జనవరి 1న నితిన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ | First Look Of Nithin Next On New Year | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 21 2017 2:12 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

First Look Of Nithin Next On New Year - Sakshi

‘లై’ సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నితిన్, ప్రస్తుతం యువ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను ఫైనల్ చేశారట. టైటిల్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపించేలా ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. 

ఈ సినిమాలో నితిన్ సరసన  ‘లై’ ఫేం మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల అమెరికా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నారట. అదే రోజు టైటిల్ విషయంలో కూడా క్లారిటీ రానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement