
‘ఛల్ మోహన్ రంగ’ మూవీ పోస్టర్
యంగ్ హీరో నితిన్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న రొమాటింక్ ఎంటర్‌టైనర్ ఛల్ మోహన్ రంగ. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రాయూనిట్.
ఇప్పటికే విడుదలైన టీజర్, తొలి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా రెండో పాటను రిలీజ్ చేశారు. తమన్ సంగీత సారధ్యం నకాష్ అజీజ్ ఆలపించిన ఈ పాటకు కేథార్ నాధ్ సాహిత్యం అంధించారు. నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment