నితిన్, హనుల సినిమా ఏమైంది..? | Nithin, Hanu Raghavapudi movie halted | Sakshi
Sakshi News home page

నితిన్, హనుల సినిమా ఏమైంది..?

Published Thu, Nov 17 2016 11:23 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నితిన్, హనుల సినిమా ఏమైంది..? - Sakshi

నితిన్, హనుల సినిమా ఏమైంది..?

నితిన్ హీరోగా బుధవారం కొత్త సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తూ తెరకెక్కిస్తూ ఈ సినిమాకు రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకుడు. గేయ రచయితగా మంచి విజయాలు సాధించిన కృష్ణచైతన్య రౌఢీఫెలో సినిమాతో దర్శకుడిగానూ సక్సెస్ సాధించాడు. అదే జోరులో ఇప్పుడు నితిన్ హీరోగా, పవన్ బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.

అయితే నితిన్ ఇప్పటికే హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. 14 రీల్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాను చాలా రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభించారు. కథాపరంగా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేయాల్సి ఉండటంతో దర్శకుడు లోకేషన్స్ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.  ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి జనవరి నుంచి ఈ సినిమాను ప్రారంభించాలని ప్లాన్ చేశారు.

కానీ ఇప్పుడు కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించటంతో హను రాఘవపూడి సినిమా ఏమైందన్న ప్రశ్న వినిపిస్తోంది. ముందు హను సినిమాను పూర్తి చేసి కృష్ణచైతన్య సినిమాను మొదలు పెడతాడా..? లేక హను సినిమాను పక్కన పెట్టేసి ఈ సినిమాను స్టార్ చేస్తాడా..? ఈ విషయం పై క్లారిటీ రావలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement