016), ‘శతమానం భవతి’ (2017) చిత్రాలు సంక్రాంతికి రిలీజైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘రణరంగం’, ‘96’ తెలుగు రీమేక్‌  సినిమాలతో బిజీగా ఉన్నారు శర్వానంద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement