అమెరికాలో ఏకధాటిగా... | Nithin Hanu 14 Reels Lie shooting in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఏకధాటిగా...

Published Wed, Apr 19 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

అమెరికాలో ఏకధాటిగా...

అమెరికాలో ఏకధాటిగా...

‘అ ఆ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నితిన్‌ నటిస్తున్న సినిమా ‘లై’. ‘లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి’ అన్నది ఉపశీర్షిక. మేఘా ఆకాష్‌ కథానాయిక. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ అమెరికాలో ఏకధాటిగా జరుగుతోంది. యూనిట్‌ సభ్యుల సమక్షంలో హను రాఘవపూడి పుట్టినరోజును బుధవారం  జరుపుకున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘జూన్‌ రెండో వారం వరకు అమెరికాలోని వెగాస్, లాస్‌ ఏంజిలిస్, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగోలో చిత్రీకరణ జరుపుతాం. దీంతో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కాగా, ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటుడు డాన్‌ బిల్జిరియాన్‌ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృ«థ్వి, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: మణిశర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement