'లై' రిలీజ్కు ముందే ఫుల్ జోష్ | Hanu Raghavapudi Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

'లై' రిలీజ్కు ముందే ఫుల్ జోష్

Published Thu, Aug 10 2017 11:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

'లై' రిలీజ్కు ముందే ఫుల్ జోష్

'లై' రిలీజ్కు ముందే ఫుల్ జోష్

నితిన్ హీరోగా లై సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తన సినిమా సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న హను, సినిమా రిలీజ్ కు ముందే లైఫ్ టైం గిఫ్ట్ అందుకున్నాడు. హను రాఘవపూడి భార్య ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా సక్సెస్ తరువాత గత ఏడాది ఆగస్టు 26న అమూల్యను వివాహం చేసుకున్నారు.

తన కెరీర్ లో తొలి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో తండ్రయ్యాడు హను రాఘవపూడి. నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాలో మెగా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటుడు అర్జున్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఎక్కువ భాగం ఫారిన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement