లై ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్..! | Nithin Lie First song release Date | Sakshi
Sakshi News home page

లై ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్..!

Published Sun, Jun 11 2017 11:52 AM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

లై ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్..!

లై ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్..!

అ..ఆ.. లాంటి బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ హీరో నితిన్ చేస్తున్న తాజా చిత్రం 'లై'. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని వివిధ లోకేషన్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అదే సమయంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టారు చిత్రయూనిట్.

అందుకే చికాగో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈ సినిమా ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు(ఆదివారం) సాయంత్రం అఫీషియల్గా రిలీజ్ కానున్న బొంబాత్ అనే పాట.., రేపు(సోమవారం) ఉదయం 9.30కు ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. తొలిసారిగా యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement